Monday, December 31, 2018

నమ్మాల్సిన ప్రస్తుత నిజాలు | The current facts that must be trusted

*1.గుడికి వెళ్లే మగవాళ్ల సంఖ్య,*
*జిమ్ కు వెళ్లే ఆడవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.*

*2.అనాధ ఆశ్రమంలో పేదవారి చిన్నపిల్లలు ఉంటారు!*
*వృద్ధా ఆశ్రమంలో ధనికుల తల్లిదండ్రులు ఉంటారు!!*

*3.మనం సంతోషంలో ఉన్నపుడు పాటలను వినాలి!*
*బాధలో ఉన్నపుడు ఆపాటలను అర్ధం చేసుకోవాలి!!*

*4.చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయనివి గవర్నమెంటు ఆసుపత్రులు!*
*చచ్చిపోయినాక కూడా వైద్యం చేసేవి కార్పొరేట్ ఆసుపత్రులు!!*

*5.లేనోడు 'నోటి'తో మాట్లాడతాడు!*
*ఉన్నోడు "నోటు"తో మాట్లాడతాడు!!*

*6.చిరునవ్వు చాలావరకు సమస్యలు పరిష్కరిస్తుంది!*
*మౌనం అసలు సమస్యలే రాకుండా నివారిస్తుంది!!*

*7.పూజలుచేసి దేవుడికోసం మనం వెతుకుతాం!*
*దానంచేస్తే ఆయనే మనకోసం వెతుక్కుంటూ వస్తాడు!!*

*8.నువ్వు అర్థం అవ్వట్లేదు అంటే...వాళ్ళకి నువ్వు అవసరం లేదు అని అర్ధం!*
*నీ మాటలు అర్ధం కావట్లేదు అంటే నిన్ను పరిగణలోకి తీసుకున్నదే లేదు అని అర్ధం!!*

*9.*తినటానికి భోజనం లేని స్థాయి నుంచి,*
*తినడానికి సమయమే లేని* *స్థాయి వరకు*
*ఎదగటమే "విజయం".*

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...