మంగళవారం, మార్చి 27, 2018

అతని పని క్లీన్ చేయడం. ఎక్కడ ఏవిధమైన యాక్సిడెంట్ జరిగినా చిన్న రక్తపు బొట్టు కూడా కనిపించకుండా క్లీన్ చేస్తాడతను. అతని చేత ఒక అపరిచిత వ్యక్తీ మర్డర్ జరిగిన ప్రదేశంలో ఏవిధంగా అనుమానం రాకుండా అతని చేత క్లీన్ చేయించి అతని మీదే ఆ హత్యానేరాన్ని మోపాలని కుట్ర చేస్తాడు. దీని నుండి ఆ క్లీనర్ ఎలా బయట పడ్డాడన్నదే ఈ సినిమా! ఆద్యటం ఆసక్తిగా సాగుతుంది. మీకు వీలయితే ఆ మూవీ డౌన్లోడ్ చేసుకుని చూడండి.లింక్ క్రింద ఉంది.

శుక్రవారం, మార్చి 16, 2018

తన సొంత పార్టీలోనే సీనియర్ లీడర్లను గౌరవించలేని మోడీ ఇక చంద్రబాబునాయుడిని ఏమి పట్టించుకుంటాడు? ఇక తెలుగోడిని ఏం లెక్క చేస్తాడు?

Why PM Narendra Modi Insult LK Advani on Stage?

ఆంధ్రాను నిలువునా మోసం చేసిన మోడికి బుద్ధి రావాలంటే అన్ని పార్టీలు కూడా బిజెపిని రాష్ట్రం నుండి బహిష్కరించాలి. దానితో సంబంధం ఉన్న ప్రతి పార్టీని కూడా బహిష్కరించాలి. అప్పుడే ఆంధ్రావోడి దెబ్బ ఏంటో తెలుస్తుంది.

సోమవారం, మార్చి 12, 2018

ఆంధ్రా పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడి ప్రవర్తన చూస్తుంటే చాలా చిరాకు వేస్తుంది. చంద్రబాబు మీద పగ ఉంటే మరోలా తీర్చుకోవాలి. అంతే గాని ఆంధ్రా ప్రజలను పణంగా పెట్టడమేమిటి? హోదా కల్పించకుండా ఇబ్బందుల పాలు చేయడమేమిటి? ఈ అన్ని పార్టీలు (వైసిపీ,టిడిపి తో సహా) ఆంధ్రా వాళ్ళను ఎంతగా ఆడుకుంటున్నారు. ఆంధ్రాలోని బిజెపి నాయకులే హోదా ఇవ్వం, రాదు అంటుంటే ఇటువంటి చెత్త నాయకులను ఎన్నుకున్న మనం వీళ్ళను గెలిపించి ఎంత పెద్ద తప్పు చేసామో అర్ధమవుతోంది. టిడిపి ఇంతకాలం ఎదురుచూడకుండా ఉండాల్సింది. చంద్రబాబు కష్టజీవే నో డౌట్. చంద్రబాబంటే ఒక విజన్. అతని పని అతను చేసుకోనిస్తే అభివృద్ధి బాగుంటుంది. అతను పెట్టే ప్రాజెక్ట్స్ మన యువతకు గ్యారెంటీగా జీవనోపాధి కలిగిస్తుంది. కానీ ఏమి లాభం? అతని క్యాబిన్ లో అత్యధికులు తిమింగలం జాతికి చెందిన వారు పీక్కు తినడానికే వారున్నారు.

ఇక వైసిపీని చూస్తే ఇదసలు పార్టీయేనా అనిపిస్తుంది. వైసిపీ యాంకర్లు అయిన అంబటి, జబర్దస్త్ కామెడీ రాణి రోజా యొక్క డబ్బా వాగుడు చూస్తుంటే వీరు జగన్ ని మరింత దిగజారుడు స్థితికి పడేస్తున్నారు. బిజెపితో టిడిపి తెగతెంపులు చేసుకున్న వెంటనే వైసిపీ...బిజెపిని పెళ్లి చేసేసుకోవడం ఖాయం. ఇదే జరిగితే వైసిపికి, జగన్కి కేసుల గొడవ, కోర్టుల గొడవ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేవరకూ ఉండవు. హోదా అడ్డు పెట్టుకుని టిడిపిని ఇరుకున పడేసి తను సేఫ్ అవ్వాలని చూస్తుంది తప్ప వైసిపికి హోదా పట్ల చిత్తశుద్ధి కనిపించడం లేదు.

ఇంతకీ మనం 2019లో ఓటు ఎవరికి వేయాలి? అధికారం ఎవరికి కట్టబెట్టాలి?

Follow by Email

Recent Posts