* New war * | *కొత్త యుద్ధం*
( *ప్రస్తుత పరిస్థితి కి అద్దం పట్టే కథ... తప్పక చదవండి.*)![]() |
Corona Virus New war |
ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారి తప్పి, వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నెన్నో కొత్త కొత్త జంతువులు కనిపించాయి. తోడేళ్ళనూ, పులులనూ, సింహాలనూ, నక్కలనూ తొలిసారి అక్కడే చూసింది.
అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై- ‘‘ఓ జింక సోదరా! ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే!’’ అంది.
‘‘అవును. మాది జింకల వనం!’’
‘‘ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూరమృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో!’’ అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళిపోయింది.