శనివారం, సెప్టెంబర్ 24, 2016

ప్రపంచంలో పుస్తకాన్ని మించిన నమ్మకమైన స్నేహితుడు మరొకరు లేరు.పుస్తకం మనకెప్పుడూ జ్ఞానాన్ని,సంస్కారాన్ని నేర్పుతుంది.దౌర్భాగ్యం ఏమిటంటే ఇప్పుడందరూ Facebook,twitterఅనుకుంటూ ఎంతో సమయాన్ని వృధా చేస్తూనే ఉన్నారు.అవి వాడకూడదు అని నేను అనడం లేదు.గంటల తరబడి వాటి చుట్టూ తిరగడం తప్పు అని నా నిశ్చితాభిప్రాయం.నిజానికి ఆ సోషల్ సైట్స్ వల్ల నేర్చుకునేది ఏమీ లేదు.Facebookలో గడిపే Timeలో ఒక పది నిముషాలు మంచి పుస్తకం చదివితే ఎంతో నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు.
       కందుకూరి వీరేశలింగం పంతులుగారు "చినిగిపోయిన చొక్కాని సూది,దారం పెట్టి కుట్టుకో.కాని కొత్త చొక్కా కొనే ఆ డబ్బులతో ఓ మంచి పుస్తకం కొనుక్కో"మన్నారు.
      ఇప్పుడన్నీ హైటెక్ చదువులయి పోయాలి.చదువుకునే రోజులు పోయి చదువుకొనే రోజులొచ్చేసాయి.చదువు ఇప్పుడు ప్రోత్సాహానికంటే అమిత భారాన్ని కలిగిస్తోంది.ర్యాంకుల కోసం బట్టి పట్టడం తప్ప నేర్చుకునేది ఏమీ ఉండడం లేదు.బహుశా మంచి పుస్తకాలు కూడా చదవడానికి యువత వెనుకాడడానికి కారణం ఇప్పటి చదువులేనేమో!
      నేను 8వ తరగతి చదివేటప్పుడు మా టీచర్ గారు "నేర్చుకోండి..నేర్చుకోండి" అనే వారు.ఆయన దృష్టిలో నేర్చుకోవడం అంటే చదువుకోవడం.అంటే బట్టీ పెట్టి చదవడడం కాదు.అవగాహణ చేసుకుంటూ చదవడం.అప్పుడు ఆయనను పిచ్చివాడని కామెంట్ చేసుకునే వాళ్లం. ఇప్పుడు మాకు తెలుస్తుంది.ఆయన మాటల యొక్క  మర్మం, గొప్పతనం.
     ఇకనుండైనా మనం పుస్తక పఠనాన్ని ప్రారంభించాలి.నెలకొచ్చీ ఎంతో వృధా ఖర్చు చేస్తాం.కనీసం నెలకి ఓ మంచి పుస్తకం కొంటే ఎంత ఉపయోగం.పుస్తకాల పట్ల నా దినచర్య క్రింది విధంగా ఉంటుంది.

  • నెలకి ఓ మంచి పుస్తకం కొంటాను.
  • ప్రతిరోజూ పడుకునే ముందు ఓ 15నిముషాలు చదువుతాను.
  • అంతే కాకుండా ఖాళీ కుదిరినప్పుడు,వీలు కుదిరినప్పుడు కూడా చదువుతాను.
  • ఒకవేళ ఎవరైనా నా బుక్ షెల్ఫ్ నుండి పుస్తకం తీసుకెళితే అతను చదివిన తరువాత కంపల్సరీ ఆ పుస్తకాన్ని తిరిగి తీసేసుకుంటాను.ఎందుకంటే పుస్తకాల పట్ల జాగ్రత్త లేనివారు పుస్తకాలు కూడా చదవరు.
  • నా ఆస్థి అంతా నిండుగా ఉన్న నా బుక్ షెల్ఫే.
మీరు కూడా పుస్తకాలు చదవండి.ఇతరులకు చదివే ప్రేరణను కలిగించండి.పుస్తకాలు మనల్ని తప్పనిసరిగా విజ్ఞానవంతున్ని చేస్తాయి.తలవంచి మనం పుస్తకం చదివితే అవి మనల్ని తలెత్తుకునేలా చేస్తాయి.శుభం.

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts