బుధవారం, నవంబర్ 20, 2019

ప్రతిరోజూ సాయంత్రం 7గంటలకు పార్క్ కు వెళ్ళడం నా అలవాటు. ఇంచుమించు రాత్రి 9గంటల వరకు అక్కడే గడుపుతాను. నా ప్రాజెక్టులు,పనుల గూర్చి ఆలోచించుకోవడం ప్లాన్ చేసుకోవడం, నాకొచ్చిన తాట్స్ పుస్తకంపై రాసుకోవడం చేస్తుంటాను. ఎందుకో అలా ఒంటరిగా గడపడం కూడా మనిషినికి ఎక్కడలేని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుకనే కాబోలు రోజు వారీ కొంత సమయాన్ని మీతో మీరు బతకండి అని మహానుభావులు ఉద్ఘాటించారు. ఈరోజు మనుషులలో అది కొరవడింది. జీవితాలన్నీ యాంత్రికం అయ్యిపోయాయి. చిన్న,చిన్న ఆనందాలన్నీ మిస్ అవుతూ పెద్ద దు:ఖానికి మనిషి గురయ్యిపోతున్నాడు.
            నాకు తెలిసి మనిషి ప్రతి సమస్యను పట్టించుకోవడం మానివేస్తే దాని ప్రమాదం ఏమీ ఉండదు. సమస్యలే వుండవు. మనం ఎక్కువుగా ఆలోచిస్తూ ఉంటాము కాబట్టి ఆ సమస్య కాస్తా పెనుభూతమై భయపెడుతుంది. కానీ మనం అలా ఉండకూడదు. సమస్యనే మనం భయపెట్టాలి. సమస్య మూలంలోకి వెళ్లి వేళ్ళను పెకిలించి పారవేస్తే సమస్య అనే వృక్షం కొన్నాళ్ళకి మాడిపోతుంది. నిజానికి మనకు తెలియకుండానే సమస్య తాలూకు విత్తనాలు మనలో వచ్చి పడుతుంటాయి. అవి మనకు తెలియకుండానే మొలకెత్తుతాయి. వీటిని మనం ఎప్పటికప్పుడు గుర్తించాలి. విత్తనాలను మొలకెత్తకుండా నాశనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ పరిస్థితులు,వ్యక్తులు మనలో సమస్య తాలూకు విత్తనాలు వెదజల్లెవారే!
  ఇవ్వన్నీ మనకి అర్ధమయ్యేది ఎప్పుడంటే "మనలో మనం బ్రతకడం" నేర్చుకున్నప్పుడే! శుభం!!

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts