గురువారం, డిసెంబర్ 28, 2017

హీరోయిన్ ప్రత్యూష గూర్చి ఆ తల్లి పడుతున్న బాధ చూస్తుంటే మనసు చలించిపోతుంది.

గురువారం, డిసెంబర్ 14, 2017

ప్రజలు కావాలని మెజార్టీతో నెగ్గించుకున్న నరేంద్రమోడి ఆ ప్రజల నడ్డే విరిచే పనిలో పడ్డాడు. నిన్నటికి మొన్న GST బిల్లు పెట్టి అందరినీ వీరబాదుడు బాదుతున్నాడు. EX: నా నెట్ బిల్లు నెలకి 570 రూ// ఉండేది. GST వచ్చిన తరువాత 590రూ// అయ్యింది. అంటే వ్యాపారస్తులకు వచ్చే లోటు,నష్టం,కష్టం ఏమీ లేదు. ఎక్స్ ట్రా బాదుడంతా కస్టమర్లకే.

ఇప్పుడు కొత్తగా మన మోడీ సార్ మరొక వాయింపు బిల్లు తేనున్నారు. అదేమింటంటే ఎవరైనా పెద్ద, పెద్ద కంపెనీ వాళ్ళు బ్యాంకులలో అప్పులు చేసి హుష్ కాకి అనిపిస్తే మన బ్యాంక్ వాళ్ళు ఆ నష్టాన్ని మనం దాచుకున్న డిపాజిట్లతో పూడ్చుకోవచ్చట. ఈ చట్టం త్వరలో ఆమోదం పొందనున్నదట. మరిన్ని వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి.

శనివారం, నవంబర్ 25, 2017

Hindu-terrorism-will-all-Hindus-become-terrorists-Is-this-the-right-to-arrest-Kamal-Haasan
నిజానికి నేటి మన భారతదేశంలో పరిస్థితులు కమల్ హాసన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఏం లేవు. ఎక్కడ చూసినా కులాల గొడవ,మతాల గొడవలతోనే నిండిపోతుంది. సమాజాన్ని శాంతివంతంగా తీర్చిదిద్దాల్చిన కొంతమంది స్వామీజీలు సైతం కులమతాలను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా పశువుల గొడవే.హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో ఎక్కడబడితే అక్కడ సంస్థలు నెలకొలిపి, ప్రతి ముఖ్యమైన పట్టణాలలోనూ, సిటీలలోనూ వాటి బ్రాంచులు స్థాపించి ఇతరమత నిర్మూలనకై దౌర్జన్యాలు చేస్తున్నారు. కొట్లాటలు ప్రారంభిస్తున్నారు. ఇది ఎంతవరకూ సమంజసం? దేశ సంస్కృతిని, జాతులను ధ్వంసం చేస్తున్నా, బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నా హిందూ పరిరక్షకులు స్పందించడంలో తప్పు లేదు గాని వాటి పేరు చెప్పి హింసాత్మకం సృష్టించడం మాత్రం ఉగ్రవాదం క్రిందికే వస్తుందని నా అభిప్రాయం. చట్టాలు,కోర్టులు ఎందుకున్నట్టు? భారతదేశపు బలమైన పోలీస్ వ్యవస్థ ఎందుకున్నట్టు? దేశ సంస్కృతిని, జాతులను ధ్వంసం చేసేవారిని (వీరు కూడా ఉగ్రవాదులే) వీరి దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దాలని ప్రయత్నించాలి తప్ప హింసాత్మకం చేయడం ఏవిధంగా న్యాయమవుతుంది? ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కమల్ హాసన్ "హిందూ ఉగ్రవాదం" అంటూ వ్యాఖ్యానించాడు. కాని కొత్త పార్టీలు పురుడు పోసుకుంటే జీర్ణించుకోలేని పాత (పాతుకుపోయిన)పార్టీలు కమల్ పార్టీని అడ్డుకోవడానికే ఆయనపై కుట్ర పన్నడం హాస్యాస్పదమేమీ కాదు.

ఈరోజు కమలహాసన్ గూర్చి అంతర్జాలంలో వచ్చిన ఒక వార్త యధాతధంగా ఇస్తున్నాను.

మామూలుగానే కొన్ని సంఘటన్ల మీద తనదంటూ ఒక అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పే కమల్ రాజకీయాల్లోకి వస్తున్నానంటూ నిర్ణయం ప్రకటించిన దగ్గరినుంచీ సామాజికాంసాలమీద స్పందించటం ఎక్కువ చేసాడు. నిజానికి కమల్ చేసిన వ్యాఖ్యలను ఎక్కువమందే సమర్థించారుకూడా. ఈ వ్యాఖ్య‌ల‌తో క‌మ‌ల్‌కు ఒక్క త‌మిళ‌నాడులోనే కాకుండా దేశ‌వ్యాప్తంగానూ మంచి మద్దతు లభించింది.

అయితే ఆ వ్యాఖ్యల వల్లే కమల్ ఇప్పుడు చిన్న చిక్కులో ఇరుక్కున్నాడు. . క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌లకు సంబంధించి కేసులు న‌మోదు చేసి విచార‌ణ చేపట్టాల‌ని ఏకంగా మ‌ద్రాస్ హైకోర్టు చెన్నై పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాజకీయాల్లోకి దిగిపోయానంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌. త‌న పార్టీ పేరును ప్ర‌క‌టించ‌క‌ముందే కేసులో ఇరుక్కున్న‌ట్టైంద‌న్న అభిప్రాయం వినిపిస్తోంది.

అయినా క‌మ‌ల్ చాలా వ్యాఖ్య‌లే చేశారు క‌దా. ఆ వ్యాఖ్య‌ల్లోని ఏ కామెంట్ ఆధారంగా క‌మ‌ల్‌పై కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించిందంటే... ఇటీవ‌ల ఆయ‌న ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దేశంలో హింందూ ఉగ్ర‌వాదం ఉంద‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న ఆ ఉగ్ర‌వాదం నానాటికీ పెచ్చ‌రిల్లుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై వెనువెంట‌నే కొన్ని వ‌ర్గాల నుంచి రియాక్ష‌న్ వినిపించినా... క‌మ‌ల్ దానిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అంతేకాకుండా తన పోస్టర్ వేలాడదీసి ఇద్దరు పిల్లలు కత్తులతో పొడుస్తున్నట్టుగా వచ్చిన ఒక వీడియోని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట‌ట్ చేసిన క‌మ‌ల్‌... అలాంటి ఏ పాపం ఎరుగ‌ని పిల్లాడి చేతిలో చ‌నిపోవ‌డం త‌న‌కు ఆనంద‌మేనంటూ మరో సంచ‌ల‌నాత్మ‌క కామెంట్ విసిరారు.

హిందూ ఉగ్ర‌వాదం అంటూ క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు ఓ వ్య‌క్తి మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. తన వ్యాఖ్యల ద్వారా హిందువులపై ఉగ్రవాదులు అనే ముద్రను కమల్ వేశారంటూ పిటిషన‌ర్ కోర్టుకు విన్న‌వించాడు. హిందువులకు వ్యతిరేకంగా విషాన్ని వ్యాపింపజేసేందుకు క‌మ‌ల్‌ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

హిందూ ఉగ్ర‌వాదం అంటూ క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు ఓ వ్య‌క్తి మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. తన వ్యాఖ్యల ద్వారా హిందువులపై ఉగ్రవాదులు అనే ముద్రను కమల్ వేశారంటూ పిటిషన‌ర్ కోర్టుకు విన్న‌వించాడు. హిందువులకు వ్యతిరేకంగా విషాన్ని వ్యాపింపజేసేందుకు క‌మ‌ల్‌ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

మానసికంగా బలహీనున్ని చేయాలని మ‌రి ఈ కేసు విచార‌ణ ఏ మ‌లుపులు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి కమల్ ని ఇప్పటినుంచే ఇబ్బందులకు గురి చేసి పార్టీ పెట్టకముందే అతన్ని మానసికంగా బలహీనున్ని చేయాలని ప్రభుత్వ ఆలోచన అన్న ఇంకో వాదన కూడా తమిళ నాడు లో వినిఒపిస్తోంది.

మంగళవారం, నవంబర్ 21, 2017

Bank of Baroda Recruitment 2017

Bank of Baroda లో 428 పోస్టులు రెడీ అయ్యాయి. మీలో ఎవరికైనా అర్హత,ఆసక్తి ఉంటే అప్లయ్ చేసుకోవచ్చు. వివరాలకు క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

శనివారం, నవంబర్ 18, 2017

Why did Mahatma Gandhi not get the Nobel Prize?
గాంధీకి నోబెల్‌ బహుమతి ఎందుకు ఇవ్వలేదు. నిజానికి ఇది ప్రపంచంలోని అనేకులకు వచ్చే ఒక సందేహం. 1937, 1938, 1939, 1947 సంవత్సరాలలో మహాత్మా గాంధీ పేరు నోబెల్‌ శాంతి బహుమతి కోసం ప్రతిపాదించడం జరిగింది. 1937లోను, అటు తరువాత కొంతకాలం పాటు ఆయన అనుచరులకే అర్థం కాని ఆయన సిద్ధాంతాలున్నాయని నోబెల్‌ కమిటీవారు ఆయన పేరును తుది జాబితాలో చేర్చలేదు. 1947లో పాకిస్తాన్‌ ఏర్పాటు విషయంలో వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయనకు అవార్డు ఇవ్వకూడదని కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1948లో నోబెల్‌ శాంతి బహుమతి కోసం మహాత్మా గాంధీని ఎంపిక చేశారు. అయితే ఆయన ఆ సంవత్సరం జనవరి 30వ తేదీన తుపాకీ గుండ్లకు బలి అయ్యారు. అప్పట్లో ఉన్న నియమం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే మరణించిన వ్యక్తులకు నోబెల్‌ బహుమతులు ప్రకటించాలనేది నిబంధన. గాంధీ ఒక సంస్థకు ప్రతినిధి కాదు. మరణ విల్లును ఆయన వ్రాయలేదు. బహుమతి ఎవరికి అందజేయాలో నోబెల్‌ సంస్థకు తెలియకపోవడంతో ప్రతిపాదన విరమించుకోబడింది. ఇక అర్హులు ఎవ్వరూ లేకపోవడంతో ఆ సంవత్సరం నోబెల్‌ శాంతి బహుమతి ఎవ్వరికీ ఇవ్వలేదు. అంతేగాని కొందరు ఊహించినట్లుగా ఆయన బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఉద్యమం నడపటం వలన, తెల్లవారికి వ్యతిరేకంగా, నల్ల వారి తరపున ఉద్యమాలకు నాయకత్వం వహించటం వలనే మహాత్మా గాంధీకి నోబెల్‌ బహుమతి ఇవ్వలేదనే వాదం సరియైనది కాదు. ఇలా ఈ బహుమతుల మీద ఎన్నో ప్రశంస లు, ఎన్నో విమర్శలు ఉన్నాయి.

శనివారం, నవంబర్ 11, 2017

ప్రధాన అగ్రిగేడర్ అయిన మాలికలో నీహారిక గారి బ్లాగ్ కనిపించడం లేదు. అందుకనే నా బ్లాగ్ సైడ్ బారులో ఆమె బ్లాగును చేర్చుకున్నాను. ఇకనుండి ఆమె ఏ పోస్టు వ్రాసినా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. నాకు నచ్చిన బ్లాగుల్లో నీహారికగారి బ్లాగును నేను ఎక్కువుగానే ఫాలో అవుతుంటాను. ఇప్పుడు ఆమె రీసెంట్ గా వ్రాసిన పోస్టులలో "ఈ చరిత్ర ఏ సిరాతో..." అనే పోస్ట్ చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. ఆలోచనాత్మకంగా ఉంది. ఊడబోడిచేలా వాగే... హరిబాబులాంటివాళ్లకు... బుద్ధి వచ్చేలా...ఉంది.
KSC బతుకు బట్టబయలు చేసి సాక్ష్యం నోరు మూయించాక కురుక్షేత్రంలో గెలిచిన పాండవుల లాగ తయారైంది నా పరిస్థితి - ఏమి గెలుపు అది? అంటూ ఒక దిక్కుమాలిన పోస్ట్ వేశాడు. ఏరా హరిబాబు నీవేవడివో నాకు తెలియదు. నాగురించి కూడా నీకు తెలియదు. నీకు మెయిల్ ద్వారా ఫేక్ సమాచారం ఇస్తున్న వాడి ముక్కూ ముఖం కూడా నాకు తెలియదు. నా బ్రతుకు బట్టబయలు ఏమి చేసావు? నేనేమైనా దుర్మార్గపు పనులేమైనా చేశానా? పదే,పదే నాగురించి ఏమి రాస్తున్నావో నీకర్ధమవుతుందా? మానసికరోగి వెధవ్వా... ఏదైనా హాస్పటల్ కి వెళ్లి తగలడు. సాక్ష్యం నోరు మూయించావా? నీవు నోరు మూయించేస్తే మూసుకుని కూర్చోవడానికి మేమేమైనా నీలా బ్లాగుల్లో మొరిగే కుక్క లాంటివారిమా? నీవేదో చెన్నై తగలడ్డాను, నన్ను ఏమి చేయగలరులే అనుకుంటున్నావేవో. నీదిక్కుమాలిన బ్లాగులో అన్ని నీతి కబుర్లు వ్రాస్తున్నావు. ఎదుటివాడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి గాయపడే మాటలు అనకూడదని తెలియదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండానే పుస్తకాలు కూడా రాసేస్తున్నావా? నీవెన్ని అజ్ఞాత కామెంట్లు, ఫేక్ ఐడిలు పెట్టి నన్ను బాధ పెట్టాలనుకున్నా చివరికి నీ రోగం ముదిరిపోయి చస్తావు తప్ప నాకు పోయేది ఏమీ లేదురా వెధవ్వా? వయస్సులో పెద్దవాడివి. అదేం బ్రతుకురా సన్నాసి వెధవా?

నేను పోలీస్ స్టేషన్ కు ఒకసారి వెళ్ళడం కాదు. చాలాసార్లు వెళ్తాను. అక్కడ మా కజిన్ బ్రదర్ కి డ్యూటీ నుండి ఇంటికి రావడం కుదరకపోతే ఒకొక్కసారి టిఫినో, క్యారేజీయో తీసుకువెళ్ళాలి. తన్నులు నేను తినడం కాదు. నీకు మక్కెలు విరగోట్టిస్తా! చెన్నైలో ఉన్నాను కదా అనుకుంటున్నావేమో, నీవు ఓవరైతే, నీ పధ్ధతి మార్చుకోకపోతే కాకినాడ రప్పిస్తా! 

"సాక్ష్యం మేగజైన్" రచయితలలో ఒక లాయర్ గారు ఉన్నారు. మేమేమీ చట్టవ్యతిరేకమైన ఆర్టికల్స్ పెట్టలేదు. వాళ్ళందరికీ నీవాగుడు తెలియజేసా. అలాగే నీవు నన్ను అన్న మాటలు,దూషణలు అన్నీ ఫైల్ చేసి అప్పగించా. ఇక నిన్ను వదిలే ప్రసక్తి లేదు. నీపని నీవు చేసుకోవడం మాని ఎదుటివారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంటే ఏం జరుగుతుందో రుచి చూపిస్తా.

పోనీలే నీవేదో పుస్తకాలు వ్రాసుకుని, నీపని నీవు చేసుకుంటావు కదా అని ఊరుకుంటుంటే మాటి,మాటికి ప్రతి కామెంట్లోనూ, ప్రతి పోస్ట్ లోనూ నన్ను దుర్మార్గుడిగా చిత్రీకరించే ప్రయత్నమే చేస్తున్నావు. ఏనాడూ నేను ఎవరినీ అన్నదీ లేదు.తిట్టిందీ లేదు. కాని నీగురించి ఇటువంటి పోస్టులు వ్రాయాల్సి వస్తుందిరా వెధవ్వకనా?

వయస్సులో పెద్దవాడివి, నీకంటే నేను చాలా చిన్నవాడిని. వ్యవసాయంలో నాన్నగారికి సహరిస్తూ మా మామయ్య గారి పెట్రోల్ బంక్ లోనూ, శాగో ఫ్యాక్టరీలోనూ మేనేజింగ్ చేస్తూ (మా మామయ్య రాజకీయాల్లో బిజీ వల్ల బంక్, శాగో ఫ్యాక్టరీ బాధ్యత నాది.) ఏదో అప్పుడప్పుడూ బ్లాగింగ్ చేస్తుంటాను. నిజానికి "సాక్ష్యం మేగజైన్ " కూడా నేను ఎక్కువుగా నడపను. నేను అడిగిన పండితులలోనూ, కొంతమంది ప్రముఖులలోనూ ఆర్టికల్స్ ఇస్తే దానిని పబ్లిష్ చేయడం తప్ప నేను పెద్దగా వ్రాసేది ఏమీ ఉండదు. ఏదైనా వ్రాస్తే నలుగురూ చదివిన తరువాతే ఓకే చేస్తే ఆ పోస్ట్ వేస్తాను. ఎందుకంటే అంతగొప్ప విషయాలు వ్రాయాలంటే చాలా పరిజ్ఞానం ఉండాలి. శాస్త్ర పరమైన అవగాహన ఉండాలి. అందుకనే ఆబాధ్యతను వారికప్పగించాను. నేను వ్రాసిన పోస్టులు నా బ్లాగుల్లో వేసుకుంటాను. ఎందుకంటే అవి నా జ్ఞాన పరిధి మేరకు సంబంధించినవి. అందులో ఎదుటివారికి ఒప్పూ,తప్పూ కూడా కనిపించవచ్చు. ఇటువంటి ఆర్టికల్స్  "సాక్ష్యం మేగజైన్"లో వేయను. నిజానికి ఇందులో పోస్టులు వేయాలంటే మిగతా కంటెంట్ రచయితల అనుమతి ఉండాల్సిందే. వ్యక్తులను చూసి, లేక మత అవలంబీకులను చూసి "సాక్ష్యం మేగజైన్"లో ఆర్టికల్స్ రావు. కేవలం శాస్త్రపరమైన విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం. ఇది హిందూమతానికో, లేక క్రైస్తవ,ఇస్లాం మతాలకో వ్యతిరేకమైనది కాదు. ఇందులో కేవలం శాస్త్రపరమైన వాటికే అనుకూలమైనది. వేదం,భగవద్గీత,బైబిల్,ఖురాన్ లలో చెప్పబడిన విషయాలకే ప్రాధాన్యత తప్ప నీలాంటి వారు ఏవో పిట్టకధలు చెప్తే "సాక్ష్యం మేగజైన్" ఏమాత్రం అనుమతించదు. అగ్రిగేడర్ల ద్వారా కంటే గూగుల్ ద్వారానే దీనికి విజిటర్స్ ఎక్కువ. దీనిని ఇంతకుముందు బ్లాగ్ స్పాట్ లోనే నడిపెవాళ్ళం. కానీ బ్లాగిల్లు శ్రీనివాస్ దీనిని మరింతగా డవలప్ చేస్తే బాగుంటుంది. ఒక వెబ్సైట్ లుక్ తీసుకొద్దాం అని ఆయన ఎంతో కష్టపడి డిజైన్ చేసి అలంకరించాడు. (కష్టానికి ప్రతిఫలం అందజేయబడిందిలెండి.)

