శనివారం, జులై 08, 2017

Do-not-overdo-your-friends-Learn-how-to-use-enemies.
స్నేహాన్ని మించిన బంధం మరొకటి లేదని చెప్తారు. అది ఒకప్పటి మాట అయ్యుండవచ్చు. ఈరోజుల్లో స్నేహానికి విలువ లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కువుగా స్నేహితులే నమ్మకద్రోహానికి తలపడతారు. వాళ్ళు మన దగ్గర చనువు ఎక్కువ తీసుకుని మనని భాధ పెట్టడానికి కూడా వెనుకాడరు. మన వలన లాభం కలిగినప్పుడు ఒకలాగా, నష్టం కలిగినప్పుడు ఒకలాగా రియాక్ట్ అవుతూ ఉంటారు. పరిస్థితులను ఏమాత్రం అర్ధం చేసుకునే ప్రయత్నం చేయరు. అప్ కోర్స్ కొంతమంది మంచి స్నేహితులు ఉండవచ్చేమో గాని వెతికితే దొరకడం కష్టమే!

అదే మీరు మీ శత్రువుని ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకోండి. ఇక అతను మిమ్మల్ని నమ్మినట్టు మీ మిత్రుడు కూడా నమ్మడు. నిజానికి మనం శత్రువులకన్నా మిత్రులని చూసే ఎక్కువ జాగ్రత్త పడాలి. అతన్ని ఎంతవరకూ ఉంచుకోవాలో అంతవరకే. మీ ప్రతి వ్యవహారం అతని దగ్గర పెడితే ఎదో ఒకరోజు మీతో చిన్న సమస్య వచ్చినప్పుడు అతను వాటినన్నిటిని ఎత్తి చూపించి నిన్ను చులకన చేసి మాట్లాడుతాడు. కాబట్టి మిత్రుల పట్ల జాగ్రత్త అవసరం. శత్రువు ఎక్కడో పది ఉన్న పాము లాంటోడు అయితే మిత్రుడు పక్కలో ఉన్న బల్లెం లాంటోడు.
చిన్న గమనిక ఏమిటంటే నిజమైన మిత్రులుంటే వారికి సర్వధా హృదయ నమష్కారాలు.
Do not overdo your friends. Learn how to use enemies.

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts