గురువారం, అక్టోబర్ 06, 2016

అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్ సన్ విషయమే తీసుకోండి. అధ్యక్షడు కావటానికి ఎంతో కాలానికి ముందే జాన్ సన్ అనునయంగా ఇతరులని ఒప్పించే తన అద్భుతమైన శక్తిని అభివృద్దిపరచుకునే క్రమంలో విజయనికి 10సూత్రాల ప్రణాళికని రూపొందించాడు. అధ్యక్షునితో కొద్దిపాటి పరిచయంవున్న వ్యక్తి ప్రతీ వ్యవహారంలోనూ అతను తన నియమాలను తు.చ. తప్పకుండా అనుసరించేవాడని గ్రహిస్తాడు. అవేమిటంటే-
1. పేర్లు జ్ఞాపకం ఉంచుకునే అలవాటు చేసుకోండి. ఈ విషయంలో మీరు అశ్రద్ధవహిస్తే, తనంటే మీకంతగా ఇష్టంలేదని అవతలి వ్యక్తి అనుకునే ప్రమాదం వుంది. 
2. మీరు హాయిగా సాదాసీదాగా ఉండండి, మీతో సమయం గడపటానికి అవతలివ్యక్తికి ఎటువంటి యిబ్బంది ఉండకూడదు. అన్నీ విషయాలు తెలుసునన్నట్లు ఎంతో అనుభవజ్ఞుడైన వ్యక్తిలా ఉండండి. 
3. మనస్సుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. దుర్భరమైన పరిస్థితులకు కూడా అది చలించకూడదు.
4. ఆత్మసుత్తి చేసుకోకండి, మీకే అన్నీ తెలుసునన్న భావన ఇతరులకి కలిగించకండి. 
5. అందరూ మిమ్మల్ని ఇష్టపడేలా ప్రవర్తించండి. జనాన్ని ఆకర్శించండి, మీ పరిచయ భాగ్యం వల్ల తమకెంతో లాభం చేకూరుతోందని వాళ్లనుకోవాలి. 
6. మీ వ్యక్తిత్వంలో మీకు తెలియకుండా, అంతర్భాగంగా వున్న అంశాలను కూడా వెలికిదీసే ప్రయత్నం చెయ్యండి.
7. సుహృద్భావంతో మీరు అపార్ధం చేసుకున్న, యిప్పుడు చేసుకుంటున్న అంశాలని దూరం చేసుకోవడానికి నిజాయితీగా ప్రవర్తించండి. మీ బాధలని మరచిపోండి.
8. జనాన్ని ఇష్టపడటానికి ప్రయత్నించండి, కాలక్రమణ వాళ్లని నిజంగానే మీరు అభిమానిస్తారు. 
9. ఎవరైనా ఏదైనా సాధించనప్పుడు వారిని అభినందించే అవకాశాన్ని ఎప్పుడూ జారవిడవద్దు, అలాగే దూ:ఖంలో ఉన్నప్పుడు, నిరాశ అనుభవిస్తున్నప్పుడు వారికి మీ సానుభూతి తెలియజేయండి. 
10. జనానికి అధ్యాత్మికబలాన్ని అందజేయండి, వారు మిపట్ల నిజమైన ఆప్యాయత కనబరుస్తారు. 
జనం మిమ్మల్ని ఇష్టపడేలా చేసే ఈ 10 సాధారణమైన, [అయినాశక్తివంతమైన] నియమాలు ప్రెసిడెంట్ జాన్ సన్ కు ఓట్లు సులభంగా పడటానికి, ఆయన కాంగ్రెసులో మద్దతు సంపాదించటానికి పనికివచ్చాయి. ఈ 10 నియమాలతో జీవించటం వల్ల ప్రెసిడెంట్ జాన్ సన్ ని పైకెత్తటం సులువైంది. 
ఈ నియమాలను మరోసారి చదవండి. ఎక్కడా ప్రతీకారం తీర్చుకునే విషయం ప్రస్తావించబడలేదన్నది గమనించండి. అపార్ధాలు లేకుండా చెయ్యడానికని అవతలివ్యక్తి ముందుగా మీ దగ్గరకు రావాలని ఎదురుచూడటం కూడా ప్రస్తావించబడలేదు. 'నాకే అంతా తెలుసు, తక్కినవళ్లంతా వట్టి మూర్ఖులు' అని కూడా ఇక్కడ అనలేదు.   

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts