వ్యక్తిత్వ వికాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్యక్తిత్వ వికాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మంగళవారం, సెప్టెంబర్ 15, 2020

ఒక రోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు.

రవివర్మను గుర్తుపట్టిన ఒక యువతి  సంతోషంతో   ఆయన దగ్గరకు వెళ్ళి  పలకరించి , ఏదైనా చిన్న పేయింటింగ్ గీసి ఇవ్వమని  అభ్యర్థించింది.

బజారులో పేయింటింగ్ ఎలా  చిత్రిస్తారు ? మరోసారి కలిసినపుడు తప్పక  చిత్రాన్ని  వేసి  ఇస్తాను అన్నా కూడా ఆ యునతి  మొండిగా  మారాం చేసే సరికి  ఒక పేపర్ పై  అప్పటికప్పుడు  చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు. ఇస్తూ ఇస్తూ  ....నవ్వుతూ    అన్నాడు  దీని విలువ  కోటి రూపాయలు.జాగ్రత్తగా కాపాడుకో.

ఆ యువతి  ఆశ్చర్యంగా  పేయింటింగ్  వంక చూస్తూ ఉండి పోయింది.

మరుసటి రోజు  ప్రముఖ చిత్రకారుల చిత్రాలు  అమ్మే వ్యక్తిని కలిసి ఈ రవివర్మ చిత్రాన్ని  అమ్మితే ఎంత ధరకు అమ్ముడు పోతుందని  వాకబు చేసింది.

ఆయన కూడా రవివర్మ చెప్పినట్లే చెప్పేసరికి  నోటమాట రాక  మళ్ళీ రవివర్మ గారిని కలవడానికి   వెళ్ళింది.

రవివర్మని కలిసి   ఇలా  అంది ...మీరు పది నిమిషాలలో చిత్రించిన చిత్రానికి  ఇంత విలువ ఉంటుందని అనుకోలేదు.

నాకు కూడా  చిత్రకళలోని మెళకువలు నేర్పండి. మీలా పది నిమిసాలలో కాక పౌయినా....పది రోజులకు ఒక చిత్రాన్నైనా గీయగలను.

రవివర్మ నవ్వుతూ అన్నాడు  అమ్మాయీ...!  నీకు  పది నిమిషాలలో చిత్రాన్ని గీసి ఇచ్చాను. నిజమే. దీని వెనకాల  నా 30 సంవత్సరాల కఠోర సాధన ఉంది.

నవ్వూ నీ 30 సంవత్సరాలు  ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే  నాలా తయారవగలవు.

ఆ యువతి నోటమాట రాక అలాగే చూస్తూ ఉండి పోయింది.

  ఒక టీచర్ చెప్పే 45 నిమిషాల పాఠం వెనుక కూడా అతని జీవితం లోని ఎన్నో సంవత్సరాల కఠిన సాధన ఉంటుంది.

తల్లి తండ్రులు  నీకు చెప్పే మాటల వెనుక కూడా, నీ ఊహకు కూడా అందని  ప్రేమ, త్యాగాలు అనుభవాలు ఉంటాయి.

అలాగే ఒక బ్రహ్మ జ్ఞాని ఎదురుగా నీవు కొన్ని నిముషాలు కూర్చుంటే, నీ జీవితమే మారిపోతుంది....
     _ఉపాధ్యాయుల పాఠాలు, తల్లి తండ్రుల మంచిమాటలు, గురువుల జ్ఞాన బోధలు కూడా రవివర్మ చిత్రాల్లా నీ ఊహకు కూడా అందని విలువైనవి🌹

*ఈ విలువైన సందేశాన్ని మీ మిత్రులతో కూడా పంచుకోండి.

సోమవారం, సెప్టెంబర్ 14, 2020

స్నేహితులు ఆరు రకాలు


1.తెలివైన వారు : వీరు మనల్ని గైడ్ చేస్తారు మాట్లాడుతారు మాట్లాడటం నేర్పుతారు వీరి కంపెనీలో మన తెలివి పెరుగుతుంది పని విలువ తెలుస్తుంది.

2.మంచివారు : వీరు తెలివైన వారు కాకపోవచ్చు కానీ ప్రాణం ఇస్తారు ఆపదలో ఆదుకుంటారు.

3.క్రిములు : మనకే తెలియకుండానే సమయం తింటారు అయినా వీరు కంపెనీలో బావుంటుంది చెడు అలవాట్లు కూడా వీరు వల్లనే అవుతాయి తమ పరిధిలోకి లాగేసి తమ లాగా బతక పోతే జీవితం వృధా అన్న అభిప్రాయాన్ని కలుగజేస్తారు వీరి ప్రభావం నుంచి బయటపడడం కష్టం.

4.దొంగలు : మన స్నేహితులు లాగే నటిస్తూ మన వస్తువులు కొట్టేస్తారు వెనుక గోతులు తవ్వుతారు అవసరానికి వాడుకుని మాయం అవుతారు.

5.గడ్డిపరకలు : వీరివల్లలాభమూఉండదు. నష్టమూఉండదు.కబుర్లకు తప్పదేనికిఉపయోగపడరు.

6.హీన చరితులు : వీరి కన్నా దొంగలు నయం. ఏలాభమూ లేకపోయినా వీరు మనగురించి బయట చెడుగా మాట్లాడుతారు. మనమనస్సుకష్టపెడతారు.

పై విషయాలన్నీ యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన విజయ రహస్యాలు అనే పుస్తకం నుండి సేకరించినవి మరిన్ని విషయాల కోసం ఆ పుస్తకాన్ని తప్పకుండా చదవండి.

Read Also: Basics rules of English Grammar

శనివారం, సెప్టెంబర్ 12, 2020

ఉపాధ్యాయులు కేవలం పంతుళ్ళు కాదు... "తరాల" తయారీదారులు

 *ఒక ఉపాధ్యాయుడిని ఎవరో అడిగారు*
గురువుగా ఉండటం మీరు ఎందుకు గర్వంగా ఫీలవుతారు?*_

అందుకా ఉపాధ్యాయుడు నవ్వుతూ....
ఒక న్యాయవాది యొక్క ఆదాయం సమాజంలో నేరాలు మరియు వ్యాజ్యాల పెరుగుదలతో పెరుగుతుంది

ఒక వైద్యుని యొక్క ఆదాయం ప్రజల వ్యాధి /అనారోగ్యం పెరుగుదలతో పెరుగుతుంది

కానీ మా(గురువు) ఆదాయం మాత్రం... ప్రజల యొక్క జ్ఞానం,శ్రేయస్సు మరియు దేశ అభివృద్ధి పెరుగుదలతో పెరుగుతుంది...!!_

Yes, అందుకే మేము ఉపాధ్యాయులుగా గర్విస్తాం !
👍👍👍👍👍👍👍👍
----------------------------------------
పంతుళ్ళం కాదు..
మేం *తరాల* తయారీదారులం.. (Teachers: Makers of Generations)

బుధవారం, జూన్ 24, 2020

everyone-should-read-principles-of-Chanakya
Everyone should read the principles of Chanakya | చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు | అందరూ తప్పనిసరిగా చదవాలి

  • లక్ష్మి, ప్రాణం, జీవనం, శరీరం ఇవన్నీ పోయేవే. కేవలం ధర్మం మాత్రమే స్థిరంగా ఉంటుంది.
  • వందమంది మూర్ఖుల కంటే గుణవంతుడైన పుత్రుడొకడు చాలు. వేలకొలదీ నక్షత్రాలు పారద్రోలలేని చీకటిని చంద్రుడొకడు తరిమేయగలడు
  • దేవుని తరువాతి స్థానాలన్నీ అమ్మవే
  • పుత్రుడికి ఉత్తమమైన మంచి విద్యానొసగుట తండ్రికి అన్నిటికన్నా పెద్ద కర్తవ్యము
  • దుష్టుడికి శరీరమంతా విషమే
  • దుష్టులు మరియు ముల్లు అయితే జోడుతో తొక్కేయాలి లేకపోతే దారిలోంచి తీసి పారేయాలి.
  • డబ్బు ఉన్నవాడికి ఎక్కువ మంది స్నేహితులు, సోదర బంధువులు మరియు చుట్టాలు ఉంటారు.
  • భూమి మీద అన్నము, నీరు మరియు సుభాషితములు అన్న మూడు రత్నములు ఉన్నాయి. మూర్ఖులు ఉత్తినే రాళ్ళకి రత్నాలని పేరు పెట్టేరు.
  • బంగారంలో సువాసన, చెరకు నుండి పండ్లు, గంధం చెట్టుకి పువ్వులు ఉండవు. విద్వాంసుడు ధనవంతుడు కాలేడు మరియు రాజు దీర్ఘాయువు కలవాడు కాలేడు.
  • సరి సమాన హోదా గలవారి మధ్యే స్నేహం శోభనిస్తుంది.
  • తన కంఠ స్వరమే కోకిలకు రూపము. పతివ్రతగా ఉండడంలోనే స్త్రీకి సౌందర్యము. 
chanakya, chanakya neeti, chanakya niti ,principles of chanakya, chanakya neethi in telugu, chanakya neeti in telugu, chanakya niti in telugu full, chanakya niti for students, chanakya niti shastra in telugu, chanakya neeti telugu, chanakya niti in telugu, the six core principles to success, chanakya niti in telugu about women, chanakya niti about girls in telugu, chanakya niti in telugu pdf, chanakya niti in english, chanakya niti in telugu audio, chanakya , best thoughts of chanakya

సోమవారం, ఏప్రిల్ 06, 2020

even-if-you-do-not-dare-others-please-do-not-fear-your-others
🙂ఒక చిన్న నీతి కథ🙂

ఊరి బయట పొలం దగ్గర ఇద్దరబ్బాయిలు👦👶 పరుగులు పెట్టి అడుకుంటున్నారు.
ఒకడు పదేళ్ల వాడు.
ఇంకొకడు ఆరేళ్ల వాడు.
చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు.
పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు.
ముందు పెద్ద బావి 🏟 ఉంది.

పెద్దోడు చూసుకోలేదు.

అందులో పడిపోయాడు.

వాడికి ఈత రాదు.

బావి చాలా లోతు.

చుట్టుపక్కల ఎవరూ లేదు.

అరిచినా 😮😩 సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు.

చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు.
"అన్నా... దీన్ని పట్టుకో" అన్నాడు.
నీట మునిగి తేలుతూ🏊🏻 కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు.

చిన్నోడు తన శక్తినంతా💪😰 కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు.
"అన్నా ... భయపడకు..!☝
జాగ్రత్తగా పట్టుకో..!
పడిపోకుండా చూసుకో" అని అరిచాడు.😧
తాడు 📯 చివరను ఒక చెట్టుకి🌴 కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు.

ఆదివారం, మార్చి 15, 2020

సంపూర్ణ విజయానికి 10 సూత్రాలున్నాయి | There are 10 principles for absolute success.


