Wednesday, April 25, 2018

పరమ నీచులారా...ఆడపిల్లలను బ్రతకనివ్వరా?

రాత్రి సరదాగా Youtube చూద్దామని ఓపెన్ చేస్తే క్రింది వీడియో కనిపించింది. మనస్సంతా ఆవేదనతో నిండిపోయింది.

ఏమిటీ దారుణాలు? ఇక ఆడపిల్లలను బ్రతకనియ్యరా? అసలు ఇటువంటివారిని ఏమి చేయాలి?
నిర్భయ,ఆసిఫా... ఇలా ఎంతోమంది అమ్మాలు బలి కావాల్సిందేనా? మన చట్టాలు ఎందుకూ పనికిరావా? ఒకవేళ నేరస్తులు దొరికినా ఎందుకంత కాలయాపన? ఒక ఆడపిల్ల ధైర్యం చేసి తనపై అత్యాచారం జరిగిందని కేసు పెడితే శిక్ష విధించడానికి రెండు,మూడు సంవత్సరాల సమయమా? అప్పటివరకూ భాధితులు తనకు న్యాయం జరుగుతుందా, లేదా అని ఎదురుచూడాల్సిందేనా? తీర్పు వెలివడే వరకూ నేరస్తులకు బయపడి బిక్కు,బిక్కుమంటూ బ్రతకాల్సిందేనా? ఇలా అయితే మనకీ చట్టాలూ,కోర్టులూ ఎందుకు?

మనపై ఏదైనా జంతువు దాడి చేస్తే మనం రక్షించుకోవడానికి దానిని చంపుతాం. ఒకవేళ వీలు కాకపొతే మనచుట్టూ నలుగురు సమయానికి వస్తే ఆ మృగాన్ని చంపుతారు.

ఈ రేపిస్టు వెధవలు అడవి మృగాలకంటే క్రూరమైన వాళ్ళు. వీళ్ళనసలు ఉపేక్షించకూడదు. వీళ్ళు ఒకవేళ అటువంటి దారుణాలు ఒడిగట్టి ప్రజల చేతికి చిక్కితే చావగొట్టి పోలీసులకి అప్పగించే బదులు చంపేసి అప్పగిస్తే బాగుంటుంది. ఈవిధంగానైనా భారతమాత సంతోషిస్తుంది. ఈవిధంగా చట్టాలను రూపొందించాలి. ఎందుకంటే వీళ్లలో కొంతమందికి చీమూ,నెత్తురు,సిగ్గూ,శరం లేని కొంతమంది సన్నాసి వెధవలు పెద్దమనుషుల ముసుగులో కూర్చుని భక్షిస్తూ ఉన్నారు. ఈ రేపిస్ట్ మృగాలను కాపాడుతూ ఉంటారు. నిజానికి అత్యాచారం కేసులు ఎక్కువుగానే ఏమీ తేలకుండా కాలగర్భంలో కల్సిపోతూనే ఉన్నాయి.

ఇటువంటి పరిస్థితులు కూడా ఉన్నప్పుడు ఈ మృగాలకు అడ్డుకట్ట ఎలా వేయగలం?
నిజానికి చట్టాలంటే భయం లేకుండా చేసేది కూడా రాజకీయ నాయకులే. ఇక ఈ చట్టాలు ప్రజాప్రతినిధులకే లెక్క లేనప్పుడు ఇక ఈ రేపిస్ట్ మృగాలు ఎలా భయపడతాయి?

ఎక్కడి దొరికిన మృగాన్ని అక్కడ చంపేయడమే సమాజానికి మేలు.మన ఆడపిల్లలకు బ్రతుకు. దీనికి మీరేమంటారు?

Monday, April 23, 2018

Ramakrishna Veeramachaneni after Mantena Satyanarayana Raju | మంతెన సత్యనారాయణ రాజు తరువాత వీరమాచనేని రామకృష్ణ.