ఇకపోతే 
ఒరేయ్ హరిబాబు పదే,పదే నన్ను పట్టుకునే ఏడ్వాలనుకుంటే ఇక నీ లైఫ్ లో ఏడుపు తప్ప ఇంకేమీ మిగలకుండా చేస్తా! నీవు సరాసరి తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ కాళ్ళు పట్టుకున్నా, లేక మా ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రాధేయపడినా ఇక నిన్ను రక్షించే నాధుడే దొరకడు. ఇంతకు ముందు ఇదే విషయాన్ని నీ గొప్పకోసం డబ్బా కొట్టుకున్నప్పటికీ నేను మాత్రం సీరియస్ గానే హెచ్చరిస్తున్నా! నీదిక్కుమాలిన చెన్నై ఫీడ్ మమ్మల్ని ఫీకేదేమీ లేదు. నాకా దమ్ము ఉంది. ఖబడ్దార్!

శుక్రవారం, నవంబర్ 10, 2017

గురువారం, నవంబర్ 02, 2017

మనిషి అనేక సమస్యలలో మునిగిపోయినప్పుడు బ్రతకడమే ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది.దానిని ఎదిరించిన నాడు మన చుట్టూ బిగుసుకున్న సమస్యలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. కాని మనిషి దాని విషయంలో ధైర్యం చేయడానికి భయపడతాడు. సమస్యలను ఎదిరించి నిలబడిన మరుక్షణం నీ సమస్యలన్నీ నీ కాళ్ళ క్రింద పడిఉండడం తధ్యం.

బుధవారం, నవంబర్ 01, 2017

"కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యౌవనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం - అనవసరం. అలాంటివారు ఉన్నా, లేకపోయినా ఒకటే"                          :చిత్రం "తీన్ మార్"

"అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు - నేను కూడా ఉన్నానూ అని! అదే వినాయకుడు రోజూ పాలు తాగితే ఎవడూ పోయడు"                            : చిత్రం - "బిజినెస్ మేన్"
   ఇటువంటి మంచి డైలాగ్స్ మీకు కూడా తెలిస్తే క్రింది కామెంట్ బాక్స్ లో తెలియ జేయండి. నలుగురికీ తెలుస్తాయి.

శనివారం, అక్టోబర్ 28, 2017

ఈ హరిబాబు ఎవడో గాని ఈమధ్య ప్రతి విషయంలోనూ నా ప్రస్తావన తీసుకొస్తూ అతిదారుణ పదజాలంతో విమర్శిస్తూనే ఉన్నాడు. వీడికి ఏమైనా పోయేకాలం వచ్చిందో,ఏమిటో తెలియడం లేదు. ఈయన గారు నాపై విజయం సాధించానని ప్రగల్భాలు పలుకుతూ, కౌటిల్యుడికే పాఠాలు చెప్పగల స్టేజ్ నాదంటూ విర్రవీగుతున్నాడు. సాక్ష్యం మేగజైన్"లో మా కంటెంట్ రచయితలు వ్రాసిన శాస్త్ర బద్ధ విషయాలకు ఏనాడూ శాస్త్రపరంగా సిద్ధాంతానికి నిలబడకుండా పెద్ద,పెద్ద పిచ్చి టపాలు వ్రాసి, తనే చెత్త కామెంట్లు వ్రాసి సైకోలా ఆనందపడే నీకు మేము భయపడుతున్నామనుకున్నావా?

బ్లాగర్లకు అవమానం చేయడానికి అన్ని అడ్డమైన దారులు వెతుకున్నే నీవు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి అలజడులు రేపి మరింత ఆనందపదాలని చూస్తున్నావా? లేక నీహారికగారికి, నాకూ రాజకీయాల్లోకి వచ్చి మీపై అన్యాయంగా కేసులు బుక్ చేయించి ఇబ్బంది పెడతానని ఇన్ డైరెక్ట్ బెదిరింపా?

పిచ్చి పుల్లయ్యా? నీవిప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నావ్. ఆల్రెడీ మా ఫ్యామీలీలోనే పెద్ద,పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఎవడు బెదిరిపోతాడు మీ దిక్కుమాలిన బెదిరింపులకు?

నీవు నన్ను వ్యక్తిగతంగా ఎంత విమర్శిస్తున్నా సహిస్తూనే వస్తున్నా! నీ నైజం,నీగుణం ఏదోరోజు బయటపడుతుందిలే, నీ అహంకారం నిన్ను ముంచేసే రోజు వస్తుందిలే అని వదిలేసా! అవి నీకు దాపురించే కాలం దగ్గరైంది. ఆల్రెడీ Real indian పేరిట కొంతమంది నీకు మొగుళ్ళు తయారవ్వుతున్నారు. జాగ్రత్త పడు.


నీకసలు బుర్ర పనిచేస్తుందా? బ్లాగుల్లో యాడ్స్ పెట్టడం దేశద్రోహమా? మా అభిప్రాయాలు మేము వ్రాసుకోవడం నేరమా? ఏం వాగుతున్నావో నీకర్ధమవుతుందా? బ్లాగిల్లు శ్రీనివాస్ గారు తన వ్యాపార రహస్యాలు నాకు బోధించాడా? 10% ఆదాయం వస్తే చాలని నా గురించి అనుకున్నాడా? అదే నీవయితే కళ్ళకద్దుకునేవాడివా? ఇంతకీ ఆ వ్యాపార రహస్యం ఏమిటో తెలుసా? తమరు ఏ యాడ్స్ కోసం అయితే నాగురించి తెగ ఏడుస్తున్నావో అదే ఆ వ్యాపార రహస్యం. నీవు,ఎలాగూ ఆయనగారితో మెయిల్ కాంటాక్ట్ ఉందిగా? ఆ వ్యాపార రహస్యం తెలుసుకుని మీ బ్లాగులో కూడా యాడ్స్ పెట్టుకుని మీ రాజకీయ ప్రవేశానికి ఫండ్స్ సమకూర్చుకోండి.:) అయితే ఆవ్యాపార రహస్యం తెలుసుకోవడానికి నాకు ఫీజులు గుంజబడ్డాయి. మీకయితే అంతా ఫ్రీగానే చెప్తాడనుకుంటా?

వ్రాయాల్సింది చాలానే ఉంది. మళ్ళీ నా బిజినెస్ పనులలో ఖాళీ దొరికినప్పుడు వస్తాను.

పెద్ద గమనిక : నీవు,నీవు అన్నందుకు మీరెంత బాధ పడుతున్నారో అంతకంటే ఎక్కువ బాధ పడ్డాను నేను. బంతిని గోడకేసి ఎంత బలంగా కొడితే అంతకంటే బలంగా,వేగంగా మీ వైపుకే వస్తుంది. ఖబడ్దార్!

ఇకపోతే ఈ Real indian ఎవరో గాని మీ దుర్మార్గపు బుద్ధిని ,మీ వికృత నైజాన్ని ఒక్క కామెంట్ తో బయట పెట్టేసారు. ఆయనకు హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నా!

శుక్రవారం, అక్టోబర్ 27, 2017

తెలంగాణా బ్లాగు మిత్రులందరికీ శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం DSC కి సంబంధించి G.O (గవర్నమెంట్ ఆర్డర్ )ను విడుదల చేసింది. వివరాలకు క్రింది లింక్ ద్వారా వెళ్ళవచ్చు.
TS DSC 2017 - Teachers Recruitment Test Rules - TS TRT Rules -GO.MS.25 Dt.110/10/2017

శనివారం, అక్టోబర్ 14, 2017

శోధిని బ్లాగులో వచ్చిన టపా పట్టుకుని బ్లాగిల్లు శ్రీనివాస్, హరిబాబుగార్లు పెడుతున్న కామెంట్లు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు.

శ్రీనివాస్ గారు.
మీరు నాకిచ్చిన రెండు ఫోన్ నంబర్లు స్విచ్చ్ ఆప్ చేసుకుని ఉన్నారు గనుక ఈ పోస్ట్ రూపంలో తెలియజేస్తున్నాను.
మీకూ,నాకూ స్నేహమా? అది కలుషితమయిపోయిందా? ఏo కామెంట్లు పెడుతున్నారో అర్ధం కావడం లేదా?

మీ దగ్గర కొన్ని బ్లాగులు బహుశా రెండు బ్లాగులు ఒకటి సాక్ష్యం మేగజైన్, రెండు ఈ బ్లాగునూ! అయితే ఈ బ్లాగు డిజైన్ పెద్దగా నచ్చక మళ్ళీ నేనే బ్లాగర్లోకి మార్చుకుని డిజైన్ చేసుకున్నా! వీటికి నేను మీకు డబ్బులిచ్చే చేయించుకున్నాను. ఇలా మీ నంబర్, నా నంబర్ తీసుకోవడం, అప్పుడప్పుడూ మాటలాడుకోవడం జరిగేది. అంతవరకే. అంతకు మించి మన విషయంలో ఇంకేముంది? నాకు నా ప్రాణమిత్రులతో కలవడమే సరిగా కుదరడం లేదు. మీతో కలుషితమయ్యి పోయేంత స్నేహ బంధాలే నడిచాయా? చాలా హాస్యాస్పదంగా ఉంది మీ వ్యవహారం. మీది రాజమండ్రి, మాది కాకినాడ. వేట్లపాలెంలోని మా మావయ్య గారి బoక్ లో ఎక్కువుగా ఉంటాను కూడా. మీకు చాలా దగ్గరలో అయినా ఏనాడు మిమ్మల్ని కలవనే లేదు. మీరు చెపుతున్నంత స్నేహం మన మధ్య ఉంటే మనం కలవకుండా ఉంటామా? మీరు కల్సే ప్రయత్నం చేసానని చెప్పవచ్చు. అయితే మీతో ప్రత్యేకంగా కలిచేoత అవసరం, స్నేహభావం మనమధ్య లేవు. మీరు గతంలో కొంతమంది బ్లాగర్ల విషయంలో మీరు రికార్డ్ చేసిన ఫోన్స్ నాకు మెయిల్ ద్వారా వినిపించినప్పుడే మీకు ఫోన్స్ రికార్డ్ చేసే భయకరమైన గుణం ఉందని గుర్తించి ఉంటే ఆరోజు నుండే అప్పుడప్పుడూ మీరు కాల్ చేస్తూ నాతో మాట్లాడే విధానానికి స్వస్తి చెప్పేసే వాడిని.మీరు ఆదుకునేoత  దౌర్భాగ్యపు స్థితిలో నేను లేను.ఇటువంటి అసంబద్ధమైన వ్యాఖ్యలు కలిపించకండి.

