సోమవారం, అక్టోబర్ 31, 2016

ఆఫీసులో ఇంట్లో ఉన్నన్ని సౌకర్యాలు ఉండొచ్చు.కానీ ఎదురుచూసే వాళ్లుండరు.ప్రేమించే వాళ్లుండరు.కొసరికొసరి వడ్డించే వాళ్లుండరు.అందుకే ఆరైపోగానే అంత ఆరాటం.ఉద్యోగ జీవితంలో అద్భుతవిజయాలు సాధిస్తే చాలు,ఇంకేం అక్కర్లేదనుకునే కెరీర్ జీవులకు ఆ గెలుపు జీవితంలో సగమేనని,ఒక భాగమేనని తేటతెల్లమైపోతోంది. మరో సగం,ఇంకో భాగం...కుటుంబమనే సంగతి అర్ధమవుతుంది."కుటుంబానికి ఇంకాస్త సమయం కేటాయించాలన్న లక్షల మంది దంపతుల నిర్ణయం.

   అంతవరకు బాగానే ఉంది.సమస్యంతా వ్యక్తిగత,వృత్తిజీవితాల మధ్య సమతూకం పాటించడంలోనే.ఆఫీసులో అనుకున్న సమయానికి లక్ష్యాలు పూర్తికావు.ఎంత తొదరగా గూడు చేరుకుందామన్నా ,అర్ధరాత్రి దాటే పరిస్థితి.అందుకే "ఎంత సమయం కేటాయిస్తున్నామన్నది ప్రక్కన పెట్టండి.ఎంత సంతోషంగా గడుపుతున్నామనే కోణంలోంచి చూడండి.అది పావుగంటే కావచ్చు.కాని లీనమయిపోండి. ఇల్లే సర్వస్వం కావాలి.ఆఫీసు,టార్గెట్లు...ఏవీ గుర్తుండకూడదు."అని సలహా ఇస్తారు.ఫ్యామిలీ కౌన్సెలర్స్ పదిలంగా అల్లుకున్న పొదరిల్లు గుర్తుకొస్తోందా! శుభం.

శనివారం, అక్టోబర్ 29, 2016

యూట్యూబ్ అందుబాటులోకి వచ్చాక సినిమాలు చూసే వాళ్ల తో పాటు తీసే వాళ్లు సంఖ్యా బాగా పెరిగింది. ఐదు నిమిషాల లఘు చిత్రంతో దర్శకత్వ అవకాశాలు పట్టేసిన వాళ్లు, రెండు నిమిషాల వీడియేతో హీరో ఛాన్స్ కొట్టేసిన వాళ్లూ ఎప్పటికిప్పుడు వార్త ల్లోని వస్తూనే ఉన్నారు. సినిమాలకు పని చేయాలని పెద్దగా ఆసక్తిలేకపోయిన తమ ప్రతిభను చూపించుకోవాలని అనుకునేవాళ్లూ చాలామందే ఉంటున్నారు. వీళ్లకి ప్రపంచానికి మద్యా ఇంటర్నెట్  వారధిలా పనిచేస్తోంది ఆ ఇంటర్నెట్ సాయంతో వీలైనంత మందికి అవకాశాలు కల్పిస్తోంది చాయ్ స్టోరీస్ అనే సంస్థ ఒకరికి మంచి కెమెరా పనితనం ఉండొచ్చు. ఇంకొకరు బాగా నటించొచ్చు మరొకరు కత్తిలాంటి కధలు రాయొచ్చు.కానీ సరైన బృందంలేక వాళ్లు ప్రతిభ వృధా అయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఒక్కో రంగంలో ప్రతిభ ఉన్నవాళ్లందరినీ ఒకే వేదిక పైకి తీసికొచ్చి వాళ్లందరితో కలిపి వారానికొ లఘు చిత్రం తీసి, సాధారణ సినిమా ల్లానే ప్రతి శుక్రవారం వాటిని అంతర్జాలంలోకి విడుదల చేస్తోంది చాయ్ స్టోరీస్.

కుర్రాళ్ల కోసమే...

'యువ సినీ ప్రేమికుల ప్రపంచానికి స్వాగతం... చాయ్ స్టోరీస్ వెబ్ సైట్ లోకి ప్రవేశించగానే కనిపించే మాట ఇది. ఆ మాట ప్రకారమే అక్కడ యువకులకూ యువతను ఆకర్షించే కధలకూ, ఆలోచింపజేసే అంశాలకే ప్రాధాన్యం. వాట్సాప్ లో వచ్చే ఓ సరదా సందేశం, దేశాన్ని కుదిపేస్తోన్న సమస్య... ఎలాంటి నేపాధ్యాన్ని ఎంచుకున్నా ఓ పది నిమిషాల నిడివిలో సూటిగా చెప్పగలగాలి. వినోదం, ఫిక్షన్, నాటకీయత లాంటి అన్నీ అంశాలకు సంబందించిన చిత్రాలను తీసే అవకాశం ఉన్నా, ఇప్పటివరకు సరదాగా సాగుతూ సామాజిక స్పృహను రేకెత్తించే సినిమా లే ఎక్కువగా వచ్చాయి. ఒక్కసారి తీయాలనుకున్న అంశం ఓకే అయితే దానికి కావల్సిన లొకేషన్లు, కెమెరా, ఇతర సామగ్రినంతా సంస్థతే అందిస్తుంది. ఔత్సాహికులు చేయాల్సించల్లా ఓ అందమైన చిత్రాన్ని వీలైనంత వేగంగా సూటిగా తీసేసి ఇవ్వడమే. ఎంత మంది ఔత్సాహికులు వస్తూ పోతూ ఉన్నా తొలి రోజుల్లో ఏర్పడ్డ బృందమే చాయ్ స్టోరీస్ ద్వారా ఎక్కువ సినిమాలు తీస్తోంది. వాళ్ల చిత్రాలకు అభిమానులు ఎక్కువ ఉండటం, బోలెడన్ని అవార్డులూ రావడమే అందుకు కారణం.

చిత్రోత్సవాల్లో చోటు 

యానిమేషన్ రంగంలో సుధీర్ఘు అనుభవం ఉన్న షోయెబ్, మీనాజ్ అనే కుర్రాళ్లు, ఆలోచనల్లోంచి పుట్టిందే ఈ 'చాయ్ స్టోరీస్' ఆలోచన.ఆకాష్, దేవేష్, అభినయ్ లాంటి కొందరు స్నేహితులతో సరదాగా టీ తాగుతున్నప్పటి సందర్బంలో మాటల మద్యలో లఘుచిత్రాల అంశం ప్రస్తావనకు వచ్చింది వాటి ఆధారంగా సమాజం మీద ఎంతో కొంత ప్రభావం చూపించొచ్చని అనిపించింది. అంతే... అప్పట్నుంచి ప్రతి వారం ఒక్కో లఘుచిత్రాన్ని తీసి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. చాయ్ తాగేప్పుడు వచ్చిన ఆలోచన కాబట్టి సంస్థకు చాయ్ స్టోరీస్ అనే పేరు పెట్టేశారు. రెండేళ్లుగా దాదాపు వంద లఘు చిత్రాలను తీసి విడుదల చేశారు. పెద్ద సినిమాల్లానే వీటికి పోస్టర్లూ, టిజర్లు విడుదల చేయడం, ఆన్ లైన్ లోనే చిన్న చిన్న ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ రావడంతో పాటూ క్రమం తప్పకుండా చిత్రాలు వస్తుండటంతో వినియెగదారుల సంఖ్యా బాగా పెరిగింది. అందరికీ వర్తించే అంశాలనే కధా వస్తువుగా తీసుకోవడంతో అంతర్జాతీయ ప్రేక్షకులకూ ఈ చిత్రాలు నచ్చేస్తున్నాయి.అలా స్థానిక చిత్రోత్సవాలతో పాటు ఇటీవల స్పెయిన్ లో జరిగిన సినీ ఫోన్ ఇంటెర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు భారత్ తరపున '3ఏ ఎమ్' అనే 'చాయ్ స్టోరీస్' లఘు చిత్రం మాత్రమే ఎంపికైంది.రోడ్డు మీద కనిపించే ప్రతి వస్తువునూ కార్లో పెట్టుకుంటే ఎలాంటి అనర్దాలు వస్తాయనే ధీమ్ తో తీసిన హారర్ చిత్రమది.

పిల్లలకు సినిమా పాఠాలు 

కేవలం సినిమాలు తీయడంతో తమ బాద్యత పూర్తివుతోందని ఈ కుర్రాళ్లు అనుకోవడం లేదు. సాధారణ విద్యార్ధుల్లానే స్వచ్ఛంద  సంస్థలు, హాస్టళ్లలో ఉండే పేద పిల్లల్లోనూ సినిమాలకు సంబంధిచిన అంశాలను నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటుందని గ్రహిచారు. మామూలు విద్యను వాళ్లను చాలామంది అందిస్తారు కానీ ఇలాంటి దృశ్య మాద్యమానికి సంబంధించిన శిక్షణ మాత్రం ఎవరూ ఇవ్వరు. అందుకే ఆ భాద్యతనూ చాయ్ స్టోరీస్ తీసుకుంది. వారం వారం వివిధ స్వచ్ఛంద సంస్థలకు వెళ్లి అక్కడి పిల్లలకు కెమెరా,నటన, దర్శకత్వం లాంటి ప్రాధమిక అంశాలకు సంబంధించిన శిక్షణ ఇస్తోంది డిజిటల్ మీడియాను సమర్ధంగా ఉపయెగించుకుంటూ సామాజిక మార్పు కోసం పనిచేస్తున్నందుకు దక్షిణాసియా స్థాయిలో ఇచ్చే మంధన్ అవార్డూ ఈ ఏడాది చాయ్ స్టోరీస్ కు దక్కింది 'వంద మాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క దృశ్యంలో చూపించొచ్చు. అందుకే సమాజానికి మేం అనుకునే విషయాలను తెలియజేయడానికి ఆ మాధ్యమాన్నే ఎంచుకున్నాం' అంటారు షోయబ్.ఆ ప్రయాణంలో మీరూ భాగమవ్వాలనుకుంటే 'చాయ్ స్టోరీస్. కామ్ 'ని చూడండి.    

మంగళవారం, అక్టోబర్ 25, 2016

పేపర్ తీస్తే తల్లి మందలించిందని ఆత్మహత్య, ఎంసెట్ లో ర్యాంకు రాలేదని ఆత్మహత్య, గురువు మందలించడని,తండ్రి తిట్టడని, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కాలేదని, సమైక్యాంధ్ర కావాలని, తమకిష్టమైన నాయకుడు మరణించడని, ఇంకేదో కావాలని, జీవితంపై విరక్తి కలిగిందని ఇలా ఏదో ఓ సాకుతో ఈ జీవితాన్ని ముగిస్తున్నారు.

ఆశయం, లక్ష్యం, గురి, ఎయిమ్, టార్గెట్ ఈ పదాలు మనకు సుపరిచితమే. ఈ పదాలే నేడు మనిషిని అతలాకుతలం చేస్తున్నాయి. తాత్కాలిక లక్ష్యాలు మనిషి ప్రాణాన్ని బలిగొంటున్నాయి. అహింసను ప్రేరేపిస్తున్నాయి. అలజడులను సృష్టిస్తున్నాయి.

లక్ష్యసాధన అంటే పోరాటం. పోరాటం అంటే కత్తి బట్టి కదనరంగంలో దూకడం కాదు. బైకాట్, ధర్నాలు ఆత్మహత్యలుకాదు. సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టడం, ప్రజల ఆస్తులను ద్వంసం చేయడం అంతకన్నా కాదు. లక్ష్య సాధనలో ఓ దృఢ సంకల్పం ఉండాలి, ఓ ప్రణాళిక ఉండాలి, అందుకు తగ్గ కృషి చేయాలి.

ప్రతి మనిషికి విభిన్న లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యసాధనలో మనిషి విభిన్న మార్గాలను అవలంభిస్తుంటాడు. అహింసకు తావులేకుండా సత్యమార్గంలో మానవతా దృక్పధం తో చేసే పోరాటమే ఉత్తమమైనది.

నేడు మనం లక్ష్యసాధనలో చేసే పోరాటంలో అహింస చోటు చేసుకుంటుంది. ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. 
మనిషికి ఆశయం ఉండాలి. ఆ ఆశయసాధన లో తగు కృషిచేయాలి. ఆశయ సాధకుడు ఎప్పుడూ అలుపెరగకూడదు. మంచి మార్గంలోనే మంచిని సాధించాలి. ఆత్మహత్యలు, బలిదానాలు చేసినా కలిగే ప్రయెజనం శూన్యం. ఆశయ సాధకునికి అపజయం ఎదురయ్యే ప్రతి దెబ్బ ఓ కొత్తపాఠాన్ని నేర్పాలి. మన ఆశయాలకు ఇంకా దృఢత్వాన్ని ఇవ్వాలి. అంతేకాని నిరాశ నిస్పృహలకు తవివ్వకూడదు. 

మనకు ఎదురయ్యే ప్రతి అపజయాన్ని విజయాలకు చిహ్నంగా గుర్తించాలి. పువ్వు పుట్టగానే పరిమళన్నిపంచినట్లు, ఆశయం పుట్టగానే ద్తెర్యాన్ని, సహనాన్ని పంచాలి.

నేడు ఆశయసాధనలో బలి అయ్యేది, బలిదానాలు చేసేది విద్యార్ధులే. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని తమ పిల్లల్ని చదివిస్తున్నారు. దానికి ప్రతిగా వారు శోకాన్ని అడియాసలు చేస్తున్నారు. వారి ఆకాంక్షలపై నీళ్లు చల్లుతున్నారు.

పేపర్ తీస్తే తల్లి మందలించిందని ఆత్మహత్య, ఎంసెట్ లో ర్యాంకు రాలేదని ఆత్మహత్య, గురువు మందలించడని,తండ్రి తిట్టడని, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కాలేదని, సమైక్యాంధ్ర కావాలని, తమకిష్టమైన నాయకుడు మరణించడని, ఇంకేదో కావాలని, జీవితంపై విరక్తి కలిగిందని ఇలా ఏదో ఓ సాకుతో ఈ జీవితాన్ని ముగిస్తున్నారు.

అర్ధాంతరంగా జీవితాన్ని అంతమొందించుకొని తల్లిదండ్రులను శోకసముద్రంలోకి నెట్టివేసి ఇహపర లోకాలను నష్టపరుచుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజనం? ఆత్మహత్యలతో ఆశయాలు నెరవేరుతాయా? అంటే అదీలేదు. ఈ త్యాగం మన అన్నవాళ్లకు, కన్నా తల్లిద్రండ్రులకు గుండెకోతనే మిగులుస్తుంది. అంతేకాదు ద్తెవాజ్ఞను ధిక్కరిస్తుంది.

ఖుర్ఆన్ లో దైవం. ఇలా తెలుపుతున్నాడు :''మిమ్మల్ని మీరే హత్యగావించుకోకండి'' [ఖుర్ఆన్]
ఇంకా దైవప్రవక్త [స] ఓ హదీసులో ఇలా తెలిపారు : ''మీరు ఏ స్థితిలో ఉన్న మరణాన్ని కోరకండి '' అని. అపర్ధాల ఆశయాల మత్తులో మనం అంధులైపోతున్నారు. దైవజ్ఞ, దైవప్రవక్త ప్రవచనం, కన్నా తల్లిదండ్రుల ప్రేమ - దేన్ని గుర్తించలేనంత అంధులవుతున్నారు. 

ఆశయం అంటే ఎంసెట్ లో ర్యాంక్, మెడిసిన్ లో సీటు లేదా ప్రత్యేక తెలంగాణ సాధించడం, సమైక్యాంధ్రను సాధించడం, ఇంకా ఏదో సాధించడం కాదు ఇవన్నీ జీవితంలో సాధించే వాటిలో భాగాలు మాత్రమే వీటి సాధనలో కృషిసలపాలి కానీ ఇవే అంతిమ లక్ష్యాలు మాత్రం కాదు. ఈ ఆశయాలతోపాటు అంతిమ ఆశయం 'పరలోక సాఫల్యం.' పరలోక సాఫల్యమే మన అంతిమలక్ష్యం లేదా ఆశయం. మరణమే ఈ ఆశయ సాధనలో అంతిమ దశ. దైవం మరణాన్ని ప్రసాదించేవరకు ఈ ఆశయ సాధనలో పాటుపడుతూనే ఉండాలి.

ఏకేశ్వరుడైన దైవాన్నే విశ్వసించడం, పరలోకద్యాస కలిగి ఉండటం, తల్లిదండ్రులతో విధేయతతో మెలగడం, మంచిని పెంపొందించడం, చెడును నిర్మూలించడం, తోటిప్రాణుల పట్ల కరుణా, దయ, జాలి కలిగి ఉండడం వంటివి ఈ ఆశయ సాధనలోని అస్త్రాలు. ఈ అస్త్రాలను వినియెగించుకుంటూ ముందుకు సాగితే జీవితంలో ఆటుపోట్లు ఏర్పడవచ్చేమో కానీ, లక్ష్యసాధనలో విజయం తప్పక ప్రాప్తమవుతుంది. మన ఆశయం నెరవేరుతుంది.  

శనివారం, అక్టోబర్ 22, 2016

గతంలో ఒక విషయం గురించి వివరాలకై మీరు చేసిన శోధన మీకు గుర్తుందా? నువ్వు కొనదలుచుకున్న కొత్త కారు గురించి నీకు సమాచారం అవసరం కావచ్చు. లేదా నువ్వు చాలాకాలంగా వాయిదా వేసుకుంటూ వస్తున్న సెలవు కాలం ఎలా గడపాలా అన్నదానిని గురించి కావచ్చు.కొద్ది సంవత్సరాల క్రితం బహుశా నువ్వు స్థానిక లైబ్రరీకి కానీ, పుస్తకాల దుకాణానికి కానీ సహాయం కోసం వెళ్ళి ఉంటావు. నేను కూడా అదే విధంగా చాలా పరిశోధన చేసేవాడిని. అటువంటి సమయంలో, రెండేళ్ల క్రిందట, ఒకరు నాకు ఇంటర్నెట్ ఎలా చూడలో చూపించారు. వావ్! - హఠాత్తుగా నా వేళ్ళకోసస సమాచారయుగం నిలిచింది.

ఇప్పుడు నేను ఇంటర్నెట్ ను ప్రధాన సమాచార పరికరంగా ఉపయోగిస్తున్నాను. ఉదాహరణకు, ఒక కొత్త మార్సిడిజ్ కారు ధర ఎంతో తెలుసుకోవాలంటే. నేను 'మార్సిడిజ్' అనే పదాన్ని వెబ్ బ్రౌజర్ సెర్చ్ బాక్సులో టైపు చేస్తాను. క్షణాల్లో డీలర్ షిప్పు దగ్గరనుంచి... ఫైనాన్సింగు దాకా... పాత పార్టులు... వేలం పాటలు... నాకు కావలసినది చూడడానికి వేల వెబ్ సైట్లు ప్రత్యక్షమవుతాయిఇంటర్నెట్ వలన నా పరిశోధన సాగించడానికి లైబ్రరీకి వెళ్లవలసిన పని తప్పింది లైబ్రరీయే నా దగ్గరకు వస్తుంది. 

అన్నింటికంటే విస్మయం కలిగించే విషయం ఏమిటంటే, మనం ఇంటర్నెట్ అని పిలుస్తున్నది ఇంకా బాల్యవస్థలోనే ఉంది. 2010 సంవత్సరానికి వెయ్యి కోట్ల ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుందని ఒక నిపుణుడు చెబుతున్నాడు. ఇది సమాచారయుగం అని ఊహిస్తున్నాను.

కొన్ని సంవత్సరాల క్రితం వరల్డ్ వైడ్ వెబ్ సౌకర్యంసైన్యంలో ఉన్న కొంత మంది కీలక వ్యక్తులకు మాత్రమే ఉండేది. ఎంత ప్రయత్నించినా ప్రెవేట్ వ్యక్తులు వెబ్ సౌలభ్యం పొందగలిగేవారుకారు. కానీ ఈరోజు కంప్యూటర్ ఉన్న ప్రతి ఒక్కరూ రోజుకు కొద్దిగా ఖర్చు పెట్టి తక్షణ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందగలరు. బెండ్ విడ్త్ పెరుగుతున్నకొలది, ఖర్చు మరింతగా కిందకు... కిందకు... కిందకుపోతోంది. 

ప్రజా నిరక్షరాస్యులుగా, ఆజ్ఞనులుగా ఉంటే క్షమించగల కాలం ఒకటి ఈ దేశంలో ఉండేది. ఆ రోజు ఎప్పుడో వెళ్లిపోయింది. ఎవరైనా సమాచారం, జ్ఞానం పొందాలని నిజంగా కోరుకున్నాట్లయితే, కొద్ది ప్రయత్నంతో వారు పొందగలరు. ఇంటి దగ్గర ఇంటర్నెట్ సౌకర్యం ఖర్చు భరించలేనివారికి దేశంలో ఉన్న వేల పబ్లిక్ లైబ్రరీల సౌకర్యం ఇంకా ఉంది. ఇవి ఉచిత లైబ్రరీలు. 

శుక్రవారం, అక్టోబర్ 21, 2016

సమాజాన్ని చూసినా, పరిస్థితులను చూసినా నాకేమీ అనిపించడం లేదు. 
అంతా అలజడిగానే అనిపిస్తోంది.
ఎవరి మధ్య సంబంధాలు పెద్దగా నిలబడటం లేదు.
రాజకీయ దోపిడీలు ఎంతకూ తగ్గడం లేదు.
సమాజాన్ని చెడగొట్టే సినిమాలు ఆగడమూ లేదు.
ఎన్నో...ఎన్నెన్నో...ఎన్నెన్నో..దారుణాలు.
సమాజం ఎటువెల్తుందో .. ఈ మనుష్యులు ఎటు పోతున్నారో..!

గురువారం, అక్టోబర్ 20, 2016

'సజీవంగా మిమ్మల్ని తినెయ్యకుండా షార్క్ చేపలతో ఈదండి' పుస్తక రచయిత హార్వే మెకే, చదువుకున్న శక్తి గురించి ఇలా అంటాడు:
మన జీవితాలు రెండు విధాల మారుతాయి - మనం 
కలిసే ప్రజల ద్వారా, మనం చదివే పుస్తకాల ద్వారా.
మీరు కొత్త వ్యక్తులను కలుసుకొనట్లయితే, కొత్త పుస్తకాలు చదవనట్లయితే ఏం జరుగుతుందో ఊహించండి. మీరు మారడం లేదు. మీరు మారనట్లయితే, మీరు ఎదగడం లేదు. విషయం ఇంత సరళమైనది. ఆనందంగా, డబ్బుకి ఏ ఇబ్బంది లేకుండా ఉన్న ప్రతి వ్యక్తి చదువరి కాదనీ, ప్రతి చదువరి సంతోషంగా, డబ్బుకి ఏ ఇబ్బంది లేకుండా లేదని నేను గుర్తిస్తున్నాను. ఇది వేరే చెప్పక్కర్లేదు. నేను చెప్పే విషయం ఏమిటంటే, నిన్నటి కంటే నేడు మెరుగుగా ఉండడానికి ఒక అడుగు ముందుండేలా మీరు ప్రయత్నించడం. జివన క్రీడలో గెలవడానికి నేను మాట్లాడుతున్నాను. చదువు గురించి మీ జీవితం లో అన్ని రంగాలలో సంపన్నులు కావడం గురించి నేను మాట్లాడుతున్నాను.
ఈ సమాచార యుగం లో, మీ ఇంట్లో పుస్తకాలుండి చదవకపోవడం, వ్యవసాయ యుగంలో విత్తనాలు చేతిలో ఉండి, వాటిని నాటకపోవడం లాంటిది. డెనిస్ వేట్ లీ మాటల్లో చెప్పాలంటే 'చెయ్యాల్సిన పని చెయ్యడానికి, నేర్చుకోవాల్సినది నేర్చుకునే వారిదే భవిష్యత్తు'. నీలి కాలర్ కార్మికుల కంటే 'విజ్ఞాన కార్మికులు' అధిక సంఖ్య లో ఉండే యుగంలో మీరు జ్ఞానం సంపాదించడానికి సంసిద్ధులవ్వండి... ఇప్పుడే సంపాదించండి.

బుధవారం, అక్టోబర్ 19, 2016

ఈ రోజుల్లో పుస్తకాల వ్యాపారం పెద్ద వ్యాపారం అన్నది నిజం. ప్రతి సంవత్సరం 60,000 కొత్త పుస్తకాలు ప్రచురితమవుతుంటాయి. గత దశాబ్దంలో అమ్మకాలు, సంవత్సరానికి 5-6 శాతం చొప్పన పెరిగాయి.

ఇది మంచి వార్త. చెడువార్త ఏమిటంటే అమ్ముడుపోయిన పుస్తకాలలో 50 శాతం పుస్తకాలు ఎవరూ చదవరు. ఆశ్చర్యకరమైన విషయం కదూ? చదివి, ఎదగలనే ఉద్దేశంతో జనం పుస్తకాలు కొంటారు, కాని సగం మంది జనం ఆ పుస్తకాలు చదవరు. హెల్త్ క్లబ్బుకి డబ్బు కట్టి ఒక్కరోజు కూడా వెళ్లకపోవడం లాంటిది ఇది. మనం ఏదైనా వస్తువు కొన్నప్పడు మనకు లాభం చేకూరదు. ఆ వస్తువును మనం వాడినప్పడే మనకు ఆ వస్తువు వలన లాభం చేకూరుతుంది. ఏది ఏమైనా ఈ ప్రజలు ఏమని ఆలోచిస్తున్నారు?

ఒక అడుగు ముందుకు - రోజుకు పదిహేను నిమిషాల చదువు మీ జీవితాన్ని మార్చగలదు

వాస్తవమేమిటంటే, ప్రపంచంలో అక్షరాస్యుడైన ప్రతి వ్యక్తి, కొంచెం చొరవ తీసుకున్నాట్లయితే చదువు ద్వారా ఒక అడుగు ముందుండగలడు. కేవలం పుస్తకాలు, సమాచారం దగ్గర ఉంచుకుంటే సరిపోదు. మనం సంపన్నులం కావాలంటే, మనం సమాచారాన్ని చదివి మన జీవితాలకు అన్వయించాలి.

మంగళవారం, అక్టోబర్ 18, 2016

ఏదో ఒక విధంగా ఎదగవలసిన అవసరం లేని వ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరు. ప్రతి వ్యక్తి - ప్రతి వ్యక్తి అంటున్నాను- తమ జీవితంలో కొన్ని రంగాలలో చదివి, సంపన్నులు కావల్సిన అవసరం ఉంది.

డా. ఒరిసస్ యస్. మర్డన్, విజయం [success] పత్రిక స్థాపకుడు. అతను చెప్పిన ఈ మాటలు పుస్తకాలు మీరు ఎదిగేలా చేసి మీ జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తాయో వివరిస్తాయి. 

మీరు మిమ్మల్ని మెరుగుపరుచుకోవాలని ఆతృతతో ఉన్నట్లయితే, మీ అభిరుచి పెంచే, మీ ఊహాశక్తికి పదునుపెట్టే, మీ ఆకాంక్షలను విశదపరిచే, మీ ఆదర్శాలను ఉన్నతం చేసే పుస్తకాలు చదవండి.