Ramakrishna Veeramachaneni after Mantena Satyanarayana Raju
వీరమాచనేని రామకృష్ణ గారి షుగర్ ఇతరత్ర వ్యాధుల యొక్క వైద్యం గురించి ఈమధ్య మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. కొందరు సూపరంటే కొందరు డేంజర్ అంటున్నారు. ఇలా ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వారు ప్రయోజనం కలిగిందని అంటుంటే.. అస్సలు ఆ సలహాలే తీసుకోనివారు వీరమాచనేని వైద్య సలహాలు చాలా ప్రమాదకరమని గట్టిగా వాదిస్తున్నారు. ఆఖరికి వీరమాచనేనిని సమర్ధించిన వారిపై కూడా కొంతమంది తమతమ బ్లాగుల్లో తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు.

నిజానికి ఎందులో ప్రమాదం లేదు. మనం తినే పుడ్ లోనే ఎన్నో కల్తీలు జరిగిపోతున్నాయి. దాని కారణంగా మనలో ప్రతి ఒక్కరూ ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురుకోవడంతోటే సరిపోతుంది. ఈ మందు కాకపొతే మరో మందు. దాని వలన నయం కాకపొతే మరో కొత్త మందు. ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేదం మందులు, అల్లోపతి,హోమియోపతి, యునాని ఇలా మనిషి వాడుతూనే ఉన్నాడు. దేని వలన తనకి ఉపయోగం కలిగిందో అదే నిజమని నమ్ముతున్నాడు. వీరమాచినేని ఆరోగ్య సూత్రాలు కూడా ఇటువంటివే. నమ్మకం ఉన్న వాడు నమ్ముతూనే ఉంటాడు. దీని మాత్రం చేత భవిష్యత్ లో ఇలా అయ్యిపోతుంది, అలా అయ్యిపోతుందని వాపోడం అనవసరం. నిజానికి మనం తినే తిండి, మనం మింగే మందులూ అన్నీ హానికరమే.

కొన్నాళ్ళ క్రితం మంతెన సత్యనారాయణ రాజు గారు కూడా ఆహార నియమాలు చెప్పేవారు. ఆయనగారి మాటలకు ఎంతోమంది ప్రభావితం అవడమే కాదు, ఆయన చెప్పిన ఆహార నియమాలు కూడా తు.చ. తప్పకుండా పాటించేవారు కూడా. అప్పట్లో కూడా ఆయన ఆహార నియమాలు గిట్టని వారు మంతెన సత్యనారాయణ రాజు  మనుషులను పశువుల మాదిరిగా మార్చేస్తున్నాడని అతి తీవ్రంగా విమర్శించే వారు కూడా. తరువాత కాలంలో ఆయన మాయమయ్యిపోయారు. ఆయనకు ఏం జరిగిందో నాకర్ధం కాలేదు.

అయినా వీధి,వీధికి ఒకొక్క మద్యం దుకాణం వెలసి ఏదో కోణంలో అందరి ఆరోగ్యాన్ని అంతమొందిస్తున్న ఈరోజుల్లో "మంతెన సత్యనారాయణ రాజు, వీరమాచనేని రామకృష్ణగారి లాంటివాళ్లు ఎంతమంది వస్తే ఉపయోగమేముంటుంది చెప్పండి?

Friday, April 13, 2018

శక్తి యొక్క 48 సూత్రాలు.

