వ్యక్తిత్వ వికాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్యక్తిత్వ వికాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శనివారం, ఆగస్టు 31, 2019

అడవులలో ఉన్న క్రూర మృగాలకంటే సమాజంలో తిరుగుతున్న క్రూరమైన మనస్తత్వం గల మనుషులే ప్రమాదకరం.

శనివారం, ఆగస్టు 17, 2019

  • తల్లి ప్రేమ కన్నీరుగా మారితే ఆనకట్ట వేసినా ఆగదు. 
  • ఒకరి తోడుతో పైకి రావాలనుకునే వాడు పైకి రావచ్చు. రాకపోవచ్చు. కానీ  ఒంటరిగా ప్రయత్నం చేసే వాడు మాత్రం తప్పక వచ్చి తీరుతాడు .
  • ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశ పడటం అజ్ఞానం, నిన్ను నీవు నమ్ముకోవడమే అసలైన జ్ఞానం. 
  • అతిగా వాగేవాడు,ఎక్కువుగా మాట్లాడే వాడు గౌరవాన్ని కోల్పోవడం ఖాయం. 

బుధవారం, జులై 10, 2019

48-principles-of-energy-ksc-smart-guide
కొందరు అధికారంతో,శక్తితో ఆడుకుంటారు.ప్రాణాంతకమైన ఒక పొరపాటువల్ల తమ శక్తి మొత్తం పోగొట్టు కుంటారు.కొందరు అవసరమైనదానికన్నా ముందుకి వెళ్లిపోతే,మరికొందరు అవసర మైనంత మేరకి కూడాముందుకు పోలేరు. కానీ అతి తక్కువమంది సరైన పనులు చేసి,ఎంతో తెలివిగా శక్తిమంతులవుతారు.
శక్తి యొక్క 48 సూత్రాలు ఆధునికయుగంలో జిత్తులని ఉపయోగించి స్వార్ధప్రయోజనాలని సాధించటానికి పనికి వచ్చే మార్గదర్శి.మీరు ఇంతవరకు కొన్న పుస్తకాలన్నిటిలోకి ఇదే ఎంతో ఆసక్తికరమైనదీ,ఉపయోగకరమైనదీ కావచ్చు.
ఈ పుస్తకాన్ని రాబర్ట్ గ్రీన్ [లాస్ ఏంజిల్] గారు రచించారు.తెలుగులోకి ఆర్.శాంతసుందరి గారు తర్జుమా చేసారు.ముఖ్యముగా ఈ పుస్తకం మనిషి జీవితంలో నెగ్గుకు రావాలంటే ఏమి చేయాలి? శిఖరంపైకి ఎలా చేరుకోవాలి? అక్కడే ఎలా ఉండాలి? వంటి ఎన్నో ప్రశ్నలకు 48సూత్రాలతో ఎంతో విడమర్చి చెప్పడం జరిగింది.నేను కేవలం 48సూత్రాలు అందిస్తాను.వాటిని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలంటే మీరు ఆ పుస్తకాన్ని చదవాల్సిందే.

శుక్రవారం, జూన్ 07, 2019

*👌ఒక మంచి మెసేజ్*

*" ఏంటోనోయ్!  అస్తమానూ   పెన్ను  ఎక్కడ  పెట్టానో  మరచిపోతూ  ఉంటాను"*

*"  ఎందుకు  అలా ? "*

*"  ఏమిటో  మరి  ఈ  మతి   మరుపు !  అందుకే   నేను  ఎప్పుడోఖరీదైన  పెన్నులు వాడడం  మానేశాను .  చీప్  పెన్ను  మాత్రమె  వాడుతున్నాను .  అది  మరిచిపోయి  పారేసినా  బాధ  అనిపించదులే !  అయితే  నా  బాధ  ఈ  మతిమరుపు  గురించే ! "*
.
." *నేను  ఒక  సలహా   ఇవ్వనా* ? "

"  *మతిమరుపు  పోతుందా* ?"

"  *చెప్పలేను !  నీ  మీద  ఆధారపడి  ఉంటుంది* !"

*ఏమిటది* ?

"  *నువ్వు  కొనగలిగినంత  అత్యంత  ఖరీదు  అయిన  పెన్ను  కొని  వాడుతూ  ఉండు  .  అప్పుడు  కూడా   నువ్వు మరిచిపోతావా*?   ,

*నీ  మరుపు  పోతుందా?   చూద్దాము* "

"  *తప్పకుండా   చేస్తాను* "

*ఆర్నెల్ల  తర్వాత   స్నేహితుడు ఫోన్  చేసి  పెన్ను  మరిచిపోతున్నావా ?   అని  అడిగాడు*

" *అబ్బే ! నువ్వు  చెప్పాక 22 కేరట్ల బంగారం పెన్ను   కొన్నాను* .

