మంగళవారం, ఏప్రిల్ 23, 2019

_**ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటున్నాడు. ఇంతలో దగ్గరలో ఏవో అరుపులు వినిపించాయి, వెంటనే అటు వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి రక్షించండి, కాపాడండి అని అరుస్తూ ఉన్నాడు, రైతు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపించాడు..*_

         _**తర్వాతి రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదయిన గుర్రపుబండి వచ్చి ఆగింది, అందులో నుండి ఖరీదయిన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వచ్చాడు, ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? అని అడిగాడు రైతు."నమస్తే, నేను పక్క వూర్లో ఉంటాను, నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు, అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ ఋణం తీరదు, దయచేసి ఈ ధనం తీసుకోండి " అంటూ ఒక ఇనప్పెట్టె ఇచ్చాడు.*

ఆదివారం, ఏప్రిల్ 14, 2019

Andhra people vs KCR
Andhra people vs KCR
చంద్రబాబే మళ్ళీ సియంగా రావాలని అత్యధికులు భావిస్తుంటే "జగనే" సియం అవ్వాలని కాదు,కాదు చెయ్యాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్, ప్రధాని మోడీగారు తెగ కుట్రలు పన్నుతున్నారు.

ఆంధ్రాప్రజలు కుక్కలు,నక్కలు,రాక్షసులు అంటూ ఆంధ్రా వెధవలతో సంబంధాలు తెగ్గోట్టేసు కోవాలని కారుకూతలు కోసిన కెసియార్ ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో ఇన్ని కుట్రలు ఎందుకు చేస్తున్నాడు?

జగన్ సియం చేయండి...మీకు (ఆంధ్రాకు) ప్రత్యేక హోదా నేనిప్పిస్తా అంటూ కెసియార్ చేసిన ప్రసంగం ఇప్పటికీ మర్చిపోలేము. కెసియార్ ఇప్పిస్తే గాని మనం తెచ్చుకోలేని దిక్కుమాలిన పరిస్థితికి దిగజారిపోయామా?

ఏది,ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు..జగన్ సియం చేస్తే కేసియార్ను సియం చేసినట్టేనని. అంటే ఆంధ్రాపై కెసియార్ ఆధిపత్యం చేయడానికే జగన్ కు సపోర్ట్ చేయడం. ఎందుకంటే చంద్రబాబు సియం అయితే కెసియార్ ఆటలు అసలు సాగవు. ఎందుకంటే YSRCP నాయకుడు విజయసాయి అన్నట్లు చంద్రబాబు ఎవరికీ లొంగడు. అయితే జగన్ కేసియార్కు, మోడీకి చేతులు ఎత్తి పూర్తిగా లొంగిపోవడానికి ప్రధాన కారణం ఉమ్మడి ఆంధ్రాలో జగన్ పై ఉన్న కేసులే. అవ్వన్నీ పట్టుకుంటే ఎక్కువ కేసులు కెసియార్ (తెలంగాణ) పరిధిలోకే పోతాయి. ఇవి గాని పట్టుకుని కెసియార్ లాగాడంటే జగన్ గారు పరిస్థితి ఊహించడానికి కూడా దారుణంగా ఉంటుంది. దీని కారణంగానే జగన్ కేసియార్కు, మోడీకి కీలుబొమ్మ మాదిరిగా మారిపోయేడు.

శనివారం, ఏప్రిల్ 06, 2019

గౌరవనీయులైన తెలుగు బ్లాగులోకంలోని బ్లాగరు మిత్రులకు, బ్లాగు వీక్షక మహాశయులకు, అగ్రిగేటర్ యజమానులకు, ఇంత సేవా ఫ్రీగా అందిస్తున్న గూగులమ్మకు అందరికీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరి జీవితాలలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

మంగళవారం, ఏప్రిల్ 02, 2019

వాట్స్ ఆప్ (WhatsApp) లో మనకు ఏదేని ఒక సందేశం వస్తే టిక్ "✓" మార్క్ పడుతున్నది అందరికీ విధితమే. ఐనా ఆ టిక్ మార్కుల వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం మంచిదేమో మరి...

*టిక్ [✓]సంకేతాల వివరాలు:*

> ఒక టిక్ [✓] మార్క్ పడితే సందేశం (Message) పంపించినట్టు;

> రెండు టిక్ మార్కులు [✓✓] పడితే సందేశం చేరినట్టు;

> రెండు టిక్ మార్కులు [✓✓] నీలం రంగుకు మారితే, ఆసందేశాన్ని చదివినట్టు;

> మూడు నీలం రంగు (Blue) టిక్ మార్కులు ఉంటే ఆ సందేశాన్ని ప్రభుత్వం పసిగట్టినట్టు;

> రెండు [✓✓] నీలం (Blue) టిక్కులు మరియు ఒక [✓] ఎరుపు (Red) రంగు టిక్ ఉంటే ఆ సందేశం విషయంగా ప్రభుత్వం చర్య తీసుకోగలదు అని అర్థం.

