మంగళవారం, నవంబర్ 29, 2016

మనిషికి కావల్సిన ఆనందాలు,సంతోషాలు కేవలం పూర్తి డబ్బులోనే లేవు.వీటిని పొందటానికి మాత్రం డబ్బు కూడా ఒకటి.ఈ మాట మీకు అర్ధం కాకపోవచ్చు.వింతగా అనిపించవచ్చు.కాని నిజం.
      మనిషి సంతోషంగా జీవించడానికి కావల్సిన వాటిలో డబ్బు  ప్రధానమైనది తప్ప..డబ్బే అన్నీ కాదు.డబ్బు ఏ కష్టo లేకుండా బ్రతకడానికి కావాలిగాని, కేవలం డబ్బు కోసమే బ్రతకడం ప్రారంభిస్తే అన్నీ కష్టాలే!అశాంతిమయాలే!!
      అతి అన్ని విషయాలలో ప్రమాదమే!అలాగే డబ్బు విషయంలో కూడా!
      అయితే మనిషి ఆ డబ్బు సంపాదన విషయంలో ముందుండాల్సిందే!
      హ్యాపీగా బ్రతకడానికి అతని దగ్గర డబ్బు లేకపోతే అతనికి ఏవిధమైన గుర్తింపు లేదు.సమాజంలో గౌరవం లేదు.
 ఆర్ధికబలం ఉన్నవాడికే సమాజం అండగా నిలుస్తుంది.తప్ప మంచి చెడులను బట్టి అస్సలు కాదు.
      ఎన్ని కుంభకోణాలు చేసిన నాయకుడైనా..ప్రజల మధ్య ఊరేగడం ప్రారంభిస్తే చేతులెత్తి నమష్కరిస్తుంది సమాజం.మనుష్యులను ఆ విధంగా తయారుచేస్తుంది డబ్బు.కాని వాళ్ల వ్యక్తిగత జీవితాలలో మాత్రం అలజడులు,అశాంతులు తప్ప మనశ్శాంతి మాత్రం ఉండదు.
     సరిపడే డబ్బే సంతృప్తి...అంతకు మించితే అనర్ధమే!
     నేనొకసారి కడపలో ఓ ఆధ్యత్మిక సభలోకి అతిధిగా వెళ్లినప్పుడు నా సందేశం ముగిసిన తరువాత ఓ ముస్లిం పండితుడు చక్కని కధ చెప్పాడు.
     ఆ ఊరి జమిందారు రాత్రి నిద్రపట్టక అతని ఇంటిపైన పచార్లు చేస్తున్నాడట.అయితే ఆ ఇంటికి దగ్గరలో ఉన్న చెట్టు క్రింద ఓ భిక్షగాడు దోమలు ఎంత కుడుతున్నా పట్టించుకోకుండా ఆదమర్చి నిద్రపోతున్నాడు.ఈ దృశ్యం జమిందారిగారి కంటబడింది.మనస్సులోనే అనుకున్నాడు"ఎంత విచిత్రం..నాకు గదిలో పడుకోవడానికి పరుపు,దుప్పట్లు,గదినిండా చల్లటి ఎ.సి ఉన్నా నాకు నిద్రలేదు.ఈ భిక్షగాడు చూస్తే అంత చలిలో అన్ని దోమకాట్లు మధ్య నిద్రపోతున్నాడు.
    జమిందారికి "నా బ్రతుక్కంటే నీ బ్రతుకే బాగుంది అనుకుని ఆ భిక్షగాడిని మనస్సులోనే అభినందించాడు.
 మర్నాడు ఉదయమే భిక్షగాడిని కల్సి ఓ వందరూపాయలు ఇచ్చి వచ్చాడు.
    ఆరోజు రాత్రి యధావిధిగా జమిందారుగారు తన డాబాపై తిరుగుతూ చెట్టు క్రింది భిక్షగాడు నిద్రపోకుండా దోమలను తోలుతూ కూర్చోవడం చూసాడు.జమిందారుగారు ఆశ్చర్యపోతూ డాబాపైనుండి క్రిందికి వచ్చి భిక్షగాడిని అడిగాడట ఎందుకు నిద్రపోలేదని?
    దానికి భిక్షగాడు "అయ్యా! ఉదయం మీరిచ్చిన 100రూపాయలలో 90రూపాయలు ఖర్చయింది.ఇంకా నాదగ్గర 10రూపాయలున్నాయి.వాటిని ఎవడు కొట్టేస్తాడోనని నిద్రపట్టడం లేదు బాబయ్యా అన్నాడట!
    ఏది ఏమైనా డబ్బు ప్రోగు వేతే మనిషి లక్ష్యం అయితే అతనికి మనసిక శాంతి కరువే!!