*దాని  విషయం  లో  చాలా  జాగ్రత్తగా  ఉంటున్నాను* .

*ఈ ఆరునెలల్లో  ఒక్క  రోజు  కూడా   నేను  దానిని  ఎక్కడా  మర్చిపోలేదు* "

" *నువ్వు  పెన్ను  మర్చిపోకపోడానికి  కారణం నువ్వు  దానికి  ఇచ్చిన  విలువ* ."

*మనం  దేనికి  విలువ  ఇస్తామో  దానిపట్ల  మనం   జాగ్రత్తగా  ఉంటాము*_ .

*వస్తువుకు  విలువ  ఇస్తే  దాన్ని  కోల్పోము*

*ఆరోగ్యానికి  విలువ  ఇస్తే  ఏమి  తినాలో  ,  ఏమి  తినకూదదో , ఎంత  తినాలో  ,  ఎప్పుడు  తినాలో  అన్నీ  జాగ్రత్తగా  ఉంటాము*

*నీతి:-* 

*స్నేహానికి  విలువ  ఇస్తే స్నేహితుడిని గౌరవిస్తాము.*

*డబ్బుకు  విలువ  ఇస్తే  ఆచి  తూచి   ఖర్చు  పెడతాము*

*కాలానికి  విలువ  ఇస్తే  టైం  వేస్ట్  చెయ్యము*,

 *బంధాలకు  విలువ  ఇస్తే  వాటిని  తెంచుకోము*

*దేనికి  ఎంత  విలువ  ఇవ్వాలో  తెలుసుకుని   వ్యవహరించడం  మనం  తెలుసుకోవాలి*.

బుధవారం, మార్చి 27, 2019

  • ప్రతిరోజూ ఒక సమయానికి ఆహారం తీసుకోవడమనే అలవాటును చేస్తే ఆ సమయానికి ఆకలి పుడుతుంది. అలాగే మనసుకీ ఆకలి కలగాలి. ఈ మనస్సులో కలిగే మానసిక ఆకలి తృష్ణకు సమయంతో పని లేదు. ఆలోచించడం ద్వారా మనమే ఈ ఆకలిని సృష్టించుకోవాలి.
  • ప్రతీ 20 నిమిషాలు లేదా ఒక నిర్ధిష్టమైన సమయాన్ని నిర్ణయించుకుని ఒక అలారం మన సెల్ ఫోన్ లో పెట్టుకుని మన లక్ష్యాలను గుర్తు చేసుకుంటూ ఉత్తేజపరచుకుంటూ వుంటే నిర్లిప్తత, నిరాశ ఎప్పటికీ మనసులో చేరవు.
  • పెద్ద లక్ష్యాలను నిర్ధేసించుకుని వాటిని చిన్న, చిన్న లక్ష్యాలుగా విభజించి పనులను పూర్తి చేస్తే మనలో ఎంతో ఉత్సాహం కలుగుతుంది. పెద్ద సైజులో ఉండే ఏ పండునైనా తినాలంటే ఒక్కసారిగా మొత్తం పండును తినలేమ్. ముక్కలు చేసుకుని ఒకొక్క ముక్కను తింటూ మొత్తం పండును ఆరగిస్తాం.
 ఇటువంటి ఎన్నో అమూల్యమైన విషయాలు "Nov:2015-సైకాలజీ టుడే" మాసపత్రికలో వచ్చాయి. వీలయితే తప్పక ఆ పత్రిక చదవండి.

గురువారం, జనవరి 24, 2019

Its-better-to-stay-away-from-being-I-I
మన జీవితకాలంలో ఎంతోమంది వ్యక్తులు పరిచయమవుతూ ఉంటారు. వారిలో కొంతమందితో మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం. అయితే కొన్ని,కొన్ని సందర్భాలలో కొంతమంది వలన మనం నష్టపోవడమో , లేక మోసపోవడమో కూడా జరుగుతూ ఉంటుంది. మరికొంతమంది వలనయితే నష్టాలు,మోసాలు జరగకపోయినా మనస్సు మాత్రం విపరీతంగా గాయపడే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే వారి చేష్టలు గాని, మాటలుగాని మనకి ఆ పరిస్థితిని తీసుకొస్తాయి.

