శుక్రవారం, సెప్టెంబర్ 30, 2016

ఈ మధ్య నేను ఒక ప్రచురణకర్తతో చదువు ద్వారా ఒక అడుగు ముందుండడం గురించి మాట్లాడుతూ, అతన్ని సూటిగా అడిగాను 'మనం సమాచారం సేకరించే వివిధ మార్గాలను చదువు ఒక ప్రత్యక స్థానంలో ఉండడానికి చదువు లో ఉన్నదేమిటి? 
అతను సామాన్యమైన, కానీ గంభీరమైన సమాచారం చెప్పే ముందు ఒక క్షణం ఆలోచించాడు. అతని సమాధానం చదువు అన్నది. సమాచారం సేకరించడానికి మనిషి కనుగొన్న ప్రక్రియల్లో అత్యంత శక్తిమంతమైన సాధనంగా ఎందుకు ఉందో తక్షణం వివరిస్తుంది.
'చదువుతున్నప్పుడు మీరు స్కాన్ చెయ్యగలరు' -అతను మెల్లిగా అన్నాడు.
'అదీ విషయం' అనుకున్నాను నేను. 'అందువలనే, టీవి కానీ, చలనచిత్రాలు కానీ, సంభాషణలు కానీ... మనిషి కనుగొనే మారేది కానీ... పఠనస్థానాన్ని తీసుకోలేవు. నువ్వు చదువుతున్నప్పుడు స్కాన్ చెయ్యగలవు. పరిమిత సమయంలో మీకు కావలసిన సమాచారం గురించి వెతుకుతున్నప్పుడు, ఇది మీకు ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు స్కాన్ చేస్తారు!
మీరు వీడియోని కానీ, ఆడియోని కానీ ఎప్పుడైనా స్కాన్ చెయ్యడానికి ఒక అడుగు ముందుకు - రోజుకు పదిహేను నిమిషాల చదువు మీ జీవితాన్ని మార్చగలదు
ప్రయత్నించారా? ఇది నిజంగా తలనొప్పి వ్యవహారం. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినప్పుడల్లా, నాకు కావల్సిన భాగం మిస్ అయిపోతుంటాను. కానీ పుస్తకం చదివేటప్పుడు స్కాన్ చెయ్యడం చాలా తేలిక. పుస్తకాలకంటే కంప్యూటర్ స్క్రీన్ స్కాన్ చెయ్యడం కష్టం. ఎందుకంటే మీరు స్ర్కోల్ చెయ్యాలి. ప్రోగ్రామర్స్ ఈ సమస్య గుర్తించి టెక్స్ట్ లేఔట్ మెరుగుచేస్తున్నారు. 

శనివారం, సెప్టెంబర్ 24, 2016

ప్రపంచంలో పుస్తకాన్ని మించిన నమ్మకమైన స్నేహితుడు మరొకరు లేరు.పుస్తకం మనకెప్పుడూ జ్ఞానాన్ని,సంస్కారాన్ని నేర్పుతుంది.దౌర్భాగ్యం ఏమిటంటే ఇప్పుడందరూ Facebook,twitterఅనుకుంటూ ఎంతో సమయాన్ని వృధా చేస్తూనే ఉన్నారు.అవి వాడకూడదు అని నేను అనడం లేదు.గంటల తరబడి వాటి చుట్టూ తిరగడం తప్పు అని నా నిశ్చితాభిప్రాయం.నిజానికి ఆ సోషల్ సైట్స్ వల్ల నేర్చుకునేది ఏమీ లేదు.Facebookలో గడిపే Timeలో ఒక పది నిముషాలు మంచి పుస్తకం చదివితే ఎంతో నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు.
       కందుకూరి వీరేశలింగం పంతులుగారు "చినిగిపోయిన చొక్కాని సూది,దారం పెట్టి కుట్టుకో.కాని కొత్త చొక్కా కొనే ఆ డబ్బులతో ఓ మంచి పుస్తకం కొనుక్కో"మన్నారు.
      ఇప్పుడన్నీ హైటెక్ చదువులయి పోయాలి.చదువుకునే రోజులు పోయి చదువుకొనే రోజులొచ్చేసాయి.చదువు ఇప్పుడు ప్రోత్సాహానికంటే అమిత భారాన్ని కలిగిస్తోంది.ర్యాంకుల కోసం బట్టి పట్టడం తప్ప నేర్చుకునేది ఏమీ ఉండడం లేదు.బహుశా మంచి పుస్తకాలు కూడా చదవడానికి యువత వెనుకాడడానికి కారణం ఇప్పటి చదువులేనేమో!
      నేను 8వ తరగతి చదివేటప్పుడు మా టీచర్ గారు "నేర్చుకోండి..నేర్చుకోండి" అనే వారు.ఆయన దృష్టిలో నేర్చుకోవడం అంటే చదువుకోవడం.అంటే బట్టీ పెట్టి చదవడడం కాదు.అవగాహణ చేసుకుంటూ చదవడం.అప్పుడు ఆయనను పిచ్చివాడని కామెంట్ చేసుకునే వాళ్లం. ఇప్పుడు మాకు తెలుస్తుంది.ఆయన మాటల యొక్క  మర్మం, గొప్పతనం.
     ఇకనుండైనా మనం పుస్తక పఠనాన్ని ప్రారంభించాలి.నెలకొచ్చీ ఎంతో వృధా ఖర్చు చేస్తాం.కనీసం నెలకి ఓ మంచి పుస్తకం కొంటే ఎంత ఉపయోగం.పుస్తకాల పట్ల నా దినచర్య క్రింది విధంగా ఉంటుంది.