సోమవారం, నవంబర్ 14, 2016

ఇప్పటివరకూ ఏ ప్రధాని చేయని ఒక సంచలనాత్మక పని మన ప్రధాని నరేంద్ర మోడీ జీ చేసారు. 500రూ//, 1000రూ// నోట్లను రద్దు చేసి, కొత్త నోట్లను ప్రవేశ పెట్టడం వలన పూర్తిగా దొంగ నోట్లను నిరోధించవచ్చు. అయితే దొంగడబ్బు [నల్లధనం] ను పూర్తిగా నిరోధించడం సాధ్యం కాకపోవచ్చు. మనిషిలో నీతి,నిజాయితీ అడుగంటిపోయినప్పుడు ఇటువంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తిగా సఫలీకృతం కావు. కానీ నరేంద్ర మోడీ గారూ పూర్తీ నిబద్ధతతో తన పని తాను చేసుకుపోవడం భారతదేశానికే శుభసూచకం.

ఇప్పటికే బడా బాబులు తమ వద్ద ఉన్న నల్లడబ్బులను మార్చేసుకున్నారని గట్టి వాదన వినిపిస్తోంది. నల్ల ధనాన్ని నిరోధించడం అనేది చాలా కష్టమని సర్వేలన్నీ చెప్తున్నాయి. 

నరేంద్ర మోడీ వీటిపై శ్రద్ధ ఎక్కువే పెట్టాలి. పేదవాడి కడుపు కొట్టి మెక్కుతున్న ఈ బడాబాబులను రచ్చకీడ్చవల్సిందే. దీని కోసం ఏమి చేయాలి?

ఈసారి నోట్లు బదులు బంగారం దాచుకునే ప్రక్రియ మొదలవుతుంది. ఇదే జరిగితే సామాన్యుడికి బంగారం ధర ఆకాశంలో కనిపిస్తుంది.

ఎందుకంటే పంది - రోత తినడం మానివేయడానికి, మురికిగుంటల్లో దొర్లకుండా ఉండడానికి ఇష్టపడదు. అది దాని నైజం. ఈ నల్ల కుబేరులు కూడా పందిలాంటి వారే! అన్యాయంగా దోచుకోకుండా బ్రతకలేరు. పందిని చంపడానికి ఎంత కష్టపడాలో వీళ్ళ అవినీతిని చంపడానికీ అంతే కష్టపడాలి. ఏదో విధంగా ఈ పనిలో ముందుకు నెట్టుకొస్తున్న మన ప్రధాని నరేంద్ర మోడీకి మనం కూడా మన వంతు సాయం చేద్దాం దీనికి మీరేమంటారు?

శనివారం, నవంబర్ 12, 2016

టీనేజీలో  వున్న మనకు అమ్మమ్మ ,నానమ్మ ,తాతయ్య లతో ఒక్కోసారి చక్కటి స్నేహం కుదురుతుంటుంది.కానీ సమస్యంతా "టెక్ " విషయాల్లోనే . వాళ్ళకి ఆ విషయాలు పెద్దగా పట్టవు కాబట్టి విసుకుంటూ వుంటారు .అలాంటివారికి  ఇలా కొత్త సాంకేతికత నేర్పించవచ్చు.

వాళ్ళ ఆసక్తిని బట్టే : అరుదుగానే కాదు.అసలే కనిపించని ఎన్నో పాత సినిమాలూ, నాటితరం తెలుగు పాటన్నింటికీ ఇంటర్నెట్ లో దొరుకుతున్నాయిప్పుడు. వాటిని వినడం, చూడటం అంతర్జాలం ద్వారా ఎంత సులువో వారికి చెప్పండి. వాటిల్లోకి ఎలా వెల్లాలో చూపండి. ఆ ఆసక్తిని బట్టి.. ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లో ప్రాధమిక కమాండ్స్ ని నేర్పించండి.

