గురువారం, జనవరి 24, 2019

Its-better-to-stay-away-from-being-I-I
మన జీవితకాలంలో ఎంతోమంది వ్యక్తులు పరిచయమవుతూ ఉంటారు. వారిలో కొంతమందితో మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం. అయితే కొన్ని,కొన్ని సందర్భాలలో కొంతమంది వలన మనం నష్టపోవడమో , లేక మోసపోవడమో కూడా జరుగుతూ ఉంటుంది. మరికొంతమంది వలనయితే నష్టాలు,మోసాలు జరగకపోయినా మనస్సు మాత్రం విపరీతంగా గాయపడే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే వారి చేష్టలు గాని, మాటలుగాని మనకి ఆ పరిస్థితిని తీసుకొస్తాయి.

మనo పై పరిస్థితులకు గురవ్వకుండా ఉండాలంటే మనకు మనం మనతో ఉన్న ప్రతీ వ్యక్తిని పరిశీలించి జాగ్రత్తతో మెలగాలి. అటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తీ యొక్క గుణం ఏమిటంటే "ప్రతిదీ నావలననే సాధ్యం! నేను మాత్రమే, నేను,నేను..నేను" ఇలా మాటలాడే వాడికి కొద్ది జాగ్రత్తగా ఉండటమే మంచిది.

ఎందుకంటే ఈ వ్యక్తిలో ప్రధానంగా...

1.ఇతరులకు క్రెడిట్ దక్కడం చూడలేడు.
2.తనతో ఉన్న మిత్రుల విషయంలో "నల్గురితో ఉన్నప్పుడు తనను హైలెట్ చేసుకుంటూ అతనిని తక్కువ చేసి పరిచయం చేస్తాడు. లేక తక్కువ చేసి మాట్లాడుతాడు.
3.ఎదుటివాడు ఎంత గొప్పగా చెప్పినా? తాను చెప్పేదే గొప్ప అనే అహంకారం నిలువెల్లా కన్పిస్తుంది.
4.తనేదో ఉద్దరించడానికి సృష్టించబడ్డాననే ఫీలింగ్ కు గురవుతూ ఉంటాడు.
5.ఏ పనీ ఊరికనే చేయడు.సహకరించడానికి అసలు ఇష్టపడడు.
6.ఇతరులకు సహాయం చేసే విషయంలో వెనుకకు పోతూ ఉంటాడు.

      కాబట్టి మిత్రులారా "నేను...నేను" అనే వాడి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అతనితో ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండండి. నిజానికి పై లక్షణాలలో కొన్ని లక్షణాలు అందరిలో లేకపోవచ్చు. కాని మిగతా లక్షనాలున్నా జాగ్రత్త అవసరమే కదా! సహజంగా మనకు పరిచయ వ్యక్తులలో ఏవో కొన్ని లోపాలున్నా వారిలో ఉన్న మిగతా మంచి లక్షణాలను బట్టి ప్రేమించడం అలవర్చుకోవాలి. జాగ్రత్త పడాలి తప్ప సంబంధాలు త్రెంచుకోకూడదు. మరీ ముఖ్యమైన విషయమేమిటంటే "మనలో ఈ గుణాలుంటే వెంటనే రూపుమాపుకోవాలి. లేదంటే మనకు ఉండే మంచి మిత్రులందరూ దూరమయ్యి పోవడం ఖాయం" సన్నిహితులు సహించలేక సైడ్ అయిపోవడం విదితమే!!
Its-better-to-stay-away-from-being-I-I



మంగళవారం, జనవరి 22, 2019

1500పైగా  Dy. Collector jobs, RDO & Other Jobsకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్నవారు అప్లయ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది లింక్ ద్వారా వెళ్ళవచ్చు.

Telangana State (TS) PSC Group 1 Notification 2019

ఆదివారం, జనవరి 20, 2019

Capture-the-wonderful-Ideas-into-your-mind
సహజంగా మనం ఏదైనా దీర్ఘంగా ఆలోచిస్తున్నపుడు, లేదా మనకు తెలియకుండానే ఒకొక్కసారి ఫ్లాష్ లా కొన్ని అద్భుతమైన ఐడియాలు వచ్చి పోతుంటాయి. అవి ఎంత ఉపయోగకరమో మన మనసులకు కూడా స్పురిస్తూ ఉంటుంది. మళ్ళీ వెంటనే మనం దానిని తరువాత ఆలోచిద్దాంలే అనుకుంటూ పక్కన పడేస్తాం. ఇక అది మనకు గుర్తుకు రాదు. ఇలా మనకి తెలిసి కూడా ఇవన్నీ జరిగిపోతుంటాయి. ఇలా క్రమీపీ జరగడం వలన మన మేధస్స్ చివరికి మొద్దుగా మారిపోతుంది. ఎటువంటి క్రియేటివిటీ లేకుండా తయారవ్వుతాం. నిజానికి ఎదో సాధించాలి అనే వ్యక్తికి ఇది పెద్ద నష్టమేనని చెప్పాలి.

