ఆదివారం, మే 26, 2019

vijaya-rahasyalu-yandamoori
vijaya rahasyalu-yandamoori

vijaya rahasyalu-yandamoori

నాకు నచ్చిన యండమూరి రచనల్లో ఒక మంచి పుస్తకం "విజయ రహస్యాలు : టీచర్లు చెప్పనివి - పెద్దలకు తెలియనివి". ఈ పుస్తకం చదివితే చదవని వారికి "చదువు"ను కొనసాగించాలనిపిస్తుంది. చదివే వారికి మరింతగా చదవాలనే ఆసక్తి కలుగుతుంది. ఈ పుస్తకంలో యండమూరి వారు ఎన్నో అద్భుతమైన సలహాలు, సూచనలు అందించారు. వీలయితే మీరు తప్పక చదవండి. మీ పిల్లల చేత చదివించండి.

చదువంటే విద్యాలయంలో నేర్చుకున్నదంతా మర్చిపోయిన తర్వాత చివరకు మిగిలేది - ఆల్బర్ట్ ఐన్ స్టీన్.

మనిషి దీపమైనా కావాలి. అద్దమైనా కావాలి. ఒకటి వెలుగునిస్తుంది. మరొకటి దాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతివారూ దీపం కాలేకపోవచ్చు. కాని అద్దం కాగలరు. తనకు తెలిసిన జ్ఞానాన్ని మరొకరికి పంచడమే జీవితం. - అరిస్టాటిల్.

Read More : స్నేహితులు ఎన్ని రకాలు ఉంటారు? వారిని గుర్తించటం ఎలా?

గురువారం, మే 23, 2019

congratulations-to-new-chief-minister-Andhra-Pradesh-YS-Jagan-Mohan-Reddy
Congratulations to the new Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy.
ఆంధ్రాకు మళ్ళీ చంద్రబాబునాయుడుగారే ముఖ్యమంత్రి అవుతారని ఆశించినప్పటికీ ఏమి జరిగిందో, ఎలా జరిగిందో తెలీదు గాని ప్రజలు మాత్రం జగన్ గారికే ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టారు. మన నూతన ఆంధ్రాకు ముఖ్యమంత్రి స్థానంలో జగన్ వచ్చారు కాబట్టి ఆంధ్రా ప్రజలంతా ఆయనను గౌరవించక తప్పదు. విభజనకు గురై అన్యాయంగా మోసపోయిన ఆంధ్రాను ముఖ్యమంత్రి జగన్ గాడిలో పెడతాడని ఆశిద్దాం. మనమందరమూ పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి జగన్ గారికి సహకరిద్దాం. నా బ్లాగు తరుపున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహాన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు.

సోమవారం, మే 13, 2019

🍥 సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు.

🍥 ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి.

🍥 సోక్రటీస్‌ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్‌ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్‌ మనసుని తాకింది.

గురువారం, మే 09, 2019

is-there-benefit-from-cinema-biopic
 Is there a benefit from cinema biopic?
ఈమధ్య కాలంలో సినిమా బయోపిక్ లు ఎక్కువయిపోయాయి. మహానటి సావిత్రి బయోపిక్ నుండి ప్రతి ఒక్కరి జీవితం మీద బయోపిక్ లు తీయడం ఎక్కువయ్యిపోయింది. కధానాయకుడు, మహానాయకుడు అంటూ ఎన్టీఆర్ పై సినిమాలు తీస్తే "లక్ష్మీస్ ఎన్టీఆర్ " పేరుతొ రాం గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితం మీద మరో బయోపిక్ చేసాడు.

ఇవ్వన్నీ సినీ జనాలపై రుద్దటం తప్ప మరేమీ లేదు. వీటిని ధియేటర్ కెళ్ళి చూసేవారికి సమయం,డబ్బూ వృధా తప్ప మరేమీ ఉపయోగం ఉండదని నా అభిప్రాయం.

నిజానికి ఒక వ్యక్తీ బయోపిక్ తీయాలంటే అతని జీవితంలో జరిగిన అన్ని కోణాలూ పరిశీలించాలి. అదెలా సాధ్యం?  దగ్గరి వారి దగ్గర సమాచారం సేకరిస్తే అభిమానం ఉన్నవారు అన్నీ మంచి విషయాలే చెప్తాడు. పెద్ద,పెద్ద తప్పులను సైతం కప్పిపుచ్చడం, అవసరమైతే దారి మళ్ళించే ప్రయత్నం కూడా చేస్తాడు. అదే సేకరణ అభిమానం లేనివాడి దగ్గర చేస్తే అన్నీ తప్పుడు పనుల గురించే చెప్తాడు, బయోపిక్ కి సంబంధించిన వ్యక్తీ యొక్క త్యాగాలను కూడా స్వార్దాలుగా చిత్రీకరిస్తాడు. ఏవిధంగా చూసినా సదరు బయోపిక్ తీయాల్సిన వ్యక్తీ గూర్చి ఏమాత్రం వాస్తవాలు పెద్దగా తెలియజేయలేము. బయోపిక్ ల పేరుతొ వారికి సంబంధించిన అభిమానుల నుండి డబ్భులు గుంజుకోవడం తప్ప మరేమీ లేదు.

 


Recent Posts