*"ఈ సందేశం మీవరకే పరిమితం కాక మీ బృందాలకు కూడా తెల్పగల విశాల హృదయం కలిగిన మీకు శుభోదయం

సోమవారం, ఏప్రిల్ 01, 2019

🕘రాత్రి భోజనాల తర్వాత ఒక👩🎤టీచర్ ఆమె విద్యార్థులు 📝రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది. 

ఆమె పిల్లలు👫 పడుకున్నారు!

భర్త💺కుర్చీలో కూర్చొని తన📱స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు.

చివరి 📝పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ👩🎤 టీచర్ నిశ్శబ్దంగా 😂ఏడుస్తూ ఉంది.

ఆ 😂ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి👨🎤భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!

"ఏమైంది? ఎందుకు😂 ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.

 "నిన్న నా సెకండ్ క్లాస్  👷‍♂👱‍♀🧑👵🏻👨🔬👨🎨👨‍⚖విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా✍రాసుకుని రమ్మని.

"అయితే...?"

"ఇదిగో! ఈ చివరి 📝పేపర్ దిద్దుదామని చదువుతుంటే 😅😂🤣ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"

👨🎤భర్త ఆసక్తిగా...."అంత 😂ఏడిపించే విధంగా ఏం✍ రాశాడు?"

హెడ్డింగ్ ఇలా పెట్టాడు

*"నేను📱స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక."*

👩🎤👨🎤అమ్మానాన్నలు📱  స్మార్ట్ ఫోన్ను చాలా ప్రేమిస్తారు!
వాళ్ళు📱స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా... శ్రద్ధగా... ఇష్టంగా చూసుకుంటారు. 👵🏻నాకన్నా ఎక్కువగా...!!

👨🎤నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి📱స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది.👨🎤నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా👵🏻కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా👨🎤 నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!

👩🎤👨🎤అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా📱 స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు.. 📱ఫోన్✋చేతిలోకి తీసుకుని🗣 జవాబిస్తారు!

కానీ... 👵🏻నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!!  ...
నేను 🤣ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు 👵🏻నాతో కాకుండా📱స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!

వాళ్ళు👵🏻నాతో కన్నా📱స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!

వాళ్ళు తమ📱స్మార్ట్ ఫోన్లో 🗣మాట్లాడుతున్నప్పుడు 👵🏻నేనేం చెప్పినా వినిపించుకోరు! 
అది👵🏻నాకు ముఖ్యమైన విషయమైనా సరే!

అదే ఒకవేళ👵🏻నాతో🗣 మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే 📱🗣ఫోన్ కి జవాబిస్తారు!

👩🎤👨🎤అమ్మానాన్నలు
📱స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!
ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు!
దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!
దాన్ని చాలా ఇష్టపడుతారు!!
దానితో రిలాక్స్ అవుతుంటారు!!
దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!

🕛రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు!!
🕔ఉదయం లేవగానే📱దాన్నే ✋చేతిలోకి తీసుకుంటారు!!

కాబట్టి! నా కోరిక ఏమిటంటే... 👵🏻నేను 👩🎤👨🎤అమ్మానాన్న ✋చేతిలో ఉండే📱స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!! 

👩🎤భార్య చదువుతుంటే... విన్న 👨🎤భర్తకు మనసంతా పిండేసినట్లైంది!! అతని కళ్ళలో కూడా కొంచెం తడి😂😅🤣 వస్తుండగా...
"ఎవరు రాశారది? "✍ అడిగాడు👩🎤భార్యని.

"మన కొడుకు"👵🏻అంది 👩🎤భార్య  😅😂🤣కన్నీరు కారుతుండగా!

వస్తువులను ఉపయోగించుకోవాలి!
బంధాలను ప్రేమించాలి!!

అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి!......ఇది నిజంగా జరిగిన కథ.. కాబట్టి ఇలాంటి కథలో 👩🎤👨🎤తల్లిదండ్రులు మీరు కాకండి...

వాట్సాప్ నుండి సేకరణ : ప్రతి తల్లితండ్రులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో పోస్ట్ చేసాను.

 


Recent Posts