మిమ్మల్ని కుదిపివేసి ఏదో లక్ష్యం వైపు కదిలించే శక్తిమంతమైన పుస్తకాలు చదవండి. మిమ్మల్ని కార్యశూరులను చేసే, కొంత మెరుగుపరిచే, కొంచెం కష్టపడి మరో వ్యక్తిలా తయారుచేసే ప్రపంచంలో ఏదో ఒకటి సాధించే, వ్యక్తి గా చేసే పుస్తకాలు చదవండి.

ప్రతిరోజూ 15 నిమిషాల శ్రద్దతో చదివితే, ఐదు సంవత్సరాలలో మీకు అనేకమంది మహా రచయితలు పరిచయమవుతారు.

డా. మార్డన్ సూచించే పుస్తకాల లాంటి పుస్తకాలు మీరు చదువుతున్నారా? మీరు ప్రతి రోజు, ఏ రోజు విడవకుండా, రోజుకు 15 నిమిషాలు చదువుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం 'అవును' అయితే మిమ్మల్ని మిరు అభినందించుకోండి. ఎందుకంటే మీరు నిజంగా చదువుతూ, జీవితంలో సంపన్నులవుతున్నారు.

మీరు ప్రతి రోజు ఇలాగే చదవాలని నేను కోరుతున్నాను. మీరు చదువంటే అయిష్టపడే పాఠకులైతే, ప్రతిరోజూ చదవడం ప్రారంభించమని కోరుతున్నాను. డా.మార్డన్ సలహా పాటించే 'మీ అభిరుచిని పెంచే మీ ఊహాశక్తికి పదును పెట్టె మీ ఆకాంక్షలను విశదపరిచే, మీ  ఆదర్శాలను ఉన్నతం చేసే పుస్తకాలు చదవండి.' మీరు అలా చేసినట్లయితే, చదువులో నిబిడీకృతమై ఉన్న శక్తులు మీ జీవితంలో అన్నీ రంగాలలోనూ మీరు సంపన్నులు కావడానికి సహాయపడగలవు.

ఈ పుస్తకం ముగిస్తూ, మీరు చదివే పుస్తకాల ద్వారా విజయం మిమ్మల్ని వరించాలని నేను కోరుతున్నాను. ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు చదువుతూ ఉన్నట్లయితే... పయనిస్తూ ఉన్నట్లయితే... మీరు ఎదుగుతూ ఉంటారు.!

సోమవారం, అక్టోబర్ 17, 2016

నమ్మకశక్తిని సంపాదించి, బలోపేతం చేసుకునేందుకు గల మూడు మార్గాలు;

1. విజయం గురించి ఆలోచించండి, ఓటమి గురించి కాదు. పనిచేసే చోట, ఇంట్లోనూ, ఓటమి గురించి ఆలోచించే బదులు విజయం గురించి ఆలోచించండి. ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, ఇలా ఆలోచించండి, ''నేను గెలుస్తాను'' , అంతేగానీ ''నేను బహుశా ఓడిపోతాను,'' అని కాదు. ఇంకొకరితో పోటీ చేసేప్పుడు, ''అందరికన్నా ఉత్తమమైన వ్యక్తితో నేను సమానుడిని'' అనుకోండి, ''అతనితో నేనెక్కడ పోటీ చేయగలను.'' అని కాదు. అవకాశం మీ ముందుకొచ్చినప్పుడు ''నేను చెయ్యగలను'' అనుకోండి, చెయ్యలేను,'' అని ఎప్పుడూ అనుకోవద్దు.  ''నేను విజయాన్ని సాధిస్తాను'' అనే గొప్ప ఆలోచన మీ ఆలోచనవిధానాన్ని ఆక్రమించుకో నివ్వండి. విజయం గురించి ఆలోచిస్తే, విజయాన్ని అందించే ప్రణాళికలను మీ మనసు రూపొందించగలుగుతుంది. అపజయం గురించి ఆలోచిస్తే దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ఓటమి గురించిన ఆలోచనలు అలాటి మరిన్ని ఆలోచనలని పుట్టించి, ఓటమిని కలగజేస్తాయి.

2. మీ గురించి మీకున్న అభిప్రాయం కన్నా మీరు మెరుగైనవారేనని తరచూ గుర్తు చేసుకుంటూ ఉండండి. విజయాన్ని సాధించినవాళ్లు సూపర్ మెన్ ఏమి కారు. విజయనికి అసాధారణమైన తెలివితేటలు అవసరం లేదు. అంతేకాదు, విజయం సాధించటంలో పెద్ద రహస్యమో, మర్మమో కూడా లేదు. అలాగే విజయం అదృష్టం మీద ఆధారపడి ఉండదు. విజయాన్ని సాధించేవాళ్లు తమ మీదా, తాము చేసే పనిమీద నమ్మకాన్ని పెంచుకున్న మామూలు మనుషులే. ఎప్పుడూ - అవును, ఎప్పుడూ కూడా -మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. 

3. గొప్ప నమ్మకాలని కలిగి ఉండండి. మీ విజయం మీ నమ్మకాన్ని బట్టే పెద్దదిగానో, చిన్నదిగానో ఉంటుంది. చిన్నచిన్న లక్ష్యాలని ఏర్పరచుకుంటే ఫలితాలు కూడా చిన్నవే ఉంటాయి. పెద్ద లక్ష్యాలని ఏర్పరచుకుని పెద్ద విజయలని సాధించండి. ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి! పెద్ద ఆలోచనలూ, పెద్ద ప్రణాళికలు సామాన్యంగా సులభంగా ఉంటాయి. కనీసం చిన్న ఆలోచనలు, ప్రణాళికల కన్నా కష్టమైనవి మాత్రం కాదు.

జనరల్ ఎలెక్ర్టిక్ కంపెనీ బోర్డు చెయిర్ మన్, మిస్టర్ రాల్ఫ్ జె. కార్డినర్, ఒక లీడర్ షిప్ సమావేశంలో ఇలా అన్నాడు : '' నాయకత్వాన్ని కోరుకునే ప్రతి వ్యక్తి, అది తనకోసం కావచ్చు లేదా కంపెనీ కోసం కావచ్చు. తనని తను వృద్ధి చేసుకునే వ్యక్తిగత కార్యక్రమంలో పాల్గొనాలనే సంకల్పనం చేసుకోవాలని మేం కోరుకుంటున్నాం. ఎవరూ ఎవరినీ అభివృద్ధి చెందామని ఆదేశించరు.... ఒక వ్యక్తి తన ప్రత్యేక రంగంలో వెనకబడి ఉంటాడా ముందుకిపోతాడా అనేది, అతను ఆ పనిని ఎంత మనస్ఫూర్తిగా చేస్తాడనే దానిమీద ఆధారపడి ఉంటాంది. దీన్ని సాధించేందుకు సమయం, ప్రయత్నం, త్యాగం అవసరమవుతాయి. మీకోసం ఇంకొకరెవరో ఆపని చెయ్యలేరు.''

మిస్టర్ కార్డినర్ చెప్పిన సలహా బావుంది, అమలు చెయ్యదగ్గది. దాని ప్రకారం జీవించండి. బిజినెస్ మేనేజ్ మెంటులో, అమ్మకాలలో, ఇంజినీరింగ్ లో, మతపరమైన కార్యాలలో, రచనా, నటన, ఇంకా ఏ విధమైన లక్ష్యాలనైనా పొందాలనుకునేవాళ్లు అన్నిటికన్నా పై స్థాయికి చేరుకోవాలంటే, మనసు పెట్టి , నిరంతరం తనని తను అభివృద్ధి చేసుకోవటం అనే ప్రణాళికని చేపట్టాలి. 

ఏ శిక్షణా కార్యక్రమమైన -ఈ పుస్తకంలో ఉన్నది సరిగ్గా అదే - మూడు పనులు చెయ్యాలి, విషయాన్ని మీముందుంచాలి, అంటే ఏం చెయ్యాలో చెప్పాలి. రెండు, చేసే పద్దతిని, అంటే ఎలా చెయ్యాలి అనేదాన్ని తెలియజేయాలి. ఇక మూడు, ఫలితాలని సాధించటం అనే అంతిమ పరీక్షకి మిమ్మల్ని గురిచేయ్యలి.
విజయాన్ని సాధించటం మీ కార్యక్రమంలో చెయ్యవలసింది ఏమిటి అనేది విజేతలైన వాళ్లు వైఖరీ, పనిచేసే విధానం ఆధారంగా తయారుచేయ్యబడుతుంది. వాళ్లు తమని ఏ విధంగా పనికి తగ్గట్టు మలుచుకుంటారు? అడ్డంకులని ఎలా అధిగమిస్తారు? ఇతరుల నుంచి గౌరవాన్ని ఎలా సంపాదించుకుంటారు? మామూలు మనుషులకన్నా వాళ్లు ఎందుకని భిన్నంగా ఉంటారు? వాళ్లెలా ఆలోచిస్తారు? 

మీ అభివృద్ధి ప్రణాళికలోని ఎలా అనే అంశం పనిచేసే తీరుకి కొన్ని నిర్దేశాలని వరుసక్రమంలో అందిస్తుంది. ఇవి ప్రతి అధ్యాయంలోనూ కనిపిస్తాయి. ఈ నిర్దేశాలు పనికొస్తాయి. వాటిని పాటించి చూడండి, మీకే తెలుస్తుంది.
మరి ఈ శిక్షణలో అన్నిటికన్నా ముఖ్యమైన భాగం, ఫలితాల మాటేమిటి? క్లుప్తంగా చెప్పాలంటే, ఈ శిక్షణాకార్యక్రమాన్ని మనసుపెట్టి, ప్రయత్నించి అమలుచేస్తే, ఇప్పుడు అసాధ్యమని తోచే విజయం మీ సొంతం అవుతుంది. ఈ ప్రణాళికలోని విభిన్న భాగాలని విడదీసి చూసినప్పుడు, మీ వ్యక్తిగత శిక్షణా కార్యక్రమం మీకు వరసగా పురస్కారాలని అందిస్తుంది : మీ కుటుంబం నుంచి మరింత లోతైన గౌరవభావాన్ని బహుమతిగా అందుకుంటారు, మీ స్నేహితులనించీ, తోటి పనివారినించీ ప్రశంసలని సంపాదించుకుంటారు, ఇతరులకి పనికొస్తున్నాను, అనేభావం మీకు బహుమతిగా దొరుకుతుంది, గుర్తింపు పొందుతారు, హోదా వస్తుంది, ఎక్కువ సంపాదనా, హెచ్చు స్థాయి జీవితం పురస్కారాలుగా లభిస్తాయి. మీకు మీరు స్వయంగా శిక్షణా ఇచ్చుకుంటారు. మీ గొంతుమీద కూర్చుని ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో చెప్పేవాళ్ళెవరూ ఉండరు. ఈ పుస్తకమే మీకు మార్గదర్శి, కానీ మిమ్మల్ని అర్ధం చేసుకోవలసింది మీరే. ఈ శిక్షణని అమలుచేయ్యమని మిమ్మల్ని ఆజ్ఞాపించ వలసింది మీరే. మీ ప్రగతిని విలువకట్టవలసింది కూడా మీరే. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇంకా పెదా విజయలని సాధించేందుకు మీకు మీరే శిక్షణా ఇచ్చుకుంటారన్నమట.

మీ దగ్గర అన్నీ వస్తువులూ సిద్దంగా ఉన్న ఒక ప్రయోగశాల ఉంది. అందులో మీరు పనిచెయ్యచ్చు, చదువుకోవచ్చు. మీ ప్రయోగశాల మీచుట్టూ ఉంది. మీ ప్రయోగశాలలో ఉన్నది మనుషులు. ఈ ప్రయోగశాల, మనుషులు చెయ్యగల పనుల తాలూకు ఉదాహరణ లన్నిటిని మీకు అందిస్తుంది. మీ సొంత ప్రయోగశాలలో మీరే ఒక శాస్త్రవేత్త అని అనుకున్న తరవాత, ఇక మీరు నేర్చుకోగల వుషయాలకి అంతుండదు-ఇంకా వినండి, అక్కడ కొనటానికి ఏమి ఉండదు. అద్దె చెల్లించక్కర్లేదు. ఎటువంటి ఫీజులూ ఉండవు. మీకు కావలసినప్పుడల్లా ఈ ప్రయోగశాలని మీరు ఉచితంగా వాడుకోవచ్చు.

మీ ప్రయోగశాలకి మీరే నిర్దేశకులు కావటం వల్ల, అందరూ శాస్త్రవేత్తల్లాగే మీకు కూడా పరీక్షించాలనీ, ప్రయోగాలు చెయ్యాలనీ అనిపిస్తుంది.

జీవితమంతా మనచుట్టూ మనుషులు ఎప్పుడూ ఉన్నప్పటికి, చాలమందికి మనుషులు ప్రవర్తించే తీరు అర్ధం కాకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా? మనలో అధికశాతం గమనించటంలో శిక్షణా పొందరు. ఈ పుస్తకం తాలూకు ముఖ్యమైన ఉద్దేశలలో ఒకటి, పరీక్షించటం అనే విద్యలో మీకు శిక్షణా ఇవ్వటం, మనుషుల ప్రవర్తనని అర్ధం చేసుకునే పరిజ్ఞానాన్ని మీకు అందించటం. మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకోవచ్చు, జాన్ అంతా పెద్ద విజయలని ఎలా సాధించగలుగుతున్నాడు. టామ్ మాత్రం ఎందుకు మందకొడిగా ఉండిపోయాడు? '' ''కొంతమందికి ఎక్కువమంది స్నేహితులూ, మరికొందరికి తక్కువమంది స్నేహితులూ ఎందుకుంటారు?'' ''ఒక మనిషి చెప్పినా మాటని ఆనందంగా అంగీకరించేవాళ్లు, ఇంకొకరు అదే విషయాన్ని చెప్పినా ఎంధుకు వినిపించుకోరు.?''

ఒకసారి శిక్షణా పొందాక, మామూలు పరిశీలన అనే విధానం ద్వారా మీరు విలువైన పాఠాలు నేర్చుకుంటారు. 
శిక్షణా పొందిన పరిశీలకుడిగా తయారయెందుకు మీకు సాయపడగల రెండు ప్రత్యేకమైన సలహాలు చెపుతాను వినండి. మీరు విశేషంగా అధ్యయనం చేసేంధుకు అందరికన్నా ఎక్కువ విజయాన్ని సాధించిన వ్యక్తినీ, అందరికన్నా పెద్ద అపజయాన్ని పొందిన వ్యక్తినీ అధ్యయనం చెయ్యండి. ఆ తరవాత, ఈ పుస్తకం ముందుకి సాగినకొద్దీ, విజేతగా ఉన్న వ్యక్తి విజయం తాలూకు సూత్రాలని ఎంత క్షుణ్ణంగా పాటిస్తున్నాడో గమనించండి. ఈ రెండు పరస్పర విరుద్ధమైన ఉదాహరణలని అధ్యయనం చెయ్యటం వల్ల, ఈ పుస్తకంలో చెప్పిన వాస్తవాలని అనుసరించటంలో ఉన్న వివేకం ఎంత ఉపయోగకరమైనదో నిస్సందేహంగా మీకు తెలిసివస్తుంది. 

ఒక్కొక్క వ్యక్తితోనూ మీరు పరిచయం చేసుకుంటూ పోతే విజయం తాలూకు సూత్రాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది. విజయంతో నిండిన పనులని ఒక అలవాటుగా చేసుకోవటమే మీ ధ్యేయం. ఎంత ఎక్కువ అభ్యాసం చేస్తే, అంతా త్వరగా అదిమి స్వభావంలో విడదీయరాని భాగంగా మరి మీరు కోరుకున్నట్టుగా పనిచెయ్య గలుగుతారు.

ఒక అభిరుచి కోసం దేన్నైనా పెంచే స్నేహితులు మనలో చాలమందికి ఉంటారు. వాళ్లు '' ఈ మొక్కలు పెరుగుతుంటే చూడటం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎరువులకీ, నీళ్లకీ అవి ఎలా ప్రతిస్పందిస్తాయో ఒక్కసారి గమనించండి.
పోయిన వారం కన్నా ఇప్పుడు ఎంతఏపుగా తయారయాయో చూడండి. '' అనటం మన౦ చాలాసార్లు వింటాం.
ఆ మాట నిజమే, మనుషులు జాగ్రత్తగా ప్రకృతికి సహకరిస్తే లభించే ఫలితాలు చేస్తే ఒళ్లు పులకరించిపోతుంది. కానీ మీ అంతట మీరు జాగ్రత్తగా నిర్వహించుకునే ఆలోచనలని అధీనంలో ఉంచుకోవటం అనే కార్యక్రమానికి మీరు ఎలా ప్రతిస్పందిస్తారో గమనిస్తే, దానికి పదిరెట్లు ఎక్కువ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతారు. రోజురోజుకీ, నెలనెలకీ, మీరు మరింత ఆత్మవిశ్వాసాన్నీ, ప్రభావాన్ని, విజయాన్ని సాధించుకోవటం గమనిస్తే మీకు బలే సరదాగా అనిపిస్తుంది. మీరు విజయాన్ని, ఫలితలనీ సాధించే మార్గంలో ప్రయాణిస్తున్నారని తెలుసుకుంటే ఇచ్చే సంతృప్తిని ఏదీ, ఇంకేదీ, ఇవ్వలేదు. మీనుంచి మీరు వీలైనంత ఎక్కవ పొందటం కన్నా పెద్ద సవాలు మరొకటి ఏదీ ఉండదు.    

శనివారం, అక్టోబర్ 15, 2016

అక్షరాలు దగ్గర దగ్గరగా మఖ్యంగా 'పొడవుగా' వ్రాసేవారు క్రమశిక్షణగా వున్న వాళ్ళు, సిగ్గు ఎక్కువగా వున్నవాళ్లు, డబ్బు విషయంలో పొదుపరిగనూ అయి వుంటారు. 
* చాలమందికి ఇంధ్రధనస్సు అంటే ఇష్టం. అది కనిపిస్తే కేరింతలు కొడతారు. కొంతమంది చిత్రకారులు దానిని అద్భుతంగా గీస్తారు. ప్రకృతి ఆరాధకులు వాటి కోసం ఆకాశం కేసి చూస్తారు. కానీ, వీరు మాత్రం నివసించేదే ఇంధ్రధనస్సు మీద.
* మీకు లోకం ఆనందంగానూ, రంగురంగుల ఊయలగానూ కన్పిస్తుంది.
* వేరొకరి జోలికి వెళ్లకుండా మీ జీవితం మీరే జీవించాలన్నదే మీ తిరుగులేని అభిప్రాయం 
* తమాషా ఏంటంటే మీరు పూర్తిగా భావుకులు కారు. ప్రపంచంలో మంచి చెడ్డలు మీకు బాగా తెలుసు. ఒక విషయాన్ని క్షుణ్ణంగా తెలసుకోవటంలో మీ కన్నా సమర్ధులైన వారు లేరని చెప్పొచ్చు.
* సాంప్రదాయాలకు అనుగుణంగా నడవటానికి మీరు ఇష్టపడరు. 
* సాంప్రదాయవాదులైన, పెద్దలను మీ అతినాగరికపు పనులతో ఆశ్చర్యపరచటం మీకెంతో సరదా. 
* మీ చుట్టుపక్కల వాళ్లందరినీ మీరు స్నేహితులగానే భావిస్తారు.
* మీరు ఎంత ప్రాక్టికల్ అంటే, మీ ప్రేయసి/ప్రియుడు నుంచి శాశ్వతంగా విడిపోయే సమయంలో కూడా 'మనం స్నేహంగా వుండలేమా' అని అడిగే మనస్తత్వం మీది. 
*మీ ప్రేమ ఫలించకపోతే అతి నిజాయితీపరులుగా పార్వతో/దేవదాసులైపోరు. మీ పరిశోధనా జిజ్ఞాసను ఆకట్టుకొని అమ్మాయి లేదా అబ్బాయి కనిపించగానే, పాత విషయాలు మరిచిపోయి, మళ్ళీ [నిజాయితీగా] ప్రేమలో పడతారు.
* మీ ప్రేయసికి ఒక విషయంలో మీ పై కోపం రావచ్చు. ఎందుకంటే మీరు ఆవిడపట్ల ఎంత ఆసక్తి చూపుతారో అంటే ఆసక్తిగా మీ ఇంటికి న్యూస్ పేపర్ తెచ్చే అబ్బాయి పైన, ధర్మం చెయ్యమని వచ్చే పేదరాలిపైన కూడా చూపుతారు.
* ఇష్టమైన అభిరుచి అంటూ ఏమి వుండదు. రాజకీయాలు మిమ్మల్నెంతగా ఆకట్టుకుంటాయో, ఆటలు కూడా అంతే ఇష్టపడతారు. ర్యాకెట్లో చంద్రమండలంకి వెళ్ళేవారు, గుర్రం నడిపే వాడు, ఒక నటుడు, సంగీతం వాయించేవాడు, ఒకటేమిటి ప్రపంచంలో అన్ని విషయాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మిమ్మల్ని ఇష్టపడేవారు సాధారణంగా మిమ్మల్ని అర్ధం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. మీకు ఏ అభిరుచిలో అయినా ఇమడ కలిగే శక్తి వుంది.
* కొద్ది మందికి చెడిపోవడం బాగా చేతనవుతుంది కొందరికి బాగుపడటం తెలుస్తుంది. కానీ మీకు చెడిపోవటం ఎంత బాగా తెలుసో బాగుపడడం కూడా అంతే బాగా తెలుసు 
*అపురూమైన ఏదో ఒక గొప్పతనం మీప్రతిచర్యలోనూ ఏదో రూపంలో చోటుచేసుకుంటూ ఉంటుంది. [మీకు నచ్చిన విషయాలన్నీట్లో మీరు ప్రవేశించి, ఎందులో మీ ప్రజ్ఞను నిరూపించుకోగలరో నిర్ధారించుకొని ముందడుగు వేస్తే జీవితంలో మీరు కోరుకున్న సుఖాలు, సౌఖ్యాలు మీ ముంగిట నిలుస్తాయి. మీరు చేయవలసిందల్లా మొహమాటం లేకుండా ప్రవేశించటమే].
* మీరు కాస్త పిరికివారే అయినా, దాన్ని ఎక్కడా బైటపడనివ్వరు. కాబట్టి వీలైనతంగా అదే రకమైన జీవితం గడపడం మంచిది. 
* విమర్శలని ఏ మాత్రం సహించలేరు. ఉదాహరణకి ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కి జెండా పాతబోయే సమయంలో 'ఇంట్లో భార్యకు చీరకొనివ్వలేదు గాని, ఇక్కడకొచ్చి ఎవరెస్ట్ మీద జెండా పాతుతున్నాడురా' అని మీ పోటీదారుడైవారైనా వెక్కిరిస్తే వెంటనే ఆ పర్వతం దిగడం ప్రారంభించేస్తారు. మీ విజయానికి గుర్తుగా జెండా పాతాలనే ఉత్సాహం అప్పుడే చచ్చిపోతుంది. మీరు ఆడవారైతే మీ స్నేహతురాలు ' ఈ చీరె నీకు బాగోలేదే' అంటే ఆ చీర పెట్టె అడుక్కి వెళ్లిపోవాల్సిందే 
* వింత వింత కలలు కంటూ నిద్రపోవడం, వాటి గురించి దిగులు పెట్టుకోవటం కూడా మీ ప్రవర్తనలో సర్వసాధారణం 
* ఏదో జరగబోతుంది అని మీరు అనుకున్నారంటే, సర్వసాధారణంగా నూటికి యాభై సార్లు అది జరుగుతుంది ఉదాహరణ కి మీ అబ్బాయి బైక్ మీద బైటకు వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళొద్దు అని చెప్తే వెళ్లకపోవటమే మంచిది. ఎందుకంటే ముందే  చెప్పినట్లు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సస్ ఏభైశాతం. 

శుక్రవారం, అక్టోబర్ 14, 2016

కాలేజీ, ఫేస్ బుక్ , ఇరుగుపొరుగు... ఇలా మనకు రకరకాల చోట్ల స్నేహితులు ఉంటారు. వాళ్ల పరిధి పెరిగేకొద్ది అందరితో అన్నిసార్లు మాట్లాడటం కుదరకపోవచ్చు. మరి స్నేహబంధాన్ని ఎలా పదిలపరచుకోవాలో చూద్దాం రండి.
అప్పుడుప్పుడూ స్నేహితులకు ఉత్తరం రాయండి. ఈ మెయిల్, వాట్స్ యాప్, ఫేస్ బుక్ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఉత్తరమా అని అనకండి. అది తప్పనిసరే. అప్పుడప్పుడూ ఉత్తరాలు రాయడం వాళ్ల మీరు వారికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయాన్ని తెలియజేసినవారవుతారు. పైగా అదో మధురజ్ఞాపకంగా మిగులుతుంది. 
స్నేహితులంతా ఓ చిత కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారా! మధ్యమధ్య ఫోను మాట్లాడం, సందేశాలు పంపడం వద్దు. స్నేహితుల మధ్య ఉన్నప్పుడూ వీలైనంతవరకూ ఫోనుని కట్టేయండి. అది కష్టం అనుకుంటే నిశ్శబ్దంగా ఉంచుకోవడం మంచిది. ఆ సమయం మొత్తం వారికే కేటాయించండి.
స్నేహితులకు సంబంధించి ఎన్నో ముఖ్యమైన రోజులు ఉంటాయి. వాటిల్లో మొదట చెప్పుకోవాల్సింది పుట్టినరోజు. దాన్ని మీరు వీలైనంతవరకూ మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకుని, మరి అభినందనలు తెలియజేయండి. అలాగే ఉద్యోగంలో చిన్న పదోన్నతి సాధించినా, మంచి ర్యాంకు తెచ్చుకున్న అభినందించేవారిలో మీరు ముందుండండి.
ఎంత స్నేహితులయిన సరే అదేపనిగా మీ గొప్పలు చెప్పడం, సమస్యలు పంచుకోవడం, సాయంకొరడం సరికాదు. మరి తప్పనిసరి అయితేనే ఆఖరి ప్రయత్నంగా వారి సాయాన్ని కోరాలి. ఎంతో స్నేహంగా ఉన్న కూడా ఓ పరిధి పెట్టుకోవాలి.
మీరు మీ స్నేహితులకు ఎంత దూరంలో ఉన్న సరే.. వాళ్లకు ఏదయినా కష్టం వస్తే మీరు అండగా ఉండేలా చూడండి. దాన్ని మాటల రూపంలో కన్నా చేతల్లో చూపించడం మంచిది.