కొందరు అధికారంతో,శక్తితో ఆడుకుంటారు.ప్రాణాంతకమైన ఒక పొరపాటువల్ల తమ శక్తి మొత్తం పోగొట్టు కుంటారు.కొందరు అవసరమైనదానికన్నా ముందుకి వెళ్లిపోతే,మరికొందరు అవసర మైనంత మేరకి కూడాముందుకు పోలేరు. కానీ అతి తక్కువమంది సరైన పనులు చేసి,ఎంతో తెలివిగా శక్తిమంతులవుతారు.
శక్తి యొక్క 48 సూత్రాలు ఆధునికయుగంలో జిత్తులని ఉపయోగించి స్వార్ధప్రయోజనాలని సాధించటానికి పనికి వచ్చే మార్గదర్శి.మీరు ఇంతవరకు కొన్న పుస్తకాలన్నిటిలోకి ఇదే ఎంతో ఆసక్తికరమైనదీ,ఉపయోగకరమైనదీ కావచ్చు.
ఈ పుస్తకాన్ని రాబర్ట్ గ్రీన్ [లాస్ ఏంజిల్] గారు రచించారు.తెలుగులోకి ఆర్.శాంతసుందరి గారు తర్జుమా చేసారు.ముఖ్యముగా ఈ పుస్తకం మనిషి జీవితంలో నెగ్గుకు రావాలంటే ఏమి చేయాలి? శిఖరంపైకి ఎలా చేరుకోవాలి? అక్కడే ఎలా ఉండాలి? వంటి ఎన్నో ప్రశ్నలకు 48సూత్రాలతో ఎంతో విడమర్చి చెప్పడం జరిగింది.నేను కేవలం 48సూత్రాలు అందిస్తాను.వాటిని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలంటే మీరు ఆ పుస్తకాన్ని చదవాల్సిందే.
ప్రతి సూత్రాన్ని 1.వివేకం, 2.శక్తిని పొందే కీలకం, 3.చిత్రం [ఉదాహరణ] అనే మూడు విధాలుగా ఒకొక్క సూత్రాన్ని వర్ణించిన తీరు అద్భుతంగా వుంది.
శక్తి యొక్క 48 సూత్రాలు 
1.బాస్ ని మించినట్టు ప్రవర్తంచవద్దు
2.మిత్రులని అతిగా నమ్మవద్దు,శత్రువులని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి
3.మీ ఉద్దేశాలని దాచిపెట్టండి
4.అవసరమైన దానికన్నా తక్కువే మాట్లాడండి
5.పేరు ప్రతిష్ఠలు మీదే ఎంతో ఆధారపడి ఉంది-ప్రాణ సమానంగా కాపాడుకోండి
6.ఏది ఏమైనా సరే అందరి దృష్టిని ఆకట్టుకోండి
7.మీ పని ఇంకొకరి చేత చేయించండి,కాని పేరు ఎప్పుడూ మీకే దక్కేట్టు చూసుకోండి
8.ఇతరులని మీ దగ్గరకి రప్పించుకోండి-అవసరమైతే ఎరని ఉపయోగించండి
9.వాదనతో కాదు,మీ చేతలతోనే గెలవండి
10.అంటువ్యాధి : దురదృష్టవంతులకి దూరంగా ఉండండి.
11.ఇతరులు మీమీద ఆధారపడేలా ఎలా చేయాలో నేర్చుకోండి
12.నిజాయితీని,ఉదారతను జాగ్రత్తగా ఎంచుకోండి
13.సహాయం కోరేటప్పుడు,అవతలివారి దయనీ,కృతజ్ఞతనీ ఆశించవద్దు.
14.స్నేహితుడిలా నటించండి,గూఢచారిలా పని కానివ్వండి.
15.మీ శత్రువుని పూర్తిగా అణచివెయ్యండి
16.గౌరవాన్ని సంపాదించేందుకు అంటీముట్టనట్టుగా ఉండండి
17.అవతలివారిని ఉత్కంఠకు గురిచేయండి.ముందుగా ఊహించటానికి వీలులేని వాతావరణాన్ని సృష్టించండి.
18.ఆత్మరక్షణకోసం కోటలు కట్టుకోకండి-ఏకాంతవాసం ప్రమాదకరమైంది.