మరి మనం ఏమి చేయాలి?
ఏమీ లేదు ఎప్పుడు బయటికి వెళ్ళినా, వెళ్లకపోయినా మన వెంట తప్పనిసరిగా చిన్న నోటు బుక్ , ఒక పెన్ మన జేబులో ఉండాలి. ఎప్పుడు ఏ ఐడియా వచ్చినా వెంటనే దానిని నోట్ బుక్ పై వ్రాసి బంధించి వేయాలి. తరువాత మనకి ఫ్రీ దొరికినప్పుడు తీరిగ్గా దాని పట్ల మరింత కసరత్తు చేయవచ్చు.




బుధవారం, జనవరి 16, 2019

There-are-two-types-of-people-A-man-who-saw-who-ksc-writes
నిజానికి మనం ఏ వర్గంలో ఉన్నామో చూసుకోవాలి. సహజంగా మనం ఏదో చేయాలని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాం. మొదలు పెట్టడానికి మాత్రం చాలా టైం తీసుకుంటాం. కొంతమందైతే అనుకుంటారు గాని ఎప్పటికీ మొదలు పెట్టరు. మరికొంతమందయితే మొదలు పెడతారుగాని విజయం సాధించే వరకూ కృషి చేయరు. అతికొద్ది మంది మాత్రమే విజయం సాధించే వరకూ పట్టు వదలరు. ఇటువంటి వారందరూ చేసేవాళ్ళలోకే వస్తారు. పై మిగతా వారందరూ చూసేవాళ్లలోకే వస్తారు. కాబట్టి మనం చేసేవాళ్ళమా? చూసేవాళ్లమా? అనేది సరి చూసుకోవాలి!

సోమవారం, జనవరి 07, 2019

వెన్నెల అనే అందమైన అమ్మాయికి పెళ్ళి కుదిరింది..
చదువు, అందం , ఆస్తి, సాంప్రదాయం అన్ని ఉన్న అమ్మాయి కనుక మగపెళ్ళివారు చూడగానే ఒప్పుకున్నారు.. ఆ అమ్మాయి పెళ్ళి కొడుకుతో మాట్లాడాలి అన్నది...సరే ఇద్దరూ కూర్చున్నారు...
వెన్నెల అన్నది ..." పెళ్ళికి నాది ఒకే ఒక షరతు ...."
అతను కుతూహలంగా  చూసాడు..
" అది ఏమిటంటే ఏ మాట మాట్లాడాలనుకున్నా  సరే,
 అంటే విపరీతమైన కోపం వచ్చినా ..... టెన్షన్ వచ్చినా ..... విసుగ్గా వున్నా... ఏదైనా అసలు నచ్చకపోయినా గొంతు పెంచి మాట్లాడకూడదు.. మీరు ఏం మాట్లాడాలనుకున్నా సరే మెల్లగా అనాలి అంతే !!!
అలా కాకుండా గొంతు పెంచి అరిస్తే నేను పుట్టింటికి వచ్చేస్తాను.. ఆ పై నన్ను ఏమీ అనకూడదు !!!" అన్నది..
అతనికి కొంచెం వింతగా అనిపించినా..తిట్టవద్దు అనలేదు కదా కొంచెం గొంతు తగ్గించమంటున్నది ఫర్వాలేదు అనుకున్నాడు....

గురువారం, డిసెంబర్ 06, 2018

హాయ్ ఫ్రెండ్స్ SBI Bank లో Deputy Manager ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 39 పోస్టులు (The bank will recruit 39 posts of Deputy Manager) భర్తీ నిమిత్తం అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. మీరు అప్లయ్ చేయాలనుకుంటే ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ తరువాత అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్ మేషన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి.

సోమవారం, డిసెంబర్ 03, 2018

Andhra Pradesh SSC Board 10th class final exams Time Table ను అప్ డేట్ చేసింది. మీ పిల్లలు ఎవరైనా 10వ తరగతి చదువుతుంటే వెంటనే వారికి తెలియజేయండి. మరిన్ని వివరాలు క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి.
Click HereAP 10th Class Time Table 2019

Recent Posts