సోమవారం, అక్టోబర్ 28, 2019

దీపావళి రోజు రాత్రి 9గంటలకు మా ఇంటిల్లిపాది నాలుగు మతాబీలు, రెండు చించూ బుడ్లు కాల్చిన తరువాత ఏదో మంచి మూవీ పెట్టండి చూద్దాం అని మా ఫ్యామిలీ చెపితే సరేనని Movierulz Site ఓపెన్ చేసి "జనతా హోటల్ " సినిమా ప్లే చేశాను. ఈ సినిమా ఎక్కడా బోరు కొట్టలేదు సరికదా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మనసంతా ద్రవించి పోయింది. ఇటువంటి మనసును కదిలించే సినిమాలు ఈమధ్యకాలంలో మన తెలుగులో రావడమే లేదు. అన్నీ కూడా కాపీ కొట్టుడు సినిమాలు. మిత్రులారా మీకు వీలుంటే ఒకసారి  "జనతా హోటల్ " సినిమాని చూడండి. Movierulz Site లో దొరుకుతుంది. డౌన్లోడ్ చేసుకోండి..


శనివారం, అక్టోబర్ 26, 2019

బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు! | Happy Diwali to all the blog friends!



/span>

మంగళవారం, అక్టోబర్ 22, 2019

AIU Recruitment 2019 విడుదల అయ్యింది. ఇందులో ప్రధానంగా 8 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
Joint Secretary – 02
Section Officer – 02
Senior Research Assistant – 01
Consultant (Admn) – 01
Consultant (Audit) – 01
Consultant (Legal/ Vigilance) (Part time) – 01
Post Doctoral Fellow – 03

మీకు అర్హత, ఆసక్తి ఉంటే అప్లయ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం ఈక్రింది లింక్ ద్వారా వెళ్లవచ్చు.

ఆదివారం, అక్టోబర్ 20, 2019

🍁అష్టావధానంలో ఓ కొంటె పృచ్ఛకుడు ఇబ్బందికర పదాలైన పంది,చేప,కప్ప, కోడిపెట్ట అవధానికి చెప్పి,ఈ పదాలు కలుపుతూ ఒక బ్రాహ్మణుడి ఇంట పెళ్లి భోజనము గూర్చి వివరించమని తుంటరి ప్రశ్న వేయగా!*

*ఆ అవధానిగారు ఓస్ ఇంతేకదా అని క్రిందివిధంగా బ్రాహ్మణభోజనము వారికి పెట్టాడు.చదవండి.*

" అందమైనట్టి "పంది"రింట విందుచేయ
బ్రహ్మణుల ఇంట "చేప"ట్టే పరిణయమున
కొసరి మా"కప్ప"డాలు ప"కోడిపెట్ట"
కమ్మనౌ వంటకాలతో కడుపు నింపే ''

*ఆహా..ఏమి మన కమ్మని తెలుగు భాషాతియ్యదనం..*


*అందుకే కదా !  దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు..*

ఇలా అనుకుంటూ ఉంటాము కదూ !
వింబుల్డన్ ప్లేయర్ Arthur Ashe మనకు అందిస్తున్న ఈ మెస్సేజ్ చదివితే మనం ఎలా ఆలోచించాలో తెలుస్తుంది .
ఏమయ్యింది ?
1983 లో ఆర్థర్ గుండె ఆపరేషన్ కోసం రక్తం ఎక్కించుకోవలసి వచ్చింది . ఆ రక్తం ద్వారా అతడికి వచ్చింది AIDS
ఈ విషయం పేపర్లద్వారా ప్రపంచం అంతటా తెలిసింది . అభిమానుల సానుభూతి వేల్లువయ్యింది .
అనేక ఉత్తరాలు . మెయిళ్ళు. అతడికి ఎన్నెన్నో సానుభూతి వచనాలు . అందులో ఒక మె యిలు లో ఇలా ఉంది .
“ ఆర్ధర్ ! నీకే ఇలా అయ్యింది ఏమిటి ? ఇంతటి భయంకరమైన వ్యాధికి దేముడు నిన్నే ఎంచుకున్నాడేమిటి ?”
ఈ మెయిలు చదివిన ఆర్థర్ దానికి సమాధానం ఇలా ఇచ్చాడు .
“డియర్ మిస్టర్ ! మీ మెయిలు నన్ను ఆలోచింప చేసింది .
5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడడం మొదలు పెడితే ,
500 000 మంది మాత్రమె ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి వచ్చారు , వారిలో........
50 వేల మంది మాత్రమె Circuit దశకు చేరుకున్నారు ..........
వారిలో 5 వేల మంది మాత్రమె గ్రాండ్ స్లామ్ కి చేరుకోగలిగారు. ...........
వారిలో 50 మంది మాత్రమె వింబుల్డన్ కి వచ్చారు . ..........
వారిలో 4 గురు మాత్రమె సెమీ ఫైనల్స్ కి వచ్చారు . .......
వారిలో ఇద్దరు మాత్రమె ఫైనల్స్ కి వచ్చారు ...........
వారిలో నేను మాత్రమె టైటిల్ గెలుచుకున్నాను .
మిత్రమా ? అప్పుడు నేను అడిగానా ?
నాకు మాత్రమె ఈ గెలుపును ఎందుకు ఇచ్చావు అని దేముడిని నేను అడగలేదు కదా !
నాకు అంతటి సంతోషాన్ని ఇచ్చినప్పుడు ఆయనను ఎందుకు ఇచ్చావు అని అడగం
బాధను కలుగచేసినపుడు ఎందుకు అడగాలి ?
సంతోషం నిన్ను ఆహ్లాదపరుస్తుంది . పరీక్షలు నిన్ను ధైర్యవంతుడిని చేస్తాయి .
బాధలు నిన్ను మానవుడిని చేస్తాయి . ఓటమి నీకు వినయాన్ని నేర్పుతుంది .
విజయం నిన్ను ఆనందపరుస్తుంది . నమ్మకం నిన్ను నడిపిస్తుంది
నీ జీవితం నీకు ఆనందం కలిగించకపోవచ్చు
నీలా జీవించాలని కలలు కనే వాళ్ళు ఎందఱో ఉంటారు
ఆకాశం లో ఎగిరే విమానాన్ని చూసి అందులో వెడితే ఎంతో బాగుంటుంది అని ఒక పిల్లవాడు అనుకుంటాడు .
కిందని ఉన్న మనుషులను చూసి ఇంటికి ఎప్పుడు వెడదామా అని ఆ విమానం నడిపే పైలట్ అనుకుంటాడు .
అదే జీవితం !
డబ్బే ఆనందం అనుకుంటే డబ్బు ఉన్న ఆసామీలు అందరూ రోడ్ల మీద డాన్స్ లు చేస్తూ కనిపించాలి . కానీ రోడ్డుమీద నిక్కరు లేకుండా ఉండే పిల్లలు హాయిగా ఆనందంగా ఆడుకుంటూ కనిపిస్తారు
అధికారమే భద్రత అనుకుంటే VIP లు అందరూ ఎటువంటి రక్షణా లేకుండా తిరగాలి .
కానీ అలా జరగడం లేదు .
సింపుల్ గా ఉండే వాళ్ళే హాయిగా తిరుగుతున్నారు . హాయిగా నిద్రపోతున్నారు .
చూడు నేస్తం !
సింపుల్ గా జీవించు !
వినమ్రతతో మెలుగు !
మనసారా ప్రేమించు !
తృప్తిగా ఉండు !