19.మీరు ఎవరితో వ్యవహరిస్తున్నారో తెలుసుకోండి-పొరపాటున తప్పుచేయని వ్యక్తికి కోపం తెప్పించకండి.
20.ఎవరికీ నిబద్ధుడై ఉండొద్దు.
21.మూర్ఖుడిగా కనిపించటంకోసం,మూర్ఖుడిలా ప్రవర్తించండి-మీ ముందున్నవ్యక్తికన్నా అమాయకుడిలా నటించండి.
22.లొంగిపోవడం అనే యుక్తిని ఉపయోగించండి:బలహీనతను శక్తిగా మార్చుకోండి.
23.మీ శక్తులన్నీ ఒకచోట కేంద్రీకరించండి.
24.పరిపూర్ణుడైన ఆస్థానికుడి పాత్ర నిర్వహించండి.
25.మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకోండి.
26.మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి.
27.మిమ్మల్ని ఆరాధించే అనుచరుల బృదాన్ని తయారుచేసుకునేందుకు వాళ్ల నమ్మకాన్ని సంపాదించండి.
28.ధైర్యంగా పనిలో ప్రవేశించండి.
29.చివరిదాకా పూర్తి ప్రణాళికని వేసుకోండి.
30.మీ విజయాలు సులభంగా సాధించినవన్నట్టు కనిపించనీయకండి.
31.ఇతరుల నిర్ణయాలని నియంత్రించండి. మీరు పంచే పేకముక్కలలో ఇతరులు ఆడేటట్టు చూడండి.
32.అందరూ కనే పగటికలలని సమర్ధించండి.
33.ప్రతి వ్యక్తిలోనూ ఉండే బలహీనమైన అన్శాన్ని గుర్తించండి.
34.మీ పద్ధతిలో మీరు రారాజులా ఉండండి. రాజులాగౌరవం పొందాలనుకుంటే,రాజులా పని చెయ్యండి.
35.సరైన సమయం ఎంచుకునే కళలో నిష్ణాతులు కండి.
36.మీరు పొందలేని వాటిని తిరస్కరించండి. వాటిని అలక్ష్యం చెయ్యడమే అన్నిటికన్నా ఉత్తమమైన ప్రతీకారం.
37.ఆకట్టుకునే అద్భుత దృశ్యాలని సృష్టించండి.
38.మీకిష్టం వచ్చినట్టు ఆలోచించండి,కానీ అందరిలా ప్రవర్తించండి
39.చేపల్ని పట్టేందుకు నీళ్లని కదపండి
40.ఉచితంగా లభించేవాటిని తిరస్కరించండి
41.గొప్ప వ్యక్తిని అనుకరించటం మానండి.
42.గొర్రెల కాపరి మీద దాడి చేస్తే గొర్రెలు చెదిరిపోతాయి.
43.ఇతరుల హృదయాలనీ,మనసులనీ జయించండి.
44.అద్దం చూపించి సమ్మోహితులనీ,కోపోద్రక్తులనీ చెయ్యండి
45.మార్పు అవసరమని ఉపదేశించండి,కాని ఒక్కసారిగా మరీ ఎక్కువ సంస్కరించకండి.
46.మరీ నిర్దుష్టంగా ఉన్నట్టు కనబడకండి.
47.లక్ష్యాన్ని దాటి వెళ్లకండి,గెలిచిన తరవాత ఎక్కడ ఆగాలో తెలుసుకోండి.
48.నిరాకారులుగా తయారవకండి.
***********
అవసరమైన దానికన్నా తక్కువే మాట్లాడండి.ఈ పుస్తకం నేటి ప్రంపంచంలో ప్రగతి సాధించటానికి,ముందుకు దూసుకుపోవటానికి అవసరమయ్యే వంచన,నటన,పోరాట పటిమను మీకు నేర్పుతుంది.-ఇండిపెండెంట్ ఆన్ సన్ డే
Manjul Publishing House
  www.manjulindia.com 
Related Posts Plugin for WordPress, Blogger...