గతంలో మీరు వివిధ ఐడిలతోనూ, బ్లాగులతోనూ పల్లా కొండల రావుగారి అగ్రిగేటర్ విషయంలో చేసిన దాడి నాకింకా గుర్తుంది. గతంలో నా బ్లాగులలో కూడా మీరు వివిధ ఐడిలతో కామెంట్ చేసేవారు కదా? ఆ విషయాలు నాతో కూడా పంచుకునేవారు కదా? మీరు అప్పుడప్పుడూ కావాలని చేసే వైరల్ దృష్టిలో పెట్టుకుని మీకు ఫోన్ కూడా చేసాను. కాని మీరు మాట్లాడిన తీరు చూస్తే మీరేనన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది. అయితే ఫోన్స్ రికార్డ్ చేసే నికృష్టపు అలవాటు నాకు లేదు కాబట్టి నేను రికార్డ్ చేయలేదు.

ఏమో నా అభిప్రాయం నిజం కావచ్చు. పొరపాటు కావచ్చు.నిజానికి వేరే బ్లాగులో వచ్చిన ఆ అజ్ఞాత కామెంట్ గురించి పట్టించుకోవడం అనవసరమనిపించిoది.

కాబట్టి నాగురించి మీరు చేస్తున్నది ఇక్కడితో ఆపు చేసేయండి. బాగుండదు. మీరు శోధినిలో టపా వేసినప్పుడే ఈ క్రింది కామెంట్ పెట్టాను. ఎవరివలన జరిగిందో ఎందుకు జరిగిందో, కావాలని జరిగిందో, తెలియదు గాని ఈ విషయాన్ని అనవసరం అన్న ఉద్దేశ్యంతో ఈ కామెంట్ పెట్టాను.
దానికి మీరు క్రింది విధంగా స్పందించి సరే సార్ అన్నారు.
మీకు కామెంట్ పెట్టి తీసేయడం అలవాటు కాబట్టి యధాప్రకారం ఆ కామెంట్ మీ బ్లాగునుండి తొలగించి వేసారు.అయితే మాలికలో స్టోరేజ్ అయ్యే ఉంది.

మీ సమాధానంలో సరే సార్..ఈ పోస్ట్ఉద్దేశ్యం వేరని చెప్పిన మీరు నాపై వ్యక్తిగత దూషణలకు ఎందుకు తీసుకు వెళ్తున్నారు? ఇక ఆపేయండి.మీకే మంచిది. మీకు నావలన ఇబ్బంది కలిగితే ఫోన్ చేయండి.మీరు రెండు రోజులనుండి ఫోన్ స్విచ్చ్ ఆప్ చేసుకుని ఉండాల్సిన పని లేదు. ఆన్ చేసుకోండి. నాకు ఫోన్ చేయండి.

ఇక హరిబాబు గారూ!
ఏమిటి మీ వ్యక్తిగత దూషణలు. ఎవడి అభిప్రాయాలు వాడు వ్రాసుకుంటాడు. నచ్చితే మా బ్లాగ్ చదవండి, లేకపోతే మానేయండి. వెధవ్వ , సన్నాసి, పిచ్చి పుల్లయ్య, సైకో, అక్కడ కలిపేస్తా, ఇక్కడ కలిపేస్తా? ఏమిటి సర్ ఈ వాగుడు? మా కీబోర్డులో బటన్స్ లేవనుకుంటున్నారా? మీ వయస్సుకు గౌరవాన్ని ఇవ్వకుండా ఉండలేకపోతున్నాము. అలాగే మా సంస్కారాన్ని వదిలి పెట్టలేము. నా పట్ల మా మేగజైన్ కంటెంట్ రచయితల పట్ల వ్యక్తిగత దూషణలు, సభ్యత దిగజారి మాట్లాడటం మానుకోండి. మా మేగజైన్ రచయితలు మీకంటే కూడా వయస్సులో పెద్దవారు ఉన్నారు. గౌరవంగా ప్రవర్తించడం నేర్చుకోండి. మీకంటే వయస్సులో చిన్న వాడినైన నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదనుకుంటాను. మీ అభిప్రాయాలు నాకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నచ్చలేదని మీతో ఏనాడైనా దూషణలు చేస్తూ కామెంట్ పెట్టానా? లేదే.

మా మేగజైన్ గాని, బ్లాగులు గాని నచ్చకపోతే మానివేయండి. అంతే. మీరు చూడాలని రూలేమైనా ఉందా?

ఇక ఉంటాను. నాకు మీ ఇద్దరి ప్రవర్తన పట్లా కలిగిన బాధతో వ్రాసాను. ఇంకా ముఖ్యమైన, ప్రధానమైన విషయాలు ఉన్నప్పటికీ కొద్దివరకే వ్రాసాను. ఇలా  వ్రాయడమే నాకు చిరాక్ కలిగిస్తోంది. శుభం.

శుక్రవారం, అక్టోబర్ 13, 2017

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అలానే ఉంది. ఒక బ్లాగరుపై మరొక బ్లాగరు విరుచుకుపడే స్థాయికి దిగజారిపోయారు. అజ్ఞాత రూపంలో కామెంట్లు పెడుతూ బ్లాగర్ల మధ్య విరోధ,విద్వేషాలు రగిలించే సన్నాసి వెధవలు పెరిగిపోతున్నారు. దీనిని అరికట్టాల్సిన కొంతమంది బ్లాగర్లు, అగ్రిగేటర్లు వారిని ప్రోత్సాహిస్తూ మరింతగా ముందుకు నడిపిస్తున్నారు. ఇటువంటివారు ముమ్మాటికీ శిక్షాహరులే. ఎవరైనా అజ్ఞాత కామెంట్ల వలన బాధపడి యుంటే వీరిని ప్రోత్సాహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడాల్సిన పని లేదు.

ముందుగా మాలిక,శోధిని లాంటి ప్రధాన అగ్రిగేటర్లు జాగ్రత్త తీసుకోవాల్సిందే. అటువంటి కామెంట్ల సెక్షన్ ని మూసివేయాల్సిందే. ఈ పని చేయలేనప్పుడు అగ్రిగేడర్లను మూసుకునికూర్చోడం మంచింది.

మన బ్లాగర్లు దయచేసి మీ బ్లాగుల యొక్క అజ్ఞాత కామెంట్ల సెక్షన్ ని డిసేబుల్ చేసేయండి. బ్లాగర్ల మధ్య ప్రశాంతమైన వాతావరణాన్ని కలిపించండి. ఎవరి అభిప్రాయాలు వారు వ్రాసుకుంటారు. నచ్చితే మెచ్చుకుంటాము. నచ్చకపోతే, ఆ అభిప్రాయంలోని లోపాలను ఎత్తి చూపుతాము. లేకపోతే మన బ్లాగులో మరొక పోస్టు వ్రాస్తాము. అంతేగాని వార్నింగ్లు, అవహేళనలు చేస్తే అవతలివారు కూడా అదే స్థాయిలో స్పందిస్తారు. ఇటువంటి పరిస్థితిని క్రియేట్ చేసుకోవడం ఎందుకు? ఎంతోమంది మంచి బ్లాగర్లు మనస్థాపం చెంది వెళ్ళిపోయారు, వెళ్ళిపోతున్నారు.

ఇకనుండైనా ఆ పరిస్థితిని మనం మార్చుదాం. దీనికి మీరేమంటారు?

మంగళవారం, అక్టోబర్ 10, 2017

Why is the fires on Kancha Ilaiah?
"సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్ళు" పుస్తక రచయిత కంచె ఐలయ్యపై ఇటీవల మన ఆర్య వైశ్యులు విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆయన బొమ్మలను తగుల బెట్టడం, పుస్తకాలను కాల్చడం, విపరీత పదజాలంతో దుర్భాషాలడటం జరగడంతో పాటు రాష్ట్ర మంత్రి అయ్యుండి టి.జి.వెంకటేష్ గారు "కంచె ఐలయ్యను నడిరోడ్డుపై ఉరి తీయాలి, కొట్టి చంపాలి " లాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు.

ఇంతకీ కంచె ఐలయ్య చేసిన తప్పేమిటి? ఆయనపై అంతగా విరుచుకు పడడానికి గల కారణం ఏమిటి? అని ఆలోచిస్తే మా కులాన్ని ఆయన విమర్శించాడు. మమ్మలను స్మగ్లర్లు అన్నాడన్నదే! అసలు కంచె ఐలయ్య ఆ పుస్తకం వ్రాయాల్సిన అవసరం ఉందా?

నిజానికి ఈ కాలంలో వ్యాపారాలు కోమటోళ్ళు మాత్రమే చేయడం లేదు. అన్ని కులాలవారు చేస్తున్నారు. చిన్నా, పెద్దా వ్యాపారస్తులు అన్ని కులాలలోనూ ఉన్నారు. కేవలం కోమటోళ్ళును మాత్రమే టార్గెట్ చేయడమన్నది అన్యాయమే అవుతుంది. నిజానికి నేటి రాజకీయ నాయకులను మించిన సామాజిక స్మగ్లర్లు ఎవరుంటారు..చెప్పండి?

కంచె ఐలయ్య వ్రాసిన "సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్ళు" అనే పుస్తకం ఈకాలానికి ఏమాత్రం సంబంధించింది కాదు. ఎందుకంటే కోమటోళ్ళు మాత్రమే వ్యాపారరంగంలో లేరుగా? అలా కాకుండా "సామాజిక స్మగ్లర్లు - వ్యాపారస్తులు" అని టైటిల్ పెడితే కరెక్ట్ గా ఈకాలానికి సరిపోతుంది.