గురువారం, అక్టోబర్ 13, 2016

పని చేసే చోట ఒత్తిడితో కూడిన సందర్భం వచ్చిందనుకుందాం. ఆ సమయంలో కుంగిపోకుండా, కోపానికి గురికాకుండా మీరు పాటించే నిగ్రహం ఎంతో ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. బయట చెప్పుకోకపోయినా మనం ఆవేశకవేశాలకు లోనైనా ప్రతి సందర్భం తర్వాత అపరాధభావానికి గురవుతుంటాం. దాన్ని తప్పించుకోవాలంటే నిగ్రహమే శరణ్యం. దాన్నెలా సాధించాలో చెబుతున్నారు నిపుణులు. 
శ్వాస నియంత్రణ: 
శ్వాసకి, ఉద్వేగాలకి దగ్గర సంబంధం ఉంటుంది. ఉచ్చ్వాసనిశ్వాసాలని నియంత్రించడం ద్వారా ఆవేశకావేశాలూ అదుపులో ఉంటాయి. అందుకే ఉదయాన్నే ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోండి. ధ్యానం కూడా కీలక వేళల్లో మనసుని అదుపులో ఉంచేలా చేస్తుంది. 
జీవనశైలి: 
అదుపు తప్పిన ఉద్వేగాలకు దారితీసే కారణల్లో నిద్రలేమి కూడా ఒకటి. కాబట్టి కనీసం ఎనిమిది గంటలైనా కంటినిండా నిద్రపోండి. రోజుకి ఓ అరగంటైనా గుండెవేగం పెరిగే శారీరక దారుధ్యం పెంచే వ్యాయామాలు చేయండి. ఇవి శరీరంలో ఎండోర్పినలను విడుదల చేసి ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి. 
అలవాట్లు:
మీ రోజువారీ జీవితంలో సృజనకీ కాస్త తావివ్వాలి. చిత్రలేఖనం, పాడటం సంగీత వాద్యం నేర్చుకోవడం ఇవన్నీ ఒత్తిడిని దూరం చేయడమే కాదు మనసు పై మనకు ఆధిపత్యాన్నిస్తాయి. ఉద్వేగాల నియంత్రణకు అంతకంటే ఏం కావాలి చెప్పండి. 
దృక్పధం మారాలి : 
'నాకు పని ఎక్కువ కావడం వల్ల ఒత్తిడి పెరుగుతోంది ప్రతి ఒక్కరూ నన్ను శత్రువులా చూస్తున్నారు! ఇలాంటి ధోరణి మార్చుకోండి. పని వల్ల మీ జీవితంలో ఏర్పడుతున్న సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి. వాటిని పెంచుకునేందుకు కృషి చేయండి. ఎదుటివారినీ సానుకూలంగా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి. 'పరిస్థితి ఎలా ఉన్న కోపతాపాలకు గురికాను. అదుపు కోల్పోను! అని తీర్మానించుకోండి. అలవాటు పడటానికి శాయశక్తులా ప్రయత్నించండి. ఎంతో ఆత్మవిశ్వాసం మీ సొంతమవుతుంది 
మరే ఇతర మధ్యమం కంటే, చదువు ఒక క్షణంలో ని జీవితాన్ని మార్చగలదు. ఏ పుస్తకం... నీ జీవితంలో ఏ సమయంలో... నీ ప్రపంచాన్ని కుదిపివేసినువ్వు అంతకు ముందు ఎన్నడూ ఊహించని మార్గాలలో నువ్వు అభివృద్ధి అయ్యేందుకు ఉత్తేజపరుస్తుందో... నీకు ఎన్నటికీ తెలియదు. [బర్క్ హెడ్జ్ స్] 

ప్రతిరోజూ కొద్దిగా చదవడానికి నిర్ణయించుకో. అది ఒక వాక్యమే కావచ్చు. రోజుకు పదిహేను నిమిషాలు వెచ్చించగలిగితే, సంవత్సరాంతానికి ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. [హోరెస్ మాన్, అమెరికన్ విద్యావేత్త]

ప్రపంచంలో అత్యంత మేధాసంబంధమైన విషయం కాదు కానీ, నేను అక్షరాలు తెలుసుకోవాలి. [వాన్నా వైట్] 

ఏది చెయ్యాలో అది నేర్చేవారిదే భవిష్యత్తు. [డెనిస్ వేట్ లీ] పుస్తకం చదవాలన్న ఆత్రుతతోఉండే వ్యక్తికీ, అలిసిపోయి చదవడానికి ఒక పుస్తకం కోరుకునే వ్యక్తికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. [జి.కె. చెస్టర్ టన్] 

పఠనం మెదడుకు జ్ఞానానికి సంబంధించిన విషయాలను మాత్రమే అందజేస్తుంది. ఆలోచన మనం చదివేదాన్ని మన స్వంతం చేస్తుంది. [జాన్ లాక్] 

నేను వేగంగా చదవడంలో ఒక కోర్సు చేశాను. నేను 'యుద్దము- శాంతి' నవలను 20 నిమిషలలో చదవగలిగాను. ఇది రష్యా గురించి రాసిన నవల. [వుడీ ఎల్ల్ న్] 

చదవడం తెలిసిన ప్రతివారు, లోతుగా ఎలా చదవాలో తెలుసుకోగలరు. ఆవిధంగా సంపూర్ణ జీవితం జీవించగలరు. [నార్మన్ కాజ్ న్స ]

పఠన కళ అంటే ఏ రకమైన సందేశాన్నయినా సాధ్యమైనంత చక్కగా అందుకునే కళ. [మార్టిమార్ ఏడ్లర్, చార్లస్ వాన్ డోరెన్]

మంచి రచన భావన నిర్మాణ శాస్త్రం కానీ, భవనం లోపలి అలంకరణ కళ కాదు. [ఎర్నెస్ట్ హెమింగ్వే] 

కొన్ని పుస్తకాలు రుచి చూడాలి... కొన్ని మింగేయాలి... కొన్ని నమిలి జీర్ణించుకోవాలి. [ఫ్రాన్సిస్ బేకన్] 

పఠనం అన్నది రోజురోజుకు పెరుగుతూ, రేఖాగణిత పద్దతిలో అభివృద్ధి చెందుతుంది. ప్రతి కొత్త పఠనం పాఠకుడు అంతకు ముందు చదివినదాని పునాది మీద నిలబడుతుంది. [ఆల్బర్టో మేన్ గ్వెల్, ]

మంచి పుస్తకాలు చదవని వ్యక్తి పరిస్థితి- ఆ పుస్తకాలు చదవలేని వ్యక్తి పరిస్థితి కన్నా మెరుగైనది కాదు. [మార్క్ టైవ్న్ ] 

చదువు నేర్చినవారు రెట్టింపు చూడగలరు. [మియాండర్]

చదువు తెలిసిన ప్రతి వ్యక్తిలోనూ తనను తను ఉన్నతుణ్ణి చేసుకోగల, తను జీవించే విధానాన్ని అనేక విధాల పెంచుకోగల, జీవితాన్ని సంపూర్ణంగానూ, ఆసక్తికరంగాను, ప్రాముఖ్యతగలదనిగాను మలుచుకోగల శక్తి ఉంటుంది. [ఆల్దస్ హక్స్ లే] 

విద్యార్ధులు కొంతమంది జ్ఞాన సుధలు తాగుతారు. కొంతమంది పుక్కిలించి ఉమ్మేస్తారు. [ఇ.సి మెకెంజీ] 

జ్ఞానంలో పెట్టుబడి అత్యధిక వడ్డినిస్తుంది. [బెన్ ఫ్రాంక్లిన్] 

పోటీ ప్రపంచంలో రెండు మార్గాలున్నాయి. మీరు వెనుకబడగలరు. లేదా మీరు గెలవలనుకుంటే మీరు మరగలరు. [లెస్టర్ సి. ధరో] 

భూమికి సూర్యుడు ఎటువంటివాడో నా జీవితనికి పుస్తకాలు అటువంటివి. [ఎర్ల్ నైటింగేల్]

నువ్వు కలుసుకునే వ్యక్తులు నువ్వు చదివే పుస్తకాలు -ఈ రెండు విషయాల్లో తప్ప, అయిదు సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉంటావో ఈ రోజు అలాగే ఉన్నావు. [ఛార్లస్ ఇ. ''టి'' జోన్స్] 

ఇతరుల రచనల ద్వారా మిమ్మల్ని అభివృద్ధి చేసుకోవడానికి మీ కాలాన్ని వినియెగించండి. ఆ విధంగా ఇతరులు ఎంతో కష్టపడి సాధించిన దాన్ని, మీరు తేలికగా సాధించగలరు.[సోక్రటీస్]

బ్రతకడానికి చదవండి [గుస్టావ్ ఫ్లాబర్ట్] 

తెలివైనవారు పుస్తకాల్లోంచే తమ జీవితంలోని కష్టసమయాల్లో ఓదార్పు పొందుతుంటారు.[ విక్టర్ హ్యూగో]

నీకు ఎదురయ్యే సమస్యలను బట్టి నిన్ను నువ్వు అంచనా వేసుకోకు. నువ్వు ధైర్యంగా ఎదుర్కొన్న సమస్యలను బట్టి నిన్ను అంచనా వేసుకో. [జిగ్గీ కార్టూన్] 

మీరు నాకన్నా ధనవంతులు ఎన్నటికీ కాలేరు, ఎందుకంటే చదివివినిపించే తల్లి నాకుంది. [ఎబి గెయిల్ వాన్ బ్యూరన్]

మీరు వేరెవరి జీవితం గురించో చదువుతారు కానీ అది మీ జీవితం గురించి మీరు ఆలోచించేల చేస్తుంది. అందులో ఉన్న గొప్పతనం అది. అందువలనే నేను పుస్తకాలంటే ఇష్టపడతాను. [ఓప్రా విన్ ఫ్రీ]

50 మిలియన్ల శ్రోతలను చేరడానికి రేడియోకు 38 సంవత్సరాలు పట్టింది. ఈ సంఖ్య చేరుకోవడానికి టీవి 13 సంవత్సరాలు తీసుకుంది. ఇంటర్ నెట్ నాలుగు సంవత్సరాలలోనే 50 మిలియన్ల సంఖ్య చేరుకుంది.

నేను యువతకు ఒక సలహా ఇవ్వగలిగితే ఆ సలహా ఏమిటంటే చదువు,చదువు,చదువు. చదువు ద్వారా వాస్తవమైనవి కానీ,ఊహాజనితమైనవి కానీ- నూతన ప్రపంచాలను మీరు ఆవిష్కరిస్తారు. సమాచారం కొరకు చదవండి.ఆనందం కొరకు చదవండి. మన లైబ్రరీల నిండా జ్ఞానం ఉంది. సంతోషం ఉంది. మీరు ఉచితంగా అందుకోవడానికి అంతా అక్కడ ఉంది. [ఎబిగెయిల్ వాన్ బ్యూరన్]

పుస్తకాలు, టివికి వ్యతిరేకాలు. అవి మెల్లగా చదవవచ్చు. మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి, మేధస్సును కదిలిస్తాయి, సృజనాత్మకతను పురికొల్పుతాయి. [డేవిడ్ షెంక్] 

పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిది. [సీసరో] 

ఎన్నో పుస్తకాలు వస్తుంటాయి, వాటికి అంతం లేదు. [ఎక్లేజియస్టస్]

అధికారానికి నూతన ఆధారం కొద్దిమంది చేతుల్లో ఉన్న ధనం కాదు. అనేకమంది చేతుల్లో ఉన్న సమాచారం. [జాన్ నేస్బిట్] 

భవిష్యత్తులో నిరక్షరాస్యుడు అంటే చదవలేని వ్యక్తి కాదు. ఏ విధంగా నేర్చుకోవాలో తెలియని వ్యక్తి నిరక్షరాస్యుడవుతాడు. [ఆల్విన్ టాప్లర్] 

గూటెన్ బర్గ్ ప్రతి వ్యక్తి చదువరిని చేశాడు. జిరాక్స్ ప్రతి వ్యక్తి ని ఒక ప్రచురణకర్త చేసింది. [మార్షల్ మెక్ లుహన్] 

మీరు విజయం సాధించాలంటే, విజయం సాధించిన వ్యక్తులు ఏం చేశారో అది చెయ్యాలి. విజయం సాధించన వ్యక్తులు చేసే పనుల్లో ఒకటి ఏమిటంటే చదవడం, సంపన్నులవడం. [బర్క్ హెడ్జెస్] 

ఈ ప్రపంచంలో నువ్వు ఖచ్చితంగా మెరుగుపరచవచ్చు అని భావించే ఒకే ఒక విషయం ఉంది. అది నువ్వే. [అల్డస్ హక్సెలే] 

మీరు మరో వ్యక్తి కాకపోవడానికి కారణం ఏదైనా, ఇటువంటి సమస్యను ఎదుర్కొని, అధిగమించిన వ్యక్తి మరొకరున్నారు. [బార్బారా రేనాల్డ్స్] 

సగటు సేల్స్ మెన్ సంవత్సరానికి ఒక పుస్తకం కూడా చదవడు, అందువల్లనే అతను సగటు సేల్స్ మన్ అయాడు. [అనామకుడు] 

ఒక మనిషి రోజూ తన తీసుకునే ఆహారాన్ని ఎలా ఒక పధకం ప్రకారం తీసుకుంటాడో, అంతా జాగ్రత్తగానూ చదివే కార్యక్రమం గురించి ఆలోచించాలి. ఎందుకంటే చదువు కూడా ఆహారమే. ఈ ఆహారం లేకుండా మానసికంగా అతను ఎదగలేడు. [ఎండ్రూ కార్న్ గీ ] 

నా ఉద్దేశంలో నిన్ను సంపన్నుడుని చెయ్యగల ప్క పుస్తకం మీద 10 డాలర్లు మదుపుపెట్టడం. ప్రపంచ చరిత్రలో చాలా విలువైన మదుపు. [ బర్క్ హెడ్జెస్] 

పుస్తకాలు మంకు రెక్కలనిస్తాయి. [ సెంట్రల్ ఫర్ ద బుక్, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారి నినాదం] 

మీరు మార్చాలనుకుంటున్న, అభివృద్ది చెయ్యాలనుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మంచిది. కానీ మీతోనే ఎందుకు ప్రారంభించకూడదు? ఇతరులను మార్చడం కంటే ఇది చాలా లాభకరమైనది. [డేల్ కార్నెగీ] 

మనం ఎలా ఉండాలో అన్నదానితో పోల్చిచూస్తే, మనం సగం మాత్రమే మెళుకువగా ఉంటాం. [విలియం జేమ్స్] 

