బుధవారం, జులై 10, 2019

48-principles-of-energy-ksc-smart-guide
కొందరు అధికారంతో,శక్తితో ఆడుకుంటారు.ప్రాణాంతకమైన ఒక పొరపాటువల్ల తమ శక్తి మొత్తం పోగొట్టు కుంటారు.కొందరు అవసరమైనదానికన్నా ముందుకి వెళ్లిపోతే,మరికొందరు అవసర మైనంత మేరకి కూడాముందుకు పోలేరు. కానీ అతి తక్కువమంది సరైన పనులు చేసి,ఎంతో తెలివిగా శక్తిమంతులవుతారు.
శక్తి యొక్క 48 సూత్రాలు ఆధునికయుగంలో జిత్తులని ఉపయోగించి స్వార్ధప్రయోజనాలని సాధించటానికి పనికి వచ్చే మార్గదర్శి.మీరు ఇంతవరకు కొన్న పుస్తకాలన్నిటిలోకి ఇదే ఎంతో ఆసక్తికరమైనదీ,ఉపయోగకరమైనదీ కావచ్చు.
ఈ పుస్తకాన్ని రాబర్ట్ గ్రీన్ [లాస్ ఏంజిల్] గారు రచించారు.తెలుగులోకి ఆర్.శాంతసుందరి గారు తర్జుమా చేసారు.ముఖ్యముగా ఈ పుస్తకం మనిషి జీవితంలో నెగ్గుకు రావాలంటే ఏమి చేయాలి? శిఖరంపైకి ఎలా చేరుకోవాలి? అక్కడే ఎలా ఉండాలి? వంటి ఎన్నో ప్రశ్నలకు 48సూత్రాలతో ఎంతో విడమర్చి చెప్పడం జరిగింది.నేను కేవలం 48సూత్రాలు అందిస్తాను.వాటిని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలంటే మీరు ఆ పుస్తకాన్ని చదవాల్సిందే.

మంగళవారం, జులై 02, 2019

Andhra Pradesh Open School - Time Table of SSC & Intermediate Public Examinations, July, 2019
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిన కాపీలోని పూర్తి వివరాలు ఒకసారి చెక్ చేసుకోగలరు.
Andhra Pradesh Open School - Time Table of SSC & Intermediate Public Examinations

సోమవారం, జులై 01, 2019

mother-and-sons
సుమారు పాతికేళ్ల క్రితం...మా ఇంటికి సమీపంలో ఒక కుటుంబం ఉండేది.  తల్లి, కుమారుడు, కోడలు.  ఆమె భర్త చనిపోయాక అతని పెన్షన్ ఆమెకు వస్తుండేది..చాలా స్వల్పమొత్తం.  రెండు వేలో, మూడు వేలో ఉండేది.  ఆమెకు ఆరుగురు కొడుకులు.  అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు.  అందరికీ వివాహాలు అయ్యాయి..ఒక్కొక్కరికి ముగ్గురు నలుగురు పిల్లలు కూడా.  కొందరు అమెరికాలో స్థిరపడ్డారు.  నగరంలోనే అందరికి సొంత ఇల్లు, కార్లు ఉన్నాయి.   జీతాలు, పై సంపాదనలు ఎక్కువే.  తండ్రి చనిపోయాక తల్లిని ఎవరు చూడాలి? అని కోడళ్ళు ప్రశ్నించగా కొడుకుల మధ్య చిచ్చు రేగింది.  నీకు ఎక్కువ సంపాదన కాబట్టి నువ్వే చూడాలి అని ఒకరు, నేను ఒక్కడినే ఎందుకు చూడాలి అని మరొకరు..ఈ విధంగా కొట్టుకున్నారు.  ఆ తరువాత ఒక శ్రేయోభిలాషి వారి మధ్యన రాజీ కుదిర్చాడు.  ఒక్కొక్క కొడుకు రెండు నెలల పాటు తల్లిని చూసుకోవాలి అని సూచించాడు.  ఆమె ఉండే ఆ రెండు నెలలకు వచ్చే పెన్షన్ ను ఆ కొడుక్కు ఇవ్వాలి!

 


Recent Posts