అయితే ఇంతకీ "సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్ళు" అనే ఈ పుస్తకం ఏ కాలానికి సరిపోతుంది?

నా దృష్టిలో ఈ పుస్తకం 20సంవత్సరాలనుండి ౩౦సంవత్సరాల క్రితం కాలానికైతే కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే ఆయా కాలాలలో అత్యధిక వ్యాపారం కోమటోళ్ళ చేతుల్లోనే ఉండేది. గ్రామాలలో,పల్లెలలో పేద ప్రజలను అన్యాయంగానే దోచుకుతినేవారు. చిన్న కిరాణా దుకాణం పెట్టి వేలకు వేలు సంపాదించేవారు. నాసిరకం వస్తువులను అంటగట్టడంలోనూ, తూనికల్లో మోసాలు చేయడంలోనూ వీరిని మించినవారు ఎవరూ ఉండేవారు కాదు. ఇప్పటికీ గ్రామాలలోనూ, పల్లెలలోనూ ఈ విధానం ఏమాత్రం సమసి పోలేదు. కొనసాగుతూనే ఉంది. గ్రామాల,పల్లెల అవగాహన, నివాసన చేసినవారు కాదనలేని పచ్చి నిజం ఇది.

ఇక కంచె ఐలయ్య విషయానికి వస్తే ఈయనగారు లక్షకోట్లు ఇస్తే అందరిచేత బైబిల్ పట్టిస్తాను. క్రైస్తవ మతాన్ని స్థాపిస్తాను అనే ఉద్దేశ్యం గనుక నిజమైతే కంచె ఐలయ్యను తీవ్రంగా పరిగణించవల్సిందే. ఎందుకంటే భారత దేశంలో నేటి క్రైస్తవ్యం ఎప్పుడైతే వ్యాపించబడుతుందో అప్పడే నైతికత నాశనమవ్వడం ఖాయం. ఎందుకంటే యేసు యొక్క ఒరిజినల్ బోధనలు గాని, విశ్వాసాలు గాని నేటి క్రైస్తవంలో ఏకోశానా లేవు.

ఇకపోతే కంచె ఐలయ్యకు సంబంధించిన కులాల వివాద వ్యవహారంలో మత స్వామీజీలు దూరటం విడ్డూరంగానే ఉంది.

ఆదివారం, అక్టోబర్ 08, 2017

జిలేబమ్మ ఎవరో తెలీదు గాని ప్రతి బ్లాగులోకి వచ్చి కామెంట్ పడేస్తుంది. అలా చేయడం మంచిదే గాని ఆ కామెంటేదో అర్ధమయ్యేలా పెడితే బాగుణ్ణు. తెలుగు బాషను కూనీ చేసే పదాలతో ఊదరగొడుతుంది. ఒత్తులు సైతం తప్పు రాస్తే బూతద్ధంతో సైతం వెతికి పట్టుకునే మన శ్యామలీయం మాష్టారు మన జిలేబమ్మను ఎందుకు వదిలి వేసారో కూడా అర్ధం కావడం లేదు. ఇక మన జిలేబమ్మ కామెంట్లను గమనిస్తే బ్లాగర్ల మధ్య, కామెంట్ల మధ్య వైరం ఏర్పాటు చేస్తుంది. వివాదం మరింత ముదిరేలా చేస్తుంది. మరికొన్ని సందర్భాలలో అత్యంత హాస్యాన్ని కూడా కురిపిస్తుంది. ఇంతకీ ఈ జిలేబమ్మ ఎవరో, ఏమిటో నాకు అర్ధమవ్వలేదు. తెలియజేయగలరా?

శుక్రవారం, అక్టోబర్ 06, 2017

మంగళవారం, సెప్టెంబర్ 12, 2017

శుక్రవారం, సెప్టెంబర్ 08, 2017

BSNL Bhart Sanchar Nigam Limited 2017-18 | Apply 996 Junior Accounts Officer Posts
BSNL Junior Accounts Officer (JAO) Vacancy Notification 2017 వచ్చేసింది. మొత్తం 996 ఉద్యోగాలు దేశ వ్యాప్తంగా రెడీ అయ్యాయి. మీలో అర్హత, ఆసక్తి ఉంటే తప్పనిసరిగా అప్లయ్ చేసుకోండి. జీత భత్యాలు 16400 నుండి Rs. 40500/ వరకూ ఇస్తారట. ఇంకా ఏమేమి Educational Qualifications ఉండాలి? వయస్సు ఎంతవరకూ ఉండాలి? ఇత్యాది అన్ని విషయాలు కూడా క్రింది లింక్ క్లిక్ చేసుకుని తెలుసుకోవచ్చు. ఎలా అప్లైయ్ చేసుకోవాలో కూడా అక్కడ వివరంగా తెలియజేయడం జరిగింది.
ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ కూడా Share చేయడం మర్చిపోవద్దు.

Click here to Link : BSNL Junior Accounts Officer (JAO) Vacancy Notification 2017

ఆదివారం, సెప్టెంబర్ 03, 2017

Nothing-is-a-problem-for-development
కొంతమందికి అన్నీ సమస్యలుగానే, అడ్డంకులుగానే తోస్తాయి.కానీ తెలివిగలవారు అడ్డంకినే ఒక అవకాశంగా మలుచుకుని దాని సాయంతోనే పైకి ఎగబ్రాకుతాడు.

మీరు మేడ మీదికి చేరాలంటే మెట్లు ఎక్కి పోవాలి. పైకెక్కడానికి ఆ మెట్లు మనకి సహాయపడతాయి. కాని ఆ మెట్లను చూసి అవే అడ్డంకులు అనుకుంటే మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు.

దీన్ని గుర్తుంచుకోండి : "ఒక గాలిపటం గాలికి ఎదురు తిరిగి పైకి ఎగురుతుంది గాని గాలి వాలువ ఎగురదు" మీరు ఏదో ఒక పనిని చేపట్టారనుకోండి.జనం దాన్ని వ్యతిరేకించి మీమీద అన్ని రకాలుగా విమర్సల వర్షం కురిపిస్తున్నారనుకోండి. - సగటు మనిషి అసలు ఆ పని జరగనే జరగదని అనుకుంటాడు. కానీ తెలివిగలవాడు ఆ వీధి కుక్కలా మొరుగుల్లకి బెదిరిపోడు. ఆ మొరుగుల్లనే దీవెనలుగా తీసుకుని ముందుకి పోతాడు.

"సమస్యలు, అడ్డంకులు ఎదురవుతాయనే భయంతో అధములు ఏ పనినీ ప్రారంభించరు. పనిని మొదలు పెట్టి సమస్యలు ఎదురవ్వగానే మధ్యలో ఆపివేసేవారు మధ్యరకం మనుష్యులు. ఉత్తములు మాటిమాటికీ సమస్యలు ఎదురవుతున్నా చేపట్టిన పనిని వదలకుండా పూర్తీ చేస్తారు"

ఎన్నో యుద్ధాలలో విజయం సాధించిన నెపోలియన్ "అందరికన్నా ఎక్కువ పట్టుదల ఉన్నవాడికే విజయం లభిస్తుంది" అని చెప్పాడు.

చూశారా! పట్టుదల అనేది విజయాన్ని సాధించిన మనుష్యుల జీవితాలలో మనం తప్పక గమనించే లక్షణం. మీరు సృజనాత్మకతను పెంపొందించుకుని, ఎలా పని చెయ్యాలో అర్ధం చేసుకుంటే మీ అభివృద్ధిని ఆపగలిగేదేదీ ఉండదు.
Nothing is a problem for development.

బుధవారం, ఆగస్టు 30, 2017


TAGS : Why is Gandhi's picture printed on currency notes?

మంగళవారం, ఆగస్టు 29, 2017

Take-advantage-of-the-art-of-choosing-the-right-time
ఎప్పుడూ కూడా తొందర పడుతున్నట్టు కనిపించవద్దు-తొందరపడటం వల్ల మీమీద మీ సమయం మీదా మీకు నియంత్రణ లేదని తెలుస్తుంది. ఎప్పుడూ ఓర్పు కనబరచండి. చివరికి అంతా మీరనుకున్నట్టే జరుగుతుందని తెలిసినట్టు ఉండండి. సరైన క్షణాన్ని వెతికి పట్టుకునే అపరాధ పరిశోధకుడిలా పని చెయ్యండి. కాలం తాలూకు ఆత్మని పసిగట్టండి, కాలవైఖరే మిమ్మల్ని శక్తిని పొందే స్థితికి తీసుకువెళ్తుంది. సరైన సమయం ఇంకా రాలేదనుకున్నప్పుడు వెనక్కి తగ్గటం నేర్చుకోండి. అదే సమయం వచ్చినట్టనిపించినప్పుడు బలమంతా ఉపయోగించి ప్రయత్నించండి.

TAGS : Take advantage of the art of choosing the right time!

శుక్రవారం, ఆగస్టు 25, 2017

Anything that is okay is dolsinde.
ఉరుకుల పరగుల జీవితం లో ఏకాంతంగా .. ప్రశాంతంగా గడపడానికి సమయం ఎక్కడ వుంటుంది. అయినా అలా గడపాల్సిందే అంటున్నారు నిపుణులు . దానివల్ల శారికంగా ,మానసికంగా మరెన్నో ప్రయోజనాలు చేకూరతాయి .అవేంటంటే ..
ప్రతిరోజూ ఎంతో కొంత సమయం ఎకాంతంగా గడపడానికి అందరికీ కుదరకపోవచ్చు.  కానీ వారంలో కనీసం ఒక సారైనా అందుకోసం సమయం కేటాయించుకోండి. అలా చెయ్యడం వల్ల ఆలోచనా తీరు మారుతుంది .కేవలం మీతో ముడిపడిన  బావాలే మనసు లో మెదులుతాయి .చిరాకూ ,విసుగూ పక్కకు వెళ్ళిపోయి .. ఒత్తిడి తగ్గుతుంది .
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరులతో పంచుకుంటే ఏదో ఒక సలహా ఇస్తారు. కొన్ని సమస్యల్ని ఎవరితోనూ పంచుకోవాలనిపించదు.  అలాంటప్పుడు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఓ గంటపాటు ఉండండి. సమస్య గురించి ఆలోచించి .. దానికి పరిష్కారాలను కూడా మీకు మీరుగా సూచించుకోండి. .మంచీ చెడులను విశ్లేషించుకోండి. మీతో మాట్లాడుకోవడమంటే ఇదే. ఇతరుల ప్రభావం లేకుంటే ఇదే.  ఇతరుల ప్రభావం లేకుండా స్వయంగా నిర్ణయం తీసుకోవడం ఇలా సాద్యమవుతుంది.

