శుక్రవారం, జులై 20, 2018

ఇప్పుడున్న క్రైస్తవ మత వర్గానికి యేసుకు,ఆయనగారి యొక్క శిష్యులకు ఏవిధమైన సంబంధమే లేదు. యేసు బ్రతికియున్న రోజులలో క్రైస్తవమతం అనే మాటే లేదు. ఆయన లేని సమయంలో కూడా శిష్యులు ప్రజల చేత ఏనాడు క్రైస్తవులని పిలువబడలేదు. సౌలు అనే ఒక యూదుడు పౌలు అనే పేరుతో యేసు యొక్క అసలు బోధనలను తారుమారు చేసి క్రైస్తవ్యం అనే బిరుదుతో ఒక కొత్తమతాన్ని పరిచయం చేసాడు. ఇప్పుడు మన చూస్తున్న "క్రైస్తవ్యం" అదే. క్రైస్తవులు అని పిలువబడుతున్న వీరందరూ నిజానికి "పౌలీయులు" (పౌలు అనుచరులు అని పిలవాలి). ఈ విషయం బైబిల్ ను బాగా పరిశీలించి చదివేవారికి ఇట్టే తెలిసిపోతుంది. ఈ విషయాలు మరింత విపులంగా అందించే ప్రయత్నం త్వరలో చేస్తాను. సమాజంలో ఉన్న సంస్కృతీ, సంప్రదాయాలను సర్వనాశనం చేయడానికి, ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి యూదులు ప్రయోగిస్తున్న ఒక అస్త్రం "క్రైస్తవ్యం".

బైబిల్ కు సంబంధించిన కొన్ని పరిశీలనాత్మకమైన ఆర్టికల్స్ ఇక్కడ క్లిక్ చేసి చదవవచ్చు.

4 కామెంట్‌లు:

  1. ఇజ్రాయెల్ దేశంలో మౌలిక చట్టం మార్పుల గురించి మీ విశ్లేషణ ఏమిటి?

    https://www.bbc.com/news/world-middle-east-44881554

    రిప్లయితొలగించండి


  2. ఆహా యేమి విన్నాణం!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. @author
    సమాజంలో ఉన్న సంస్కృతీ, సంప్రదాయాలను సర్వనాశనం చేయడానికి, ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి యూదులు ప్రయోగిస్తున్న ఒక అస్త్రం "క్రైస్తవ్యం".

    hari.S.babu
    ఇది యెట్లా సాధ్యం?

    యూదులకి అప్పటికే తోరా గ్రంధమూ ఉంది, వూవస్థీకృతమైన ఆచరణ మార్గం ఉంది,చెప్పుకోదగిన పాప్యులారిటీ కూడా ఉంది.వ్యాపించాలనుకుంటే ఆ రూపంలోనే వ్యాపించవచ్చును గదా - నీ ముక్కేదిరా అంటే తల వెనక నుంచి చెయ్యి తిప్పి చూపించినట్టు ఒక కొత్త మతాన్ని పుట్టించి ఆ కొత్త మతంతో పాత మతాన్ని చంపేసుకుని కొత్త రూపంలో వ్యాపించాలని మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడూ చెయ్యడు!

    మీరు తొలినాటి క్రైస్తవం గురిచి చెప్పినది సగమే నిజం.జీసస్ అనే మూలస్తంభాన్ని చారిత్రక వ్యక్తిగా తీసుకుంటే అతను మతస్థాపన చెయ్యడం గురించి అసలు ఆలోచించలేదు. వైదిక సంస్కృతితో చాలా దూరపు సంబంధం ఉన్న రోమన్ల మీద రాజకీయమైన తిరుగుబాటు చేసి యూదులకు స్వతంత్ర రాజ్యాన్ని సాధించి పెట్టడమూ పనిలో పనిగా తను యూదులకు రాజు కావడమూ మాత్రమే అతని లక్ష్యం!అందుకే యేసు స్వయంగా చేసే విజ్ఞాపనలన్నీ యూదులను ఉద్దేశించి చెప్పినట్టు ఉంటాయి.అయితే ఇప్పటి క్రైస్తవానికి మంచి వూపు తీసుకొచ్చిన కాన్స్టాంటిన్ మహాశయుడికి యూదుల మీద ద్వేషం ఉంది.దానికి తోడు అప్పుడు అతని చుట్టూ ఉన్న పురోహిత వర్గం అతని మీద పెత్తనం చెయ్యాలని చూస్తున్నారు. దాంతో అతను ఈ కొత్త మతస్థులని పిల్చి రూపం మార్చుకుంటే ప్రాభవం వస్తుందనీ అప్పుడున్న రూపంలో ఉంటే క్రమేణా కనుమరుగచుతుందనీ చెప్పి ఒప్పించి సలహాలు ఇచ్చి ప్రోత్సహించాడు. అతని ఈ ఒక్క దెబ్బకి రెండు పిట్టల ప్లానులో యూదుల కోసం రాజ్యం అనేది పోయి యూదులకి వ్యతిరేకం అయ్యింది.

    మీరు చరిత్ర విషయంలో ఎక్కువ పరిశోధన చెయ్యాలి.లేదంటే ఇలాంటి తంటాలే వస్తాయి.మీ సూత్రీకరణ యూదులే ప్రపంచం అంతట్నీ కబళించడానికి క్రైస్తవాన్ని తయారు చేసినట్టు ఉంది.కానీ ఈ సూత్రీకరణ ప్రకారం యూదులు తాము కనిపెట్టిన కొత్త మతం ద్వారా పాత మతాన్ని యెందుకు ధ్వంసం చేసుకుంటారనే ప్రశ్నకి జవాబు చెప్పడం కుదరదు, అవునా?

    రిప్లయితొలగించండి

 


Popular Posts

Recent Posts