  1. జీవితాన్ని సింపుల్ గా గడపండి. ఖరీదైన అలవాట్లు మానుకోండి.ఇక్కడ ఖరీదు అంటే ఆర్ధికపరమైన ఖరీదు కాదు.ఇతరుల మీద మనం ఆధారపడేట్లు చేసే అలవాట్లు కూడా ఖరీదైన అలవాట్లే. ఎప్పుడయితే నిరాడంబరంగా బ్రతకడం ప్రారంభిస్తామో అప్పుడు మనకి స్వార్ధం కూడా తక్కువుగా ఉంటుంది.
  2. సంపాదించిన దానికన్నా తక్కువ ఖర్చు పెట్టండి. అప్పు తీసుకోవడాన్ని ఎవాయిడ్ చేయండి.
  3. మీ మెదడు ద్వారం దగ్గర మీరే వెయిటర్ లాగా నిలబడండి. లోపలినుంచి ఎప్పుడు ఏం కావాలో దానిని అందజేయడానికి సన్నద్దులుగా వుండండి. మెదడు ఏదైనా అడిగినప్పుడు దానిని హృదయం కిచెన్ లోంచి తీసుకు వెళ్లి అందజేస్తూ వుండండి. ఈ విధంగా మెదడుకీ, హృదయానికి మధ్య మీరు తిరుగుతూ వుంటే ఆ ఎక్సర్ సైజ్ మిమ్మల్ని మానసికంగా ఎంతో శక్తిమంతుల్ని చేస్తుంది.
  4. మనిషిగా పుట్టినందుకు నిరంతరం గర్వంగా,ఆనందంగా ఫీలవుతూ ఉండండి.ఇతరుఅలని సంతోషపెట్టడం వలన వచ్చే ఆనందాన్ని గ్రహించండి. అదే సమయంలో మీకే మాత్రం నష్టం కలుగకుండా చూసుకోండి.
  5. ఫలితం ఏమైనా, ఉద్దేశ్యం మాత్రం నిజాయితీగా ఉండేలా చూసుకోండి.
  6. పక్కవారి జ్ఞానం మీదా, అనుభవం మీదా నమ్మకాన్ని వుంచండి. అలా అని వారు మీ నమ్మకాలని కూలదోయడానికి ప్రయత్నిస్తే తప్పకుండా ఎదుర్కోండి. తార్కికంగా ఆలోచించి వారు చెప్పింది కరెక్టా, మీది కరెక్టా అన్న విషయం ఒంటరిగా నిర్ధారించుకోండి.
  7. నిన్నటికీ, ఈ రోజుకీ మధ్య మీ జీవితాన్ని తీసుకుంటే అందులో తప్పనిసరిగా ఒక అనుభవమో, ఒక అనుభూతో, ఒక ఆహ్లాదమో కనీసం ఒక్కసారైనా మీద పెదవుల మీద చిరునవ్వో ఉండి తీరాలి. అలాంటి రోజు లేదంటే మీ జీవితంలో ఒకరోజు నిరర్ధకమైనట్లే. ఈ విషయం సదా గుర్తుంచుకోండి.
  8. పక్షుల్ని గమనించడం, ఉదయం పూట నడవటం, తోటపని, సంగీతం పట్ల అభిరుచి, ఎదో ఒక ఆట, ఒక విదేశీ బాష నేర్చుకోవటం, పుస్తకాలు చదవటం, ఫోటోగ్రఫీ, సాంఘిక సేవ, స్టేజీ మీద మాట్లాడటం, దూరప్రాంతాలు చూసే అభిలాష, రచన, మ్యూజిక్ - పై వాటిలో కనీసం మూడిటి పట్ల మీకు ఇష్టం, అభిరుచి వుంది తీరాలి.
  9. ప్రార్ధనలని నమ్మండి. ప్రార్ధన మనసుని ప్రక్షాళన చేస్తుంది. నిస్వార్ధమైన ప్రార్ధనలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ లేదు.
  10. "మనం ఒక వ్యక్తిని ఎంత ఇష్టపడుతున్నాం అనేది అతడికి మనం చేసిన మంచి' మీద ఆధారపడి ఉండాలే తప్ప అతడు మనకు చేసిన సాయం మీద కాదు" ఈ వాక్యం కొంచెం కన్ ఫ్యూజింగ్ గా వున్నా ఒకటికి పదిసార్లు చదివి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. "మానవ సంబంధాలు" అన్న అధ్యాయం మొత్తం ఈ ఒక్క వాక్యం మీద ఆధారపడి వుంది. ఇష్టపడి మనం సాయం చేయటం దైవత్వం. సాయం చేయటం వల్లనే ఇష్టపడటం స్వార్ధం (లేదా) కృతజ్ఞత.

గురువారం, ఫిబ్రవరి 27, 2020

చదువు ద్వారా మీ జీవితం మార్చుకోండి. | Change your life by reading.

ప్రజలకు "డియర్ ఎబ్బీ"గా సుపరిచితమైన ఏబిగెయిల్ వాన్ బ్యూరన్ ఓఫ్రా విన్ ఫ్రీ రెండేళ్ల పసిపాపగా ఉన్నప్పుడు, జనరంజకమైన తన "సలహా కాలం" రాయడం మొదలు పెట్టింది. పదిమంది అమెరికన్లలో ఒకరి కంటే తక్కువమంది దగ్గరే టి.వీలు ఉన్న రోజుల్లో, డియర్ ఎబ్బీ కాలం ప్రపంచంలోని వార్తా పత్రికలలో ప్రచురించబడేవి. ఆమె తక్కువుగా టివి చూడమని,ఎక్కువుగా చదవమని ఎప్పుడూ చెబుతుండేది.

చదువు ప్రాముఖ్యత గురించి యువతకు ఆమె ఇచ్చే సందేశం ఇదే అయ్యుండేది. 
అంతేకాదు ఏ వయసు వారికైనా ఆమె మాటలు చాలా విలువైనవి.

