శనివారం, డిసెంబర్ 24, 2016

మొత్తం 5 పద్ధతులు అవలంభించాలి.
1.కంటెంట్ మీ స్వంతం అయ్యుండాలి.
2.సబ్జెక్ట్ బాగుండాలి.
3.మీ వీడియో యొక్క Title,Tags,Descripation బాగుండాలి. ఇవి కూడా ఎట్టి సమయంలోనూ Copy అయ్యుండకూడదు.
4.మీ వీడియోలను ప్రతి సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేసుకోవాలి.
5.మీ వీడియోలకి తప్పనిసరిగా బ్యాక్ లింక్స్ ఏర్పాటు చేసుకోవాలి.
పై 5 పనులను చేసుకుంటూ పొతే మీరు YouTube ద్వారా ఎక్కువ సంపాదించగలరు.


గురువారం, డిసెంబర్ 22, 2016

రక్తపిశాచులన్నీ మానవులను అంతం చేసి తమ రాజ్యాన్ని స్థాపించుకుంటే పరిస్థితి ఏమిటి? ఇత్యాది కథ వృత్తాంతతో నిర్మించబడిన సినిమా BloodRayne (2005) 720p BRRip Telugu Dubbed Movie.
సినిమా ఇంట్రస్ట్ గానే సాగుతోంది. ఎక్కడా భయపడెటంత సన్నివేసాలేమీ ఉండవు. అయితే యాక్షన్ ఆదరగోడుతుంది. యుద్ధాల సన్నీ వేశాలు బాగుంటాయి.
కథ మొత్తం మానవునికి,రక్త పిశాచానికి పుట్టిన హీరోయిన్ చుట్టూనే తిరుగుతోంది. ఆ హీరోయిన్ మానవులను రక్షించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసిందీ చూడడానికి ఈసినిమా తప్పక వీక్షించవాల్సిందే. ఆ సినిమా డౌన్లోడ్ కొరకు క్రింది లింక్ క్లిక్ చేయవచ్చు.
BloodRayne (2005) 720p BRRip Telugu Dubbed Movie

మంగళవారం, డిసెంబర్ 20, 2016

ఈరోజు మీకు పరిచయం చేయబోయే సినిమా Speed (1994) 720p Telugu. ఒక బస్సులో బాంబ్ ఉంటుంది. బస్ ఏమాత్రం 50 కిలో మీటర్లు వేగం తగ్గినా ఆ బాంబ్ పేలిపోతుంది.  కాబట్టి బస్ ను 50 కిలోమీటర్లు ఏమాత్రం తగ్గకుండా న్యూయార్క్ సిటీ అంతా తిప్పుతూ బస్ లో ప్రయాణికులను ఏ విధంగా కాపాడేరన్నదే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మీకు తప్పకుండా నచ్చుతుంది. డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. లింక్ ఇక్కడ క్రింద ఇస్తున్నాను.
YouTube ద్వారా సంపాదించాలంటే కావలసినవి ఈ వీడియోలో ఉన్నవి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం మీలో తగినంత సృజనాత్మకత ఉండాలి. అది లేనప్పుడు మీరు ఏవిధంగానూ YouTube ద్వారా సంపాదించలేరు. ఈ మధ్య ఏమాత్రం కాపీ కంటెంట్ కనిపించినా ఛానెల్ మొత్తాన్ని గూగుల్ కంపెనీ మాయం చేసేస్తుంది. ఒక్క 18 నైటే మన ఇండియాలో 12 లక్షల యూట్యూబ్ చానెళ్ళు గాలిలోకి ఎగిరిపోయాయంటే మీరే ఊహించికోవచ్చు. దయచేసి ఆఖరికి గూగుల్ నుండి తీసిన Image సైతం పెట్టినా ప్రమాదమే!