మనo పై పరిస్థితులకు గురవ్వకుండా ఉండాలంటే మనకు మనం మనతో ఉన్న ప్రతీ వ్యక్తిని పరిశీలించి జాగ్రత్తతో మెలగాలి. అటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తీ యొక్క గుణం ఏమిటంటే "ప్రతిదీ నావలననే సాధ్యం! నేను మాత్రమే, నేను,నేను..నేను" ఇలా మాటలాడే వాడికి కొద్ది జాగ్రత్తగా ఉండటమే మంచిది.

ఎందుకంటే ఈ వ్యక్తిలో ప్రధానంగా...

1.ఇతరులకు క్రెడిట్ దక్కడం చూడలేడు.
2.తనతో ఉన్న మిత్రుల విషయంలో "నల్గురితో ఉన్నప్పుడు తనను హైలెట్ చేసుకుంటూ అతనిని తక్కువ చేసి పరిచయం చేస్తాడు. లేక తక్కువ చేసి మాట్లాడుతాడు.
3.ఎదుటివాడు ఎంత గొప్పగా చెప్పినా? తాను చెప్పేదే గొప్ప అనే అహంకారం నిలువెల్లా కన్పిస్తుంది.
4.తనేదో ఉద్దరించడానికి సృష్టించబడ్డాననే ఫీలింగ్ కు గురవుతూ ఉంటాడు.
5.ఏ పనీ ఊరికనే చేయడు.సహకరించడానికి అసలు ఇష్టపడడు.
6.ఇతరులకు సహాయం చేసే విషయంలో వెనుకకు పోతూ ఉంటాడు.

      కాబట్టి మిత్రులారా "నేను...నేను" అనే వాడి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అతనితో ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండండి. నిజానికి పై లక్షణాలలో కొన్ని లక్షణాలు అందరిలో లేకపోవచ్చు. కాని మిగతా లక్షనాలున్నా జాగ్రత్త అవసరమే కదా! సహజంగా మనకు పరిచయ వ్యక్తులలో ఏవో కొన్ని లోపాలున్నా వారిలో ఉన్న మిగతా మంచి లక్షణాలను బట్టి ప్రేమించడం అలవర్చుకోవాలి. జాగ్రత్త పడాలి తప్ప సంబంధాలు త్రెంచుకోకూడదు. మరీ ముఖ్యమైన విషయమేమిటంటే "మనలో ఈ గుణాలుంటే వెంటనే రూపుమాపుకోవాలి. లేదంటే మనకు ఉండే మంచి మిత్రులందరూ దూరమయ్యి పోవడం ఖాయం" సన్నిహితులు సహించలేక సైడ్ అయిపోవడం విదితమే!!
Its-better-to-stay-away-from-being-I-I



ఆదివారం, జనవరి 20, 2019

Capture-the-wonderful-Ideas-into-your-mind
సహజంగా మనం ఏదైనా దీర్ఘంగా ఆలోచిస్తున్నపుడు, లేదా మనకు తెలియకుండానే ఒకొక్కసారి ఫ్లాష్ లా కొన్ని అద్భుతమైన ఐడియాలు వచ్చి పోతుంటాయి. అవి ఎంత ఉపయోగకరమో మన మనసులకు కూడా స్పురిస్తూ ఉంటుంది. మళ్ళీ వెంటనే మనం దానిని తరువాత ఆలోచిద్దాంలే అనుకుంటూ పక్కన పడేస్తాం. ఇక అది మనకు గుర్తుకు రాదు. ఇలా మనకి తెలిసి కూడా ఇవన్నీ జరిగిపోతుంటాయి. ఇలా క్రమీపీ జరగడం వలన మన మేధస్స్ చివరికి మొద్దుగా మారిపోతుంది. ఎటువంటి క్రియేటివిటీ లేకుండా తయారవ్వుతాం. నిజానికి ఎదో సాధించాలి అనే వ్యక్తికి ఇది పెద్ద నష్టమేనని చెప్పాలి.

మరి మనం ఏమి చేయాలి?
ఏమీ లేదు ఎప్పుడు బయటికి వెళ్ళినా, వెళ్లకపోయినా మన వెంట తప్పనిసరిగా చిన్న నోటు బుక్ , ఒక పెన్ మన జేబులో ఉండాలి. ఎప్పుడు ఏ ఐడియా వచ్చినా వెంటనే దానిని నోట్ బుక్ పై వ్రాసి బంధించి వేయాలి. తరువాత మనకి ఫ్రీ దొరికినప్పుడు తీరిగ్గా దాని పట్ల మరింత కసరత్తు చేయవచ్చు.