          "నేను యువతకు ఒక సలహా ఇవ్వగలిగితే, ఆ సలహా ఏమిటంటే చదువు,చదువు,చదువు. చదువు ద్వారా వాస్తవమైనవి కాని, ఊహాజనితమైనవి కాని - నూతన ప్రపంచాలను మీరు ఆవిష్కరిస్తారు. సమాచారం కొరకు చదవండి. ఆనందం కొరకు చదవండి.మన లైబ్రరీలనిండా కావాల్సినంత జ్ఞానం ఉంది. సంతోషం ఉంది. మీరు ఉచితంగా అందుకోవడానికి అంతా అక్కడ రెడీగా ఉంది. చదవని వ్యక్తి, చదువురాని వ్యక్తి కంటే ఏ విధంగాను గొప్పవాడు కాదు."

నిజానికి ఆమె మాటలు ఏంతో స్పూర్తి దాయకమైనవి. "చదువు, చదువు, చదువు" తెలివైన స్త్రీ నుంచి వెలువడిన తెలివైన మాటలు. ఆమె సలహా కాలం 50 సంవత్సరాలకు పైగా నడిచిందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

బుధవారం, ఫిబ్రవరి 19, 2020

is-happiness-for-man-in-money
మనిషికి కావల్సిన ఆనందాలు,సంతోషాలు కేవలం పూర్తి డబ్బులోనే లేవు.వీటిని పొందటానికి మాత్రం డబ్బు కూడా ఒకటి.ఈ మాట మీకు అర్ధం కాకపోవచ్చు.వింతగా అనిపించవచ్చు.కాని నిజం.
      మనిషి సంతోషంగా జీవించడానికి కావల్సిన వాటిలో డబ్బు  ప్రధానమైనది తప్ప..డబ్బే అన్నీ కాదు.డబ్బు ఏ కష్టఒ లేకుండా బ్రతకడానికి కావాలిగాని, కేవలం డబ్బు కోసమే బ్రతకడం ప్రారంభిస్తే అన్నీ కష్టాలే!అశాంతిమయాలే!!
      అతి అన్ని విషయాలలో ప్రమాదమే!అలాగే డబ్బు విషయంలో కూడా!
      అయితే మనిషి ఆ డబ్బు సంపాదన విషయంలో ముందుండాల్సిందే!
      హ్యాపీగా బ్రతకడానికి అతని దగ్గర డబ్బు లేకపోతే అతనికి ఏవిధమైన గుర్తింపు లేదు.సమాజంలో గౌరవం లేదు.
 ఆర్ధికబలం ఉన్నవాడికే సమాజం అండగా నిలుస్తుంది.తప్ప మంచి చెడులను బట్టి అస్సలు కాదు.
      ఎన్ని కుంభకోణాలు చేసిన నాయకుడైనా..ప్రజల మధ్య ఊరేగడం ప్రారంభిస్తే చేతులెత్తి నమష్కరిస్తుంది సమాజం.మనుష్యులను ఆ విధంగా తయారుచేస్తుంది డబ్బు.కాని వాళ్ల వ్యక్తిగత జీవితాలలో మాత్రం అలజడులు,అశాంతులు తప్ప మనశ్శాంతి మాత్రం ఉండదు.
     సరిపడే డబ్బే సంతృప్తి...అంతకు మించితే అనర్ధమే!
     నేనొకసారి కడపలో ఓ ఆధ్యత్మిక సభలోకి అతిధిగా వెళ్లినప్పుడు నా సందేశం ముగిసిన తరువాత ఓ ముస్లిం పండితుడు చక్కని కధ చెప్పాడు.
     ఆ ఊరి జమిందారు రాత్రి నిద్రపట్టక అతని ఇంటిపైన పచార్లు చేస్తున్నాడట.అయితే ఆ ఇంటికి దగ్గరలో ఉన్న చెట్టు క్రింద ఓ భిక్షగాడు దోమలు ఎంత కుడుతున్నా పట్టించుకోకుండా ఆదమర్చి నిద్రపోతున్నాడు.ఈ దృశ్యం జమిందారిగారి కంటబడింది.మనస్సులోనే అనుకున్నాడు"ఎంత విచిత్రం..నాకు గదిలో పడుకోవడానికి పరుపు,దుప్పట్లు,గదినిండా చల్లటి ఎ.సి ఉన్నా నాకు నిద్రలేదు.ఈ భిక్షగాడు చూస్తే అంత చలిలో అన్ని దోమకాట్లు మధ్య నిద్రపోతున్నాడు.
    జమిందారికి "నా బ్రతుక్కంటే నీ బ్రతుకే బాగుంది అనుకుని ఆ భిక్షగాడిని మనస్సులోనే అభినందించాడు.
 మర్నాడు ఉదయమే భిక్షగాడిని కల్సి ఓ వందరూపాయలు ఇచ్చి వచ్చాడు.
    ఆరోజు రాత్రి యధావిధిగా జమిందారుగారు తన డాబాపై తిరుగుతూ చెట్టు క్రింది భిక్షగాడు నిద్రపోకుండా దోమలను తోలుతూ కూర్చోవడం చూసాడు.జమిందారుగారు ఆశ్చర్యపోతూ డాబాపైనుండి క్రిందికి వచ్చి భిక్షగాడిని అడిగాడట ఎందుకు నిద్రపోలేదని?
    దానికి భిక్షగాడు "అయ్యా! ఉదయం మీరిచ్చిన 100రూపాయలలో 90రూపాయలు ఖర్చయింది.ఇంకా నాదగ్గర 10రూపాయలున్నాయి.వాటిని ఎవడు కొట్టేస్తాడోనని నిద్రపట్టడం లేదు బాబయ్యా అన్నాడట!
    ఏది ఏమైనా డబ్బు ప్రోగు వేతే మనిషి లక్ష్యం అయితే అతనికి మనసిక శాంతి కరువే!!

శనివారం, ఫిబ్రవరి 15, 2020

  • ఒకదారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరోదారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం.
  • ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం.


మంగళవారం, జనవరి 07, 2020

సమయం  గడిచిపోయింది, ఎలా  గడిచిందో తెలియదు,
జీవితమనే..పెనుగులాటలో..... వయసు  గడిచిపోయింది  తెలియకుండానే.

భుజాలపైకి..ఎక్కే పిల్లలు  భుజాలదాక వచ్చేశారు. తెలియనేలేదు..

అద్దె ఇంటి నుండి  చిన్న గా మొదలైన  జీవితం. ఎప్పుడు  మన ఇంట్లో కి వచ్చామో తెలియదు

ఆయాసంతో   సైకిల్  పెడల్ కొడుతూ..కొడుతూ.. కారు లో తిరిగే స్ధాయి కి ఎప్పుడొచ్చామో తెలియదు

ఒకప్పుడు  తల్లిదండ్రుల బాధ్యత  మాది. కానీ ఇప్పుడు  నాపిల్లలకు  నేను బాధ్యత గా మారాను ఇది కూడా  ఎలా  జరిగిందో  తెలియదు. .

ఒకప్పుడు   పగలు  కూడా  హాయిగా  నిద్ర పోయే వారం.. కానీ.. ఇప్పుడు  నిద్ర రాని  రాత్రులు  ఎన్నో.. ఇది కూడా ఎలా జరిగిందో తెలియదు.

ఒకప్పుడు  నల్లని కురులనుచూసుకొని  గర్వంగా  వగలు పోయే వాళ్ళం.. అవన్నీ  ఎప్పుడు  తెల్లగా  మారాయో తెలియదు.

ఉద్యోగం  కోసం  తిరిగి  తిరిగి  .. ఎప్పుడు  రిటైర్  అయ్యామో.. తెలియనేలేదు.

పిల్లల కోసం  ప్రతిదీ  అని ఎంత తాపత్రయం  పడ్డామో.. వాళ్ళు  ఎప్పుడు  దూరంగా  వెళ్లి పోయారో తెలియదు.

రొమ్ము విరుచుకొని అన్నదమ్ముల,అక్కచెల్లెండ్ల  మధ్య  గర్వంగా  నడిచే వాడిని  ఎప్పుడు అందరూ... దూరమయ్యారో తెలియదు.

ఇప్పుడే   ఆలోచిస్తున్నాను..నా కోసం..నా శరీరం  కోసం   ఏమైనా  చేసుకోవాలని.. కానీ.. శరీరం  సహకరించడం లేదు.
ఇవన్నీ..జరిపోయాయి.. కానీ  కాలం  ఎలా  గడిచిందో..తెలియనేలేదు.
It's  truth  of life.

గమనిక : పై ఆర్టికల్ నేను వ్రాసింది కాదు. ఒక మిత్రుడు వాట్సాప్ లో నాకు షేర్ చేస్తే చాలా బాగుంది కదా అని మీ అందరికోసం పోస్టు వేసాను. ఇంత గొప్ప జీవిత సత్యాలు తెలియజేసిన ఆ రచయిత(త్రి)గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

బుధవారం, డిసెంబర్ 04, 2019

జ్ఞాన సముపార్జనకు బ్లాగ్ కూడా ఒక మంచి వేదికే! అన్నీ విషయాల మీద బ్లాగర్లు తమ బ్లాగులను వ్రాస్తున్నారు. ఎన్నో మంచి,మంచి బ్లాగులున్నాయి. గొప్ప బ్లాగులున్నాయి. వాటిని మనము చదవడం అలవర్చుకోవాలి. వీలయితే ప్రతి ఒక్కరూ ఒక్క బ్లాగునైనా వ్రాయడం ప్రారంభించాలి. మన అనుభవాలును, మధుర స్మృతులను వ్రాసుకోవడానికి బ్లాగనేది ఒక మంచి వేదిక.

బుధవారం, నవంబర్ 20, 2019

ప్రతిరోజూ సాయంత్రం 7గంటలకు పార్క్ కు వెళ్ళడం నా అలవాటు. ఇంచుమించు రాత్రి 9గంటల వరకు అక్కడే గడుపుతాను. నా ప్రాజెక్టులు,పనుల గూర్చి ఆలోచించుకోవడం ప్లాన్ చేసుకోవడం, నాకొచ్చిన తాట్స్ పుస్తకంపై రాసుకోవడం చేస్తుంటాను. ఎందుకో అలా ఒంటరిగా గడపడం కూడా మనిషినికి ఎక్కడలేని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుకనే కాబోలు రోజు వారీ కొంత సమయాన్ని మీతో మీరు బతకండి అని మహానుభావులు ఉద్ఘాటించారు. ఈరోజు మనుషులలో అది కొరవడింది. జీవితాలన్నీ యాంత్రికం అయ్యిపోయాయి. చిన్న,చిన్న ఆనందాలన్నీ మిస్ అవుతూ పెద్ద దు:ఖానికి మనిషి గురయ్యిపోతున్నాడు.
            నాకు తెలిసి మనిషి ప్రతి సమస్యను పట్టించుకోవడం మానివేస్తే దాని ప్రమాదం ఏమీ ఉండదు. సమస్యలే వుండవు. మనం ఎక్కువుగా ఆలోచిస్తూ ఉంటాము కాబట్టి ఆ సమస్య కాస్తా పెనుభూతమై భయపెడుతుంది. కానీ మనం అలా ఉండకూడదు. సమస్యనే మనం భయపెట్టాలి. సమస్య మూలంలోకి వెళ్లి వేళ్ళను పెకిలించి పారవేస్తే సమస్య అనే వృక్షం కొన్నాళ్ళకి మాడిపోతుంది. నిజానికి మనకు తెలియకుండానే సమస్య తాలూకు విత్తనాలు మనలో వచ్చి పడుతుంటాయి. అవి మనకు తెలియకుండానే మొలకెత్తుతాయి. వీటిని మనం ఎప్పటికప్పుడు గుర్తించాలి. విత్తనాలను మొలకెత్తకుండా నాశనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ పరిస్థితులు,వ్యక్తులు మనలో సమస్య తాలూకు విత్తనాలు వెదజల్లెవారే!
  ఇవ్వన్నీ మనకి అర్ధమయ్యేది ఎప్పుడంటే "మనలో మనం బ్రతకడం" నేర్చుకున్నప్పుడే! శుభం!!

