ఆదివారం, ఆగస్టు 19, 2018

నేను ఏర్పాటు చేసుకున్న small kitchen garden

నేను నెలరోజుల క్రితం ఏర్పాటు చేసుకున్న The small kitchen garden ఇది. మాకు కొద్దిగా చిన్నపాటి స్థలం ఉంటే దానిలో క్రింది విధంగా ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో వంకాయ, చెట్టు చిక్కుడు, టమోటా, మిర్చి, తోటకూర, పుదీనా, కొత్తిమీర, గోంగూర, క్యారెట్, మొక్కజొన్న, మూడు రకాల రోజా పూల మొక్కలు, కనకాంబరం మొక్క, బంతిపూల మొక్కలు నాటడం జరిగింది. ఇలా ఎవరి అనుకూలాన్ని బట్టి వాళ్ళు గార్డెన్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.










The small kitchen garden I have set up

మంగళవారం, ఆగస్టు 14, 2018

indian-national-flag-rules-what-we-must-Know

💐జాతీయ జెండా నియమాలు


🚩2002 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ లోని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నవి.
🚩జెండా ఎగురవేయడంలో నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నవి.కాగా రాజ్యాంగా స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుచున్నది.
🚩Flag code of India సెక్షన్ V రూల్ ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సంధర్భంగా జెండాలో పూలుఫెట్టి ఎగుర వేయవచ్చు

ఝండా ఎవరు ఎగుర వేయాలనేది ఒక సమస్య. 

1.👉విధాన నిర్ణాయక సంస్థలు,(బాధ్యులు ప్రధాని,ముఖ్యమంత్రి, ZP చైర్మెన్,గ్రామ సర్పంచు మొదలగు వారు). 
2.👉కార్యనినిర్వహణ సంస్థలు.(రాష్ట్రపతి, గవర్నర్ కలెక్టర్ MDO, MEO.MRO  హెడ్ మాష్టర్  ప్రిన్సిపాల్) అనేవి ఈ విధంగా  రెండు రకాలు. మనం  కార్యనిర్వహణ సంస్థల క్రిందకు వస్తాము. కార్యనిర్వహుకులం. 
3.👉పాఠశాలలు, కాలేజీలు కార్యనిర్వహణ సంస్థలు. కావున పాఠశాల్లో 15 ఆగష్టు,  26 జనవరిలనందు ప్రధానోపాధ్యాయులే జాతీయ జెండాను ఎగుర వేయాలి. 

ఆదివారం, ఆగస్టు 12, 2018

ఒకసారి బుధ్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు.
ఇంతలో ఒక శిష్యుడిని పిలిచి,
"నాయనా, దాహంగా ఉంది, ఆ కనబడే చెరువునుంచి కొన్ని నీళ్ళు తీసుకురా" అని చెప్పాడు. అప్పుడే ఒక ఎద్దులబండి ఆ చెరువులోంచి వెళ్ళడం మూలంగా నీరు అంతా మురికిగా తయారయింది.
శిష్యుడు ఆ నీరు తేరుకొనేంతవరకు అలాగే కూర్చున్నాడు.
అరగంట సమయం గడిచింది.
చూస్తే నీరు ఇంకా మురికిగానే ఉంది.
మరో అరగంట సమయం వేచి చూసాడు.
నీరు తేరుకున్నాయి.
ఆ పైన ఉన్న నీరు తీసుకెళ్ళి బుధ్ధుడికి ఇచ్చాడు శిష్యుడు.
అప్పుడు శిష్యుని అనుమానం
" ఈ నీరు అంత మురికిగా ఉన్నా, ఎలా తేరుకుంది? నువ్వు కాసేపు దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు. అది నెమ్మదిగా మురికి కిందకుపోయి, స్వచ్చమైన నీరు పైకి తేరుకుంది.
మన మనసు కూడా అంతే.
ఒకసారి మనసులో ఆందోళన కలిగినపుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి.
కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే మురికి అంతా అడుగుకు వెళ్ళిపోయి, మనసు స్వచ్చంగా మారుతుంది.
నీ మనసు తేలిక అవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నమూ చేయవలసిన పనిలేదు.
కొంతసేపు అలా వదిలేస్తే, దానంతట అదే సద్దుమణుగుతుంది.
చక్కబడుతుంది.
మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
మన ప్రయత్నం లేకుండానే జరిగిపోతుంది."
మీకు ఇష్టమైన వాళ్లను ఎప్పుడూ వదులుకోకండి.
వారు తప్పులు చేసారు అనుకుంటే, ఒక్క క్షణం వారితో మీరు గడిపిన అద్భుతమైన, ఆనందకరమైన క్షణాల గురించి ఒక్కసారి తలుచుకోండి.
ఎందుకంటే, పరిపక్వత కన్నా, అభిమానం ముఖ్యం.
మిమ్మల్ని మీరు కౌగలించుకోలేరు.
మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు.
అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి.
జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకటమే.
మీకు ఇష్టమైన వారి కోసం, మిమ్మల్ని ప్రేమించేవారికోసం బ్రతకండి. స్నేహం, ప్రేమ,
బంధుత్వాలు అనేవి డబ్బు భాష మాట్లాడేవారికి అర్థం కావు.
ఎందుకంటే కొన్ని పెట్టుబడులు మనకు కనిపించే లాభాలను ఇవ్వలేకపోవచ్చు, కాని మనలను సంపన్నుల్ని చేస్తాయి.
కుటుంబం, స్నేహితులు అలాంటి గొప్ప పెట్టుబడులు.....

 


Recent Posts