మంగళవారం, సెప్టెంబర్ 15, 2020

ఒక రోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు.

రవివర్మను గుర్తుపట్టిన ఒక యువతి  సంతోషంతో   ఆయన దగ్గరకు వెళ్ళి  పలకరించి , ఏదైనా చిన్న పేయింటింగ్ గీసి ఇవ్వమని  అభ్యర్థించింది.

బజారులో పేయింటింగ్ ఎలా  చిత్రిస్తారు ? మరోసారి కలిసినపుడు తప్పక  చిత్రాన్ని  వేసి  ఇస్తాను అన్నా కూడా ఆ యునతి  మొండిగా  మారాం చేసే సరికి  ఒక పేపర్ పై  అప్పటికప్పుడు  చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు. ఇస్తూ ఇస్తూ  ....నవ్వుతూ    అన్నాడు  దీని విలువ  కోటి రూపాయలు.జాగ్రత్తగా కాపాడుకో.

ఆ యువతి  ఆశ్చర్యంగా  పేయింటింగ్  వంక చూస్తూ ఉండి పోయింది.

మరుసటి రోజు  ప్రముఖ చిత్రకారుల చిత్రాలు  అమ్మే వ్యక్తిని కలిసి ఈ రవివర్మ చిత్రాన్ని  అమ్మితే ఎంత ధరకు అమ్ముడు పోతుందని  వాకబు చేసింది.

ఆయన కూడా రవివర్మ చెప్పినట్లే చెప్పేసరికి  నోటమాట రాక  మళ్ళీ రవివర్మ గారిని కలవడానికి   వెళ్ళింది.

రవివర్మని కలిసి   ఇలా  అంది ...మీరు పది నిమిషాలలో చిత్రించిన చిత్రానికి  ఇంత విలువ ఉంటుందని అనుకోలేదు.

నాకు కూడా  చిత్రకళలోని మెళకువలు నేర్పండి. మీలా పది నిమిసాలలో కాక పౌయినా....పది రోజులకు ఒక చిత్రాన్నైనా గీయగలను.

రవివర్మ నవ్వుతూ అన్నాడు  అమ్మాయీ...!  నీకు  పది నిమిషాలలో చిత్రాన్ని గీసి ఇచ్చాను. నిజమే. దీని వెనకాల  నా 30 సంవత్సరాల కఠోర సాధన ఉంది.

నవ్వూ నీ 30 సంవత్సరాలు  ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే  నాలా తయారవగలవు.

ఆ యువతి నోటమాట రాక అలాగే చూస్తూ ఉండి పోయింది.

  ఒక టీచర్ చెప్పే 45 నిమిషాల పాఠం వెనుక కూడా అతని జీవితం లోని ఎన్నో సంవత్సరాల కఠిన సాధన ఉంటుంది.

తల్లి తండ్రులు  నీకు చెప్పే మాటల వెనుక కూడా, నీ ఊహకు కూడా అందని  ప్రేమ, త్యాగాలు అనుభవాలు ఉంటాయి.

అలాగే ఒక బ్రహ్మ జ్ఞాని ఎదురుగా నీవు కొన్ని నిముషాలు కూర్చుంటే, నీ జీవితమే మారిపోతుంది....
     _ఉపాధ్యాయుల పాఠాలు, తల్లి తండ్రుల మంచిమాటలు, గురువుల జ్ఞాన బోధలు కూడా రవివర్మ చిత్రాల్లా నీ ఊహకు కూడా అందని విలువైనవి🌹

*ఈ విలువైన సందేశాన్ని మీ మిత్రులతో కూడా పంచుకోండి.

సోమవారం, సెప్టెంబర్ 14, 2020

స్నేహితులు ఆరు రకాలు


1.తెలివైన వారు : వీరు మనల్ని గైడ్ చేస్తారు మాట్లాడుతారు మాట్లాడటం నేర్పుతారు వీరి కంపెనీలో మన తెలివి పెరుగుతుంది పని విలువ తెలుస్తుంది.

2.మంచివారు : వీరు తెలివైన వారు కాకపోవచ్చు కానీ ప్రాణం ఇస్తారు ఆపదలో ఆదుకుంటారు.

3.క్రిములు : మనకే తెలియకుండానే సమయం తింటారు అయినా వీరు కంపెనీలో బావుంటుంది చెడు అలవాట్లు కూడా వీరు వల్లనే అవుతాయి తమ పరిధిలోకి లాగేసి తమ లాగా బతక పోతే జీవితం వృధా అన్న అభిప్రాయాన్ని కలుగజేస్తారు వీరి ప్రభావం నుంచి బయటపడడం కష్టం.