ఎన్ని వ్యాపకాలున్నా సరే అభిరుచులకు ప్రాధాన్యమివ్వడం వల్ల సానుకూల దృక్పథo  పెరుగుతుంది. డ్రైవింగ్ క్లాస్ లకు వెళ్ళడం ,తోట పని చేయ్యడం.. ఈత నేర్చుకోవడం వంటివి దూరమవుతాయి. 

ఒంటరిగా షాపింగ్ కు వెళ్ళడం కూడా మనకోసం మనం గడపడమే! ఎవరి ఎంపికా లేకుండా మనసుకు నచ్చినవి ఎంచుకోవడం...గౌవించుకోవడమే!

కొన్ని సార్లు క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొనే ప్రమాదం వుంటుంది. కానీ ఆవేశం, కోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఒంటరిగా వుండడం మంచిది. ఒంటరితనం ఆవేశాల్ని తగ్గిస్తుంది. మనసును నిదానపరుస్తుంది. మనతో మనం మాట్లాడుకోవడం...మంఛిచెడులను బేరీజు వేసుకోనే క్రమంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోo. అధిక రక్తపోటూ తగ్గుతుంది.  

మంగళవారం, ఆగస్టు 22, 2017

This-is-also-the-tusk-of-the-Tulus-of-August-21-2012
ఆగస్ట్ 21-2017 రోజునాడు భూమి నాశనం కానుంది ఒకవైపు, అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం కాబట్టి ఆ దేశమంతా చీకటిలోకి వెళితే ఇక వెలుగులోకి రాదు నాశనం కానుందని మరో వైపు ఇలా అన్ని ప్రక్కల నుండి మన టీవీ వాళ్ళు ఊదరగొట్టి పాడేశారు. ఆగస్ట్ 21-2017 వెళ్ళిపోయింది ఏం జరిగింది? ప్రళయమెక్కడ వచ్చింది? ఏదైనా ఒక విషయాన్ని మనం ప్రజలకు తెలియజేస్తున్నామంటే అందులో వాస్తవం ఉండాలి. అంతేగాని TRP రేట్లు పెంచుకోవడం కోసం అడ్డమైన విషయాలు తీసుకుని వచ్చి ప్రజలపై రుద్దాలని ప్రయత్నించకూడదు. మన మహనీయులైన, శాస్త్రాలైనా ప్రళయం వచ్చే ముందు కొన్ని సూచనలు సూచించారే గాని ఫలానా సమయంలో ఖచ్చితంగా వస్తుందని చెప్పలేదు. ఇవేవీ పట్టించుకోకుండా అదిగో ప్రళయం, ఇదిగో ప్రళయం అంటూ ఊదరగోట్టడం దేనికసలు? 2000లో ప్రళయం అన్నారు రాలేదు. ఇంకేముంది 2012లో మొత్తం భూమంతా ఖాళీ అయ్యిపోతుందన్నారు అవ్వలేదు. కొంతమందయితే బ్లాగుల్లో కూడా అదిగో,ఇదిగో అంటూ జ్యోస్యాలు వ్రాసేస్తున్నారు! ఇప్పుడా జ్యోతిష్యం అబద్దమనే కదా అర్ధం. ఇప్పుడు మళ్ళీ 2020 అంటున్నారు. ఈ సంవత్సర అంకెలు బాగున్నాయి కదా! ప్రజలు నమ్ముతారులే అనే ఉద్దేశ్యం కాబోలు. వాళ్లనుకున్నది నిజమే అనుకుంటా ఇవి నమ్మే ప్రజలకు బుర్రలు పనిచేస్తేనే కదా? వాళ్ళు చెప్పేది అబద్ధమని అర్ధమయ్యేది!!

మంగళవారం, ఆగస్టు 15, 2017

I-congratulate-Indian-Independence-for-all-my-friends
ప్రియమైన బ్లాగ్ మిత్రులారా మీ అందరికీ నా తరపున, సాక్ష్యం గ్రూప్ తరుపున 71వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

మనకి నిజమైన పండుగ ఆగస్ట్ 15 నాడు మాత్రమే. ఎందుకంటే ఈరోజు మనం బ్రిటీస్ బానిసత్వం లేకుండా హ్యాపీగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనకి స్వాతంత్ర్యం సాధించి పెట్టారు. దానికి కృతజ్ఞతగా మనమందరమూ ఆ వీరోచిత స్వాతంత్ర్య సమరవీరులందరినీ జ్ఞప్తికి తెచ్చుకుని నివాళులు అర్పించుకుందాము.

జై భారత్...జై హింద్.

సోమవారం, ఆగస్టు 14, 2017

ఈక్రింది సందేశాత్మక వ్యాసం నా Facebook అకౌంట్ లో చదివాను. చాలా బాగుంది అనిపించి ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాను. దీనిపై మీ అమూల్యమైన కామెంట్ ఒకటి పడెయ్యండి చాలు.

ఇదేనా నా దేశం?
ఇదేనా నా బగత్ సింగ్ కలలు కన్న స్వరాజ్యం?
ఈ దేశం కోసమేనా నా అల్లూరి తెల్లవాడి ముందు రొమ్ము విరిచింది?
దీని కోసమేనా నా సుబాష్ చంద్ర బోస్ ప్రాణాలు అర్పించింది?
ఈ రోజు చూడదానికేన నా గాంధీ బ్రిటిష్ వాడికి ఎదురొడ్డి నిలిచింది?
మంత్రులు,ముఖ్యమంత్రులు
ఎవడు కాదు అవినీతికి అర్హులు..
నేటి రాజకీయాలకు కొలమానం దేశానికి ఏమి చేసాం అనడం కంటే నా వాళ్ళకు నేను ఎంత సంపాదించుకున్నాను..
ఇది నిజం.
నమ్మలేని నిజం..
మన రాజకీయ నాయకులూ ఒప్పుకోని నిజం…
వాళ్ళ జేబు నింపుకోవడానికి రాజ్యాంగాన్ని మార్చిన తప్పు లేదు.
కాని,
పేదోడి కోసం మాత్రం ఈ రాజ్యాంగమే పెద్ద తప్పు…
నేను చేస్తే ఒప్పు, అదే ఎదుటివాడు చేస్తే తప్పు..
నేను బాగుండాలి,నా కుటుంబం బాగుండాలి..
కాని,
నాకు ఓటు వేసిన వాళ్ళు మాత్రం నాశనం కావాలి..
ఇవే నేటి రాజకీయానికి ప్రాధమిక సూత్రాలు…
నా తెల్లని దేశం ఫై నల్లని సిరా తో పెదోడిని చంపడానికి విషపు రాతలు రాస్తున్న
ఓ అవినీతి రాజకీయ నాయకుడ కబద్ధార్..
తప్పు చేసిన వాడి చోక్క పుచ్చుకు అడిగే రోజు ఎప్పుడు ఒస్తుందో కాని
ఆ రోజే నా భారతమాత కి నిజమైన స్వాతంత్రం..
అదే మా యువత కలలు కంటున్నస్వరాజ్యం…

Is this my country?
Is this the dream of my dream Bagat Singh?

శనివారం, ఆగస్టు 12, 2017

that is narendra modi
ప్రజలను మిమ్మల్ని MPలను చేసింది తినేసి ఇళ్ళ దగ్గర పడుకోవడానికి కాదు..పని చేయడానికంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోడి తన పార్టీ MPల తీరుపై విరుచుకుపడ్డాడు. వాళ్ళు సరిగా సభలకు రాకపోవడంపై విసుకు చెందిన మోడి పైవిధంగా స్పందించారు. అంతే కాకుండా మీరు పధ్ధతి మార్చుకోకపోతే వచ్చే 2019 ఎలక్షన్స్ లో సీటు ఇవ్వడం కష్టమేనని కూడా తేల్చేస్తూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు.

మోడీ విషయంలో ఇవ్వన్నీ చూస్తుంటే త్వరలో మన ప్రధాని మోడీ గారు భారతదేశానికి ఎదురులేని రాజుగా,నియంతగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం కూడా మోడీ ఎప్పుడు,ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియక అనుక్షణం భయంతో బ్రతుకుతూనే ఉన్నారు.

ఏది,ఏమైనా MPల, MLAల మద్దతు కోసం ప్రాకులాడుతూ పరిపాలక సీట్లలో కూర్చుని కూడా ఏమీ చేయలేక మద్దతు ఎక్కడ ఊడుతుందో, అధికారం ఎక్కడ చేజారిపోతుందోనని భయపడి తన క్రింది సభ్యులకు బానిసలుగా మారిపోయే ముఖ్యమంత్రి,ప్రధానమంత్రుల పదవులకు దీటుగా ప్రధాని మోడి MPలకు లొంగక పోవడం గొప్ప విషయం. ఇదే నిజమైన ప్రధానమంత్రి పీఠానికి ఇచ్చే గొప్ప గౌరవం.

పదవిలో ఎంతకాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు.ఎలా పరిపాలించాము? అన్నదే ముఖ్యం. దీనిని బట్టే భరతమాత ముద్దు బిడ్డలుగా మిగిలేది.చూద్దాం మన ప్రధాని నరేంద్రమోడి పరిపాలన సాగినంత కాలం భరతమాత ముద్దు బిడ్డగా ఉంటాడో,లేదో!!