మంగళవారం, అక్టోబర్ 15, 2019

కొన్నేళ్ల క్రితం..భగవంతుని దగ్గరకు చీమలు, దోమలు,ఈగలు,చెట్ల మీద ఉండే పురుగులు,బల్లులూ వెళ్లి..
" స్వామీ ఈ మానవులు పురుగు మందు కొట్టి పురుగుల్ని, చీమల మందు పెట్టి చీమల్ని, నల్లుల్ని, చెదలని, దయ లేకుండా చంపేస్తున్నారు, మాకు ఈ హింస భరించడం చాలా కష్టం గా ఉంది..మా జీవితాల్ని కాపాడు స్వామీ " అని మోర పెట్టుకున్నాయి..

దేవుడు నవ్వి.." నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో వెళ్ళండి అతి త్వరలో మీ బాధలు తీరుతాయి. త్వరలో అంబానీ అనే మహాత్ముడు పుట్టి నిరంతరం పనిచేసే 4g ని ప్రసాదిస్తాడు, అతనికంటే ముందు జుకెన్ అనేవాడు Face Book ఇస్తాడు...ఇంకొకడు whatsapp ఇస్తాడు ..ఇంకొకడు స్మార్ట్ ఫోన్ ఇస్తాడు..అప్పటినుండి మనిషి మిమ్మల్ని పట్టించుకోడు, ఇంట్లో పుట్టలు పెట్టినా పట్టించుకోడు..వాడి పతనం వాడే తెచ్చు కుంటాడు, మీకు అధ్భుతమైన జీవితం ముందుంది " అని వరమిచ్చాడు.
😂🤣😥😂🤣😥😂🤣😥

సోమవారం, అక్టోబర్ 14, 2019

will-chandrababu-naidu-join-bjp-again
ఆంధ్రా ప్రజలకు ఇదే అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకంటే టిడిపి పార్టీలోని కొంతమంది ప్రముఖ నాయకులు బిజెపిలోకి జంప్ అయినా చంద్రబాబునాయుడు గారు వ్యతిరేకించకపోవడం, అలాగే మొన్న వైజాగ్ మీటింగ్ లో చంద్రబాబు ప్రసంగిస్తూ బిజెపిని వీడడం తప్పుడు నిర్ణయమని, వైసిపి రెచ్చగొట్టినందునే టిడిపికి,బిజెపికి విరోధాలు ఏర్పడ్డాయని చెప్పడం బిజెపి మద్దతు ఉన్నట్లు అనిపిస్తోంది. నిజానికి చంద్రబాబు బిజెపిని దారుణంగానే విమర్శించాలి గాని ఇవేవీ చంద్రబాబు నాయుడుగారు చేయలేదు. నిజం చెప్పాలంటే బిజెపికి చంద్రబాబును మళ్ళీ కలుపుకుపోవడం వలనే ప్రయోజనం గాని జగన్ గారి వలన ఎంటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే చంద్రబాబుకు హైలెవెల్లో ఉన్న సర్కిల్ జగన్ ఏమాత్రం లేదు. ఇకపోతే దేశీయంగా చూస్తే ఏమాత్రం ఇమేజ్ లేని కాంగ్రెస్ ను పట్టుకుని ఉండటం కంటే కేంద్రంలో బలంగా ఉన్న బిజెపినే కలుపుకుంటే ప్రయోజనం. అటు బిజెపికి ఇటు జగన్ కంటే చంద్రబాబు వలెనే ప్రయోజనాలు ఎక్కువ. దానికితోడు చంద్రబాబు యొక్క నేషనల్ ఇమేజ్ కూడా బిజెపి వారికి మరింత ప్రయోజనాన్ని చేకూర్చుతుంది. ఇవన్నీ కలిసి ఒకవేళ బిజెపి, టిడిపి కలిస్తే జగన్ గారికి గడ్డు కాలం ప్రారంభమయ్యినట్లే... కాదంటారా?

 


Recent Posts