4.దొంగలు : మన స్నేహితులు లాగే నటిస్తూ మన వస్తువులు కొట్టేస్తారు వెనుక గోతులు తవ్వుతారు అవసరానికి వాడుకుని మాయం అవుతారు.

5.గడ్డిపరకలు : వీరివల్లలాభమూఉండదు. నష్టమూఉండదు.కబుర్లకు తప్పదేనికిఉపయోగపడరు.

6.హీన చరితులు : వీరి కన్నా దొంగలు నయం. ఏలాభమూ లేకపోయినా వీరు మనగురించి బయట చెడుగా మాట్లాడుతారు. మనమనస్సుకష్టపెడతారు.

పై విషయాలన్నీ యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన విజయ రహస్యాలు అనే పుస్తకం నుండి సేకరించినవి మరిన్ని విషయాల కోసం ఆ పుస్తకాన్ని తప్పకుండా చదవండి.

Read Also: Basics rules of English Grammar

శనివారం, సెప్టెంబర్ 12, 2020

ఉపాధ్యాయులు కేవలం పంతుళ్ళు కాదు... "తరాల" తయారీదారులు

 *ఒక ఉపాధ్యాయుడిని ఎవరో అడిగారు*
గురువుగా ఉండటం మీరు ఎందుకు గర్వంగా ఫీలవుతారు?*_

అందుకా ఉపాధ్యాయుడు నవ్వుతూ....
ఒక న్యాయవాది యొక్క ఆదాయం సమాజంలో నేరాలు మరియు వ్యాజ్యాల పెరుగుదలతో పెరుగుతుంది

ఒక వైద్యుని యొక్క ఆదాయం ప్రజల వ్యాధి /అనారోగ్యం పెరుగుదలతో పెరుగుతుంది

కానీ మా(గురువు) ఆదాయం మాత్రం... ప్రజల యొక్క జ్ఞానం,శ్రేయస్సు మరియు దేశ అభివృద్ధి పెరుగుదలతో పెరుగుతుంది...!!_

Yes, అందుకే మేము ఉపాధ్యాయులుగా గర్విస్తాం !
👍👍👍👍👍👍👍👍
----------------------------------------
పంతుళ్ళం కాదు..
మేం *తరాల* తయారీదారులం.. (Teachers: Makers of Generations)

మంగళవారం, ఆగస్టు 25, 2020

*ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!*

మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి ప్రయోజనాలు అనేకం
అవగాహన కలిగి ఉండటం శ్రేయస్కరం
ఆలంబనగా నిలిచే జీవోలెన్నో
కుటుంబసభ్యులు తెలుసుకోవడం చాలా అవసరం
గుంటూరు: ఆయన ఓ శాఖలో కీలక ఉద్యోగి. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. ఆ కుటుంబంలో అంతులేని విషాదం నింపారు. తేరుకోవడానికి కుటుంబసభ్యులకు రోజులు పట్టింది. అటు తరువాత ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం, రాయితీల గురించి తెలియక కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఏ ధ్రువపత్రాలు పొందుపరచాలో, ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో తెలియక తికమకపడ్డారు. ఇది ఈ ఒక్క ఉద్యోగి కుటుంబానిదే కాదు. సర్వీసులో ఉండగా అకాల మరణం పొందిన చాలా కుటుంబాలదీ ఇదే పరిస్థితి. అందుకే సర్వీసులో ఉన్న ప్రతీ ఉద్యోగి బెనిఫిట్స్‌ గురించి తెలుసుకోవడమే కాకుండా కుటుంబసభ్యులకు తెలియజేయాలి.*
Key-Things-Family-Government-Employees-Need-Know
ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!
 
*🌺ఉద్యోగి అకాల మరణం పొందితే ప్రభుత్వం మానవత్వంతో స్పందిస్తుంది. అవకాశమున్నంత వరకూ నిబంధనల మేరకు సదరు ఉద్యోగి కుటుంబానికి పరిహారం, రాయితీలు, ఇతర బెనిఫిట్స్‌ అందిస్తుంది. దీనికిగాను కొన్ని మార్గదర్శకాలు పాటిస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా కాలం, పరిస్థితుల ప్రాతిపదికన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు మారుస్తూ అమలుచేస్తున్నాయి. వీటిపై ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులకు అవగాహన అవసరం.. ఆవశ్యం. అవి ఏమిటో తెలుసుకుందాం.*

Join English WhatsApp group links | Best English WhatsApp group links

Join Job Alerts WhatsApp Group Links | Join Jobs Whatsapp Group Links

*🌺అంత్యక్రియలకు సాయం
ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల ఖర్చుకుగాను తక్షణం రూ.15 వేలు అందిస్తారు. 2010 ఏప్రిల్‌ 24న ఇందుకుగాను ఒక ప్రత్యేక జీవో 192 జారీచేశారు. ఈ జీవోలో అన్ని వివరాలు పొందుపరిచారు. మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించడానికి సంబంధించి రవాణా చార్జీలు సైతం ప్రభుత్వ చెల్లిస్తుంది. ఎక్కడైతే మరణిస్తారో అక్కడి నుంచి తరలించే ప్రాంతాన్ని బట్టి ఈ చార్జీలు చెల్లిస్తారు. దీనికి సంబంధించి 1987 జూన్‌ 23న జీవో 153 జారీచేశారు.