మంగళవారం, అక్టోబర్ 11, 2016

ఒక మంచి బ్యాంకులో కంటే ఒక మంచి పుస్తకంలో ఎక్కువ సంపద ఉంటుంది.[ రాయ్ యల్. స్మిత్

చదువు ద్వారా మన ప్రపంచాన్ని, మన చరిత్రను, మనలను, మనం ఆవిష్కరించుకుంటాం. [డేనియల్ జె. బూర్ స్టీన్

అనేక సందర్భాలలో ఒక పుస్తక పఠనం మనిషి భవిష్యత్తును రూపుదిద్దింది. [ రాల్ఫ్ వాల్డ్ ఎమర్సన్

పుస్తకాల వలన కలిగే ఒక గొప్ప లాభం- అవి మనకు అందించే ప్రేరణ. [  రాల్ఫ్ వాల్డ్ ఎమర్సన్

వాక్యాలు మన జ్ఞాపకాలలో సత్యాన్ని దింపే మేకుల్లాంటివి. [దీదరో

చదవడం వేరొక వ్యక్తి మెదడుతో ఆలోచించే సాధనం: దానివలన మీరు మీ మెదడును విస్తరింప చేసుకోగలుగుతారు. [చార్లస్ స్కిన్నర్, జూనియర్

గొప్ప పుస్తకాలలో గొప్ప వ్యక్తులు మనతో మాట్లాడుతారు. అత్యంత విలవైన వారి ఆలోచనలను అందిస్తారు. వారి ఆత్మలను మనలో ప్రవేశపెడడతారు. [ విలియమ్ ఎల్లెరి ఛాన్నింగ్

ఒక సిరా బొట్టు కొన్ని కోట్ల మందిని ఆలోచించేలా చేస్తుంది. [ లార్డ్ బైరన్

జీవితం ఆనందంగా ఉండడానికి మూడు విషయాలు మాత్రమే అవసరం : దేవుడి దీవెనలు, పుస్తకాలు, ఒక స్నేహితుడు. [లేకోర్డేయర్

నా దగ్గర కొద్దిగా డబ్బు ఉంటే నేను పుస్తకాలు కొంటాను ఇంకా మిగిలితే ఆహారం దుస్తులు కొంటాను. [ఇరస్మస్]

నేను ఆనందం కోసం ప్రతిచోటా అన్వేషించాను. కానీ నాకు ఆనందం ఒక ముల ఒక చిన్న పుస్తకంతో ఉన్నప్పుడు మాత్రమే లభించింది. కాని మరెక్కడా లభించలేదు. [ధామస్ ఎ. కెంపిన్]

శక్తిమంతమైన రచనలు, చాలా తక్కువమంది మాత్రమే అవి చదివినా, ఒక సంస్కృతి సమష్టి చైతన్యం మీద ముద్రలానిలుస్తాయి. [బర్క్ హెడ్జ్ స్

చదవలేకపోవడం అనేది ప్రవేశించడానికి ఒకే ద్వారం ఉన్న ఒక ప్రపంచం వంటిది. లోనికి ప్రవేశిస్తే ఏమి ఉండదు. అక్షరాస్యత నన్ను ఈ చీకటి ప్రపంచాన్నుంచి విముక్తి చేసింది. అక్షరాస్యత వలన ఈ ప్రపంచంలో ప్రవేశించడానికి నాకు వెయ్యి ద్వారాలున్నాయి. [ఎర్నెస్ట్ కార్ మెంఫిన్ అక్షరాస్యత కౌన్నిల్ పూర్వ విద్యార్ధి ]

పదాలు, మనిషి ఉపయోగించే మందులలో అత్యంత శక్తివంతమైన మందులు. [రుడ్యార్డ్ కిప్లింగ్

వివేకంతో ఉన్న, వివేకహీనమైనా ఒక పుస్తకం నేను చదువుతున్నప్పుడు. అది సజీవంగా ఉన్నట్లు, నాతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. [జొనాధన్ స్విఫ్ట్

మరే ఒక్క ఆవిష్కరణకంటే, వ్రాత మనిషి చైతన్యాన్ని మార్చింది. [డా. వాల్డర్ ఓంగ్

పుస్తకం మనలో గడ్డకట్టుకుపోయిన సముద్రాన్ని బ్రద్దలు కొట్టే గొడ్డలి కావాలి. [ఫ్రాఞ్జ్ కాఫ్కా]  

నేను నా మెదడులో పై అర ఖాళీ చేసినప్పుడు , ఒక పుస్తకం చూశాను. [జార్జ్జెస్సేన్

శరీరానికి వ్యాయామం ఎటువంటిదో మనసుకు చదువు అటువంటిది. [ఆజ్ఞాత వ్యక్తి]

పుస్తకాల యొక్క నిజమైన లక్ష్యం ఏమిటంటే మెదడును తన ఆలోచన తాను చేసే విధంగా చెయ్యడం. [క్రీష్టోఫర్ మేర్లే

ప్రశ్నలు అడగటంకోసం జనం పుస్తకాలు చదువుతారు. [ఫ్రాంజ్ కాఫ్కా

చదువు లో దుస్తులు నేసే మగ్గం. పనికిరాని చదువు మెదడుకు, హృదయానికి పనికిమాలిన దుస్తులు వేస్తుంది. [ఎ.పి.గధీ

పుస్తకాల ఎంపిక, స్నేహితుల్లాగే, ఒక క్లిష్టమైన పని. మనం చేసే పనుల పట్ల మనకి ఎంత బాద్యత ఉందో, మనం చదివేవాటిపైన అంతే బాద్యత కలిగి ఉండాలి. [జాన్ లుబాక్

మనకు అసాధారణ తెలివితేటలు గల వ్యక్తి ఎదురవుతే, నువ్వు ఏ పుస్తకాలు చదివావని అతడిని మనం అడగాలి. [ఎమార్సన్]

మనిషి రెండు విషయాల ద్వారా మాత్రమే నేర్చుకుంటాడు. ఒకటి చదవడం ద్వారా, రెండవది తెలివైన ప్రజలతో సంపర్కంద్వారా. [విల్ రోజర్స్]


నిజమైన గొప్ప పుస్తకం చదవడం - మెరుగైన జీవితం జీవించడం ఎలాగో నేర్చుకోవడం లాంటిది. త్వరగా పుస్తకాన్ని చదివి పక్కన పెట్టేయాలి, అది అందించే సంకేతం ఆధారంగా జీవించడం ప్రారంభించాలి.  దేన్న్తే తే చదవడం మొదలుపెట్టానో, దాన్ని కార్యరూపంలో పెట్టి ముగించాలి. [హెన్రీడేవిడ్ ధోరో]

చదువు నేర్చిన ప్రతి వ్యక్తిలోనూ, తనను తను ఉన్నతుణ్ణి చేసుకోగల అనేక విధాలుగా జీవించగల, తన జీవితాన్ని సంపూర్ణం, అర్ధవంతం, ఆసక్తికరమైన జీవితంగా మలుచుకోగల శక్తి ఉంటుంది. [ఆల్డ స్ హక్స్ లే ]

మానవజాతి చేసినది, ఆలోచించినది, సంపాదించినది, మానవజాతి ఏమిటో -అంతా పుస్తకాల పేజీలలో ఉంది. [కార్ల్తెల్

పుస్తకాల లేకుండా నేను బ్రతకలేను [ధామస్జెఫర్సన్

పుస్తకం ఇప్పటికీ కూడా భావాలకు ప్రధాన వాహకమని నేను నమ్ముతున్నాను. [జార్జ్ విల్]

ప్రతి చదువరీ నాయకుడు కాడు. కానీ ప్రతి నాయకుడూ చదువరి కావాలి. [హేరీ ట్రూమన్]

మన నూతన జ్ఞాన ఆర్ధిక వ్యవస్థలో, ఎలా నేర్చుకోవాలో నీవు నేర్చుకొనట్లయితే, నీకు కష్టకాలం ఎదురవుతుంది. [పీటర్ డ్రకర్

సోమవారం, అక్టోబర్ 10, 2016

వైపల్యాల పట్లా, ఇబ్బందుల పట్లా, నిరుత్సాహం పట్లా, మరికొన్ని నిరాశాజనకమైన పరిస్థితుల పట్లా ఒక వ్యక్తి కనబరచే ధోరణిని బట్టి గెలుపు, ఓటమి ఉంటాయి.
ఓటమిని గెలుపుగా మార్చుకునేంధుకు మీకు సాయపడే 5 మార్గదర్శకాలు: 
1. వైఫల్యాన్ని అధ్యయనం చేసి విజియనికి దారి వెతుక్కొండి. ఓడిపోతే నేర్చుకుని, మరోసారి గెలవడానికి ప్రయత్నించండి. 
2. మీకు మీరే నిర్మాణాత్మకంగా విమర్శించుకునే ధైర్యాన్ని అలవరచుకోండి. మీలోని లోతుపాట్లనీ, బలహీనతలనీ వెతుక్కుని, వాటిని సరిదిద్దుకొండి. ఇది మిమ్మల్ని వృత్తి నిపుణుడిగా తీర్చిదిద్దుతుంది. 
3.దురదృష్టాన్ని నిందించవద్దు. ప్రతి వైఫల్యాన్నీ పరిశోధించండి. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోండి. గుర్తుంచుకోండి, దురదృష్టాన్నితిట్టిన వాళ్లెవరూ, తాము వెళ్లవలసిన చోటికి చేరుకోలేదు.
4. పట్టుదలకు ప్రయోగాన్ని జోడించండి. మీ లక్ష్యాన్ని వదలద్దు కానీ గొడకేసి తలబదుకోకండి. కొత్త మార్గాలని ప్రయత్నించి చూడండి. ప్రయోగాలు చేయండి. 
5. గుర్తుంచుకోండి, ప్రతి పరిస్థితిలోనుఎంతో కొంత సానుకూలత ఉంటుంది. దానికోసం వెతకండి. మంచిని చూడండి, నిరుత్సాహాన్ని పారద్రోలండి. 

శనివారం, అక్టోబర్ 08, 2016

బ్రతుకు జట్కాబండి,రచ్చబండ లాంటి దిక్కుమాలిన TV షోలకు మన తీన్మార్ వాళ్ళు భలే బుద్ధి చెప్పారు.ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేయండి.

శుక్రవారం, అక్టోబర్ 07, 2016

ఈ కీలకమైన అంశాలని అభ్యసించండి:
1. పనిమంతులుగా ఉండండి. పని చేసేవాడని పేరు తెచ్చుకోండి. పని చెయ్యండి, చెయ్యకుండా ఉండకండి.
2. పరిస్థితులు నిర్దుష్టంగా ఉండేదాకా వేచి ఉండద్దు. అవి ఎప్పటికీ అలా ఉండవు. భవిష్యత్తులో అడ్డంకులనీ సమస్యలనీ ఎదురుచూడండి, అవి తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించండి.
3. గుర్తుంచుకోండి, కేవలం ఆలోచనలు విజయాన్ని చేకూర్చవు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే వాటికి విలువ ఏర్పడేది. 
4.భయాన్ని పోగొట్టుకుని ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకునేంధుకు పని చెయ్యండి. మీకు భయాన్ని కలిగించే పని చెయ్యండి, అది మాయమవుతుంది. ప్రయత్నించి చూడండి. 
5. మీ మనసు అనే ఇంజన్ని యాంత్రికంగా నడపండి. మీలోని స్పూర్తి మిమ్మల్ని కదిలించేదాకా ఆగద్దు. పని చెయ్యండి, లోతులకి వెళ్లండి, అప్పుడు స్ఫూర్తిని కదిలించగలుగుతాను. 
6. ఇప్పుడు అనే విధంగా ఆలోచించండి. రేపు, వచ్చే వారం, తరవాత, లాంటి మాటలు ఎన్నడూ జరగదు అనే పదానికి పర్యాయాలు. ''ఇప్పుడే పని ప్రారంభిస్తున్నాను,'' అనే వ్యక్తిలా ఉండండి. 
7. వెంటనే పనిలోకి ప్రవేశించండి. పని చెయ్యడానికి సిద్దంగా అవుతూ సమయాన్ని వృధా చెయ్యకండి. దానికి బదులు పని ప్రారంభించండి.
8. చొరవ తీసుకోండి. పోరాడండి. నాయకత్వం వహించండి. స్వచ్ఛంద సేవ చెయ్యండి. పని చేసే సామర్ధ్యం, కొరికా ఉన్నాయని నిరూపించండి
పని ప్రారంభించి పదండి ముందుకు!