బుధవారం, జనవరి 16, 2019

There-are-two-types-of-people-A-man-who-saw-who-ksc-writes
నిజానికి మనం ఏ వర్గంలో ఉన్నామో చూసుకోవాలి. సహజంగా మనం ఏదో చేయాలని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాం. మొదలు పెట్టడానికి మాత్రం చాలా టైం తీసుకుంటాం. కొంతమందైతే అనుకుంటారు గాని ఎప్పటికీ మొదలు పెట్టరు. మరికొంతమందయితే మొదలు పెడతారుగాని విజయం సాధించే వరకూ కృషి చేయరు. అతికొద్ది మంది మాత్రమే విజయం సాధించే వరకూ పట్టు వదలరు. ఇటువంటి వారందరూ చేసేవాళ్ళలోకే వస్తారు. పై మిగతా వారందరూ చూసేవాళ్లలోకే వస్తారు. కాబట్టి మనం చేసేవాళ్ళమా? చూసేవాళ్లమా? అనేది సరి చూసుకోవాలి!

గురువారం, నవంబర్ 08, 2018

మనకి ఎంతో మంది స్నేహితులుగా పరిచయమవ్వడం, వాళ్ళతో కొన్ని వ్యవహారాలు పెట్టుకోవడం సహజంగా జరిగే పరిస్తితి. ఇక్కడే మనం జాగ్రత్త వహించాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. అలా నమ్మితే మనం సమస్యల వలయంలో చిక్కుకోవడం ఖాయం. ఒక సంఘటన చెప్తాను. నాజీవితంలో ఈమధ్యే జరిగింది. కొత్తగా ఒక మిత్రుడు పరిచయమయ్యి బాగా దగ్గరయ్యాడు. అతనిని పరిచయం చేసింది అంతకు ముందు నుండే పరిచయమున్న మరొక మిత్రుడు. ఇలా ముగ్గురమూ వీలున్నప్పుడల్లా పార్కులో కూర్చుని అనేక విషయాలు మాట్లాడుకోవడం,. చర్చించుకోవడం చేసేవాళ్లం. ఒకరోజు కొత్త ఫ్రెండుకి అవసరమని పాత ఫ్రెండు 10,000రూ|| చూడమన్నాడు. సర్లే అని నాదగ్గర లేకపోతే నా ఆప్తమిత్రుడి దగ్గర 10,000రూ|| తీసుకుని పార్కులో ఉన్న నా కొత్త,పాత మిత్రులను కలిసి డబ్బులన్నీ అందించాను. వాళ్ళు ఇస్తామన్న నెలరోజులు గడువు దాటిపోయి మూడు నెలలు ముగిశాయి. నా ఆప్తమిత్రుడు 10,000రూ|| చూచిపెట్టు చాలా అవసరమొచ్చింది అంటే సరే అని వాళ్ళను అడిగాను. అదిగో,ఇదిగో అంటూ మరో నెల రోజులు గడిపి ఫోన్లు సరిగా లిఫ్ట్ చేయడం మానేశారు. సర్లే ఏదో ఇబ్బందిలో ఉన్నారేమోనని నేను పెద్దగా తీసుకోలేదు. ఒకరోజు పార్కులో ముగ్గురమూ కూర్చునప్పుడు నేను అడిగాను. " మీరు 10,000రూ|| త్వరగా ఇచ్చేస్తే బాగుంటుంది.అవతల నా మిత్రుడు ఇబ్బంది పడుతున్నాడు.నన్ను చాలా గట్టిగానే అడుగుతున్నాదంటే నా పాత మిత్రుడు ఆ సమయంలో మాట్లాడిన మాటలకు అతను ఎంత స్వార్ధపరుడో, దుర్మార్గపు భావాలో నాకు అర్ధమయ్యిపోయాయి. పాత మిత్రుడు "అతనితో మనకెందుకండీ..డబ్బులుకోసం అలా ఇబ్బంది పెట్టేవాడు మనకి కరెక్ట్ కాదు. అతనితో ఫ్రెండ్ షిప్ ను కట్ చేసేయండి.మీకు చాలా మంచిది అన్నాడు. ఆసమయంలో నాకు అతని పట్ల అసహ్యం,విపరీతమైన కోపం వచ్చాయి. డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్న ఇవ్వకుండా, ఫోన్లు లిఫ్ట్ చేయకుండా వ్యవహరించే వీళ్లతో స్నేహం చేయాలా? స్నేహ భావంతో ఆపదలకు స్పందించే నా ఆప్తమిత్రుడితో సంబంధాలు తెంచుకోవాలా? ఆ దిక్కుమాలిన స్వార్ధపూరితమైన సలహాకి చెప్పు తీసుకుని కొట్టినా తప్పు లేదనిపించింది. ఉపయాగం కోసం స్నేహం చేసే స్వార్ధపూరితమైన ఇటువంటి వారితో దూరంగా ఉండడమే చాలా మేలని ఆసమయంలో నా అంతరాత్మ ఘోషించింది. తరువాత సీరియస్ గా తీసుకుని డబ్బులు వసూలు చేసి నెమ్మదిగా వాళ్ళను కలవడం తగ్గించి చివరికి కట్ చేసేశాను. ఇటువంటి వ్యక్తులు అందరికీ తారసపడతారు. వాళ్ళను జాగ్రత్తగా హాండిల్ చేస్తూ ముందుకు పోవాలి తప్ప ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు. శుభం!!!