🌺ఎన్‌క్యాష్‌మెంట్‌
మృతిచెందిన ఉద్యోగి ఎర్న్‌డ్‌ లీవ్‌లకు సంబంధించిన ఎన్‌క్యాష్‌మెంట్‌ను కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. ఈ ఎన్‌క్యాష్‌మెంట్‌ను 240 రోజుల నుంచి 300 రోజులకు పెంపుదల చేశారు. దీనికి సంబంధించి 2005 సెప్టెంబర్‌ 16న జీవో 232 జారీచేశారు.

🌺యాక్సిడెంటల్‌ ఎక్స్‌గ్రేషియా
విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ప్రమాదాల్లో మృత్యువాత పడితే ప్రభుత్వం రూ.లక్ష ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తుంది. దీనికి సంబంధించి 2006 జూలై 7న 317 జీవో జారీచేశారు.

రవాణా చార్జీలు
ఉద్యోగి విధి నిర్వహణలో కానీ.. ఇతర ప్రదేశంలో కానీ చనిపోతే ఆ ఉద్యోగి మృతదేహాన్ని ఇంటికి తరలించటానికి చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సంఘటనా స్థలం నుంచి ఇంటికి తీసుకువెళ్లడానికి నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈఅంశంలో మరిన్ని వివరాలు కావాలంటే 1985 సెప్టెంబర్‌ 15న జారీ చేసిన జీవో 1669 చూడవచ్చు.

🌺సస్పెన్షన్‌లో ఉంటే..
ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉండగా మరణిస్తే.. సస్పెన్షన్‌ విధించిన నాటి నుంచి చనిపోయిన కాలం వరకూ మానవతాభావంతో ఆ ఉద్యోగి డ్యూటీలో ఉన్నట్టుగానే పరిగణిస్తారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారంతో పాటు ఇతరత్రా రాయితీలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఈ కాలంలో అలవెన్స్‌లు వంటివి వర్తించినా వాటిని కూడా కుటుంబసభ్యులకు చెల్లిస్తారు.

🌺కారుణ్య నియామకం - కరువుభత్యం
ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగమిస్తారు. అయితే వారి అర్హతల ప్రాతిపదికన వివిధ స్థాయిల్లో తీసుకునే అవకాశం ఉంది. మరణించిన ఉద్యోగికి సంబంధించి డీయర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ) ను కుటుంబ పెన్సన్‌ కింద చెల్లించరు. కానీ కారుణ్య నియామకం పొందిన వారికి ఈ మొత్తాన్ని రెగ్యులర్‌గా చెల్లిస్తారు. దీని వివరాలను 1998 మే 25న జారీ చేసి జీవో 89లో తెలుసుకోవచ్చు.

🌺సంఘ విద్రోహ శక్తుల చేతిలో మరణిస్తే...
విధుల్లో ఉండగా అనుకోని సంఘటనల వల్ల మరణించినా. తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో దుర్మరణం పాలైతే తక్షణం ఆ ఉద్యోగి కుటంబసభ్యులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు.

🌺ఫ్యామిలీ పింఛన్‌
ఉద్యోగి మృతి చెందితే కుటుంబసభ్యులకు కుటుంబ పింఛన్‌ను వర్తింపజేస్తారు. ఈ పింఛన్‌ ఉద్యోగిస్థాయి, తరగతిని బట్టి ఉంటుంది. డీసీఆర్‌జీ పింఛన్‌రూల్స్‌కు అనుగుణంగా కుటుంబ పింఛన్‌ వర్తిస్తుంది.

🌺రుణాల చెల్లింపులు, అడ్వాన్సులు రద్దు
ఒక ఉద్యోగి సంస్థ నుంచి అప్పులు కానీ, అడ్వాన్సులు కానీ తీసుకుని మృతిచెంది ఉంటే ఆమొత్తాన్ని రద్దు చేస్తారు. ఉద్యోగి మరణించిన సమయానికి జీపీఎఫ్‌తో సమానమైన రూ.10 వేలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.

🌺రిఫండ్‌
ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్‌ కింద మినహాయించిన మొత్తాన్ని ఆ ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. 1974 నవంబర్‌ 9న జారీ చేసిన జీవో 307తో పాటు 1983 ఏప్రిల్‌ 27నజారీ చేసిన జీవో 55 ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.

🌺గ్రూప్‌ ఇన్సూరెన్స్‌
ఉద్యోగి తన విధి నిర్వహణలో చక్కగా పనిచేసి, అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే అతని గ్రూపు ఇన్స్‌రెన్స్‌ను రెట్టింపు మొత్తంలో కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. దీనికి సంబంధించి 1969 సెప్టెంబరు 28న 314 జీవో జారీచేశారు
Read Also: Andhra Pradesh Govt Jobs

సోమవారం, ఆగస్టు 24, 2020

కరోనా కు మానవ జాతి ఎందుకు బలవుతోంది?

కరోనా కు మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది. ఇన్ని రోజులు మానవ జాతి సాధించిన అభివృద్ధి  మానవున్ని ఈ చిన్న వైరస్ నుండి ఎందుకు కాపాడ లేక పోతోంది..
WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది SARC జాతి వైరస్. ఈ SARC  కరోనా వైరస్, ముందు వచ్చిన SARC వైరస్ లకన్నా తక్కువ శక్తి కలది.  అయినా ఈ కరోనాకు ఇన్ని లక్షల మంది ఎలా బలి అయిపోతున్నారు
ఈ వైరస్ లు ఇప్పుడు పుట్టినవి కాదు. కొన్ని వేల సంవత్సరం ల కింద నుండే వున్నాయి. అప్పుడు వైరస్ లను తట్టు కున్న మానవులు ఇప్పుడు ఎందుకు చిగురుటాకు లాగ రాలి పోతున్నారు.

గురువారం, ఆగస్టు 13, 2020

AP Grama Sachivalayam Hall Ticket 2020


AP-Grama-Sachivalayam-Hall-Ticket
అభ్యర్థులకు సూచనలు…
అభ్యర్థులు బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్ను, హాల్‌టికెట్, గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, డ్రైవింగ్ లెసైన్స్, ఓటర్ కార్డుల్లో ఒకటి)ను తప్పనిసరిగా తెచ్చుకోవాలి.
ఫోన్, క్యాలిక్యులేటర్, వాచ్‌తో సహా ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
అభ్యర్థులను తనిఖీ చేసిన అనంతరమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.
అభ్యర్థులకు సమయం తెలిసేలా అరగంటకొకసారి బెల్ కొడతారు.
పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు జరుగుతుంది.
పరీక్ష సమయం 150 నిమిషాలు. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి.
ఉదయం తొమ్మిది గంటలకే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
ఉదయం 9.30 గంటలకు పరీక్ష హాల్లోకి అనుమతించి ఓఎంఆర్ షీట్ ఇస్తారు.
ఓఎంఆర్ షీట్‌పై వివరాలు సరిచూసుకుని తప్పులుంటే ఇన్విజిలేటర్ దృష్టికి తేవాలి.
పది గంటలకు ప్రశ్నపత్రం అందిస్తారు.
ఉదయం 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోనికి అనుమతించరు.
పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులు హాలులోనే ఉండాలి.
మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఏ, బీ, సీ, డీ సిరీస్‌లో ప్రశ్నపత్రాలు ఇస్తారు.

సోమవారం, జులై 13, 2020

Every house needs a quarantine | ప్రతి ఇల్లు ఒక క్వరంటైన్  కావాలి

Every house needs a quarantine
*ఇలా చేయడం వల్ల కోవిడ్-19 వైరస్ వ్యాప్తి ని, రాకుండా ఆపగలం....*
*రోజు పొద్దున్నే 💥బయట ఎండలో 20 ని. సేపు మాస్క్😷 పెట్టుకుని  ఉండండి..*
*1.ప్రతి ఒక్కరూ ఇంట్లో కొంచెం గోరు వెచ్చని 🔥నీరు మాత్రమే తాగాలి...అది అరగంటకు ఒకసారి కొన్ని కొన్ని  చాలాసార్లు 5 లిటర్స్ వరకు త్రాగండి...*
*2.అల్లం..వెల్లుల్లి..మిరియాలు,శొంఠి,పసుపు..లవంగాలు,మిరియాల మొ.వి... బాగా వేడి చేసి రెండు,మూడు పూటలా తాగాలి..*
*3.రాత్రి పాలు 🥛,నీళ్లు తాగిన పసుపు కలుపుకుని తాగండి....*
*4.చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఇంట్లో కొంచెం జాగ్రత్తలు తప్పనిసరి చేయండి...*
*5.బలమైన ఆహరం కోడిగుడ్లు,పాలు,బాదం,జీడిపప్పు,కిస్మిస్ తినండి.....రాగి జావా...అంబలి....చేసుకోండి...*
*6.అత్యవసర మందులు ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవాలి....*

Recent Posts