సోమవారం, జూన్ 24, 2019

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా గ్రామ వాలంటీర్ల నియమకానికి సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది...Read More

బుధవారం, జూన్ 19, 2019

రష్యాలోని మూడు వింత ప్రదేశాలు. | Three wonder places in Russia.

ఇక్కడ మీకు 3 అద్భుతమైన, ఆశ్చర్యకరమైన వీడియోలను అందిస్తున్నాను. ఈ సంఘటనలు పాత రష్యా దేశంలోని వింతైన ప్రదేశాలలోని జరుగుతున్న వింత వింత విషయాలు.  ఒకటోది :- మనం తాగగలిగే మంచి నీరు, పెట్రోల్ లాగా మండటం. రెండోది :- భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఉండే ప్రదేశం, అక్కడకు ఏదైనా వస్తువును విసిరితే, అది తిరిగి వచ్చి మనముందుకు వచ్చి పడుతుంది. మూడవది :- ఒక కొలనులోని నీటిలో పెద్ద పెద్ద బరువైన రాళ్ళను వేసిన వెంటనే అవి దూది పింజలాగా పైకి తేలుతాయి. మీరే చూడండి..*_







మంగళవారం, జూన్ 11, 2019

ఆంధ్రాలో విలేజ్ వాలెంటరీ పోస్టుల నోటిఫికేషన్ డిటైల్స్ విడుదల అయ్యాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈక్రింది లింక్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

శుక్రవారం, జూన్ 07, 2019

*👌ఒక మంచి మెసేజ్*

*" ఏంటోనోయ్!  అస్తమానూ   పెన్ను  ఎక్కడ  పెట్టానో  మరచిపోతూ  ఉంటాను"*

*"  ఎందుకు  అలా ? "*

*"  ఏమిటో  మరి  ఈ  మతి   మరుపు !  అందుకే   నేను  ఎప్పుడోఖరీదైన  పెన్నులు వాడడం  మానేశాను .  చీప్  పెన్ను  మాత్రమె  వాడుతున్నాను .  అది  మరిచిపోయి  పారేసినా  బాధ  అనిపించదులే !  అయితే  నా  బాధ  ఈ  మతిమరుపు  గురించే ! "*
.
." *నేను  ఒక  సలహా   ఇవ్వనా* ? "

"  *మతిమరుపు  పోతుందా* ?"

"  *చెప్పలేను !  నీ  మీద  ఆధారపడి  ఉంటుంది* !"

*ఏమిటది* ?

"  *నువ్వు  కొనగలిగినంత  అత్యంత  ఖరీదు  అయిన  పెన్ను  కొని  వాడుతూ  ఉండు  .  అప్పుడు  కూడా   నువ్వు మరిచిపోతావా*?   ,

*నీ  మరుపు  పోతుందా?   చూద్దాము* "

"  *తప్పకుండా   చేస్తాను* "

*ఆర్నెల్ల  తర్వాత   స్నేహితుడు ఫోన్  చేసి  పెన్ను  మరిచిపోతున్నావా ?   అని  అడిగాడు*

" *అబ్బే ! నువ్వు  చెప్పాక 22 కేరట్ల బంగారం పెన్ను   కొన్నాను* .

*దాని  విషయం  లో  చాలా  జాగ్రత్తగా  ఉంటున్నాను* .

*ఈ ఆరునెలల్లో  ఒక్క  రోజు  కూడా   నేను  దానిని  ఎక్కడా  మర్చిపోలేదు* "

" *నువ్వు  పెన్ను  మర్చిపోకపోడానికి  కారణం నువ్వు  దానికి  ఇచ్చిన  విలువ* ."

*మనం  దేనికి  విలువ  ఇస్తామో  దానిపట్ల  మనం   జాగ్రత్తగా  ఉంటాము*_ .

*వస్తువుకు  విలువ  ఇస్తే  దాన్ని  కోల్పోము*

*ఆరోగ్యానికి  విలువ  ఇస్తే  ఏమి  తినాలో  ,  ఏమి  తినకూదదో , ఎంత  తినాలో  ,  ఎప్పుడు  తినాలో  అన్నీ  జాగ్రత్తగా  ఉంటాము*

*నీతి:-* 

*స్నేహానికి  విలువ  ఇస్తే స్నేహితుడిని గౌరవిస్తాము.*

*డబ్బుకు  విలువ  ఇస్తే  ఆచి  తూచి   ఖర్చు  పెడతాము*

*కాలానికి  విలువ  ఇస్తే  టైం  వేస్ట్  చెయ్యము*,

 *బంధాలకు  విలువ  ఇస్తే  వాటిని  తెంచుకోము*

*దేనికి  ఎంత  విలువ  ఇవ్వాలో  తెలుసుకుని   వ్యవహరించడం  మనం  తెలుసుకోవాలి*.

బుధవారం, జూన్ 05, 2019

*1. పేదలు శ్రమ చేస్తూనే ఉంటారు.
*2. ధనికులు వారిని వాడుకుంటారు.
*3.సైనికుడు పై ఇద్దరినీ రక్షిస్తుంటాడు.
*4.పన్ను కట్టేవాడు, పై ముగ్గురుకీ కడుతుంటాడు.
*5.తిరుగుబోతు, పై నలుగురి బదులుగా విశ్రాంతి తీసుకుంటాడు.
*6.తాగుబోతు పై ఐదుగురి కోసం తాగుతుంటాడు.
*7. ధనాగార నిర్వాహకుడు పై ఆరుగురిని దోపిడి చేస్తుంటాడు.
*8. న్యాయవాది , పై ఏడుమందిని తప్పు త్రోవ పట్టిస్తుంటాడు .
*9. వైద్యుడు, పై ఎనిమిది మంది నుంచి డబ్బు తీసుకుంటాడు .
10. కాటికాపరి పై తొమ్మిది మందినీ పాతిపెడతాడు.
11. రాజకీయ నాయకుడు, పై వారందరి మూలంగా హాయిగా జీవిస్తాడు
 *ఈ నాటికీ ఇవే వర్తిస్తున్నాయి  క్రీ.పూ.43 నాటివి ! *

 


Recent Posts