మంగళవారం, అక్టోబర్ 30, 2018

SBI Recruitment 2018 | Various Specialist Officers Posts | Apply online


Stat Bank of India వారి జాబ్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దీనిలో అత్యధికంగా బ్యాంక్ ఉద్యోగం నిమిత్తం అభ్యర్ధులను తీసుకోనున్నారు. మీకు తగిన అర్హతలు, ఆసక్తి ఉంటే క్రింది లింక్ ద్వారా వెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు. వివరాలు పూర్తిగా గమనించడం మర్చిపోవద్దు.

శనివారం, అక్టోబర్ 27, 2018

రాత్రి పడుకునే ముందు నాకు ఏదైనా ఒక పుస్తకం కొంతవరకైనా చదవడం అలవాటు. నాకదేమిటో కానీ పుస్తకం ముట్టుకోనిదే అసలు నిద్ర పట్టదు. ఆ పరంపరలో భాగంగా ఒక పర్సనాలిటీ డెవలప్ మెంట్ బుక్ చదువుతుంటే అందులో ధీరూభాయ్ అంబానీ గారి మాటలు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించాయి.స్ఫూర్తిని ఇచ్చాయి. ఆయనగారి మాటల్లో...
      "సూర్యుడు నన్ను మంచం మీద చూసి 50సంవత్సరాలు అయింది"
    ఈ మాటల్లో చాలా లోతైన అర్ధం వుంది. గొప్పవారు పెద్దగా మాట్లాడరు. చాలా మౌనంగానే ఉంటారు. ఒకవేళ వాళ్ళు మాట్లాడ వస్తే "ఆ మాటల్లో లెక్కలేనన్ని ఆణిముత్యాలు" దొర్లుతాయి.
    తెల్లవారు జాము నిద్రలేవడం అంటే జీవితంలో సగం విజయాన్ని సాధించడమే! ఆరోగ్య సంస్థలు కూడా తమ,తమ పరిశోధనలలో "తెల్లవారు జాము నిద్రలేచి, రోజుకు 5లీటర్ల నీళ్ళు త్రాగడం ఎవరు ప్రారంభిస్తారో వాళ్ళకు ఏవిధమైన రోగమూ అంటదు" అని తేల్చి చెప్పేసాయి.
    మన ధార్మిక గ్రంధాలైన వేదాలు, ఖురాన్,బైబిల్లు కూడా తెల్లవారు జామున లేచి ప్రార్ధన చేసుకునే వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని శాసిస్తూనే ఉన్నాయి.
   అందుకే కాబోలు గొప్పవాళ్లేప్పుడూ ఈ అవకాశాలను వదులుకోలేదు. మీరే ఆలోచించండి. ధీరూభాయ్ అంభానీ గారీలాంటి గొప్పవారు 50సం// సూర్యుడి కంటే ముందే అంటే ఉద్దేశ్యం తెల్లవారుజామునే నిద్ర లేచేవారు.
  ఈరోజుల్లో మనం చాలా దిగజారిపోతూ ఉన్నామనే చెప్పాలి. రాత్రి 10లేక 11 గంటలకు భోజనం చేయడం, అప్పటి వరకూ TVలకు అతుక్కుపోవడం, మర్నాడు 8,9 గంటలకు నిద్రలేవడం ఆదర,బాదరా హడావుడి...జీవితం అంతా ఒక యంత్రం మాదిరి అయిపోయింది. నిస్తేజం,నీరసం,నిర్వేదం,నిష్తానమ్ ఏవైతే ఉన్నాయో అవ్వన్నీ కూడా మన జీవితాన్ని అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. మానసిక ప్రశాంతత లేక చికాకు,చింతనాలతో నిత్యం బాధపడుతూనే వున్నాం.వీటిని ఎలాగైనా మనం జయించాలి.జయించవచ్చు కూడా! ఇప్పటి రోజులు సహకరించవు. పరిస్తితి మన చేతులలో లేదనే మాటలు కుంటి సాకులు మాత్రమే! వళ్ళంతా నీరసం, నిస్తేజం నిండిపోయిన మాటలే!ఇప్పటికీ ఎంతో మంది మేధావులు అవుతూనే ఉన్నారు. గొప్ప,గొప్ప పనులు చేసి చూపిస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా మనాలాగే ఆలోచిస్తే వారా స్తాయికి చేరుకుందురా? ఒక్కసారి ఆలోచించండి! మనం మారిపోదాం! మన జీవిత గమ్యాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం! ఆ పనేదో తెల్లవారు జాము నిద్రలేచిపోయి సరైన ప్లానింగ్ తో ముందుకెళ్దాం!...మీరు రెడీ నా?

గురువారం, అక్టోబర్ 25, 2018

*👴తాత గారి గడియారం*

*తాతగారి గడియారం స్టోర్ రూమ్ లో ఎక్కడో పడిపోయింది.ఎంత వెతికినా దొరకలేదు. మనవళ్లందరినీ పిలిచి, ఎవరు గడియారం వెతికిపెడితే వాళ్లకు పది రూపాయలు అని ప్రకటించాడు.*

*పిల్లలందరూ గోలగోలగా రోజు రోజంతా వెతికారు.  గడియారం దొరకలేదు.*

*అంతా వెళ్లిపోయిన తరువాత ఒక మనవడు తిరిగి వచ్చాడు."నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు తాతా... నేను వెతుకుతాను." అన్నాడు. గదిలోకి వెళ్లాడు. తలుపులు మూసుకున్నాడు.*

*ఒక పది నిమిషాల తరువాత "ఇదిగో తాతా గడియారం" అంటూ బయటకు వచ్చాడు.*

*"ఎలా దొరికిందిరా?" అని అడిగాడు తాత."తాతా ఇందాక అందరూ మాట్లాడుకుంటూ, కేకలు వేసుకుంటూ వెతికాం. గడియారం దొరకలేదు. ఈ సారి గదితలుపు వేసి నిశ్శబ్దంగా కాస్సేపు నిలుచున్నాను. "టిక్ టిక్" మంటూ గడియారం శబ్దం వినిపించింది. కాస్త చెవులు రిక్కించి, ఇంకాస్త మౌనంగా ఉండిపోయాను. ఆ శబ్దం ఎటు వైపు నుంచి వస్తుందో అర్థమైంది. ఆ వైపు వెళ్లి వెతికాను. ఇదిగో దొరికింది."*

*🕸నిజమే...ఎంత సమస్యైనా హడావిడి పడితే పరిష్కరించలేం...*

*🐿ప్రశాంతంగా ఆలోచిస్తే,నిశ్శబ్దంగా ఉంటే బతుకు గడియారం శబ్దం దానికదే వినిపించి తీరుతుంది...సమాధానం కనిపించి తీరుతుంది...*

*🐺అంతేగాని ఒత్తిడికి గురైతే , తికమక పడితే , నానా యాగీ చేస్తే , పరేషాన్ అయితే , దుఖిస్తే ఫలితం వ్యతిరేఖంగా ఉంటుంది.*

బుధవారం, అక్టోబర్ 17, 2018

swami-vivekananda-ksc-writes

స్వామి వివేకానంద స్ఫూర్తి...సూక్తి -1

* నా ఆశయాన్ని క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పవచ్చు.అదే మానవకోటికి వారిలోని దివ్యత్వాన్ని గూర్చి బోధించి, వారి జీవిత ప్రతికార్యకలాపంలోనూ ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చేయాలో ప్రబోధించడమే.

* సత్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే, మనం జయించక తప్పదు.

* ఏ ఘనకార్యాన్నీ మోసంతో సాధించలేం. అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి.

సోమవారం, అక్టోబర్ 15, 2018

టీచర్ -- "భారత దేశం నుంచి 
             మొదటిసారిగా విదేశం
          వెళ్ళిన మహిళ ఎవరు?’’

విద్యార్ధి --"సీత టీచర్.
                శ్రీలంక వెళ్ళింది.’’

టీచరు ఇంకా కోమా లోంచి బయటకి రాలేదు..

*****
ఆ మేధావి విద్యార్థి పెరిగి, పెరిగి, పెద్ద లాయర్ అయ్యాడు....

ఒక జడ్జి గారు మన లాయర్ ని అడిగాడు :

"మహాభారతానికి , రామాయణానికి తేడా ఏమిటి?"

మన లాయర్....

"మహాభారతం భూమి తగాదా కేసు,
రామాయణం కిడ్నాప్ కేసు !"

జడ్జి గారు కోమాలోకి వెళ్లిపోయారు.....

> వాట్సప్ షేరింగ్ లో చూసి కామెడీగా ఉందని పోస్ట్ చేసా! ఎవరూ ఏమీ అనుకోమాకండి సుమా!! :)

గురువారం, అక్టోబర్ 11, 2018

యధావిధిగా భగవద్గీత చదువుతూ ఉంటే అసలు అసురులంటే ఎవరు? అనే సందేహం కలిగింది. చిరంజీవిగారు వ్రాసిన సురులు,అసురులు అన్న టపాలో ఆయన దేవతలైన వరుణుడు,ఇంద్రుడు, అగ్ని..ఇలా అనేకమందిని ఋగ్వేదం అసురులుగా పేర్కొనడం వ్రాసుకొచ్చారు.

ఋగ్వేదం 8.42.1. ఈ విధంగా అంటుంది: 

अस्तभ्नाद दयामसुरो विश्ववेदा अमिमीत वरिमाणं पर्थिव्याः |
आसीदद विश्वा भुवनानि सम्राड विश्वेत तानि वरुणस्य वरतानि ||

 "అసురుడైనటువంటి వరుణుడు.. పరలోకము మొదలుకోని.. భూమివరకు.. లోకమును కొలిచాడు.. ఈ క్రమంలో.. అతడు అన్ని జీవులని కలిశాడు." 

ఋగ్వేదం 1.174.1 కూడా ఇంద్రుడు అసురుడనే చెబుతుంది.. ఋగ్వేదం యొక్క అనేక శ్లోకాలు... మిత్ర, వరుణ, సావిత్రి, అగ్నీ, పుషన్ వంటి వేద దేవుళ్ళను అసురులుగా చెబుతున్నాయి.

అయితే పై ఋగ్వేద మంత్రాలను ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉంది. నాకు పరిచయమున్న వేదం పండితులతో చర్చించవలసిన పరిస్థితి అంతకంటే ఎక్కువే ఉంది.

ఇకపోతే భగవద్గీతలో అసుర సంబంధమైన వారి గూర్చి క్రింది విధంగా ఉంది.
మచ్చుకు కొన్ని భగవద్గీత శ్లోకాలు.
తానహం ద్విషత: క్రూరా న్నంసారేషు నరాధమాన్
క్షిపామ్యజస్ర మశుభా నాసురీష్వేవ యోనిషు. {గీత 16:19}

తా:- నన్ను ద్వేషించువారును, క్రూరులును, అశుభ (పాప) కార్యములను జేయువారును నగు అట్టి మనుజాధములను నేను జననమరణరూపములగు ఈ సంసారమార్గములందు అసురసంబంధమైన నీచజన్మలందే యెల్లప్పుడు త్రోసివైచెదను.

ఆసురీం యోనిమాపన్నా మూడా జన్మని జన్మని
మామప్రాప్యైవ కౌన్తేయ! తతో యాన్త్యధమాం గతిమ్. [గీత 16:20]

తా:- ఓ అర్జునా! అసురసంబంధమైన (నీచ) జన్మమును పొందినవారలగు మూడులు ప్రతి జన్మయండును నన్ను పొందకయే, అంతకంటే (తాము పొందిన జన్మ కంటే) నీచతరమైన జన్మమును పొందుచున్నారు.

ఈవిధంగా భగవద్గీత అసురసంబంధమైన గుణములు కలవారందరూ నీచజన్ములు అని క్రూరులని, అశుభ కార్యములు చేయువారని చెప్పడమే కాకుండా 16వ అధ్యాయం 13 -16 శ్లోకాలలో అసురులు యొక్క గుణగణాలను తెలియజేస్తూ "పతన్తి నరకేzశుచౌ" అపవిత్రమైన నరకమందు పడుచున్నారంటూ తెలియజేస్తుంది.

శుక్రవారం, అక్టోబర్ 05, 2018

reading-blogs-diluted

చదువూరించే బ్లాగులు కరువైపోయాయి.

అతి కొద్ది బ్లాగులు తప్ప ఇంట్రస్ట్ కలిగించే బ్లాగులు మాలికలో పెద్దగా కనిపించడం లేదు. పాతతరం వారి బ్లాగులు మళ్ళీ ఉనికిలోకి వస్తే బాగుణ్ణు. ఇంతకు ముందు మంచి,మంచి బ్లాగులు కనిపించేవి. హాస్య బ్లాగులు, కార్టూన్ బ్లాగులు, కథల బ్లాగులు, సాహిత్య,ఆధ్యాత్మిక.., ఇలా ఒకటేమిటి అనేక రకాల బ్లాగులు కలిపించేవి. ఇప్పుడవేవీ కనిపించడమే తగ్గిపోయింది. మాలికలో టపాల పేజీ కంటే "కామెంట్ల"పేజీకే విజిటింగ్ రేటు ఎక్కువనుకుంటా! ఎందుకంటే కొంతమంది అరకొర టపా వ్రాసినా తమతమ బ్లాగుల్లో కామెంట్లు పెట్టుకుని తరించడానికే ఇష్టపడుతున్నారు. నిజానికి వారు పెట్టుకుంటున్న ఆ కామెంట్లు వారు వ్రాసుకున్న టపాలకే సంబంధం ఉండదు. మళ్ళీ తెలుగు బ్లాగుల పూదోట వికసిస్తే బాగుణ్ణు.

 


Recent Posts