వ్యక్తిత్వ వికాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్యక్తిత్వ వికాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఆదివారం, ఆగస్టు 12, 2018

ఒకసారి బుధ్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు.
ఇంతలో ఒక శిష్యుడిని పిలిచి,
"నాయనా, దాహంగా ఉంది, ఆ కనబడే చెరువునుంచి కొన్ని నీళ్ళు తీసుకురా" అని చెప్పాడు. అప్పుడే ఒక ఎద్దులబండి ఆ చెరువులోంచి వెళ్ళడం మూలంగా నీరు అంతా మురికిగా తయారయింది.
శిష్యుడు ఆ నీరు తేరుకొనేంతవరకు అలాగే కూర్చున్నాడు.
అరగంట సమయం గడిచింది.
చూస్తే నీరు ఇంకా మురికిగానే ఉంది.
మరో అరగంట సమయం వేచి చూసాడు.
నీరు తేరుకున్నాయి.
ఆ పైన ఉన్న నీరు తీసుకెళ్ళి బుధ్ధుడికి ఇచ్చాడు శిష్యుడు.
అప్పుడు శిష్యుని అనుమానం
" ఈ నీరు అంత మురికిగా ఉన్నా, ఎలా తేరుకుంది? నువ్వు కాసేపు దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు. అది నెమ్మదిగా మురికి కిందకుపోయి, స్వచ్చమైన నీరు పైకి తేరుకుంది.
మన మనసు కూడా అంతే.
ఒకసారి మనసులో ఆందోళన కలిగినపుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి.
కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే మురికి అంతా అడుగుకు వెళ్ళిపోయి, మనసు స్వచ్చంగా మారుతుంది.
నీ మనసు తేలిక అవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నమూ చేయవలసిన పనిలేదు.
కొంతసేపు అలా వదిలేస్తే, దానంతట అదే సద్దుమణుగుతుంది.
చక్కబడుతుంది.
మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
మన ప్రయత్నం లేకుండానే జరిగిపోతుంది."
మీకు ఇష్టమైన వాళ్లను ఎప్పుడూ వదులుకోకండి.
వారు తప్పులు చేసారు అనుకుంటే, ఒక్క క్షణం వారితో మీరు గడిపిన అద్భుతమైన, ఆనందకరమైన క్షణాల గురించి ఒక్కసారి తలుచుకోండి.
ఎందుకంటే, పరిపక్వత కన్నా, అభిమానం ముఖ్యం.
మిమ్మల్ని మీరు కౌగలించుకోలేరు.
మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు.
అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి.
జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకటమే.
మీకు ఇష్టమైన వారి కోసం, మిమ్మల్ని ప్రేమించేవారికోసం బ్రతకండి. స్నేహం, ప్రేమ,
బంధుత్వాలు అనేవి డబ్బు భాష మాట్లాడేవారికి అర్థం కావు.
ఎందుకంటే కొన్ని పెట్టుబడులు మనకు కనిపించే లాభాలను ఇవ్వలేకపోవచ్చు, కాని మనలను సంపన్నుల్ని చేస్తాయి.
కుటుంబం, స్నేహితులు అలాంటి గొప్ప పెట్టుబడులు.....

శనివారం, జూన్ 30, 2018

జీవితంలో పైకి రావాలంటే ప్రతిభా,పనితనం మాత్రమే సరిపోవు.ఎప్పటికప్పుడు ఎమోషన్స్ ని అదుపు చేసుకుపోతూ అడ్జస్ట్ మెంట్ అలవాటు చేసుకోవాలి. ఇటువంటి విషయాలు చెప్పడానికి,రాయడానికి బావుంటాయని అనుకోకండి.అక్షరాలా అద్భుతాలు చేసినవారెందరో ఉన్నారు.
   అటువంటి వారిలో మన భారతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒకరు. 16ఏళ్ల వయస్సులోనే టెస్ట్ మ్యాచ్ రంగంలో దిగి,24 సంవత్సరాల పాటు నిర్విరామంగా, నంబర్ వన్ గానూ ఆడుతూ 100సెంచరీలు చేసి, ఇటు ప్రజలు అటు ప్రభుత్వం గుర్తింపు పొంది అత్యంత ప్రతిష్టాత్మకరమైన "భారతరత్న" బిరుదును పొందారు.రాజ్యసభలో సభ్యుడిగా గౌరవింపబడ్డారు. లిటిల్ మాస్టారుగా ప్రపంచంలో ఎందరికో అభిమాని అయ్యాడు.
     అయితే ఇంతకీ విషయమేమిటంటే ఈ లిటిల్ మాస్టర్ తన కెరీర్ లో అడుగదునా అడ్డంకులు ఎదుర్కొన్నాడు. కానీ లక్ష్యం గుర్తుంచుకుని అన్నిటికి అడ్జస్ట్ అయ్యానని ఆయన తన పుస్తకం "ప్లేయింగ్ ఇట్ మై వే" ఆటో బ్రయోగ్రఫీలో వెల్లడించారు.కొంతమంది పాత ప్లేయర్లతో ఆయన ఎలా అడ్జెస్ట్ అయ్యాడు. భారత క్రికెట్ కోచ్ గ్రెగ్ చాపల్ తనను ఎలా ఇబ్బంది పెట్టాదో సవివరంగా వర్ణించాడు. ఈ పుస్తకం ఏదో సంచలనం సృష్టించాలని రాయలేదు. పైగా ఆయనకు రావాల్సిన బిరుదులు,సత్కారాలు,ఐశ్వర్యం అంటూ ఏదీ లేదు.పైగా తను ఎన్నో దానాలు,గుప్తదానాలు చేశాడు.

గురువారం, మే 26, 2016

100% నిజమని నమ్ముతున్నాను. ఎందుకంటే నమ్మకం లేనిది ఏదీ లేదు. మనిషి నైనా, గవర్నమెంట్ వ్యవస్థనైనా ఆఖరికి దేవుడినైనా నమ్మకంతోనే చూస్తూన్నాము. నమ్మకంతోనే బ్రతుకుతున్నాము. రేపటి కోసం చూస్తున్నామంటే రేపటికి మనము బ్రతికే ఉంటామన్న నమ్మకం. నమ్మకం మూఢ నమ్మకం కాకుండా చూసుకుంటే చాలు. నమ్మకం హేతువుకి అందితే చాలు. అప్పుడు ప్రతి నమ్మకాన్ని ఖచ్చితంగా నమ్మవచ్చు. నమ్మకం లేనిది ఏముంది చెప్పండి? అన్నీ నమ్మకాలే, నమ్మకం లేని జీవితం లేదంటే ఖచ్చితంగా నమ్మవచ్చు.

శనివారం, మే 07, 2016

శనివారం, మార్చి 05, 2016


బుధవారం, జనవరి 27, 2016

ఉదయమే 7గంటలకు మొబైల్ రిచార్జ్ కోసం మెయిన్ రోడ్డు మీదకు వచ్చి చూస్తే ఒక్క రిచార్జ్ షాప్ కూడా తీయలేదు. తీసిన షాపులు కేవలం ఒకటి సెలూన్ అయితే రెండవది వడ్డీ షాపులు. ఇవి తప్ప మరే షాపు కూడా తెరవలేదు. నిజానికి ఈ రెండు షాపులూ మనుషులకు తల గొరిగేవే! మొదటి షాప్ తలగొరుడుకు మేలుంటే, రెండో షాపు తల గొరుగుడుకు నాశనం తప్ప ఏమీ ఉండదు.

బుధవారం, డిసెంబర్ 30, 2015

5am to 6am మధ్యం ఇంకా మంచంపై దొర్లుతూనే ఉన్నాను. నిద్రపోలేదుగాని ఈరోజు ఏమి చేయాలా? నూతన సంవత్సరంలో కొత్త ప్రాజెక్ట్స్ ఏమి ప్లాన్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంటే ప్రక్కనే ఉన్న ఫోన్ మ్రోగింది. ఇంత ప్రొద్దుటే నాతో ఎవరికి అవసరం పడిందా అని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తే అవతలి నుండి NTV రిపోర్టర్ గారట. నాతో చాలా సేపు సంభాషించారు. మన "సాక్ష్యం మేగజైన్" చాలా బాగా నచ్చిందట. అందులోని కొన్ని బుక్స్ ఆయన Download చేసుకుని చదవడమే కాకుండా రెగ్యులర్ గా దానిలోని ఆర్టికల్స్ ఆయన ఫాలో అవుతున్నానని త్వరలో మీ సాక్ష్యం బ్లాగును NTV లో ప్రమోట్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఎందుకో మనసుకి ఎక్కడ లేని ఆనందం కలిగింది. ఎందుకంటే "సాక్ష్యం మేగజైన్" వల్ల కొంతమంది మత వర్గాల పండితులకు గుండె దడ పట్టుకుంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో భక్తి స్థానంలో చెలామణీ అవుతున్న థర్మానికి శాస్త్రాలలో ఉన్న థర్మానికి ఎక్కడా సంబంధం లేదు. భక్తి పేరు చెప్పి సామాన్య జనులను దోచుకోవడానికి ఈరోజు పెద్ద వ్యాపారమే జరుగుతోంది. ప్రజలెవరూ తమను పూర్తిగా నమ్మరు కాబట్టి ఇవ్వన్నీ శాస్తాలను అడ్డు పెట్టుకుని, పుణ్య పురుషులను అడ్డు పెట్టుకుని దోచుకుంటున్నారు. ఇదంతా పెద్ద,పెద్ద నాయకులనుండి, స్వార్ధ పరులైన కొంతమంది పండితుల వరకూ రహస్యంగా సాగుతున్న వ్యాపారం. ఇటువంటి ఎన్నో విషయాలను ఎండగడుతూ, శాస్త్రీయమైన విషయాలను ప్రజలకు అందిస్తూ ఎంతో ధైర్యంగా ఈ "సాక్ష్యం మేగజైన్" ముందుకు సాగుతోంది. ఒకసారి మీరు "సాక్ష్యం మేగజైన్" ని విజిట్ చేయండి...Next

గురువారం, డిసెంబర్ 24, 2015

అవును నేను ముమ్మాటికి హంతకుడినే...ఒకటా రెండా? ఎన్నో హత్యలు చేసి మోసాలకు, కుట్రలకు దొరకకుండా తిరుగుతున్నాను. ఏ పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నన్ను వేలెత్తి చూపించలేదు. ఏ ప్రభుత్వమూ నన్ను సన్మానించకుండా ఉండలేదు. ఎందుకంటే నేను చేసిన హత్యల వలన నేను బాగుపడుతున్నాను. సమాజమూ బాగుపడుతుంది. అందుకనే మీరు కూడా హత్యలు చేయండి. మీరు బాగుంటారు.
నీ స్వార్ధం నీవు చూసుకో, ఎవరు ఎలా పోతే నీకేమిటి? అని నిత్యం శాసించే మనసును నిర్ధాక్షిణ్యంగా చంపేశాను.
నిన్ను తమ స్వార్ధాలకు ఉపయోగించుకుని వాడుకునే వ్యక్తులతో కల్సే అవసరాన్ని కలిగిస్తున్న కాలాన్ని చంపేశాను.
కంటి మీద నిద్ర, గుండెల్లో ప్రశాంతత లేకుండా చేస్తున్న ఆశలను చంపేశాను.
నన్ను నాశనం చేయాలనుకుంటున్న అహంకారాలునూ, మమకారాలనూ నిర్ధాక్షిణ్యంగా చంపేసి పూడ్చి వేశాను.
అదేమిటో నేను హత్యలు చేస్తున్నా నాలో శత్రువులు కొత్తగా పుట్టుకొస్తూనే వున్నారు. ఎన్నని చంపను? అయినప్పటికీ నేను చంపుతూనే ఉన్నాను. నేను దేనిని వదలను. ప్రతిదాన్ని చంపేస్తూనే ఉంటాను.ఎందుకంటే నేనొక హంతకుడిని!

శనివారం, డిసెంబర్ 19, 2015

అవును. జాగ్రత్త లేకపోతే అందమైన ఆడపిల్ల,అగ్గిపుల్ల ఇవి రెండూ ప్రమాదమే. మనుషులను నిలువునా తగలబెట్టేస్తాయి. నిజం కాదంటారా?

 


Recent Posts