గురువారం, అక్టోబర్ 06, 2016

అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్ సన్ విషయమే తీసుకోండి. అధ్యక్షడు కావటానికి ఎంతో కాలానికి ముందే జాన్ సన్ అనునయంగా ఇతరులని ఒప్పించే తన అద్భుతమైన శక్తిని అభివృద్దిపరచుకునే క్రమంలో విజయనికి 10సూత్రాల ప్రణాళికని రూపొందించాడు. అధ్యక్షునితో కొద్దిపాటి పరిచయంవున్న వ్యక్తి ప్రతీ వ్యవహారంలోనూ అతను తన నియమాలను తు.చ. తప్పకుండా అనుసరించేవాడని గ్రహిస్తాడు. అవేమిటంటే-
1. పేర్లు జ్ఞాపకం ఉంచుకునే అలవాటు చేసుకోండి. ఈ విషయంలో మీరు అశ్రద్ధవహిస్తే, తనంటే మీకంతగా ఇష్టంలేదని అవతలి వ్యక్తి అనుకునే ప్రమాదం వుంది. 
2. మీరు హాయిగా సాదాసీదాగా ఉండండి, మీతో సమయం గడపటానికి అవతలివ్యక్తికి ఎటువంటి యిబ్బంది ఉండకూడదు. అన్నీ విషయాలు తెలుసునన్నట్లు ఎంతో అనుభవజ్ఞుడైన వ్యక్తిలా ఉండండి. 
3. మనస్సుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. దుర్భరమైన పరిస్థితులకు కూడా అది చలించకూడదు.
4. ఆత్మసుత్తి చేసుకోకండి, మీకే అన్నీ తెలుసునన్న భావన ఇతరులకి కలిగించకండి. 
5. అందరూ మిమ్మల్ని ఇష్టపడేలా ప్రవర్తించండి. జనాన్ని ఆకర్శించండి, మీ పరిచయ భాగ్యం వల్ల తమకెంతో లాభం చేకూరుతోందని వాళ్లనుకోవాలి. 
6. మీ వ్యక్తిత్వంలో మీకు తెలియకుండా, అంతర్భాగంగా వున్న అంశాలను కూడా వెలికిదీసే ప్రయత్నం చెయ్యండి.
7. సుహృద్భావంతో మీరు అపార్ధం చేసుకున్న, యిప్పుడు చేసుకుంటున్న అంశాలని దూరం చేసుకోవడానికి నిజాయితీగా ప్రవర్తించండి. మీ బాధలని మరచిపోండి.
8. జనాన్ని ఇష్టపడటానికి ప్రయత్నించండి, కాలక్రమణ వాళ్లని నిజంగానే మీరు అభిమానిస్తారు. 
9. ఎవరైనా ఏదైనా సాధించనప్పుడు వారిని అభినందించే అవకాశాన్ని ఎప్పుడూ జారవిడవద్దు, అలాగే దూ:ఖంలో ఉన్నప్పుడు, నిరాశ అనుభవిస్తున్నప్పుడు వారికి మీ సానుభూతి తెలియజేయండి. 
10. జనానికి అధ్యాత్మికబలాన్ని అందజేయండి, వారు మిపట్ల నిజమైన ఆప్యాయత కనబరుస్తారు. 
జనం మిమ్మల్ని ఇష్టపడేలా చేసే ఈ 10 సాధారణమైన, [అయినాశక్తివంతమైన] నియమాలు ప్రెసిడెంట్ జాన్ సన్ కు ఓట్లు సులభంగా పడటానికి, ఆయన కాంగ్రెసులో మద్దతు సంపాదించటానికి పనికివచ్చాయి. ఈ 10 నియమాలతో జీవించటం వల్ల ప్రెసిడెంట్ జాన్ సన్ ని పైకెత్తటం సులువైంది. 
ఈ నియమాలను మరోసారి చదవండి. ఎక్కడా ప్రతీకారం తీర్చుకునే విషయం ప్రస్తావించబడలేదన్నది గమనించండి. అపార్ధాలు లేకుండా చెయ్యడానికని అవతలివ్యక్తి ముందుగా మీ దగ్గరకు రావాలని ఎదురుచూడటం కూడా ప్రస్తావించబడలేదు. 'నాకే అంతా తెలుసు, తక్కినవళ్లంతా వట్టి మూర్ఖులు' అని కూడా ఇక్కడ అనలేదు.   

బుధవారం, అక్టోబర్ 05, 2016

నమ్మకశక్తిని సంపాదించి, బలోపేతం చేసుకునేందుకు గల మూడు మార్గాలు;

1. విజయం గురించి ఆలోచించండి, ఓటమి గురించి కాదు. పనిచేసే చోట, ఇంట్లోనూ, ఓటమి గురించి ఆలోచించే బదులు విజయం గురించి ఆలోచించండి. ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, ఇలా ఆలోచించండి, ''నేను గెలుస్తాను'' , అంతేగానీ ''నేను బహుశా ఓడిపోతాను,'' అని కాదు. ఇంకొకరితో పోటీ చేసేప్పుడు, ''అందరికన్నా ఉత్తమమైన వ్యక్తితో నేను సమానుడిని'' అనుకోండి, ''అతనితో నేనెక్కడ పోటీ చేయగలను.'' అని కాదు. అవకాశం మీ ముందుకొచ్చినప్పుడు ''నేను చెయ్యగలను'' అనుకోండి, చెయ్యలేను,'' అని ఎప్పుడూ అనుకోవద్దు.  ''నేను విజయాన్ని సాధిస్తాను'' అనే గొప్ప ఆలోచన మీ ఆలోచనవిధానాన్ని ఆక్రమించుకో నివ్వండి. విజయం గురించి ఆలోచిస్తే, విజయాన్ని అందించే ప్రణాళికలను మీ మనసు రూపొందించగలుగుతుంది. అపజయం గురించి ఆలోచిస్తే దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ఓటమి గురించిన ఆలోచనలు అలాటి మరిన్ని ఆలోచనలని పుట్టించి, ఓటమిని కలగజేస్తాయి.

2. మీ గురించి మీకున్న అభిప్రాయం కన్నా మీరు మెరుగైనవారేనని తరచూ గుర్తు చేసుకుంటూ ఉండండి. విజయాన్ని సాధించినవాళ్లు సూపర్ మెన్ ఏమి కారు. విజయనికి అసాధారణమైన తెలివితేటలు అవసరం లేదు. అంతేకాదు, విజయం సాధించటంలో పెద్ద రహస్యమో, మర్మమో కూడా లేదు. అలాగే విజయం అదృష్టం మీద ఆధారపడి ఉండదు. విజయాన్ని సాధించేవాళ్లు తమ మీదా, తాము చేసే పనిమీద నమ్మకాన్ని పెంచుకున్న మామూలు మనుషులే. ఎప్పుడూ - అవును, ఎప్పుడూ కూడా -మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. 

3. గొప్ప నమ్మకాలని కలిగి ఉండండి. మీ విజయం మీ నమ్మకాన్ని బట్టే పెద్దదిగానో, చిన్నదిగానో ఉంటుంది. చిన్నచిన్న లక్ష్యాలని ఏర్పరచుకుంటే ఫలితాలు కూడా చిన్నవే ఉంటాయి. పెద్ద లక్ష్యాలని ఏర్పరచుకుని పెద్ద విజయలని సాధించండి. ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి! పెద్ద ఆలోచనలూ, పెద్ద ప్రణాళికలు సామాన్యంగా సులభంగా ఉంటాయి. కనీసం చిన్న ఆలోచనలు, ప్రణాళికల కన్నా కష్టమైనవి మాత్రం కాదు.

జనరల్ ఎలెక్ర్టిక్ కంపెనీ బోర్డు చెయిర్ మన్, మిస్టర్ రాల్ఫ్ జె. కార్డినర్, ఒక లీడర్ షిప్ సమావేశంలో ఇలా అన్నాడు : '' నాయకత్వాన్ని కోరుకునే ప్రతి వ్యక్తి, అది తనకోసం కావచ్చు లేదా కంపెనీ కోసం కావచ్చు. తనని తను వృద్ధి చేసుకునే వ్యక్తిగత కార్యక్రమంలో పాల్గొనాలనే సంకల్పనం చేసుకోవాలని మేం కోరుకుంటున్నాం. ఎవరూ ఎవరినీ అభివృద్ధి చెందామని ఆదేశించరు.... ఒక వ్యక్తి తన ప్రత్యేక రంగంలో వెనకబడి ఉంటాడా ముందుకిపోతాడా అనేది, అతను ఆ పనిని ఎంత మనస్ఫూర్తిగా చేస్తాడనే దానిమీద ఆధారపడి ఉంటాంది. దీన్ని సాధించేందుకు సమయం, ప్రయత్నం, త్యాగం అవసరమవుతాయి. మీకోసం ఇంకొకరెవరో ఆపని చెయ్యలేరు.''

మిస్టర్ కార్డినర్ చెప్పిన సలహా బావుంది, అమలు చెయ్యదగ్గది. దాని ప్రకారం జీవించండి. బిజినెస్ మేనేజ్ మెంటులో, అమ్మకాలలో, ఇంజినీరింగ్ లో, మతపరమైన కార్యాలలో, రచనా, నటన, ఇంకా ఏ విధమైన లక్ష్యాలనైనా పొందాలనుకునేవాళ్లు అన్నిటికన్నా పై స్థాయికి చేరుకోవాలంటే, మనసు పెట్టి , నిరంతరం తనని తను అభివృద్ధి చేసుకోవటం అనే ప్రణాళికని చేపట్టాలి. 

ఏ శిక్షణా కార్యక్రమమైన -ఈ పుస్తకంలో ఉన్నది సరిగ్గా అదే - మూడు పనులు చెయ్యాలి, విషయాన్ని మీముందుంచాలి, అంటే ఏం చెయ్యాలో చెప్పాలి. రెండు, చేసే పద్దతిని, అంటే ఎలా చెయ్యాలి అనేదాన్ని తెలియజేయాలి. ఇక మూడు, ఫలితాలని సాధించటం అనే అంతిమ పరీక్షకి మిమ్మల్ని గురిచేయ్యలి.

విజయాన్ని సాధించటం మీ కార్యక్రమంలో చెయ్యవలసింది ఏమిటి అనేది విజేతలైన వాళ్లు వైఖరీ, పనిచేసే విధానం ఆధారంగా తయారుచేయ్యబడుతుంది. వాళ్లు తమని ఏ విధంగా పనికి తగ్గట్టు మలుచుకుంటారు? అడ్డంకులని ఎలా అధిగమిస్తారు? ఇతరుల నుంచి గౌరవాన్ని ఎలా సంపాదించుకుంటారు? మామూలు మనుషులకన్నా వాళ్లు ఎందుకని భిన్నంగా ఉంటారు? వాళ్లెలా ఆలోచిస్తారు? 

మీ అభివృద్ధి ప్రణాళికలోని ఎలా అనే అంశం పనిచేసే తీరుకి కొన్ని నిర్దేశాలని వరుసక్రమంలో అందిస్తుంది. ఇవి ప్రతి అధ్యాయంలోనూ కనిపిస్తాయి. ఈ నిర్దేశాలు పనికొస్తాయి. వాటిని పాటించి చూడండి, మీకే తెలుస్తుంది.
మరి ఈ శిక్షణలో అన్నిటికన్నా ముఖ్యమైన భాగం, ఫలితాల మాటేమిటి? క్లుప్తంగా చెప్పాలంటే, ఈ శిక్షణాకార్యక్రమాన్ని మనసుపెట్టి, ప్రయత్నించి అమలుచేస్తే, ఇప్పుడు అసాధ్యమని తోచే విజయం మీ సొంతం అవుతుంది. ఈ ప్రణాళికలోని విభిన్న భాగాలని విడదీసి చూసినప్పుడు, మీ వ్యక్తిగత శిక్షణా కార్యక్రమం మీకు వరసగా పురస్కారాలని అందిస్తుంది : మీ కుటుంబం నుంచి మరింత లోతైన గౌరవభావాన్ని బహుమతిగా అందుకుంటారు, మీ స్నేహితులనించీ, తోటి పనివారినించీ ప్రశంసలని సంపాదించుకుంటారు, ఇతరులకి పనికొస్తున్నాను, అనేభావం మీకు బహుమతిగా దొరుకుతుంది, గుర్తింపు పొందుతారు, హోదా వస్తుంది, ఎక్కువ సంపాదనా, హెచ్చు స్థాయి జీవితం పురస్కారాలుగా లభిస్తాయి. 

మీకు మీరు స్వయంగా శిక్షణా ఇచ్చుకుంటారు. మీ గొంతుమీద కూర్చుని ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో చెప్పేవాళ్ళెవరూ ఉండరు. ఈ పుస్తకమే మీకు మార్గదర్శి, కానీ మిమ్మల్ని అర్ధం చేసుకోవలసింది మీరే. ఈ శిక్షణని అమలుచేయ్యమని మిమ్మల్ని ఆజ్ఞాపించ వలసింది మీరే. మీ ప్రగతిని విలువకట్టవలసింది కూడా మీరే. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇంకా పెదా విజయలని సాధించేందుకు మీకు మీరే శిక్షణా ఇచ్చుకుంటారన్నమట.

మీ దగ్గర అన్నీ వస్తువులూ సిద్దంగా ఉన్న ఒక ప్రయోగశాల ఉంది. అందులో మీరు పనిచెయ్యచ్చు, చదువుకోవచ్చు. మీ ప్రయోగశాల మీచుట్టూ ఉంది. మీ ప్రయోగశాలలో ఉన్నది మనుషులు. ఈ ప్రయోగశాల, మనుషులు చెయ్యగల పనుల తాలూకు ఉదాహరణ లన్నిటిని మీకు అందిస్తుంది. మీ సొంత ప్రయోగశాలలో మీరే ఒక శాస్త్రవేత్త అని అనుకున్న తరవాత, ఇక మీరు నేర్చుకోగల వుషయాలకి అంతుండదు-ఇంకా వినండి, అక్కడ కొనటానికి ఏమి ఉండదు. అద్దె చెల్లించక్కర్లేదు. ఎటువంటి ఫీజులూ ఉండవు. మీకు కావలసినప్పుడల్లా ఈ ప్రయోగశాలని మీరు ఉచితంగా వాడుకోవచ్చు.

మీ ప్రయోగశాలకి మీరే నిర్దేశకులు కావటం వల్ల, అందరూ శాస్త్రవేత్తల్లాగే మీకు కూడా పరీక్షించాలనీ, ప్రయోగాలు చెయ్యాలనీ అనిపిస్తుంది.

జీవితమంతా మనచుట్టూ మనుషులు ఎప్పుడూ ఉన్నప్పటికి, చాలమందికి మనుషులు ప్రవర్తించే తీరు అర్ధం కాకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా? మనలో అధికశాతం గమనించటంలో శిక్షణా పొందరు. ఈ పుస్తకం తాలూకు ముఖ్యమైన ఉద్దేశలలో ఒకటి, పరీక్షించటం అనే విద్యలో మీకు శిక్షణా ఇవ్వటం, మనుషుల ప్రవర్తనని అర్ధం చేసుకునే పరిజ్ఞానాన్ని మీకు అందించటం. మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకోవచ్చు, జాన్ అంతా పెద్ద విజయలని ఎలా సాధించగలుగుతున్నాడు. టామ్ మాత్రం ఎందుకు మందకొడిగా ఉండిపోయాడు? '' ''కొంతమందికి ఎక్కువమంది స్నేహితులూ, మరికొందరికి తక్కువమంది స్నేహితులూ ఎందుకుంటారు?'' ''ఒక మనిషి చెప్పినా మాటని ఆనందంగా అంగీకరించేవాళ్లు, ఇంకొకరు అదే విషయాన్ని చెప్పినా ఎంధుకు వినిపించుకోరు.?''