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ఇలా అనుకుంటూ ఉంటాము కదూ !
వింబుల్డన్ ప్లేయర్ Arthur Ashe మనకు అందిస్తున్న ఈ మెస్సేజ్ చదివితే మనం ఎలా ఆలోచించాలో తెలుస్తుంది .
ఏమయ్యింది ?
1983 లో ఆర్థర్ గుండె ఆపరేషన్ కోసం రక్తం ఎక్కించుకోవలసి వచ్చింది . ఆ రక్తం ద్వారా అతడికి వచ్చింది AIDS
ఈ విషయం పేపర్లద్వారా ప్రపంచం అంతటా తెలిసింది . అభిమానుల సానుభూతి వేల్లువయ్యింది .
అనేక ఉత్తరాలు . మెయిళ్ళు. అతడికి ఎన్నెన్నో సానుభూతి వచనాలు . అందులో ఒక మె యిలు లో ఇలా ఉంది .
“ ఆర్ధర్ ! నీకే ఇలా అయ్యింది ఏమిటి ? ఇంతటి భయంకరమైన వ్యాధికి దేముడు నిన్నే ఎంచుకున్నాడేమిటి ?”
ఈ మెయిలు చదివిన ఆర్థర్ దానికి సమాధానం ఇలా ఇచ్చాడు .
“డియర్ మిస్టర్ ! మీ మెయిలు నన్ను ఆలోచింప చేసింది .
5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడడం మొదలు పెడితే ,
500 000 మంది మాత్రమె ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి వచ్చారు , వారిలో........
50 వేల మంది మాత్రమె Circuit దశకు చేరుకున్నారు ..........
వారిలో 5 వేల మంది మాత్రమె గ్రాండ్ స్లామ్ కి చేరుకోగలిగారు. ...........
వారిలో 50 మంది మాత్రమె వింబుల్డన్ కి వచ్చారు . ..........
వారిలో 4 గురు మాత్రమె సెమీ ఫైనల్స్ కి వచ్చారు . .......
వారిలో ఇద్దరు మాత్రమె ఫైనల్స్ కి వచ్చారు ...........
వారిలో నేను మాత్రమె టైటిల్ గెలుచుకున్నాను .
మిత్రమా ? అప్పుడు నేను అడిగానా ?
నాకు మాత్రమె ఈ గెలుపును ఎందుకు ఇచ్చావు అని దేముడిని నేను అడగలేదు కదా !
నాకు అంతటి సంతోషాన్ని ఇచ్చినప్పుడు ఆయనను ఎందుకు ఇచ్చావు అని అడగం
బాధను కలుగచేసినపుడు ఎందుకు అడగాలి ?
సంతోషం నిన్ను ఆహ్లాదపరుస్తుంది . పరీక్షలు నిన్ను ధైర్యవంతుడిని చేస్తాయి .
బాధలు నిన్ను మానవుడిని చేస్తాయి . ఓటమి నీకు వినయాన్ని నేర్పుతుంది .
విజయం నిన్ను ఆనందపరుస్తుంది . నమ్మకం నిన్ను నడిపిస్తుంది
నీ జీవితం నీకు ఆనందం కలిగించకపోవచ్చు
నీలా జీవించాలని కలలు కనే వాళ్ళు ఎందఱో ఉంటారు
ఆకాశం లో ఎగిరే విమానాన్ని చూసి అందులో వెడితే ఎంతో బాగుంటుంది అని ఒక పిల్లవాడు అనుకుంటాడు .
కిందని ఉన్న మనుషులను చూసి ఇంటికి ఎప్పుడు వెడదామా అని ఆ విమానం నడిపే పైలట్ అనుకుంటాడు .
అదే జీవితం !
డబ్బే ఆనందం అనుకుంటే డబ్బు ఉన్న ఆసామీలు అందరూ రోడ్ల మీద డాన్స్ లు చేస్తూ కనిపించాలి . కానీ రోడ్డుమీద నిక్కరు లేకుండా ఉండే పిల్లలు హాయిగా ఆనందంగా ఆడుకుంటూ కనిపిస్తారు
అధికారమే భద్రత అనుకుంటే VIP లు అందరూ ఎటువంటి రక్షణా లేకుండా తిరగాలి .
కానీ అలా జరగడం లేదు .
సింపుల్ గా ఉండే వాళ్ళే హాయిగా తిరుగుతున్నారు . హాయిగా నిద్రపోతున్నారు .
చూడు నేస్తం !
సింపుల్ గా జీవించు !
వినమ్రతతో మెలుగు !
మనసారా ప్రేమించు !
తృప్తిగా ఉండు !

మంగళవారం, అక్టోబర్ 15, 2019

కొన్నేళ్ల క్రితం..భగవంతుని దగ్గరకు చీమలు, దోమలు,ఈగలు,చెట్ల మీద ఉండే పురుగులు,బల్లులూ వెళ్లి..
" స్వామీ ఈ మానవులు పురుగు మందు కొట్టి పురుగుల్ని, చీమల మందు పెట్టి చీమల్ని, నల్లుల్ని, చెదలని, దయ లేకుండా చంపేస్తున్నారు, మాకు ఈ హింస భరించడం చాలా కష్టం గా ఉంది..మా జీవితాల్ని కాపాడు స్వామీ " అని మోర పెట్టుకున్నాయి..