శనివారం, అక్టోబర్ 27, 2018

రాత్రి పడుకునే ముందు నాకు ఏదైనా ఒక పుస్తకం కొంతవరకైనా చదవడం అలవాటు. నాకదేమిటో కానీ పుస్తకం ముట్టుకోనిదే అసలు నిద్ర పట్టదు. ఆ పరంపరలో భాగంగా ఒక పర్సనాలిటీ డెవలప్ మెంట్ బుక్ చదువుతుంటే అందులో ధీరూభాయ్ అంబానీ గారి మాటలు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించాయి.స్ఫూర్తిని ఇచ్చాయి. ఆయనగారి మాటల్లో...
      "సూర్యుడు నన్ను మంచం మీద చూసి 50సంవత్సరాలు అయింది"
    ఈ మాటల్లో చాలా లోతైన అర్ధం వుంది. గొప్పవారు పెద్దగా మాట్లాడరు. చాలా మౌనంగానే ఉంటారు. ఒకవేళ వాళ్ళు మాట్లాడ వస్తే "ఆ మాటల్లో లెక్కలేనన్ని ఆణిముత్యాలు" దొర్లుతాయి.
    తెల్లవారు జాము నిద్రలేవడం అంటే జీవితంలో సగం విజయాన్ని సాధించడమే! ఆరోగ్య సంస్థలు కూడా తమ,తమ పరిశోధనలలో "తెల్లవారు జాము నిద్రలేచి, రోజుకు 5లీటర్ల నీళ్ళు త్రాగడం ఎవరు ప్రారంభిస్తారో వాళ్ళకు ఏవిధమైన రోగమూ అంటదు" అని తేల్చి చెప్పేసాయి.
    మన ధార్మిక గ్రంధాలైన వేదాలు, ఖురాన్,బైబిల్లు కూడా తెల్లవారు జామున లేచి ప్రార్ధన చేసుకునే వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని శాసిస్తూనే ఉన్నాయి.
   అందుకే కాబోలు గొప్పవాళ్లేప్పుడూ ఈ అవకాశాలను వదులుకోలేదు. మీరే ఆలోచించండి. ధీరూభాయ్ అంభానీ గారీలాంటి గొప్పవారు 50సం// సూర్యుడి కంటే ముందే అంటే ఉద్దేశ్యం తెల్లవారుజామునే నిద్ర లేచేవారు.
  ఈరోజుల్లో మనం చాలా దిగజారిపోతూ ఉన్నామనే చెప్పాలి. రాత్రి 10లేక 11 గంటలకు భోజనం చేయడం, అప్పటి వరకూ TVలకు అతుక్కుపోవడం, మర్నాడు 8,9 గంటలకు నిద్రలేవడం ఆదర,బాదరా హడావుడి...జీవితం అంతా ఒక యంత్రం మాదిరి అయిపోయింది. నిస్తేజం,నీరసం,నిర్వేదం,నిష్తానమ్ ఏవైతే ఉన్నాయో అవ్వన్నీ కూడా మన జీవితాన్ని అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. మానసిక ప్రశాంతత లేక చికాకు,చింతనాలతో నిత్యం బాధపడుతూనే వున్నాం.వీటిని ఎలాగైనా మనం జయించాలి.జయించవచ్చు కూడా! ఇప్పటి రోజులు సహకరించవు. పరిస్తితి మన చేతులలో లేదనే మాటలు కుంటి సాకులు మాత్రమే! వళ్ళంతా నీరసం, నిస్తేజం నిండిపోయిన మాటలే!ఇప్పటికీ ఎంతో మంది మేధావులు అవుతూనే ఉన్నారు. గొప్ప,గొప్ప పనులు చేసి చూపిస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా మనాలాగే ఆలోచిస్తే వారా స్తాయికి చేరుకుందురా? ఒక్కసారి ఆలోచించండి! మనం మారిపోదాం! మన జీవిత గమ్యాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం! ఆ పనేదో తెల్లవారు జాము నిద్రలేచిపోయి సరైన ప్లానింగ్ తో ముందుకెళ్దాం!...మీరు రెడీ నా?