సోమవారం, డిసెంబర్ 19, 2016


గురువారం, డిసెంబర్ 15, 2016

ఇంకా పూర్తి అందుబాటులోకి డబ్బుల చలామణీ రాకపోవడంతో సామాన్యుల ఇబ్బందులు పెరిగిపోయాయి. ఒక ప్రక్క నల్ల కుబేరుల దగ్గర కోట్ల కొద్దీ కొత్త నోట్లు లభ్యమవ్వడం చూస్తుంటే ఇప్పటికే నల్ల డబ్బును కొత్త డబ్బుగా మార్చేసుకుని జాగ్రత్త పడిపోయారన్న విషయం అర్ధమవ్వుతుంది. ఇందులో విచిత్రం ఏమీ లేదు. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు దాచు కుంటారంతే!
ఎటొచ్చీ అందరూ బాగానే ఉన్నారు. కేవలం సామాన్యులు మాత్రమే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు.
ఇవ్వన్నీ చూస్తుంటే మోడీ మంచి పని చేసాడని పొగిడిన వారే ఆయన ప్లానింగ్ లేకుండా చేసి ఆర్ధిక కుంభకోణాలకు తెర లేపారని విమర్శిస్తున్నారు.
పరిస్థితి ఇలానే ఉంటే దేశం ప్రమాదకర స్థితిలోకి పోవడం ఖాయం. నరేంద్ర మోడీ తొందరగా మేలుకొంటే మంచిది.

శుక్రవారం, డిసెంబర్ 02, 2016

రెండురోజుల క్రితం విపక్షాలన్నీ కలిపి భారత్ బందు ప్రకటించాయి. కానీ ఎవరూ పెద్దగా స్పందించకపోవడం మంచి శుభసూచకం. ఎందుకంటే పెరిగిన ధరలు తగ్గించమని బందు చేస్తే ఎవరైనా స్పందిస్తారు. అంతే గాని నల్ల కుబేరుల ఆట కట్టిస్తున్న నరేంద్ర మోడిని ప్రజలెలా వ్యతిరేకిస్తారు?

ఏ ప్రధాని చేయని పనిని ఏంతో ధైర్యంగా మన నరేంద్ర మోడిజీ గారు తలపెట్టారు. ఎవరు సపోర్ట్ చేయరు చెప్పండి?నోట్ల రద్దు వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం కరెక్టే...కాని ఎవరూ కూడా తిండి లేనంతగా, కనీస అవసరాలు తీరలేనంతగా ఇబ్బంది పడడం లేదే? కొన్ని రోజులు కాస్త సమస్యను తట్టుకుంటే సర్దుబాటు అయిపోతుంది. ఇప్పటికే బ్యాంకులలోనూ, ATM సెంటర్లలోనూ రద్దీ తగ్గిపోయింది. ఇంకొన్ని రోజులు ఓపిక పెడితే అన్నీ పూర్తిగా సర్డుకుపోతాయి. ఈమాత్రానికి మన ఆవేశం,కోపం పడిపోవడం అవసరమా?

దీనికే ఇలా అనుకుంటే భారత్ రక్షణకోసం పగలనక,రాత్రనక, తిండీతిప్పలు మాని కాపలా కాస్తున్న మన సైనికులకంటే పెద్ద సమస్యా మనది? వాళ్ళు భార్య పిల్లలను వదిలి, తల్లిదండ్రులను వదిలి దేశం కోసం ప్రాణాలు అర్పిస్తుంటే కనీసం మనం దేశ భవిష్యత్ కోసం ఈమాత్రం సమస్య భరించలేమా?

మోడిని వ్యతిరేకిస్తున్న వారందరూ నల్ల కుబేరులే! వాళ్ళ అక్రమార్జనను ఎలా మార్చుకోవాలో తెలియక అమాయక ప్రజలను అయోమయానికి గురి చేసి దేశంలో పెద్ద,పెద్ద అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు.

గొప్ప విషయమేమిటంటే ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. మోడీ తల పెట్టిన ఈ యజ్ఞం వలన దేశానికి ఎంత ఉపయోగమో గుర్తించగలిగారు.

ఈ ప్రజలు గనుక మోడిగారికి సంపూర్ణ మద్దతు ఇవ్వగలిగితే మరింత ఉపయోగాలు కలుగుతాయి. అది దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. దీనికి మీరేమంటారు?

 


Recent Posts