Friday, September 28, 2018

గవర్నమెంట్ ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన FUNDAMENTAL RULES

గవర్నమెంట్ ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన  FUNDAMENTAL RULES

Fundamental Rules to be understood by Government employees
# F.R. 12(a)👉1 శాశ్వత పోస్ట్ లోకి ఇద్దరూ, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకే సారి నియమించరాదు.

#F. R. 12(బి)👉ఒక govt employee ని ఒకే సారి 2 లేక అంతకంటే ఎక్కువ పోస్ట్ లలో నియమించరాదు.

# F. R. 12(c)👉ఉద్యోగి లీవ్ లో ఉంటే ఆ పోస్ట్ లో మరొకరిని appoint చేయకూడదు.

#F. R. 15(b)👉 ఉద్యోగి 1 డే కూడా మెడికల్ లీవ్ పెట్టుకోవచ్చు.

#F. R. 18👉govt appoint చేస్తే తప్ప, ఏ employee కి ఒకే సారి 5y కంటే ఎక్కువ సెలవు మంజూరు చేయకూడదు.

#F. R.18(a)👉1y కంటే ఎక్కువ కాలం పర్మిషన్ లేని సెలవు లో ఉంటే, అతను రాజీనామా చేసినట్లు లెక్క.

#F.R.18(బి)👉పర్మిషన్ ఉన్నా /పర్మిషన్ లేకుండా 5y కంటే ఎక్కువ కాలం లీవ్ లో ఉంటే అతను జాబ్ కి రాజీనామా చేసినట్లు లెక్క.

Tuesday, September 18, 2018

కనువిందు చేసే అందమైన పువ్వులు | Beautiful flowers that are eye-catching

కనువిందు చేసే  అందమైన పువ్వులు | Beautiful flowers that are eye-catching

Beautiful flowers that are eye-catching

Beautiful flowers that are eye-catching

Beautiful flowers that are eye-catching

Beautiful flowers that are eye-catching


Beautiful flowers that are eye-catching

Beautiful flowers that are eye-catching

Friday, September 14, 2018

ఆధార్ కార్డు మనల్ని అధః పాతాళానికి దింపేసే సాధనమా? "అభిమన్యుడు" సినిమా చూసిన ప్రతివారికీ అలాగే అనిపిస్తుంది! | Is Aadhar Card Taking Away to Heaven? "Abhimanyudu" feels like everyone who has seen the movie!

Abhimanyudu-Telugu-Movie-ksc-writes
మనం ఎన్నో అవసరాల కోసం ప్రతీసారి ఎన్నో జెరాక్సులు మనకవసరమైన ప్రతి ఆఫీసుకు అందిస్తూనే ఉంటాం. అది పాన్ కార్డైనా, ఆధార్ కార్డయినా, లేక ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా కావచ్చు. అది కాని ఇంటర్ నెట్ దొంగల బారిన పడిందా అంతే సంగతులు. ఇక మన జీవితంలో పూడ్చుకోలేని విధంగా నష్టపోయినట్లే.

ఆధార కార్డ్ మీద ఉన్న మన ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ మీది సంతకం ఉన్న జెరాక్సులు ఆన్ లైన్ దొంగల బారిన పడిందా? ఇక అంతే. ఎవరూ కాపాడలేరు. అది ఎన్ని విధాల మనకు నష్టాన్ని తెచ్చి పెడుతుందో మనమెవరమూ కూడా ఊహించలేవు. బ్యాంక్ అకౌంట్లు సైతం లూటీ అయిపోవడం ఖాయం. ఇది ఎలా సాధ్యం తెలియాలంటే మనం వెంటనే " అభిమన్యుడు" సినిమా చూడాల్సిందే.

"cashless india కోరుకుంటే చివరికి careless india మిగులుతుంది" అన్న డైలాగ్ మనల్ని ఆలోచనలలో పడేస్తుంది. పూర్తీ సందేశం కోసం వెంటనే అభిమన్యుడు సినిమా చూడండి.

Thursday, September 13, 2018

వ్యక్తిత్వ వికాసానికే పెద్ద ప్రతీక "వినాయక విగ్రహం" | The "Vinayaka Statue" is a big symbol of personality development

The "Vinayaka Statue" is a big symbol of personality development

వ్యక్తిత్వ వికాసానికే పెద్ద ప్రతీక "వినాయక విగ్రహం" | The "Vinayaka Statue" is a big symbol of personality development

మన పూర్వీకులు కొన్ని గొప్ప, గొప్ప విషయాలను తాళ పత్రాల ద్వారా చిత్రాల ద్వారా,విగ్రహాల ద్వారా మనకు తెలియజేయడం కోసం పొందుపరచిన ఎన్నో దాఖనాలు ఇప్పటికీ మనముందున్నాయి. వాటిలో ఒక ప్రధానమైనది వినాయకుని విగ్రహం. నిజానికి మన పూర్వీకులు విగ్రహాల ద్వారా విజ్ఞానాన్ని నేర్పాలని చూసారు తప్ప అజ్ఞానాన్ని కాదు. అయితే కాలక్రమేణా అసలు విషయాలు అంతరించి పోయి "విగ్రహాలు పూజలందుకోవడం" ప్రారంభమయ్యాయి తప్ప వాటి ద్వారా మనం నేర్చుకోవాల్చిన జ్ఞానాన్ని మాత్రం మనం వదిలిపెట్టేసాము.

వినాయకుని విగ్రహం - మనకిచ్చే వ్యక్తిత్వ వికాసపు సమాచారం ఏమిటి?

ఏనుగు తల, ఏక దంతం, భారీ బొజ్జ వంటి వాటితో కూడిన వినాయకుని విగ్రహం హిందూ విగ్రహాలలో అన్నిటికంటే ఎక్కువ విమర్శలకు గురవుతుంది. వాస్తవానికి ఆ విగ్రహం అవ్యక్తుడైన దైవంపై విశ్వాసానికి, మానవతా విలువలకు సంకేతం. సాధారణ వాడుక భాషలో తెలివైన వాళ్ళను ఉద్దేశించి వారిది పెద్ద తల అని అనటం మనం వింటుంటాం. అవ్యక్తుడైన దేవుడు అత్యంత జ్ఞానవంతుడు అనే విషయం తెలుపటానికే వినాయకుని విగ్రహానికి భారీ తల పెట్టడం జరిగింది. అంటే వినాయకుని భారీ తల జ్ఞానానికి ప్రతీకన్నమాట.

Friday, September 07, 2018

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గూర్చి కొంత సమాచారం | Some information about Sarvepalli Radhakrishnan

some-information-about-sarvepalli-Radhakrishnan

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గూర్చి కొంత సమాచారం | Some information about Sarvepalli Radhakrishnan

_*✏డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (Dr. Sarvepalli Radhakrishnan) (సెప్టెంబర్ 5 , 1888 – ఏప్రిల్ 17 , 1975 ) భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి కూడా. అంతేకాదు భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో( చైనా , పాకిస్తానులతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.*_

*📚బాల్యం విద్యాభ్యాసం📚*

_*✍సర్వేపల్లి రాధాకృష్ణన్ 5-9-1888న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు.*_

_*📔వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. ఘసర్వేపల్లి బాల్యము మరియు విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి మరియు తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. 1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహము జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు.*_

*🖍ఉద్యోగం🖍*

_*⛱21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం అతనిని ప్రొఫెసర్ గా నియమించింది.*_⛱

_*🎤ఆయన ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్లు కోరారు. దాంతో ఆయన కలకత్తా వెళ్ళాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన 'భారతీయ తత్వశాస్త్రం' అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది. 1931లో డా. సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్గారి పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు.*_

_*📔✍1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'" సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు.*_

_*📚1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగష్టు 14-15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.
1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్.
డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.*_

_*📘1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతి అయిన తరువాత కొందరు శిష్యులు మరియు మిత్రులు, పుట్టిన రోజు జరపటానికి అతనివద్దకు వచ్చినప్పుడు, "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను", అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను చాటారు.*_

_*✍🎤అప్పటినుండి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.*_

_*⛱🙏ఈయన పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించారు. అతని దృష్టిలో తత్వము అనేది జీవితాన్ని అర్ధంచేసుకోవటానికి ఒక మార్గము, భారతీయ తత్వమును అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించేవారు. భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో వివేకము, తర్కము ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ తాత్వికచింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు.*_

*⛱జీవిత విశేషాలు⛱*

_*🌸రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5న చెన్నై దగ్గరి తిరుత్తణి అనే వూరిలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. వీళ్లది చాలాపేద కుటుంబం. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారిగా చేయమన్నారు. కానీ రాధాకృష్ణన్కు చదువంటే ప్రాణం. అందుకే ఉన్నత పాఠశాల చదువుకోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరారు. ఇక అప్పటినుంచీ ఈయన చదువంతా ఉపకారవేతనాలతోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని పరిస్థితుల్లో ఆయన నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎమ్మే పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరారు. ఆయన పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. ఆయన రోజులో 12 గంటలపాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవారు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కోల్కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పదవులు చేపట్టడమే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి (వైస్ఛాన్స్లర్) గా పనిచేశారు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు.

ఆయన రాసిన 'ఇండియన్ ఫిలాసఫీ' పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్'లో సభ్యుడిగా ఉండి మన విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు రాధాకృష్ణన్*_

_*✍1952లో మన మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టారు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. అయినా ఏనాడూ ఆడంబరాలకు పోలేదు.*_

_*🌺రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగిచ్చేవారు.*_

_*రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. ఆయన మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి తమ గురువును కూర్చోబెట్టి రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట.*_

_*🌹రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని ఆయన కోరారట. ఆరోజు నుంచే ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.*_

📘🖍📔✏📕✒📚🖍📗✏📔🖍📕🖍📘📚📗
Related Posts Plugin for WordPress, Blogger...