ఆదివారం, ఆగస్టు 12, 2018

ఒకసారి బుధ్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు.
ఇంతలో ఒక శిష్యుడిని పిలిచి,
"నాయనా, దాహంగా ఉంది, ఆ కనబడే చెరువునుంచి కొన్ని నీళ్ళు తీసుకురా" అని చెప్పాడు. అప్పుడే ఒక ఎద్దులబండి ఆ చెరువులోంచి వెళ్ళడం మూలంగా నీరు అంతా మురికిగా తయారయింది.
శిష్యుడు ఆ నీరు తేరుకొనేంతవరకు అలాగే కూర్చున్నాడు.
అరగంట సమయం గడిచింది.
చూస్తే నీరు ఇంకా మురికిగానే ఉంది.
మరో అరగంట సమయం వేచి చూసాడు.
నీరు తేరుకున్నాయి.
ఆ పైన ఉన్న నీరు తీసుకెళ్ళి బుధ్ధుడికి ఇచ్చాడు శిష్యుడు.
అప్పుడు శిష్యుని అనుమానం
" ఈ నీరు అంత మురికిగా ఉన్నా, ఎలా తేరుకుంది? నువ్వు కాసేపు దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు. అది నెమ్మదిగా మురికి కిందకుపోయి, స్వచ్చమైన నీరు పైకి తేరుకుంది.
మన మనసు కూడా అంతే.
ఒకసారి మనసులో ఆందోళన కలిగినపుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి.
కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే మురికి అంతా అడుగుకు వెళ్ళిపోయి, మనసు స్వచ్చంగా మారుతుంది.
నీ మనసు తేలిక అవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నమూ చేయవలసిన పనిలేదు.
కొంతసేపు అలా వదిలేస్తే, దానంతట అదే సద్దుమణుగుతుంది.
చక్కబడుతుంది.
మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
మన ప్రయత్నం లేకుండానే జరిగిపోతుంది."
మీకు ఇష్టమైన వాళ్లను ఎప్పుడూ వదులుకోకండి.
వారు తప్పులు చేసారు అనుకుంటే, ఒక్క క్షణం వారితో మీరు గడిపిన అద్భుతమైన, ఆనందకరమైన క్షణాల గురించి ఒక్కసారి తలుచుకోండి.
ఎందుకంటే, పరిపక్వత కన్నా, అభిమానం ముఖ్యం.
మిమ్మల్ని మీరు కౌగలించుకోలేరు.
మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు.
అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి.
జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకటమే.
మీకు ఇష్టమైన వారి కోసం, మిమ్మల్ని ప్రేమించేవారికోసం బ్రతకండి. స్నేహం, ప్రేమ,
బంధుత్వాలు అనేవి డబ్బు భాష మాట్లాడేవారికి అర్థం కావు.
ఎందుకంటే కొన్ని పెట్టుబడులు మనకు కనిపించే లాభాలను ఇవ్వలేకపోవచ్చు, కాని మనలను సంపన్నుల్ని చేస్తాయి.
కుటుంబం, స్నేహితులు అలాంటి గొప్ప పెట్టుబడులు.....

