శనివారం, జూన్ 27, 2020

🎯 *వైరస్ అనేది జీవి కాదు. కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే.   ఇది ఒక నిర్జీవి.*

*ఇది కంటి, ముక్కు,గొంతు లోని కణాలతో కలిసినప్పుడు తన యొక్క జన్యు కోడ్ ను మార్చుకొని, ఆ కణాలను చైతన్య వంతమైనవిగా చేయడమే కాక అవి సంఖ్యలో వృద్ధి అయ్యేవిధంగా చేస్తుంది.*  
    
*వైరస్ అనేది జీవి కాదు కాబట్టి, దీనిని చంపడం అనేది జరుగదు. దానంతట అదే క్షయమవుతుంది ( నాశనం).*

*వైరస్ క్షయం (నాశనం) అయ్యే సమయం ఉష్ణోగ్రత, గాలిలో తేమ & అది ఉన్న ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది.*                          

*వాస్తవానికి వైరస్ చాలా బలహీనమైనది. తేలికగా విచ్చిన్నమయ్యే  గుణం కలిగినది. కానీ దానికి రక్షణ కవచంగా ఉన్న కొవ్వు కణాల వలన అది బలం సంతరించుకుంటుంది.*

*అందుకే సబ్బు, డిటర్జెంట్స్ వాడటం వలన, వాటినుండి వచ్చే నురగ కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది.*
*అందుకే సబ్బు తదితర పదార్థాలతో కనీసం 30 సెకండ్లు గట్టిగా రుద్దమని చెబుతారు.* 
*సబ్బుతో రుద్దడం వలన కొవ్వు కణాలు విచ్చిన్నమై, లోపలవున్న వైరస్ ( ప్రోటీన్) కూడా దానంతట అదే విచ్చన్నమౌతుంది.*

*వేడి కొవ్వును కరిగిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అందుకే 25 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వున్న నీటితో చేతులు, బట్టలు, ఇతరాలను శుభ్రపరచుకోవాలి.*

*వేడి నీటికి ఎక్కువ నురగ నిచ్చే లక్షణం కూడా ఉన్నది.  నురగ ఎంత ఎక్కువగా ఉంటే, వైరస్ ను అంత సులభంగా కరిగించగలం.*
                  
*కొవ్వులు ఆల్కహాల్‌ లో కరుగుతాయి. అందుకే 65% తగ్గని ఆల్కహాల్ లేదా ఆల్కహాల్‌ మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.*

*ఒకవంతు బ్లీచింగ్ పౌడర్, 5 వంతుల నీరు కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించినట్లయితే వైరస్ లోని ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేసి, వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.*

*హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ప్రోటీన్ ( వైరస్) అణువులను విచ్చిన్నం చేసే శక్తి ఉన్నది. అందుకే చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు.*

*వైరస్ నిర్జీవి కనుక దానిని Anti Biotics నిర్వీర్యం చేయలేవు. కానీ వాటి నిర్మాణాన్ని కొంతమేరకు కుదించగలవు. Anti Biotics బాక్టీరియాను మాత్రమే  చంపగలవు.*

*ఉపయోగించిన లేదా ఉపయోగించని బట్టలను దులపడం లేదా విదిలించడం చేయరాదు. ఎందుకంటే వాటిలో వైరస్ ఉంటుంది కాబట్టి.*  

*వైరస్ నిర్వీర్యం కాకుండా/ నిలచి వుండే సమయం:*
*వైరస్ బట్టలపై - 3 గంటల వరకూ* 
*సహజసిద్ధమైన ఏంటిసెప్టిక్ అయిన రాగిపై - 4 గంటలు*
*చెక్కపై - 4 గంటలు* 
*కార్డ్ బోర్డు పై - 24 గంటలు*
*లోహాలపై - 42 గంటలు*
 *ప్లాస్టిక్ పై - 72 గంటలు నిర్వీర్యం కాకుండా ఉంటుంది.*

*వైరస్ ఉన్న బట్టలు, ఇతరాలను మనం దులిపినపుడు వైరస్ గాలిలో కలసి సుమారు మూడుగంటలు ఉండే అవకాశం ఉంది. అటువంటి గాలిని మనం పీల్చినప్పుడు వైరస్ మన ముక్కు ద్వారా ఊపిరితిత్తుల లోనికి ప్రవేశిస్తుంది.*

*వైరస్ లు చల్లని వాతావరణం లో, ఎయిర్ కండిషనర్ల కారణంగా ఏర్పడే కృత్రిమ చల్లదనంలో మరియు చీకటిలో వాటి అస్తిత్వాన్ని నిలకడగా కొనసాగిస్తాయి.*

*కావున మన పరిసరాలను తేమలేకుండా, పొడిగా, వెచ్చగా, వెలుతురు తో వుండేలా చూసుకోవాలి.*

*ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.*

*అల్ట్రా వయొలెట్ కిరణాలు కూడా వైరస్ లోని ప్రోటీన్ లను విచ్చిన్నం చేస్తాయి. కానీ UV Rays చర్మంపై పడితే ( మన చర్మం లోని కొలాజిన్ అనే ప్రోటీన్ ను విచ్చిన్నం చేస్తాయి) చర్మ కేన్సర్ వచ్చే అవకాశం వుంటుంది.*

*ఆరోగ్య వంతమైన మానవవుని చర్మం ద్వారా ఈ వైరస్ లు శరీరం లోకి ప్రవేశించలేవు.*

*వెనిగర్ వలన ఉపయోగంలేదు ఎందుకంటే వెనిగర్ కు  కొవ్వు లను కరిగించే శక్తి లేదు.*

*స్పిరిట్, వోడ్కా లవలన కూడా వైరస్‌ను కట్టడి చేయలేం ఎందుకంటే వాటిలో 40% కన్నా తక్కువ ఆల్కహాల్ ఉంటుంది.*
*వైరస్ నిర్వీర్యం కావాలంటే 65% ఆల్కహాల్ కావాలి.*✅

*65% ఆల్కహాల్ కలిగిన శానిటీజర్స్, లిస్టరిన్ వలన కొంత ఉపయోగం ఉంటుంది.* 

*తక్కువ వెలుతురు, గాలి కలిగిన  ప్రదేశంలో, తక్కువ ఏరియాలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది.*

*విశాలమైన ప్రదేశం, గాలి, వెలుతురు ధారాళంగా ఉంటే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది.*

*చేతులు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎండిన చేతుల్లోని పగుళ్ళలో వైరస్ దాక్కొనే అవకాశం ఉంటుంది.*

*మనం ఉపయోగించే మాయిస్చరైజర్ ఎంత చిక్కగా ఉంటే వైరస్ ను విచ్చిన్నం చేయడానికి అంతగా ఉపయోగపడుతుంది.*

*గోళ్ళ సందుల్లో వైరస్ ఉండకుండా   గోళ్ళ పరిమాణం చాలా తక్కువ వుండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే.*
*Note:* 
ఇనుముపై 12 గం. ల వరకూ వుంటుంది - కాబట్టి
*తాళాలు, తలుపుల నాబ్స్, స్విచ్ లు, రిమోట్స్, సెల్ ఫోన్, వాచీలు, కంప్యూటర్ లు, డెస్కులు, టివిలు ముట్టుకున్నప్పుడు, బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు, బయటి నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు, భోజనానికి ముందు తప్పక చేతులు సబ్బులు ఉపయోగించి 10 ని.ల కు తగ్గకుండా శుభ్రం చేసుకోవాలి.*✅

*మీకు కరోనావైరస్ ఉందని ఎలా తెలుసు?*
 1. గొంతులో దురద,
 2. పొడి గొంతు,
 3. పొడి దగ్గు.
4. జలుబు, తలనొప్పి నుండి తీవ్ర జ్వరము కూడా వస్తుంది.

 కావున మీరు ఈ మూడు లక్షణాలు మనకు వున్నాయేమో మనకు మనమే గమనించుకుంటూ ఉండాలి.
*ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.*
             🌸🌸🌸🌸🌸
*ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహనని పెంచుదాం.👍*
నలుగురికి ఈ విషయాలు తెలిసేలా పంచుదాం.

*ఈ సమాచారాన్ని మీ వద్ద మాత్రమే ఉంచవద్దు.  మీ కుటుంబం మరియు స్నేహితులందరికీ పంపించండి.😊👍🙏🙏*

బుధవారం, జూన్ 24, 2020

everyone-should-read-principles-of-Chanakya
Everyone should read the principles of Chanakya | చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు | అందరూ తప్పనిసరిగా చదవాలి

  • లక్ష్మి, ప్రాణం, జీవనం, శరీరం ఇవన్నీ పోయేవే. కేవలం ధర్మం మాత్రమే స్థిరంగా ఉంటుంది.
  • వందమంది మూర్ఖుల కంటే గుణవంతుడైన పుత్రుడొకడు చాలు. వేలకొలదీ నక్షత్రాలు పారద్రోలలేని చీకటిని చంద్రుడొకడు తరిమేయగలడు
  • దేవుని తరువాతి స్థానాలన్నీ అమ్మవే
  • పుత్రుడికి ఉత్తమమైన మంచి విద్యానొసగుట తండ్రికి అన్నిటికన్నా పెద్ద కర్తవ్యము
  • దుష్టుడికి శరీరమంతా విషమే
  • దుష్టులు మరియు ముల్లు అయితే జోడుతో తొక్కేయాలి లేకపోతే దారిలోంచి తీసి పారేయాలి.
  • డబ్బు ఉన్నవాడికి ఎక్కువ మంది స్నేహితులు, సోదర బంధువులు మరియు చుట్టాలు ఉంటారు.
  • భూమి మీద అన్నము, నీరు మరియు సుభాషితములు అన్న మూడు రత్నములు ఉన్నాయి. మూర్ఖులు ఉత్తినే రాళ్ళకి రత్నాలని పేరు పెట్టేరు.
  • బంగారంలో సువాసన, చెరకు నుండి పండ్లు, గంధం చెట్టుకి పువ్వులు ఉండవు. విద్వాంసుడు ధనవంతుడు కాలేడు మరియు రాజు దీర్ఘాయువు కలవాడు కాలేడు.
  • సరి సమాన హోదా గలవారి మధ్యే స్నేహం శోభనిస్తుంది.
  • తన కంఠ స్వరమే కోకిలకు రూపము. పతివ్రతగా ఉండడంలోనే స్త్రీకి సౌందర్యము. 
chanakya, chanakya neeti, chanakya niti ,principles of chanakya, chanakya neethi in telugu, chanakya neeti in telugu, chanakya niti in telugu full, chanakya niti for students, chanakya niti shastra in telugu, chanakya neeti telugu, chanakya niti in telugu, the six core principles to success, chanakya niti in telugu about women, chanakya niti about girls in telugu, chanakya niti in telugu pdf, chanakya niti in english, chanakya niti in telugu audio, chanakya , best thoughts of chanakya

సోమవారం, జూన్ 22, 2020

చైనా వస్తువులు వాడని వాడు దేశ భక్తుడు? వాడే వాడు దేశద్రోహి!

is-china-devotee-of-goods-hes-traitor
భారత్-చైనా యుద్దమేఘాలు కమ్ముకుంటున్న సమయంలో కొంతమంది రాజకీయ ప్రముఖుల నినాదం ఏమిటంటే.. "చైనా వస్తువులు వాడని వాడు దేశ భక్తుడు? వాడే వాడు దేశద్రోహి!" అని.

నిజానికి ఇది వినడానికి చాలా గమ్మత్తుగా ఉంది. నిజమే కదా చైనా వస్తువులు వాడటం మానేస్తే చైనా ఆర్ధిక పరిస్థితి పడిపోయి అప్పుల ఊబుల్లో కూరుకుపోయి సర్వనాశనం అయిపోతుందని కొంతమంది మేధావులు ఊదరగొడుతున్నారు. ఇది ఎంత వరకూ నిజమనేది నాకయితే తెలీదు గాని.. యుద్ధానికి రెడీ అయిన చైనా మాత్రం ఈమాత్రం నష్టాన్ని అంచనా వేయకుండా ఉంటుందా అన్నది నా సందేహం. 

ఇకపోతే పై విషయం వదిలేద్దాం.. ఎందుకంటే చైనా కొచ్చే నష్టాలతోనూ, కష్టాలతోనూ ఆలోచించాల్సిన పనిలేదు. ఇప్పటికే చైనా తీసుకొచ్చిన కరోనాకి ప్రపంచమే అంధకారంలోకి పోతోంది.

సోమవారం, జూన్ 15, 2020

ప్రపంచానికి కరోనా వరమా? శాపమా?

China-Virus-Corona-effect-in-world
ఈ పోస్టు చదువుతున్నవారందరూ ఇదేమి ప్రశ్నా? అనుకోవచ్చు. కానీ నిజానికి చాలామంది హృదయాలలో కరోనా భగవంతుడి తరుపునుండి వచ్చిన ఒక వరమని కొంతమంది, ఒక శాపమని మరికొంతమంది భావిస్తున్నారు. 

ఒకరోజు ఉదయం నేను నా మిత్రుడు "ధర్మ"తో ఫోన్లో సంభాషిస్తుండగా ఒక ఆసక్తికర సంఘటన ఒకటి చెప్పుకొచ్చారు. అదేమిటంటే తను "బజార్లో కూరగాయలు తీసుకుంటుండగా ఒక పెద్దాయన మరొకరితో వాదిస్తున్నాడు. " కరోనాను వైరస్ అని అనకండి.. నేను ఒప్పుకోను... అది భగవంతుడి అవతారం.. దుర్మార్గులను అంతమొందించడానికి, నాశనమయిన ప్రకృతిని పునరుద్ధరించడానికి వచ్చింది... మీరే గమనించండి మన పద్ధతులు ఎంత చక్కగా మారాయో ఉన్న సంపదను పొదుపుగా వాడుకోవడం.. క్రమశిక్షణను పాటించడం.. అనవసరంగా బయట బలాదూరుగా తిరుగుడు ఆగిపోవడం... అర్ధరాత్రులు వరకూ తాగి తందనాలాడటం ఆగిపోవడం... కుటుంబ సభ్యులతో గడపటం ఎలా సాధ్యమయింది కరోనా వలన కాదా? సౌండ్ పొల్యూషన్ లేదు, డస్ట్ పొల్యూషన్ లేదు.. రోడ్లు అన్నీ నిర్మాన్యుషంగా, ప్రశాంతంగా లేవా?... పెద్దాయన మాటలు వింటూ ఉంటే వాస్తవమే కదా అనిపిస్తోంది.

 


Recent Posts