కార్డులతో : ఇప్పుడు దాదాపు ప్రతి బ్యాంకూ ఆన్లైన్ సేవలు అందిస్తోంది. వృద్ధాప్యంలో ఉన్నవారికి గంటల తరబడి బ్యాంకుల్లో క్యూలో నిల్చుని డబ్బులు వేయడం, తీయడం వంటివి వీటివల్ల తప్పుతాయి. ఆన్ లైన్ కీ తీసుకొచ్చే అతి దగ్గరి దారి ఇది. కాకపోతే ఈ విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం మరిచిపోవచ్చు.

అవి ఉత్తమం : పెద్దవారికి ల్యాప్ టాప్ స్మార్ట్ ఫోన్ ల కంటే ట్యాబ్ లెట్ చక్కగా నప్పుతాయి .ఆ రెండింటి తో పోలిస్తే వీటిలో సాంకేతిక ; కొంత తక్కువ. మీకు వీలుంటే వాటితో నే ప్రాథమిక పాఠాలు నేర్పించండి .

ఆ మాద్యమాలు :facebook లాంటి వాటితో ఎప్పుడో కాలేజీ లో చదివినప్పటి స్నేహితులందరూ కలిసి online బృందంగా ఏర్పడే అవకాశం అందివస్తుంది . ఒక్కో లంకెని పట్టుకుంటూ ..వారి స్నేహితుల్ని వెతకడంలో మీరు సాయపడండి .చూస్తుండగానే ..మీ ఇంటి పెద్దవారు సాంకేతికతని అక్కున చేర్చుకుంటారు .    

శుక్రవారం, నవంబర్ 11, 2016

ప్రతి ఒక్కరూ లక్ష్యాలు పెట్టుకుంటారు. అవి ఉద్యోగం,విద్యా,పదోన్నతి... ఇలా ఏదైనా కావొచ్చు.కానీ వాటిని చేరుకొనేది కొందరే.అవకాశాలు మాత్రం అందరికీ సమానంగానే ఉన్న... ప్రయత్నించే మార్గాలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి...ఇలాంటప్పుడు మహిళలను ఏమీ చెయ్యలేకపోతున్నామనీ లేక మరోకారనమో చెబుతూ నిరాశను దరిచే రనిస్తే... ఆ ప్రయత్నం అక్కడితోనే ఆగిపోతుంది.లోటు పాట్లను అధిగమించి ఉన్నత శిఖరాలను చేరాలంటే!

లక్ష్యం ఏర్పర్చుకోకుండా ఊహాల్లో మేడలు కట్టి గమ్యం చేరాలని తహతహలాడే వారు కొందరైతే,ఆలోచన బాగున్నా... ఆచరణ లోపంలో కుంగిపోయేవారు మరికొందరు. పక్కా ప్రణాళిక, మీ మీద మీరు నమ్మకాన్ని స్త్రీరపరుచుకుంటే ఎంతటి కష్టాన్నైనా సులభంగా దాటేయగలుగుతారు. ఇలాంటప్పుడు మీ వాస్తవిక సామార్ద్యాలను మాత్రమే అంచనా వేసుకోవాలి. అలచచేయ్యనప్పుడే అపజయానికి ఆస్కారం ఎక్కువ. ఊహాజనిత ఆలోచనలు విలువైన సమయాన్ని వృధా చేస్తాయి. నిజానికి మీకో ఆలోచన వచ్చిందంటే అది ఎంతవరకూ సాద్యమవుతుందో ఆనుకూల,వ్యతిరేకతలను ఓ పుస్తకంలో రాసుకొని ఒకటికి రెండు సార్లు చూడండి. మీకే అర్దం అవుతుంది. ఈ సమస్యను అదిగమించగలిగితే మీ ప్రయాణంలో మొదటి అడుగు విజయవంతంగా పడుతుంది.

విజయాలు సాదించాలనేవారు తరచూ మనకు తారసపడుతూనే ఉంటారు.  అది వారికే పరిమితం కూడా కాదు. ఆవతలివారి విజయాన్ని మనస్ఫూర్తిగా ఆంగికరించగలగాలి. వారికి బలం అనుకున్నవి మమీలో ఏం లోపించాయో గమనించుకుంటే మీ పై  మీరు ఓ అంచనాకు రావోచు. అవసరాన్ని బట్టి మీలో అంతర్గతంగా అభిరుచులకు, ఆసక్తులకు నైపుణ్యాలకూ పదునుపెట్టండి. మీ శక్తి యుక్తుల్ని పూర్తి స్తాయిలో వినియోగించుకోగలిగితే మీరనుకున్న ఫలితం మీ సొంతం అవుతుంది.

ఎవరి సామార్ధ్యం మేరకు వారు పని చేస్తారు.  ఇతరులతో పోల్చుకోవడం వల్ల ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయో తప్ప గమ్యం చేరుకోలేరనే విషయాన్ని మొదట గుర్తించండి. దానికి బదులు ఇతరులను ప్రేరణగా తీసుకొని ఎదిగే ప్రయత్నం చెయ్యడం వల్ల ఫలితం ఉంటుంది . ఆపజయాలు ఎదురైనప్పుడు ఆత్మ పరిశీలన అవసరమే. కానీ ప్రతి సారి నేనేమీ చేయ్యలేకపోతున్నాననే భావన వల్ల నిరాశ పెరిగిపోతుంది. ఒకవేళ ఓడిపోతే... మీ ప్రయాణం ఆగిపోదు.ఓటమి నుంచే పాఠాలు నేర్చుకుని అడుగులు వేయండి .తిరుగులేని విజయం మీ సొంతమవుతుంది.      

సోమవారం, నవంబర్ 07, 2016

'ఆడపిల్లైనా పెద్దచదువులు చదివించాం. కానీ ఉద్యోగం రాలేదు...! అని పెద్దవాళ్ల బాధ. 'నాతో చదువుకున్న వాళ్లందరూ ఏదో రకంగా స్థిరపడ్డారు. నేను మాత్రం ఇలా..' ఆణి మీలో నిస్పృహ. ఇలాంటి ఎన్నో ప్రతికూల భావాలకి కారణమవుతుంది నిరుద్యోగ దశ ఆ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం రండి.

నాటి విజయాలు:
 ఉద్యోగం లేకపోవడం దేని గురించి ఆలోచించనివ్వదు. కాలేజీలో విద్య, క్రీడలూ,ఇతర అంశాల్లో మీరు అందుకున్న గెలుపు, చదువుని విజయవంతంగా ముగించిన విధానం.. ఇవన్నీ మరిచిపోతుంటాం.నాటి విజయలన్నింటినీ ఓసారి గుర్తుచేసుకోండి. మీ అధ్యాపకుల అభినందనలు నెమరేసుకోండి. వీలైతేఓసారి వెళ్లి వాళ్లని కలవండి. అది మీకు కొత్త నమ్మకాన్నిస్తుంది.

ప్రయత్నలోపం లేకుండా...:
 ఉద్యోగం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నాన్నీ రాయండి. ఇంతవరకూ ఉద్యోగం రాకపోవడానికి కారణాలు గుర్తు చేసుకోండీ. నైపుణ్యాల లోపం ఉందనిపిస్తే.. వాటిని భర్తీ చేసేందుకు ప్రయత్నించండి. శిక్షణలో చేరండి. మరో విషయం. కంపెనీలకి మీరు నచ్చకపోవడమేకాదు.. మీకు నచ్చని సంస్థలను వద్దనుకున్న సందర్భాలూ ఉండొచ్చు. రాజీపడి ఏదో ఒకదాంట్లో చేరడంకన్నా.. మంచిదానికోసం వేచి ఉండటం ఉత్తమమని తెలుసుకోండి. 

పోలికలొద్దు:
ఇప్పటికే ఉద్యోగంలో స్థిరపడ్డవారితో పోల్చుకోవడంవల్ల ప్రతికులభావాలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఇంటర్వ్యూలూ బృంద చర్చలకు వెళ్లాల్సిన మనలో ఇవి తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి. ఎప్పటికప్పుడు మన ఆలోచనల్ని జాగ్రత్తగా పరిశీలించడం ఒక్కటే దీనికి పరిష్కారం. మీ మనసు ప్రతికూల భావాల్లోకి వెళుతోందనిపిస్తే.. చటుక్కున సానుకూల అంశాలపై దృష్టిమరల్చండి. మీకు నచ్చిన అభిరుచి పై మనసుని లగ్నం చేయండి.

 


Recent Posts