శనివారం, జూన్ 30, 2018

జీవితంలో పైకి రావాలంటే ప్రతిభా,పనితనం మాత్రమే సరిపోవు.ఎప్పటికప్పుడు ఎమోషన్స్ ని అదుపు చేసుకుపోతూ అడ్జస్ట్ మెంట్ అలవాటు చేసుకోవాలి. ఇటువంటి విషయాలు చెప్పడానికి,రాయడానికి బావుంటాయని అనుకోకండి.అక్షరాలా అద్భుతాలు చేసినవారెందరో ఉన్నారు.
   అటువంటి వారిలో మన భారతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒకరు. 16ఏళ్ల వయస్సులోనే టెస్ట్ మ్యాచ్ రంగంలో దిగి,24 సంవత్సరాల పాటు నిర్విరామంగా, నంబర్ వన్ గానూ ఆడుతూ 100సెంచరీలు చేసి, ఇటు ప్రజలు అటు ప్రభుత్వం గుర్తింపు పొంది అత్యంత ప్రతిష్టాత్మకరమైన "భారతరత్న" బిరుదును పొందారు.రాజ్యసభలో సభ్యుడిగా గౌరవింపబడ్డారు. లిటిల్ మాస్టారుగా ప్రపంచంలో ఎందరికో అభిమాని అయ్యాడు.
     అయితే ఇంతకీ విషయమేమిటంటే ఈ లిటిల్ మాస్టర్ తన కెరీర్ లో అడుగదునా అడ్డంకులు ఎదుర్కొన్నాడు. కానీ లక్ష్యం గుర్తుంచుకుని అన్నిటికి అడ్జస్ట్ అయ్యానని ఆయన తన పుస్తకం "ప్లేయింగ్ ఇట్ మై వే" ఆటో బ్రయోగ్రఫీలో వెల్లడించారు.కొంతమంది పాత ప్లేయర్లతో ఆయన ఎలా అడ్జెస్ట్ అయ్యాడు. భారత క్రికెట్ కోచ్ గ్రెగ్ చాపల్ తనను ఎలా ఇబ్బంది పెట్టాదో సవివరంగా వర్ణించాడు. ఈ పుస్తకం ఏదో సంచలనం సృష్టించాలని రాయలేదు. పైగా ఆయనకు రావాల్సిన బిరుదులు,సత్కారాలు,ఐశ్వర్యం అంటూ ఏదీ లేదు.పైగా తను ఎన్నో దానాలు,గుప్తదానాలు చేశాడు.

గురువారం, మే 26, 2016

100% నిజమని నమ్ముతున్నాను. ఎందుకంటే నమ్మకం లేనిది ఏదీ లేదు. మనిషి నైనా, గవర్నమెంట్ వ్యవస్థనైనా ఆఖరికి దేవుడినైనా నమ్మకంతోనే చూస్తూన్నాము. నమ్మకంతోనే బ్రతుకుతున్నాము. రేపటి కోసం చూస్తున్నామంటే రేపటికి మనము బ్రతికే ఉంటామన్న నమ్మకం. నమ్మకం మూఢ నమ్మకం కాకుండా చూసుకుంటే చాలు. నమ్మకం హేతువుకి అందితే చాలు. అప్పుడు ప్రతి నమ్మకాన్ని ఖచ్చితంగా నమ్మవచ్చు. నమ్మకం లేనిది ఏముంది చెప్పండి? అన్నీ నమ్మకాలే, నమ్మకం లేని జీవితం లేదంటే ఖచ్చితంగా నమ్మవచ్చు.

శనివారం, మే 07, 2016

శనివారం, మార్చి 05, 2016


బుధవారం, జనవరి 27, 2016

ఉదయమే 7గంటలకు మొబైల్ రిచార్జ్ కోసం మెయిన్ రోడ్డు మీదకు వచ్చి చూస్తే ఒక్క రిచార్జ్ షాప్ కూడా తీయలేదు. తీసిన షాపులు కేవలం ఒకటి సెలూన్ అయితే రెండవది వడ్డీ షాపులు. ఇవి తప్ప మరే షాపు కూడా తెరవలేదు. నిజానికి ఈ రెండు షాపులూ మనుషులకు తల గొరిగేవే! మొదటి షాప్ తలగొరుడుకు మేలుంటే, రెండో షాపు తల గొరుగుడుకు నాశనం తప్ప ఏమీ ఉండదు.

