సోమవారం, ఫిబ్రవరి 19, 2018

Learn-to-read-good-and-good-books
ఈ పై మాట ఇప్పుడు ఎవరికీ చెవికెక్కదేమో? ఎందుకంటే మనుషుల్లో పుస్తకాలు చదివే అలవాటు అంతరించిపోయింది. అందరూ వీడియోలు చూడడానికే అలవాటు పడిపోయారు.

JIO పుణ్యమాని అందరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చిన తరువాత పుస్తకాల పట్ల ఇంట్రస్ట్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు కేవలం Youtube లోకి వెళ్లి వెతికేసుకోవడం, వీడియోలు చూస్తూ నిమగ్నమయ్యిపోవడం జరుగుతోంది. దీని ప్రభావం ఆఖరికి బ్లాగులపై కూడా పడింది. బ్లాగ్ విజిటర్స్ చాలా వరకూ తగ్గిపోయారు.

పుస్తకాలు ఎప్పుడైతే చదవడం మానివేసామో అప్పుడు మన జ్ఞానం కూడా చాలా వరకూ అడుగంటిపోతూనే ఉందని చెప్పాలి. వీడియోలు చూడడం తప్పు కాదు. దాని వలన కూడా ఎంతో నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు. కాని మేధావులు వ్రాసిన సాహిత్యం, వ్యక్తిత్వ వికాసపు పుస్తకాలు మనకు అక్కడ దొరకవు కదా? వాటితో పాటు ప్రతిరోజూ కొంత టైం పుస్తక పఠనానికి కూడా కేటాయిస్తే ఎంతో ప్రయోజనం జరుగుతుంది.

కాబట్టి మిత్రులారా మీ రోజువారీ టైములో కొంత సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించండి. ఎందుకంటే తల దించుకుని పుస్తకాలు అధ్యయనం చేస్తే మనల్ని తలెత్తుకుని తిరిగేలా చేస్తాయి ఈ పుస్తకాలు.
Learn to read good and good books.

సోమవారం, ఫిబ్రవరి 12, 2018

చైనా మొబైల్ దిగ్గజం షియోమి ఇండియా మార్కెట్లో దుమ్మురేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. అమ్మకాల్లో ఓ కొత్త రికార్డును సృష్టిస్తోంది. కాగా ఇప్పుడు షియోమి ఫోన్లు రూ. 4999 నుంచి రూ. 62 వేల ధర వరకు ఉన్నాయి. కాగా ఈ ఫోన్లు కావాలనుకున్న వారికి ఇప్పుడు బెస్ట్ ఈఎమ్ఐ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. కేవలం రూ. 243 ఈఎమ్ఐతో మీకు నచ్చిన ఫోన్ ని మీ సొంతం చేసుకోవచ్చు. మీకు మరిన్నివివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 


Recent Posts