బుధవారం, మార్చి 25, 2020



Home Made Sanitizer | కరోనా బారి నుండి తప్పించుకోవడానికి ఇంట్లోనే శానిటైజర్ చేసుకునే వెరీ సింపుల్ విధానం

భయంకరమైన కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవడానికి తప్పనిసరిగా మీరు ఈ క్రింది విధంగా శానిటైజర్ ని తయారు చేసుకోండి.
దీని కోసం కావాల్సినవి కేవలం 6 వస్తువులు కేవలం మాత్రమే అవి 1.దాల్చిన చెక్క 2.మిరియాలు 3.పసుపు 4.హారతి కర్పూరం 5.వేపాకు 6.లవంగాలు

ప్రకృతి నుండి పుట్టిన జబ్బులను ప్రకృతి మాత్రమే నయం చేయగలదు.
మానవుడు ప్రకృతి ఎప్పటి నుండైతే ధ్వసమ్ చేయడం పారంభించాదో అప్పటి నుండి ప్రకృతి కన్నెర్ర చేయడం ప్రారంభించింది... అందుకనే "ప్రకృతిని బ్రతుకనివ్వండి - అది మనల్ని బ్రతుకనిస్తుంది"

ఇక మిత్రులారా "శానిటైజర్ ని ఎలా తయారు చేసుకోవాలో క్రింది వీడియోలో చూడండి.
hand sanitizer,diy hand sanitizer,homemade hand sanitizer,how to make hand sanitizer,sanitizer, how to make hand sanitizer at home,diy sanitizer,hand sanitizer recipe,home made,hand sanitizer spray, hand sanitiser, make your own hand sanitizer,how to make sanitizer,hand sanitizer diy,hand sanitizer making, how to make sanitizer at home,hand sanitizer at home,homemade sanitizer,

శనివారం, మార్చి 21, 2020

 

Let nature live - it makes us live | ప్రకృతిని బ్రతుకనివ్వండి - అది మనల్ని బ్రతుకనిస్తుంది

let-nature-live-it-makes-us-live
 Let nature live - it makes us live | ప్రకృతిని బ్రతుకనివ్వండి - అది మనల్ని బ్రతుకనిస్తుంది
దయచేసి ఇది అందరూ చదవాలి,*
*మిగతా అందరికీ పంచాలి..*
*మనందరికీ కనువిప్పు కలగాలి.*

ఒక సూక్ష్మ జీవి.. కంటికి క‌న‌ప‌డ‌దు. దాన్ని చూసిన వాళ్లెవ‌రూ లేరు. అయినా న్యూయార్క్‌లోని ఒక వెయిట‌ర్‌, బెంగ‌ళూరులోని కూలి, తెలంగాణ‌లోని మొక్క‌జొన్న రైతు, కువైట్‌లోని సెలూన్ వ‌ర్క‌ర్ దాంతో యుద్ధం చేస్తున్నారు. బ‌తుకుని కోల్పోతున్నారు. నిశ్శ‌బ్దంగా అన్నీ కుప్ప‌కూలి పోతున్నాయి.

ఎక్క‌డో చైనాలో వ‌చ్చింది.. మ‌న‌కేం కాదులే అనుకున్నాం. చైనా వాళ్లు ఏం చేసినా ఓవ‌ర్ యాక్షన్ అనుకున్నాం. త‌మ దేశానికే గోడ క‌ట్టుకున్న మొండివాళ్లు, వైర‌స్‌ని కూడా అంతే మొండిగా త‌రిమేశారు. అది ప్ర‌పంచం మీదికి వ‌చ్చి ప‌డింది. ఇదేదో చిన్న విష‌యం అనుకున్నాం, కానీ ఇట‌లీ ఒక పెద్ద యుద్ధ‌మే చేస్తోంది. ఎంత పెద్ద యుద్ధ‌మంటే.. 80 ఏళ్లు పైబ‌డిన వాళ్లు చ‌చ్చినా ఫ‌ర్వాలేద‌నుకునే యుద్ధం.

ఆదివారం, మార్చి 15, 2020

సంపూర్ణ విజయానికి 10 సూత్రాలున్నాయి | There are 10 principles for absolute success.


