శనివారం, జులై 29, 2017

నిన్న ఒక ఆధ్యాత్మిక సెలబ్రిటీని కలిసాను.ఎందుకో తెలీదు గాని ఆయనతో మాటలాడినప్పుడల్లా నాకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.లైఫ్ లో ఏదో సాధించాలన్న కసి పుడుతుంది.అంతగా ఆయన మాటలు నాకు ప్రేరణ కలిగిస్తాయి.మనకంటే గొప్పవారితోనే మన సంబంధాలు పెట్టుకోవాలి.లేదా మన రంగానికి సంబధించినవారితో నన్న కలిసి ఉంటే ప్రయోజనం ఉంటుంది.ఎదుటివారి గురించి చాడీలు చెప్పేవారి దగ్గర,ఎగతాళిగా మాటలాడేవారి దగ్గర అస్సలు కూర్చోకూడదు.మన సమయం వృధాతో పాటు,మానసికంగా అప్సెట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

   కొంతమంది మేధావులుంటారు.వీళ్లు తమ విషయాలేమీ తెలియనీయకుండా జాగ్రత్త పడుతూ...ఎదుటి వారి అన్ని విషయాలు కూపీలాగి మరీ తెలుసుకుంటారు.ఏదైనా ఇష్టంలేని పరిస్థితి వస్తే ఆ విషయాలన్నీ బైట పెడుతూ ఎంతో నష్టానికి గురి చేస్తారు.వీళ్లు మహా ప్రమాదకరమైన వ్యక్తులు.వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.


   ఏది,ఏమైనా మన సక్సెస్ పై ప్రభావం మన కలిగియున్న వ్యక్తులను బట్టి కూడా ఉంటుంది. జాగ్రత్త వహిస్తే మనకే మంచిది.ఏమంటారు?

శనివారం, జులై 15, 2017

Do-not-let-others-know-your-intentions-Hide-them.
సహజంగా మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దానిని ఇతరుల ముందు ఆరబోస్తూ ఉంటాం. నిజానికి ఇది చాలా అజ్ఞానపూర్వకమైన పనని నా అభిప్రాయం. ఎoదుకంటే మన పని కార్యరూపం దాల్చకుండానే  బయట పెడితే అది పూర్తవ్వడానికి చాలా టైం పడుతుంది. లేదా అది పూర్తవ్వకుండా మనమే అడ్డంకులను ఏర్పాటు చేసుకున్న వాళ్ళమవుతాము. కాబట్టి మన పని యొక్క ఉద్దేశాలను బయట పెట్టకండి. మీరు చేసే పనుల ప్రయోజనాలని ఇతరుల ముందు బయట పెట్టకుండా జనాన్ని అంధకారంలో ఉంచి కంగారు పెట్టండి. మీరేం చేయ్యబోతున్నారో ఏమాత్రం గ్రహించలేనప్పుడు వాళ్లు మిమ్మల్ని ఏం చేయడానికి సిద్ధంగా ఉండలేరు. వాళ్లు మీ ఉద్దేశాలని గ్రహించే సమయం వచ్చేటప్పటికి మీరు మీ లక్ష్యాన్ని సాధించేసి ఉంటారు. అప్పుడు మీ ఉద్దేశం ఎంత గ్రహించగలిగినా వాళ్లకి ఏవిధంగానూ ఉపయోగమూ ఉండదు. మీకు నష్టమూ ఉండదు. శుభం.
Do not let others know your intentions. Hide them.
Andhra,Telangana Teachers Notifications,10th,Inter,Degree,all Groups Model Papers and Question Papers, All Govt Jobs Notifications, latest job news...More. Please Visit the Teacherguide.in

శనివారం, జులై 08, 2017

Do-not-overdo-your-friends-Learn-how-to-use-enemies.
స్నేహాన్ని మించిన బంధం మరొకటి లేదని చెప్తారు. అది ఒకప్పటి మాట అయ్యుండవచ్చు. ఈరోజుల్లో స్నేహానికి విలువ లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కువుగా స్నేహితులే నమ్మకద్రోహానికి తలపడతారు. వాళ్ళు మన దగ్గర చనువు ఎక్కువ తీసుకుని మనని భాధ పెట్టడానికి కూడా వెనుకాడరు. మన వలన లాభం కలిగినప్పుడు ఒకలాగా, నష్టం కలిగినప్పుడు ఒకలాగా రియాక్ట్ అవుతూ ఉంటారు. పరిస్థితులను ఏమాత్రం అర్ధం చేసుకునే ప్రయత్నం చేయరు. అప్ కోర్స్ కొంతమంది మంచి స్నేహితులు ఉండవచ్చేమో గాని వెతికితే దొరకడం కష్టమే!

అదే మీరు మీ శత్రువుని ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకోండి. ఇక అతను మిమ్మల్ని నమ్మినట్టు మీ మిత్రుడు కూడా నమ్మడు. నిజానికి మనం శత్రువులకన్నా మిత్రులని చూసే ఎక్కువ జాగ్రత్త పడాలి. అతన్ని ఎంతవరకూ ఉంచుకోవాలో అంతవరకే. మీ ప్రతి వ్యవహారం అతని దగ్గర పెడితే ఎదో ఒకరోజు మీతో చిన్న సమస్య వచ్చినప్పుడు అతను వాటినన్నిటిని ఎత్తి చూపించి నిన్ను చులకన చేసి మాట్లాడుతాడు. కాబట్టి మిత్రుల పట్ల జాగ్రత్త అవసరం. శత్రువు ఎక్కడో పది ఉన్న పాము లాంటోడు అయితే మిత్రుడు పక్కలో ఉన్న బల్లెం లాంటోడు.
చిన్న గమనిక ఏమిటంటే నిజమైన మిత్రులుంటే వారికి సర్వధా హృదయ నమష్కారాలు.
Do not overdo your friends. Learn how to use enemies.
IIT Bombay Recruitment-2017
హాయ్ ప్రెండ్స్ IIT Bombay Recruitment ద్వారా Junior Mechanic, Jr. Technician, Jr. Laboratory Assistant Govt Jobs కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మీరు గాని, మీ బంధువులలో ఎవరైనా అర్హత ఉన్నవారు గాని అప్లయ్ చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు 17 ఉన్నాయి. అందులో 1.Junior Mechanic: 08 posts, 2.Junior Laboratory Assistant: 03 posts, 3.Junior Technician: 02 posts, 4.Assistant Security Inspector: 04 posts ఉన్నాయి.

ప్రతి పోస్టుకు క్రింది విధంగా Qualifications Required ఉండాలి.
Jr. Mechanic: Diploma in Electrical/ Electrical & Electronics Engineering discipline (03 years) with 2 years relevant experience or ITI in Power Electric Systems trade/ Electronics Mechanic Trade with 5 years relevant experience or Bachelor’s degree in Electrical/ Electrical & Electronics Engineering. Jr Laboratory Assistant: Diploma/ Bachelor’s Degree in Civil/ Mechanical Engineering Discipline or ITI in Machinist trade

 


Recent Posts