శనివారం, ఆగస్టు 05, 2017

నిహారికా గారు తెలుగు బ్లాగుల లోకానికి తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. నిజానికి నిహారికా మేడం గారిలాంటి బ్లాగర్లు ఉంటే బ్లాగ్ ప్రపంచానికి కాస్త ప్రోత్సాహం, ఉత్సాహం వస్తాయి. ఇంకా ఎంతో మంది మంచి బ్లాగర్లు రావల్సివుంది. వారందరూ మళ్ళీ తెలుగు బ్లాగుల ప్రపంచానికి తిరిగి రావాలని కోరుకుందాం. మళ్ళీ తెలుగు బ్లాగుల ప్రపంచం పూర్వపు వైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుందాం! శుభం.!!!

Welcome back to the blog of Nehika Madam

శనివారం, జులై 29, 2017

నిన్న ఒక ఆధ్యాత్మిక సెలబ్రిటీని కలిసాను.ఎందుకో తెలీదు గాని ఆయనతో మాటలాడినప్పుడల్లా నాకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.లైఫ్ లో ఏదో సాధించాలన్న కసి పుడుతుంది.అంతగా ఆయన మాటలు నాకు ప్రేరణ కలిగిస్తాయి.మనకంటే గొప్పవారితోనే మన సంబంధాలు పెట్టుకోవాలి.లేదా మన రంగానికి సంబధించినవారితో నన్న కలిసి ఉంటే ప్రయోజనం ఉంటుంది.ఎదుటివారి గురించి చాడీలు చెప్పేవారి దగ్గర,ఎగతాళిగా మాటలాడేవారి దగ్గర అస్సలు కూర్చోకూడదు.మన సమయం వృధాతో పాటు,మానసికంగా అప్సెట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

   కొంతమంది మేధావులుంటారు.వీళ్లు తమ విషయాలేమీ తెలియనీయకుండా జాగ్రత్త పడుతూ...ఎదుటి వారి అన్ని విషయాలు కూపీలాగి మరీ తెలుసుకుంటారు.ఏదైనా ఇష్టంలేని పరిస్థితి వస్తే ఆ విషయాలన్నీ బైట పెడుతూ ఎంతో నష్టానికి గురి చేస్తారు.వీళ్లు మహా ప్రమాదకరమైన వ్యక్తులు.వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.


   ఏది,ఏమైనా మన సక్సెస్ పై ప్రభావం మన కలిగియున్న వ్యక్తులను బట్టి కూడా ఉంటుంది. జాగ్రత్త వహిస్తే మనకే మంచిది.ఏమంటారు?

శనివారం, జులై 15, 2017

Do-not-let-others-know-your-intentions-Hide-them.
సహజంగా మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దానిని ఇతరుల ముందు ఆరబోస్తూ ఉంటాం. నిజానికి ఇది చాలా అజ్ఞానపూర్వకమైన పనని నా అభిప్రాయం. ఎoదుకంటే మన పని కార్యరూపం దాల్చకుండానే  బయట పెడితే అది పూర్తవ్వడానికి చాలా టైం పడుతుంది. లేదా అది పూర్తవ్వకుండా మనమే అడ్డంకులను ఏర్పాటు చేసుకున్న వాళ్ళమవుతాము. కాబట్టి మన పని యొక్క ఉద్దేశాలను బయట పెట్టకండి. మీరు చేసే పనుల ప్రయోజనాలని ఇతరుల ముందు బయట పెట్టకుండా జనాన్ని అంధకారంలో ఉంచి కంగారు పెట్టండి. మీరేం చేయ్యబోతున్నారో ఏమాత్రం గ్రహించలేనప్పుడు వాళ్లు మిమ్మల్ని ఏం చేయడానికి సిద్ధంగా ఉండలేరు. వాళ్లు మీ ఉద్దేశాలని గ్రహించే సమయం వచ్చేటప్పటికి మీరు మీ లక్ష్యాన్ని సాధించేసి ఉంటారు. అప్పుడు మీ ఉద్దేశం ఎంత గ్రహించగలిగినా వాళ్లకి ఏవిధంగానూ ఉపయోగమూ ఉండదు. మీకు నష్టమూ ఉండదు. శుభం.
Do not let others know your intentions. Hide them.
Andhra,Telangana Teachers Notifications,10th,Inter,Degree,all Groups Model Papers and Question Papers, All Govt Jobs Notifications, latest job news...More. Please Visit the Teacherguide.in

శనివారం, జులై 08, 2017

Do-not-overdo-your-friends-Learn-how-to-use-enemies.
స్నేహాన్ని మించిన బంధం మరొకటి లేదని చెప్తారు. అది ఒకప్పటి మాట అయ్యుండవచ్చు. ఈరోజుల్లో స్నేహానికి విలువ లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కువుగా స్నేహితులే నమ్మకద్రోహానికి తలపడతారు. వాళ్ళు మన దగ్గర చనువు ఎక్కువ తీసుకుని మనని భాధ పెట్టడానికి కూడా వెనుకాడరు. మన వలన లాభం కలిగినప్పుడు ఒకలాగా, నష్టం కలిగినప్పుడు ఒకలాగా రియాక్ట్ అవుతూ ఉంటారు. పరిస్థితులను ఏమాత్రం అర్ధం చేసుకునే ప్రయత్నం చేయరు. అప్ కోర్స్ కొంతమంది మంచి స్నేహితులు ఉండవచ్చేమో గాని వెతికితే దొరకడం కష్టమే!

అదే మీరు మీ శత్రువుని ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకోండి. ఇక అతను మిమ్మల్ని నమ్మినట్టు మీ మిత్రుడు కూడా నమ్మడు. నిజానికి మనం శత్రువులకన్నా మిత్రులని చూసే ఎక్కువ జాగ్రత్త పడాలి. అతన్ని ఎంతవరకూ ఉంచుకోవాలో అంతవరకే. మీ ప్రతి వ్యవహారం అతని దగ్గర పెడితే ఎదో ఒకరోజు మీతో చిన్న సమస్య వచ్చినప్పుడు అతను వాటినన్నిటిని ఎత్తి చూపించి నిన్ను చులకన చేసి మాట్లాడుతాడు. కాబట్టి మిత్రుల పట్ల జాగ్రత్త అవసరం. శత్రువు ఎక్కడో పది ఉన్న పాము లాంటోడు అయితే మిత్రుడు పక్కలో ఉన్న బల్లెం లాంటోడు.
చిన్న గమనిక ఏమిటంటే నిజమైన మిత్రులుంటే వారికి సర్వధా హృదయ నమష్కారాలు.
Do not overdo your friends. Learn how to use enemies.
IIT Bombay Recruitment-2017
హాయ్ ప్రెండ్స్ IIT Bombay Recruitment ద్వారా Junior Mechanic, Jr. Technician, Jr. Laboratory Assistant Govt Jobs కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మీరు గాని, మీ బంధువులలో ఎవరైనా అర్హత ఉన్నవారు గాని అప్లయ్ చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు 17 ఉన్నాయి. అందులో 1.Junior Mechanic: 08 posts, 2.Junior Laboratory Assistant: 03 posts, 3.Junior Technician: 02 posts, 4.Assistant Security Inspector: 04 posts ఉన్నాయి.

ప్రతి పోస్టుకు క్రింది విధంగా Qualifications Required ఉండాలి.
Jr. Mechanic: Diploma in Electrical/ Electrical & Electronics Engineering discipline (03 years) with 2 years relevant experience or ITI in Power Electric Systems trade/ Electronics Mechanic Trade with 5 years relevant experience or Bachelor’s degree in Electrical/ Electrical & Electronics Engineering. Jr Laboratory Assistant: Diploma/ Bachelor’s Degree in Civil/ Mechanical Engineering Discipline or ITI in Machinist trade

మంగళవారం, జూన్ 13, 2017

ఈ మధ్యకాలంలో ఎక్కువుగా గోవధ నినాదం వినబడుతోంది. తినకూడదని హిందువులు (ఇక్కడ హిందువులు అనే కంటే రాజకీయ వర్గాలు, లేక కొన్ని మతపరమైన సంస్థలు అంటే బాగుంటుందేమో! ఎందుకంటే హిందువులలో కూడా గోమాంసం తినే వారు ఎక్కువగానే ఉన్నారు.) ఇక మరోపక్క ముస్లింలు వాదులాడుకుంటున్నారు. మొన్నా మధ్య పరిపూర్ణానంద స్వామివారు మాంసాహార నిషేధం శాస్త్రాలలో లేదు అని చెప్పారు. అంటే దైవ దృష్టిలో మాంసాహార నిషేధం లేదన్నమాట. మనిషిని సృష్టించిన దేవునికి తెలియదా? ఏది తినాలో,ఏది తినకూడదో? అందుకే కాబోలు మనుస్మృతిలో పంది నిషేధం ఉంది. అంటే దానిని తినకూడదు. ఆవులు,గుఱ్ఱాల నిషేధం లేదు వేదంలో! ఆనాటి రోజుల్లో యాగాలలోనూ,యజ్ఞాలలోనూ వాటిని బలిచ్చిన దాఖలాలు ఎన్నో వున్నాయి. కాబట్టి దాశరధి రంగాచార్య గారన్నట్టు నేటి గోవధ నిషేధం రాజకీయ నినాదం తప్ప వేద నినాదం కాదని ఆయన తేల్చి చెప్పేశారు.

     మనుషులకీ, ఇతర జీవరాసులకీ మధ్య ఒక వ్యత్యాసం ఉంటుంది....Read More

శుక్రవారం, మే 12, 2017

ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పోలీసు కానిస్టేబుళ్ల Recruitment విడుదల చేసింది. అర్హత ఉన్నవారంతా ప్రయత్నం చేయవచ్చు. ఎలా అప్లయ్ చేయాలి? కేటగీరీల వారీగా ఫీజులు ఎంత చెల్లించాలి? Exame Date.. తదితర వివరాలన్నీ మీకు ఈ క్రింది లింక్ లో దొరుకుతాయి. వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ఒకసారి చూడవచ్చు.