  1. జీవితాన్ని సింపుల్ గా గడపండి. ఖరీదైన అలవాట్లు మానుకోండి.ఇక్కడ ఖరీదు అంటే ఆర్ధికపరమైన ఖరీదు కాదు.ఇతరుల మీద మనం ఆధారపడేట్లు చేసే అలవాట్లు కూడా ఖరీదైన అలవాట్లే. ఎప్పుడయితే నిరాడంబరంగా బ్రతకడం ప్రారంభిస్తామో అప్పుడు మనకి స్వార్ధం కూడా తక్కువుగా ఉంటుంది.
  2. సంపాదించిన దానికన్నా తక్కువ ఖర్చు పెట్టండి. అప్పు తీసుకోవడాన్ని ఎవాయిడ్ చేయండి.
  3. మీ మెదడు ద్వారం దగ్గర మీరే వెయిటర్ లాగా నిలబడండి. లోపలినుంచి ఎప్పుడు ఏం కావాలో దానిని అందజేయడానికి సన్నద్దులుగా వుండండి. మెదడు ఏదైనా అడిగినప్పుడు దానిని హృదయం కిచెన్ లోంచి తీసుకు వెళ్లి అందజేస్తూ వుండండి. ఈ విధంగా మెదడుకీ, హృదయానికి మధ్య మీరు తిరుగుతూ వుంటే ఆ ఎక్సర్ సైజ్ మిమ్మల్ని మానసికంగా ఎంతో శక్తిమంతుల్ని చేస్తుంది.
  4. మనిషిగా పుట్టినందుకు నిరంతరం గర్వంగా,ఆనందంగా ఫీలవుతూ ఉండండి.ఇతరుఅలని సంతోషపెట్టడం వలన వచ్చే ఆనందాన్ని గ్రహించండి. అదే సమయంలో మీకే మాత్రం నష్టం కలుగకుండా చూసుకోండి.
  5. ఫలితం ఏమైనా, ఉద్దేశ్యం మాత్రం నిజాయితీగా ఉండేలా చూసుకోండి.
  6. పక్కవారి జ్ఞానం మీదా, అనుభవం మీదా నమ్మకాన్ని వుంచండి. అలా అని వారు మీ నమ్మకాలని కూలదోయడానికి ప్రయత్నిస్తే తప్పకుండా ఎదుర్కోండి. తార్కికంగా ఆలోచించి వారు చెప్పింది కరెక్టా, మీది కరెక్టా అన్న విషయం ఒంటరిగా నిర్ధారించుకోండి.
  7. నిన్నటికీ, ఈ రోజుకీ మధ్య మీ జీవితాన్ని తీసుకుంటే అందులో తప్పనిసరిగా ఒక అనుభవమో, ఒక అనుభూతో, ఒక ఆహ్లాదమో కనీసం ఒక్కసారైనా మీద పెదవుల మీద చిరునవ్వో ఉండి తీరాలి. అలాంటి రోజు లేదంటే మీ జీవితంలో ఒకరోజు నిరర్ధకమైనట్లే. ఈ విషయం సదా గుర్తుంచుకోండి.
  8. పక్షుల్ని గమనించడం, ఉదయం పూట నడవటం, తోటపని, సంగీతం పట్ల అభిరుచి, ఎదో ఒక ఆట, ఒక విదేశీ బాష నేర్చుకోవటం, పుస్తకాలు చదవటం, ఫోటోగ్రఫీ, సాంఘిక సేవ, స్టేజీ మీద మాట్లాడటం, దూరప్రాంతాలు చూసే అభిలాష, రచన, మ్యూజిక్ - పై వాటిలో కనీసం మూడిటి పట్ల మీకు ఇష్టం, అభిరుచి వుంది తీరాలి.
  9. ప్రార్ధనలని నమ్మండి. ప్రార్ధన మనసుని ప్రక్షాళన చేస్తుంది. నిస్వార్ధమైన ప్రార్ధనలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ లేదు.
  10. "మనం ఒక వ్యక్తిని ఎంత ఇష్టపడుతున్నాం అనేది అతడికి మనం చేసిన మంచి' మీద ఆధారపడి ఉండాలే తప్ప అతడు మనకు చేసిన సాయం మీద కాదు" ఈ వాక్యం కొంచెం కన్ ఫ్యూజింగ్ గా వున్నా ఒకటికి పదిసార్లు చదివి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. "మానవ సంబంధాలు" అన్న అధ్యాయం మొత్తం ఈ ఒక్క వాక్యం మీద ఆధారపడి వుంది. ఇష్టపడి మనం సాయం చేయటం దైవత్వం. సాయం చేయటం వల్లనే ఇష్టపడటం స్వార్ధం (లేదా) కృతజ్ఞత.

బుధవారం, మార్చి 11, 2020

స్థానిక ఎలక్షన్లలో టి‌డి‌పి పోటీ చేయడం అవసరమా?

ప్రస్తుత వైయస్సార్ సిపి పరిస్తితి చూస్తుంటే స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం అనవసరం అనిపిస్తోంది. ఎందుకంటే పైన అధికారంలో వైయస్సార్ సిపి ఉన్నప్పుడూ ఒకవేళ టి‌డి‌పి పార్టీ వాళ్లు గెలిచినా వాళ్లు ఎటువంటి పనులు చేయలేరు సరికదా తీవ్రమైన పరిస్థితులు ఎదురుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల వైయస్సార్ సిపి వాళ్ళ దౌర్జన్యానికి భయపడి నామినేషన్లు వేయడానికే భయపడే వాళ్లు ఒకవేళ నెగ్గినా అధికారంలో ఉన్న వైసీపీ వాళ్లను ఏవిధంగా ఎదురుకోగలరు?

జెసి స్థానిక ఎన్నికలలో టిడిపి పోటీ చేయకపోవడమే మంచిదన్న వాదన సమర్ధనీయమైనది. ఎటూ ఆంధ్రా అంతా వైసీపీనే రాజ్యమేలుతుంది కాబట్టి స్థానిక సంస్థలు కూడా వాళ్ళకే అప్పగించేస్తే బాగుంటుంది. ఇదే పని టిడిపి చేయగలిగితే 2024 అసెంబ్లీ ఎలక్షన్లలో టిడిపికి ఎదురు లేకుండా పోతుంది. ప్రజలు పూర్తిగా టిడిపికే పూర్తిగా ఒరిగిపోతారు.

Recent Posts