బుధవారం, డిసెంబర్ 30, 2015

5am to 6am మధ్యం ఇంకా మంచంపై దొర్లుతూనే ఉన్నాను. నిద్రపోలేదుగాని ఈరోజు ఏమి చేయాలా? నూతన సంవత్సరంలో కొత్త ప్రాజెక్ట్స్ ఏమి ప్లాన్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంటే ప్రక్కనే ఉన్న ఫోన్ మ్రోగింది. ఇంత ప్రొద్దుటే నాతో ఎవరికి అవసరం పడిందా అని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తే అవతలి నుండి NTV రిపోర్టర్ గారట. నాతో చాలా సేపు సంభాషించారు. మన "సాక్ష్యం మేగజైన్" చాలా బాగా నచ్చిందట. అందులోని కొన్ని బుక్స్ ఆయన Download చేసుకుని చదవడమే కాకుండా రెగ్యులర్ గా దానిలోని ఆర్టికల్స్ ఆయన ఫాలో అవుతున్నానని త్వరలో మీ సాక్ష్యం బ్లాగును NTV లో ప్రమోట్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఎందుకో మనసుకి ఎక్కడ లేని ఆనందం కలిగింది. ఎందుకంటే "సాక్ష్యం మేగజైన్" వల్ల కొంతమంది మత వర్గాల పండితులకు గుండె దడ పట్టుకుంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో భక్తి స్థానంలో చెలామణీ అవుతున్న థర్మానికి శాస్త్రాలలో ఉన్న థర్మానికి ఎక్కడా సంబంధం లేదు. భక్తి పేరు చెప్పి సామాన్య జనులను దోచుకోవడానికి ఈరోజు పెద్ద వ్యాపారమే జరుగుతోంది. ప్రజలెవరూ తమను పూర్తిగా నమ్మరు కాబట్టి ఇవ్వన్నీ శాస్తాలను అడ్డు పెట్టుకుని, పుణ్య పురుషులను అడ్డు పెట్టుకుని దోచుకుంటున్నారు. ఇదంతా పెద్ద,పెద్ద నాయకులనుండి, స్వార్ధ పరులైన కొంతమంది పండితుల వరకూ రహస్యంగా సాగుతున్న వ్యాపారం. ఇటువంటి ఎన్నో విషయాలను ఎండగడుతూ, శాస్త్రీయమైన విషయాలను ప్రజలకు అందిస్తూ ఎంతో ధైర్యంగా ఈ "సాక్ష్యం మేగజైన్" ముందుకు సాగుతోంది. ఒకసారి మీరు "సాక్ష్యం మేగజైన్" ని విజిట్ చేయండి...Next

గురువారం, డిసెంబర్ 24, 2015

అవును నేను ముమ్మాటికి హంతకుడినే...ఒకటా రెండా? ఎన్నో హత్యలు చేసి మోసాలకు, కుట్రలకు దొరకకుండా తిరుగుతున్నాను. ఏ పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నన్ను వేలెత్తి చూపించలేదు. ఏ ప్రభుత్వమూ నన్ను సన్మానించకుండా ఉండలేదు. ఎందుకంటే నేను చేసిన హత్యల వలన నేను బాగుపడుతున్నాను. సమాజమూ బాగుపడుతుంది. అందుకనే మీరు కూడా హత్యలు చేయండి. మీరు బాగుంటారు.
నీ స్వార్ధం నీవు చూసుకో, ఎవరు ఎలా పోతే నీకేమిటి? అని నిత్యం శాసించే మనసును నిర్ధాక్షిణ్యంగా చంపేశాను.
నిన్ను తమ స్వార్ధాలకు ఉపయోగించుకుని వాడుకునే వ్యక్తులతో కల్సే అవసరాన్ని కలిగిస్తున్న కాలాన్ని చంపేశాను.
కంటి మీద నిద్ర, గుండెల్లో ప్రశాంతత లేకుండా చేస్తున్న ఆశలను చంపేశాను.
నన్ను నాశనం చేయాలనుకుంటున్న అహంకారాలునూ, మమకారాలనూ నిర్ధాక్షిణ్యంగా చంపేసి పూడ్చి వేశాను.
అదేమిటో నేను హత్యలు చేస్తున్నా నాలో శత్రువులు కొత్తగా పుట్టుకొస్తూనే వున్నారు. ఎన్నని చంపను? అయినప్పటికీ నేను చంపుతూనే ఉన్నాను. నేను దేనిని వదలను. ప్రతిదాన్ని చంపేస్తూనే ఉంటాను.ఎందుకంటే నేనొక హంతకుడిని!

శనివారం, డిసెంబర్ 19, 2015

అవును. జాగ్రత్త లేకపోతే అందమైన ఆడపిల్ల,అగ్గిపుల్ల ఇవి రెండూ ప్రమాదమే. మనుషులను నిలువునా తగలబెట్టేస్తాయి. నిజం కాదంటారా?

 


Recent Posts