AP Police Constables Recruitment 2017 Apply Online for 800 new Police Constable Vacancies


బుధవారం, మే 10, 2017

హాయ్ ఫ్రెండ్స్ DEECET ప్రిపెరయ్యే వాళ్లందరికీ పూర్తీ ఇన్ఫర్మేషన్ క్రింది లింక్ లో కనిపిస్తుంది.దానిని క్లిక్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. చదివే వయస్సులో తీసుకునే జాగ్రత్త, శ్రద్ధ మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. దయచేసి కెరీర్ పట్ల అశ్రద్ధ చేయవద్దు.
DEECET వివరాలకు : AP DEECET 2017 Hall tickets, Exam Date Detailes

సోమవారం, మే 08, 2017

టీచర్లకు, స్టూడెంట్ల కొరకు ఉపయోగార్ధం నేను ఒక "Teacher guide" అనే సైట్ ప్రారంభించాను. దానిలో టీచర్లకు సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ అప్లోడ్ చేస్తూ, ఇంకా అన్ని తరగతుల మోడల్ పేపర్లు, క్వశ్చన్ పేపర్లు.. ఇలా ఏంతో సమాచారాన్ని అందిస్తూ వస్తున్నాను.

     ఆంధ్రా,తెలంగాణా రాష్ట్రాలకు సంబందించిన ఉద్యోగ సమాచారాన్ని కూడా అందిస్తూ వస్తున్నాను. ఈ వెబ్సైట్ కోసం నిరంతరం పని చేయడానికి ఒక అమ్మాయిని కూడా నియమించాను.
     
      ప్రియమైన బ్లాగ్ అభిమానులందరూ కూడా ఈ "Teacher guide" వెబ్సైట్ ను ప్రోత్సాహించవలసిందిగా కోరుచున్నాను. వివరాలకు చూడండి : http://www.teacherguide.in/

ఆదివారం, మే 07, 2017

ఏమిటో అర్ధమై చావడం లేదు. మంచితనం లేదు, ప్రేమ లేదు ఎటు చూసినా అన్యాయమే కనిపిస్తోంది. నా మిత్రుడు ఒకడు బ్లాగ్ ఒకటి తయారు చేయమని చెప్పాడు. సరే వీలు చూసుకుని ఒక వారం రోజుల్లో చేస్తానని చెప్పాను. నిన్న వచ్చి అలా అయితే ఎలా?  బ్లాగ్ చేసి ఇవ్వాలి కదా? నా బిజీ ని ప్రక్కన బెట్టి ఎన్ని సార్లు ఫోన్లు చేయమంటావు? అని అడిగేసరికి నాకు మైండ్ బ్లాక్ అయ్యిపోయింది. అంత పాయింట్ అవుట్ చేసి మాట్లాడవలసింది ఏముంది? పోనీ ఏమైనా బ్లాగ్ డిజైన్ కు డబ్బులు ఇస్తున్నాడా? లేదే? ఇదేమి దారుణం? నేను ఎక్కువుగా బాధ పడింది దేనికంటే మరొక మూడో వ్యక్తీ సమక్షంలో అలా మాట్లాడటం, అదీ కాక అతను వెళ్ళిపోయిన తరువాత నీతి కబుర్లు చెప్పడం మరీ దారుణమనిపించింది. ఏది,ఏమైనా ఇలాంటి వ్యక్తులను వదిలించుకోవడమే మంచిదని అనిపిస్తోంది. దీనికి మీరేమంటారో?

* Baahubali Success Secret & 3 Pillars of Rajamouli

శనివారం, మే 06, 2017

ఆంధ్రప్రదేశ్ Eamcet - 2017 లో జిల్లాల వారీగా ఎవరెవరు టాప్ స్థాయిలో నిలిచారో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఏప్రియల్ నెల నుండీ ఈ నెల 23వరకూ Google Update కార్యక్రమం మొదలు పెట్టింది. దీని కారణంగా మన ఇండియన్ వెబ్సైట్స్ అన్నీ ర్యాకింగ్ లలో చాలా దారుణంగా పడిపోయాయి.

బుధవారం, మే 03, 2017

శుభవార్త : ECIL Recruitment 2017 వచ్చింది.
ITI, Diploma, Degree (Engg) అర్హత ఉన్నవారు Technical Officer, Scientific Asst-A, Jr Artisan ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు.
వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.


గురువారం, ఏప్రిల్ 20, 2017

మనిషి యొక్క బాధ రెండు రకాలుగా ఉంటుంది.

ఎవరైనా తనకు తానే నష్టం కలిగించుకున్నప్పుడు ఎంత బాధనైనా భరించగలుగుతాడు. కాని ఎదుటి వారి వలన తనకు అన్యాయంగా నష్టం కలిగితే మాత్రం జీర్ణించు కోలేడు.

అగ్గి మీద చేయి పెట్టి మనకు మనమే కాల్చుకునే బాధ కంటే ఎవడో వచ్చి కాల్సినప్పుడు కలిగే బాధే కష్టంగా ఉంటుంది.

శుక్రవారం, మార్చి 24, 2017

8th,9th Class Social Studies papers లీకయిపోయాయట?

మన రాష్ట్ర ప్రభుత్వం కన్నుగప్పి కొంతమంది స్వార్ధపరులు ఇలా విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుకోవడం పరిపాటి అయ్యిపోయింది. ఇది ముమ్మాటికి దేశ ద్రోహం క్రిందే పరిగానిన్చావాల్సి వస్తుంది. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించనంత కాలం ఇటువంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. మరిన్ని వివరాలకు క్రింది లింక్స్ చూడండి.




బుధవారం, ఫిబ్రవరి 22, 2017

హాయ్ రీడర్స్ ఈరోజు మీకోసం ఒక మంచి సినిమాని పరిచయం చేస్తున్నాను. ఈ సినిమాని డౌన్లోడ్ చేసుకుని చూసారంటే మీరే ఆశ్చర్యపోతారు. సినిమా ఆద్యంతం ఎక్కడా బోరు కొట్టకుండా ఉంటుంది. చూసినంత సేపు చాలా ఉత్కంత భరితంగా ఉంటుంది.మీకు ఖాళీ దొరికినప్పుడు సరదాగా ఈ మూవీ ఎంజాయ్ చేయండి. సినిమా డౌన్లోడ్ లింక్ క్రింద ఇస్తున్నాను.
San Andreas (2015) 720p Telugu Dubbed 

బుధవారం, ఫిబ్రవరి 01, 2017

బ్లాగ్ వివాదా చర్చల్లో ఎప్పుడూ నిలిచి పోరాడే ధీర వనిత నిహారికా మేడం గారు ఈమధ్య బ్లాగు లోకంలో కనిపించడం లేదు. ఆమె వ్రాసే టపాలను ఎక్కువుగా చదివే వాళ్ళలో నేనూ ఒకడిని. ఈమధ్య అగ్రిగేడర్ లలో వెతుకుతుంటే ఈమెగారి బ్లాగు అసలు కనిపించడం లేదు. ఇంతకీ నిహారికా మేడమ్ గారికి ఏమయ్యింది? ఆమెగారు సమాధానం ఇస్తే సంతోషం.

బుధవారం, జనవరి 25, 2017

Angels and Demons అనే తెలుగు డబ్బింగ్ సినిమా చూడడానికి బాగుంటుంది. కాస్త ఇంట్రస్ట్ గానే ఉంటుంది. మనం పనులతో విసిగి వేసారిపోయి గూటికి చేరుకున్నప్పుడు వెంటనే Fresh అయ్యిపోయి, రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ ఎదురుగా TV లో మూవీని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ కావచ్చు. అటువంటి వారికి కావాల్సిన తెలుగు డబ్బింగ్ సినిమాల బ్లాగ్ TELUGU MOVIEZ. దీని నుండి ఉత్సాహంగా చూడాలనిపించే సినిమా : Angels and Demons ను డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. వీలయితే ఈ మూవీ యొక్క REVIEWS చదువుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

గురువారం, జనవరి 12, 2017

ఒకొక్కరు ఒకో విధంగా చెప్తున్నారు. కొందరు ఖైదీ నెం:150 అంటుంటే మరికొందరు శాతకర్ణి అంటున్నారు. బహుశా వారి అభిమానాన్ని బట్టి చెప్తున్నారు అనుకుంటా! నా అంచనా ప్రకారం శాతకర్ణి, ఖైదీ నెం:150 కంటే బాగుండవచ్చు. ఎందుకంటే చరిత్రకు సంబంధిన సినిమా కాబట్టి ఎక్కువ ఆకర్షించవచ్చు. ఇకపోతే చిరంజీవి చాలా సంవత్సరాల తరువాత సినిమా తీసినప్పటికీ అతను పెట్టిన "ప్రజారాజ్యం" పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసేసి పెద్దగా జనంలో ప్రచారం లేకుండా పోవడం కూడా కొద్ది దెబ్బ తగలవచ్చు. ఒకప్పుడు చిరంజీవి సినిమా అంటే మామూలు క్రేజ్ కాదు. కాని ఇప్పుడది పెద్దగా కనిపించడం లేదు. వాళ్ళ పట్ల ఉన్న సినీ అభిమానాన్ని ప్రక్కన బెడితే ఆ రెండు సినిమాల్లో ఏది కధాంశం బాగుందో దాన్నే ప్రజలు ఆదరిస్తారన్నది మాత్రం అక్షరసత్యం.

శుక్రవారం, జనవరి 06, 2017

ఈరోజు మీకు తెలుగు డబ్బింగ్ సినిమాలన్నీ ఒకే చోట అందించే బ్లాగును పరిచయం చేస్తున్నాను.ప్రతిరోజూ ఆ బ్లాగులో సూపర్ హిట్ మూవీస్ అప్లోడ్ అవుతున్నాయి.మీరూ ఒక లుక్ వేయండి మరి.
లింక్ : Telugu Moviez

 


Recent Posts