శనివారం, మే 28, 2016

మా అత్తగారికి, నా సతీమణికి టి‌వి సీరియల్స్ అంటే పిచ్చి. 7pm నుండి ప్రారంభమయ్యే చిన్నారి పెళ్లి కూతురి నుండి 9:30 వరకూ ప్రసారమయ్యే శశిరేఖా పరిణయం వరకూ దేనిని వదలరు. ఆసమయంలో ఇంట్లో దొంగలు పడినా సరే వీరు గమనించే స్థితిలో ఉండరు. కేవలం మా ఇళ్లే కాదండోయ్! మా కాలనీలోని స్త్రీ సమాజం మొత్తం అదే పనిలో ఉంటుంది.
        మా మగ సమాజం ఏదైనా ప్రోగ్రామ్ వీక్షించాలంటే ఈ సీరియళ్ళన్నీ అయిపోయిన తరవాతనే! అంతవరకూ రిమోట్ ముట్టుకుంటే అంతే సంగతులు!
        ఈ బాధ చూడలేక, చూడలేక అత్యధిక మగ సమాజం కూడా క్రమేపీ సీరియల్ చూడడానికే అలవాటు పడిపోయారు...మా మామయ్య గారిలా!!
       ఈ విధంగా రోజులు నడుస్తున్న సమయంలో సర్లే అని నేను కూడా ఒకరోజు రాత్రి అంటే నిన్న రాత్రి "శశిరేఖా పరిణయం" సీరియల్ ముందు కూర్చున్నాను. దానమ్మ..అదేం సీరియల్లో ఒక చిన్న డైలాగ్ చెప్తే చాలు 5 నిమిషాలు అందరి ముఖ కవళికలు జూమ్,జూమ్ అనే మూజిక్ తో చూపిస్తూ ఫ్లాష్ లైట్లు కొడుతూ... ఒక్కసారిగా నాకళ్లు ఆ మెరుపులకు బైర్లు కమ్మాయంటే నమ్మండి. మైండ్ మొత్తం మొద్దుబారిపోయింది. అదేంటో అరగంట సమయంలో ఆసీరియల్ లో 20నిమిషాలు పాటు అడ్వరటైజ్ మెంట్లు! మొత్తానికి రెండు డైలాగులు 20నుండి 30 ఫేస్ క్లోజప్ లతో సీరియల్ ముగిసిపోయింది. ఒక్క క్షణం ఏమి చూశానో, ఏమి జరుగుతుందో కూడా నాకు అర్ధం కాలేదు. ఈ ఆడజాతికి బుర్ర లేదన్న ఎవరో కవి మాటలు నిజమే అనిపించాయి. ఎందుకంటే వారు ప్రతిరోజూ సీరియల్స్ చూసి,చూసి వాటిలో ఏం జరుగుందో... ఆ కధా కమామీషు ఏమిటో కూడా అర్ధం చేసుకునే పరిస్థితిలో లేరు. అంతెందుకు నాకు తెల్సి ఆ సీరియల్ డైరెక్టర్లకు కూడా ఈ సీరియల్స్ క్లైమాక్స్ ఎక్కడ ముగించాలో తెలియదనుకుంటా!!

గురువారం, మే 26, 2016

100% నిజమని నమ్ముతున్నాను. ఎందుకంటే నమ్మకం లేనిది ఏదీ లేదు. మనిషి నైనా, గవర్నమెంట్ వ్యవస్థనైనా ఆఖరికి దేవుడినైనా నమ్మకంతోనే చూస్తూన్నాము. నమ్మకంతోనే బ్రతుకుతున్నాము. రేపటి కోసం చూస్తున్నామంటే రేపటికి మనము బ్రతికే ఉంటామన్న నమ్మకం. నమ్మకం మూఢ నమ్మకం కాకుండా చూసుకుంటే చాలు. నమ్మకం హేతువుకి అందితే చాలు. అప్పుడు ప్రతి నమ్మకాన్ని ఖచ్చితంగా నమ్మవచ్చు. నమ్మకం లేనిది ఏముంది చెప్పండి? అన్నీ నమ్మకాలే, నమ్మకం లేని జీవితం లేదంటే ఖచ్చితంగా నమ్మవచ్చు.

శుక్రవారం, మే 20, 2016

Adsense ద్వారా అంత సంపాదించండి,ఇంత సంపాదించండి అనే ప్రకటనలు విని నేను కూడా ఒక సంవత్సరం క్రితం Youtube ఛానెల్ ఒకటి క్రియేట్ చేసి ఇప్పటికి ఏప్రియల్ ి౩౦ కి 100 డాలర్లు సంపాదించాను. కొంతమంది మిత్రులను అడిగితె ఈ నెల అంటే మే 27 కి బ్యాంక్ కు వచ్చేస్తాయి అంటున్నారు. అప్పటివరకూ వెయిట్ చేస్తాను తప్పదునేను కొత్త,కొత్త షార్ట్ ఫిలిమ్స్,డాక్యుమెంటరీలు తీస్తాను.గూగుల్ కంపెనీ నిజాయతీ ఏమిటో త్వరలోనే తెలుస్తుందన్న మాట! డబ్బులోస్తే మీకు కూడా చెప్తా లెండి. నిజమైతే మీరు కూడా ఆ దిశగా ప్రయాణం మొదలుపెడుదురు.ఏమంటారు?

శనివారం, మే 07, 2016

 


Recent Posts