ఒకసారి శిక్షణ పొందాక, మామూలు పరిశీలన అనే విధానం ద్వారా మీరు విలువైన పాఠాలు నేర్చుకుంటారు. 
శిక్షణా పొందిన పరిశీలకుడిగా తయారయెందుకు మీకు సాయపడగల రెండు ప్రత్యేకమైన సలహాలు చెపుతాను వినండి. మీరు విశేషంగా అధ్యయనం చేసేంధుకు అందరికన్నా ఎక్కువ విజయాన్ని సాధించిన వ్యక్తినీ, అందరికన్నా పెద్ద అపజయాన్ని పొందిన వ్యక్తినీ అధ్యయనం చెయ్యండి. ఆ తరవాత, ఈ పుస్తకం ముందుకి సాగినకొద్దీ, విజేతగా ఉన్న వ్యక్తి విజయం తాలూకు సూత్రాలని ఎంత క్షుణ్ణంగా పాటిస్తున్నాడో గమనించండి. ఈ రెండు పరస్పర విరుద్ధమైన ఉదాహరణలని అధ్యయనం చెయ్యటం వల్ల, ఈ పుస్తకంలో చెప్పిన వాస్తవాలని అనుసరించటంలో ఉన్న వివేకం ఎంత ఉపయోగకరమైనదో నిస్సందేహంగా మీకు తెలిసివస్తుంది. 

ఒక్కొక్క వ్యక్తితోనూ మీరు పరిచయం చేసుకుంటూ పోతే విజయం తాలూకు సూత్రాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది. విజయంతో నిండిన పనులని ఒక అలవాటుగా చేసుకోవటమే మీ ధ్యేయం. ఎంత ఎక్కువ అభ్యాసం చేస్తే, అంతా త్వరగా అదిమి స్వభావంలో విడదీయరాని భాగంగా మరి మీరు కోరుకున్నట్టుగా పనిచెయ్య గలుగుతారు.

ఒక అభిరుచి కోసం దేన్నైనా పెంచే స్నేహితులు మనలో చాలమందికి ఉంటారు. వాళ్లు '' ఈ మొక్కలు పెరుగుతుంటే చూడటం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎరువులకీ, నీళ్లకీ అవి ఎలా ప్రతిస్పందిస్తాయో ఒక్కసారి గమనించండి.
పోయిన వారం కన్నా ఇప్పుడు ఎంతఏపుగా తయారయాయో చూడండి. '' అనటం మన౦ చాలాసార్లు వింటాం.
ఆ మాట నిజమే, మనుషులు జాగ్రత్తగా ప్రకృతికి సహకరిస్తే లభించే ఫలితాలు చేస్తే ఒళ్లు పులకరించిపోతుంది. కానీ మీ అంతట మీరు జాగ్రత్తగా నిర్వహించుకునే ఆలోచనలని అధీనంలో ఉంచుకోవటం అనే కార్యక్రమానికి మీరు ఎలా ప్రతిస్పందిస్తారో గమనిస్తే, దానికి పదిరెట్లు ఎక్కువ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతారు. రోజురోజుకీ, నెలనెలకీ, మీరు మరింత ఆత్మవిశ్వాసాన్నీ, ప్రభావాన్ని, విజయాన్ని సాధించుకోవటం గమనిస్తే మీకు బలే సరదాగా అనిపిస్తుంది. మీరు విజయాన్ని, ఫలితలనీ సాధించే మార్గంలో ప్రయాణిస్తున్నారని తెలుసుకుంటే ఇచ్చే సంతృప్తిని ఏదీ, ఇంకేదీ, ఇవ్వలేదు. మీనుంచి మీరు వీలైనంత ఎక్కవ పొందటం కన్నా పెద్ద సవాలు మరొకటి ఏదీ ఉండదు.    
తెలుగు బ్లాగుల ప్రపంచంలో ఈమధ్య ఎవరూ పెద్దగా కనిపించడం లేదు. ఏదైనా పోస్ట్ పెడితే కనీసం 200 వరకూ లైక్స్ వచ్చి పడేవి. ఇప్పుడు చూస్తే మాత్రం కేవలం 50 లైకుల కంటే ఎక్కువ రావడం లేదు. దీనిని బట్టి కొద్దిగా బ్లాగు వీక్షకులు తగ్గిపోయినట్టుగా కనిపిస్తోంది.
కారణం ఏమిటంటారు?
సరైన పసందు కలిగిన పోస్టులు రావడం లేని కారణమా? లేక వస్తే కొంతమంది విమర్శకుల గోల,గోల చదవలేకా? ఏమి జరుగుతుందో గాని బ్లాగు ప్రపంచంలో ఆరోగ్యం పోయింది.
నాతో సహా ఎవరూ సరైన పోస్టులు రాయడం లేదు. వ్రాసినా తిట్ల దండకం తప్ప ప్రోత్సాహమూ లేదు. ఇదిలాగే కొనసాగితే కొన్నాళ్ళకి బ్లాగులను మర్చిపోతారేమో?

మంగళవారం, అక్టోబర్ 04, 2016

మధ్యాహ్నం వచ్చే టీవి టాక్ షో చూసినవారెవరైనా వెంటనే 'డమ్మీయి౦గ్ డౌన్' అంటే ఏమిటో అర్ధం చేసుకోగలరు. ఈ షోలలో అనేకం 'తమ కుమరైల బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేసే తల్లులు' లాంటి విషయాలు చర్చిస్తూ మనిషి స్వభావంలో చెడు పార్శ్వన్ని రెచ్చగొట్టి డబ్బులు చేసుకుంటాయి.

నేను చెప్పెదేమిటో మీకు అర్ధమైంది.

టాక్ షో హోస్టులలో మహారాణి, ఓప్రా విన్ ఫ్రీ, టీవి ఒక శక్తివంతమైన మధ్యమమని, వినోదానికి గొప్ప సాధనమనీ, కొద్దిగా టీవీ ప్రయోజనకరంగా ఉంటుందనీ అంగీకరిస్తుంది. పఠనంలాగా టీవీ వ్యక్తిగత వికాసానికి తోడ్పడదు. 
'టీవీ తప్పడు విలువలను ప్రోత్సహిస్తుంది' అని ఆమె ఏ మాత్రం దాపరికం లేకుండా చెబుతుంది.

ఓప్రా విన్ ఫ్రీ, మధ్యాహ్నం చెత్త ప్రోగ్రాంలు వదలి, ఎక్కువగా అమ్ముడుపోయే ఒక పుస్తకం గురించి చర్చ కార్యక్రమం, 'ఓప్రా పుస్తకాల క్లబ్బు' ప్రారంభించినప్పడు, ఒక స్వచ్ఛమైన గాలి విచినట్లయింది. ఓప్రా హృదయంలో పుస్తకాలకు ప్రత్యక స్థానం ఉందని చెబుతుంది ఆమె.

ఓప్రా మిస్సిసిపీలో ఒక పేద, అవివాహిత తల్లికి జన్మించింది. చదువురాణి అమ్మమ్మ పెంపకంలో పెరిగింది. టీవి చరిత్రలో అత్యంత ధనికులైన, అత్యంత శక్తివంతమైన వ్యక్తిత్వం గల వ్యక్తిని సృష్టించగల నేపధ్యం కాదు ఇది. ఆరేళ్ళ వయసులో ఓప్రా నాష్ వీల్లీలో ఉన్న తన తండ్రి, సవతి తల్లితో కలిసి జీవించడానికి వెళ్లింది. అక్కడ ఆమె జీవితాన్ని మలుపుతిప్పిన సంఘటన ఒకటి జరిగింది. అక్కడ ఆమెకు మొట్టమొదటి లైబ్రరీ కార్డు లభించింది. తండ్రి, సవతి తల్లి, అమూల్యమైన చదువు ఆమె గుర్తించేలా చేశారు. ఆమె చదివిన పుస్తకాల మీద రిపోర్టులు రాయమని ఆమెను అడిగేవారు.

ఒక యువ అభిమాని ఆమెను టాక్ షో హోస్టుగా ఎలా మరిందో అడిగినప్పడు. 'నేను గొప్ప పాఠకురాలిని కావడం వలన ఇది జరిగింది' అని సమాధానమిచ్చింది.

పసితనంలో ఓప్రాను రోజుకు ఒక గంట మాత్రమే టీవీ చూడనిచ్చేవారు. అందువలన వినోదంకోసం, ఊరటకోసం, తోడుకోసం ఆమె పుస్తకాలవైపు తిరిగింది. అనేకమార్లు పుస్తకాలు తన స్నేహితులు, కొన్ని సమయాల్లో అవి మాత్రమే నాకున్న స్నేహితులు అని ఆమె చెప్పింది. ఓప్రా ఆవేశంతో పుస్తకాలకు ఉన్న మార్చే శక్తి గురించి మాట్లాడినప్పుడు, ఆమె తన అనుభవం నుంచి మాట్లాడుతోంది. తన హృదయంలో మాట్లాడుతోంది. ఆమె చదువుకు ఉన్న శక్తిని ఈ విధంగా వర్ణిస్తుంది- మీరు మరొకరి జీవితం గురించి చదువుతారు. కానీ అది మీరు మీ జీవితం గురించి ఆలోచించేటట్లు చేస్తుంది. చదువులో ఉన్న గొప్పతనం అది. అందువల్లనే నేను పుస్తకాలంటే ఇష్టపడతాను.'

సోమవారం, అక్టోబర్ 03, 2016

చదవలేకపోవడం అనేది ప్రవేశించడానికి ఒకే ద్వారం 
ఉన్న ఒక ప్రపంచం వంటిది. లోనికి ప్రవేశిస్తే ఏమి 
ఉండదు. అక్షరాస్యత నన్ను ఈ చీకటి ప్రపంచన్నుంచి 
విముక్తి చేసింది. అక్షరాస్యత వలన ఈ ప్రపంచంలో 
ప్రవేశించడానికి నాకు వెయ్యి ద్వారాలున్నాయి.
                              ఎర్నెస్ట్ కార్, (మెంఫిన్ అక్షరాస్య కౌన్సిల్ లో పూర్వ విద్యార్ధి)

చదువు, వ్రాత లేని ప్రపంచాన్ని ఊహించడానికి ప్రయత్నించండి. ఆ ప్రపంచంలో పుస్తకాలు, వార్తాపత్రికలు, మేగజైన్లు ఉండవు- ఇది స్పష్టమే కానీ ఇది ప్రారంభం మాత్రమే.
చదువు, వ్రాత లేకుండా టీవీ ఉండదు. చలనచిత్రాలు, పెన్సిళ్లు, పెన్నులు, కాగితం, వీధిలో మార్గసూచికలు, అడ్రసులు, కాంట్రాక్టులు, స్టాక్ మార్కెట్, డిక్షనరీలు, షాపింగ్ పట్టికలు, మెయిల్స్, లైబ్రరీలు, కార్లు, సైకిళ్ళు, ఫ్యాక్టరీలు, ఫోన్ బుక్, ఫోన్లు, సిటీ హాల్, వృతిపరమైన క్రీడలు, కిరణాకోట్లు, బ్యాంకులు, చెక్కులు, ముద్రించిన నోట్లు, మేపులు, స్కూల్లు, కేలండర్లు, గడియారాలు, చేతి గడియారాలు, విమానాలు, టైప్ రైటర్లు, కంప్యూటర్లు -ఏమి ఉండవు. చదివి సంపన్నులవండి
క్లుప్తంగా చెప్పాలంటే, మనకు తెలిసిన నాగరికత ఉండదు. చెప్పడానికి పురోగమనం ఉండదు. 
చదువు, వ్రాత లేకుంటే మనం రాతియుగంలోనే ఉండిపోతాం.

శనివారం, అక్టోబర్ 01, 2016

చదవడంలో మరో ప్రయోజనం ఏమిటంటే మీరు మార్జిన్లో నోట్లు రాయవచ్చు కీలక భాగాలను హైలైట్ చెయ్యవచ్చు [ఆడియో టేపులో ఇది ప్రయత్నించి చూడండి ] అబ్రహం లింకన్ భాగస్వామి, బిల్లీ హెర్న్ డన్, పాఠ్యభాగాలను అండర్ లైను చెయ్యడంలో, మార్జినులో నోట్లు రాయడంలోను, లింకన్ నిపుణుదని పేర్కొన్నాడు. ఏదైనా పుస్తకంలో కానీ, పత్రంలో కానీ భాగాలు ప్రత్యకంగా గుర్తుపెట్టుకోవాలని లింకన్ అనుకున్నప్పుడు, అతను పేజీలకు పేజీలు అండర్ లైను చేసి తిరిగి రాసేవాడు.
ఈ పద్ధతి సమయం తీసుకుంటుంది కానీ ఫలితాలను ఎవ్వరూ కాదనరు. ఇల్లినాయ్ రాష్ర్టంలో స్ర్పింగ్ ఫీల్డ్ లో లాయరుగా ఉంటూ, లింకన్ ఇల్లినాయ్ సుప్రీంకోర్టులో డజన్ల కేసులు వాదించాడు. న్యాయమూర్తులు, అతనికి వ్యతిరేకంగా వాదించే లాయర్లు, తను చేపట్టిన కేసు గురించి అతనికున్న సంపూర్ణ పరిజ్ఞానం చూసి, విషయాలను విశదపరచడానికి బైబిలు లేక గ్రీకు పురాణాల కధలు చెప్పే అతని నైపుణ్యం చూసి ఆశ్చర్యపోతుండేవారు.

 


Recent Posts