దేవుడు నవ్వి.." నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో వెళ్ళండి అతి త్వరలో మీ బాధలు తీరుతాయి. త్వరలో అంబానీ అనే మహాత్ముడు పుట్టి నిరంతరం పనిచేసే 4g ని ప్రసాదిస్తాడు, అతనికంటే ముందు జుకెన్ అనేవాడు Face Book ఇస్తాడు...ఇంకొకడు whatsapp ఇస్తాడు ..ఇంకొకడు స్మార్ట్ ఫోన్ ఇస్తాడు..అప్పటినుండి మనిషి మిమ్మల్ని పట్టించుకోడు, ఇంట్లో పుట్టలు పెట్టినా పట్టించుకోడు..వాడి పతనం వాడే తెచ్చు కుంటాడు, మీకు అధ్భుతమైన జీవితం ముందుంది " అని వరమిచ్చాడు.
😂🤣😥😂🤣😥😂🤣😥

బుధవారం, సెప్టెంబర్ 11, 2019

మంచి పుస్తక పఠనానికున్న మహత్తర శక్తి గూర్చి మహనీయుల అభిప్రాయాలు.

The views of the Mahanites about the great power of good book reading-1
1.ఒక మంచి బ్యాంకులో కంటే ఒక మంచి పుస్తకంలో ఎక్కువ సంపద ఉంటుంది. - రాయ్ యల్ స్మిత్.

The views of the Mahanites about the great power of good book reading.2

2.మీరు నాకన్నా ధనవంతులు ఎన్నటికీ కాలేరు.ఎందుకంటే చదివి వినిపించే తల్లి నాకుంది - ఎబిగెయిల్ నాన్ బ్యూరన్


The views of the Mahanites about the great power of good book reading.3

3.నేను పుస్తకాలు కనుగొన్నాను కనుక నిజంగా జీవిస్తున్నాను.- ఆర్చీ మూర్

The views of the Mahanites about the great power of good book reading.4
4.భూమికి సూర్యుడు ఎటువంటి వాడో నా జీవితానికి పుస్తకాలు అటువంటివి -ఎర్ల్ నైటింగేల్

The views of the Mahanites about the great power of good book reading.5
5.చదువు ద్వారా మన ప్రపంచాన్ని మన చరిత్రను మనలను మనం ఆవిష్కరించుకుంటాం. - డేనియల్ జె. బూరిస్టిన్

The views of the Mahanites about the great power of good book reading.6

6.అనేక సందర్భాలలో ఒక పుస్తక పఠనం మనిషి భవిష్యత్తును రూపుదిద్దింది.-రాల్ఫ్ వాల్డో ఎమర్సన్

The views of the Mahanites about the great power of good book reading.7
7.పుస్తకాలు లేకుండా ఈ రోజు ఈ స్థానాన్ని నేను ఊహించలేను.పుస్తకాలు స్వేచ్చకు పర్యాయపదాలుగా మారాయి.మీరు తలుపులు తెరిచి నడవవచ్చని అవి చెబుతాయి.- ఓప్రా విన్ ఫ్రీ.

శనివారం, ఆగస్టు 31, 2019

అడవులలో ఉన్న క్రూర మృగాలకంటే సమాజంలో తిరుగుతున్న క్రూరమైన మనస్తత్వం గల మనుషులే ప్రమాదకరం.

శనివారం, ఆగస్టు 17, 2019

  • తల్లి ప్రేమ కన్నీరుగా మారితే ఆనకట్ట వేసినా ఆగదు. 
  • ఒకరి తోడుతో పైకి రావాలనుకునే వాడు పైకి రావచ్చు. రాకపోవచ్చు. కానీ  ఒంటరిగా ప్రయత్నం చేసే వాడు మాత్రం తప్పక వచ్చి తీరుతాడు .
  • ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశ పడటం అజ్ఞానం, నిన్ను నీవు నమ్ముకోవడమే అసలైన జ్ఞానం. 
  • అతిగా వాగేవాడు,ఎక్కువుగా మాట్లాడే వాడు గౌరవాన్ని కోల్పోవడం ఖాయం. 

బుధవారం, జులై 10, 2019

48-principles-of-energy-ksc-smart-guide
కొందరు అధికారంతో,శక్తితో ఆడుకుంటారు.ప్రాణాంతకమైన ఒక పొరపాటువల్ల తమ శక్తి మొత్తం పోగొట్టు కుంటారు.కొందరు అవసరమైనదానికన్నా ముందుకి వెళ్లిపోతే,మరికొందరు అవసర మైనంత మేరకి కూడాముందుకు పోలేరు. కానీ అతి తక్కువమంది సరైన పనులు చేసి,ఎంతో తెలివిగా శక్తిమంతులవుతారు.
శక్తి యొక్క 48 సూత్రాలు ఆధునికయుగంలో జిత్తులని ఉపయోగించి స్వార్ధప్రయోజనాలని సాధించటానికి పనికి వచ్చే మార్గదర్శి.మీరు ఇంతవరకు కొన్న పుస్తకాలన్నిటిలోకి ఇదే ఎంతో ఆసక్తికరమైనదీ,ఉపయోగకరమైనదీ కావచ్చు.
ఈ పుస్తకాన్ని రాబర్ట్ గ్రీన్ [లాస్ ఏంజిల్] గారు రచించారు.తెలుగులోకి ఆర్.శాంతసుందరి గారు తర్జుమా చేసారు.ముఖ్యముగా ఈ పుస్తకం మనిషి జీవితంలో నెగ్గుకు రావాలంటే ఏమి చేయాలి? శిఖరంపైకి ఎలా చేరుకోవాలి? అక్కడే ఎలా ఉండాలి? వంటి ఎన్నో ప్రశ్నలకు 48సూత్రాలతో ఎంతో విడమర్చి చెప్పడం జరిగింది.నేను కేవలం 48సూత్రాలు అందిస్తాను.వాటిని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలంటే మీరు ఆ పుస్తకాన్ని చదవాల్సిందే.

శుక్రవారం, జూన్ 07, 2019

*👌ఒక మంచి మెసేజ్*

*" ఏంటోనోయ్!  అస్తమానూ   పెన్ను  ఎక్కడ  పెట్టానో  మరచిపోతూ  ఉంటాను"*

*"  ఎందుకు  అలా ? "*

*"  ఏమిటో  మరి  ఈ  మతి   మరుపు !  అందుకే   నేను  ఎప్పుడోఖరీదైన  పెన్నులు వాడడం  మానేశాను .  చీప్  పెన్ను  మాత్రమె  వాడుతున్నాను .  అది  మరిచిపోయి  పారేసినా  బాధ  అనిపించదులే !  అయితే  నా  బాధ  ఈ  మతిమరుపు  గురించే ! "*
.
." *నేను  ఒక  సలహా   ఇవ్వనా* ? "

"  *మతిమరుపు  పోతుందా* ?"

"  *చెప్పలేను !  నీ  మీద  ఆధారపడి  ఉంటుంది* !"

*ఏమిటది* ?

"  *నువ్వు  కొనగలిగినంత  అత్యంత  ఖరీదు  అయిన  పెన్ను  కొని  వాడుతూ  ఉండు  .  అప్పుడు  కూడా   నువ్వు మరిచిపోతావా*?   ,

*నీ  మరుపు  పోతుందా?   చూద్దాము* "

"  *తప్పకుండా   చేస్తాను* "

*ఆర్నెల్ల  తర్వాత   స్నేహితుడు ఫోన్  చేసి  పెన్ను  మరిచిపోతున్నావా ?   అని  అడిగాడు*

" *అబ్బే ! నువ్వు  చెప్పాక 22 కేరట్ల బంగారం పెన్ను   కొన్నాను* .

*దాని  విషయం  లో  చాలా  జాగ్రత్తగా  ఉంటున్నాను* .

*ఈ ఆరునెలల్లో  ఒక్క  రోజు  కూడా   నేను  దానిని  ఎక్కడా  మర్చిపోలేదు* "

" *నువ్వు  పెన్ను  మర్చిపోకపోడానికి  కారణం నువ్వు  దానికి  ఇచ్చిన  విలువ* ."

*మనం  దేనికి  విలువ  ఇస్తామో  దానిపట్ల  మనం   జాగ్రత్తగా  ఉంటాము*_ .

*వస్తువుకు  విలువ  ఇస్తే  దాన్ని  కోల్పోము*

*ఆరోగ్యానికి  విలువ  ఇస్తే  ఏమి  తినాలో  ,  ఏమి  తినకూదదో , ఎంత  తినాలో  ,  ఎప్పుడు  తినాలో  అన్నీ  జాగ్రత్తగా  ఉంటాము*

*నీతి:-* 

*స్నేహానికి  విలువ  ఇస్తే స్నేహితుడిని గౌరవిస్తాము.*

*డబ్బుకు  విలువ  ఇస్తే  ఆచి  తూచి   ఖర్చు  పెడతాము*

*కాలానికి  విలువ  ఇస్తే  టైం  వేస్ట్  చెయ్యము*,

 *బంధాలకు  విలువ  ఇస్తే  వాటిని  తెంచుకోము*

*దేనికి  ఎంత  విలువ  ఇవ్వాలో  తెలుసుకుని   వ్యవహరించడం  మనం  తెలుసుకోవాలి*.

బుధవారం, మార్చి 27, 2019

  • ప్రతిరోజూ ఒక సమయానికి ఆహారం తీసుకోవడమనే అలవాటును చేస్తే ఆ సమయానికి ఆకలి పుడుతుంది. అలాగే మనసుకీ ఆకలి కలగాలి. ఈ మనస్సులో కలిగే మానసిక ఆకలి తృష్ణకు సమయంతో పని లేదు. ఆలోచించడం ద్వారా మనమే ఈ ఆకలిని సృష్టించుకోవాలి.
  • ప్రతీ 20 నిమిషాలు లేదా ఒక నిర్ధిష్టమైన సమయాన్ని నిర్ణయించుకుని ఒక అలారం మన సెల్ ఫోన్ లో పెట్టుకుని మన లక్ష్యాలను గుర్తు చేసుకుంటూ ఉత్తేజపరచుకుంటూ వుంటే నిర్లిప్తత, నిరాశ ఎప్పటికీ మనసులో చేరవు.
  • పెద్ద లక్ష్యాలను నిర్ధేసించుకుని వాటిని చిన్న, చిన్న లక్ష్యాలుగా విభజించి పనులను పూర్తి చేస్తే మనలో ఎంతో ఉత్సాహం కలుగుతుంది. పెద్ద సైజులో ఉండే ఏ పండునైనా తినాలంటే ఒక్కసారిగా మొత్తం పండును తినలేమ్. ముక్కలు చేసుకుని ఒకొక్క ముక్కను తింటూ మొత్తం పండును ఆరగిస్తాం.
 ఇటువంటి ఎన్నో అమూల్యమైన విషయాలు "Nov:2015-సైకాలజీ టుడే" మాసపత్రికలో వచ్చాయి. వీలయితే తప్పక ఆ పత్రిక చదవండి.

Recent Posts