  • నెలకి ఓ మంచి పుస్తకం కొంటాను.
  • ప్రతిరోజూ పడుకునే ముందు ఓ 15నిముషాలు చదువుతాను.
  • అంతే కాకుండా ఖాళీ కుదిరినప్పుడు,వీలు కుదిరినప్పుడు కూడా చదువుతాను.
  • ఒకవేళ ఎవరైనా నా బుక్ షెల్ఫ్ నుండి పుస్తకం తీసుకెళితే అతను చదివిన తరువాత కంపల్సరీ ఆ పుస్తకాన్ని తిరిగి తీసేసుకుంటాను.ఎందుకంటే పుస్తకాల పట్ల జాగ్రత్త లేనివారు పుస్తకాలు కూడా చదవరు.
  • నా ఆస్థి అంతా నిండుగా ఉన్న నా బుక్ షెల్ఫే.
మీరు కూడా పుస్తకాలు చదవండి.ఇతరులకు చదివే ప్రేరణను కలిగించండి.పుస్తకాలు మనల్ని తప్పనిసరిగా విజ్ఞానవంతున్ని చేస్తాయి.తలవంచి మనం పుస్తకం చదివితే అవి మనల్ని తలెత్తుకునేలా చేస్తాయి.శుభం.

బుధవారం, సెప్టెంబర్ 21, 2016

మన దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది, ఆర్ధిక వ్యవస్థ బలపడుతోంది, ఇండియా పూర్తిగా వెలిగిపోతోందంటూ మన పాలకులు చేసే ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పేరు మారుమ్రోగుతోంది. అంతర్జాతీయ క్రీడలు సైతం భారతదేశంలో నిర్వహిస్తున్నారు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇండియా పోటీపడుతోంది. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే, ఇక నాణానికి మరోవైపు గమనిస్తే సగటు మనిషి జీవనం దుర్భరంగా మారింది. పేదలకు కూడు, గూడు, గుడ్డ కరువయ్యాయి. ప్రజల కష్టాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. రైతుల సమస్యలు తగ్గడానికి బదులు నానాటికీ పెరిగిపోతున్నాయి.
మరోవైపు సామాజిక రగ్మతలు పట్టిపీడిస్తున్నాయి. ఆర్ధిక సమస్యలు మనిషిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. రాజకీయ వ్యవస్థ రోజురోజుకూ భ్రష్టుపట్టిపోతుంది. మైనారిటీ పరిస్థితి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. వారిలో మార్పు కనబడటం లేదు. సామాజికంగా మైనారిటీ ల హోదాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. కేవలం రిజర్వేషన్ల సౌకర్యం తప్ప మిగతా ప్రభుత్వ సౌకర్యాలు ఏవి వారికి అందడం లేదు.
ఇక ఆర్ధిక సమస్యల విషయానికి వస్తే, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా  పెరిగిపోయాయి. సగటు మనిషి బ్రతకడానికి పోరాడుతున్నాడు. ఒకవైపు ప్రభుత్వం స్వయం సమృద్ధి గురించి బీరాలుపలుకుతోంది. కానీ మరోవైపు వ్యవసాయ దేశoగా పేరున్న మన దేశంలో ఆహార ధాన్యాల కొరత, ధరల పెరుగుదల విచిత్రంగా మారింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మొదలైంది. దైవానుగ్రహం వల్ల వర్షాలు కూడా సకాలంలో కురుస్తున్నాయి. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్న చందంగా మారింది మన రైతన్న పరిస్థితి.
సగటు ప్రజలకు వైద్యసదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమై నెలగడుస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రాష్ర్టంలోని పలుపట్టణాల్లో మురికినీటి సమస్యల వల్ల ప్రజల తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఇంతజరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి పటిష్టమైన చర్యలు చేపట్టడంలేదు. ఇక గ్రామాల్లో పరిస్థితి చెప్పనక్కర్లేదు. పరిస్థితి ఇంతదయనీయంగా మారినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. ప్రభుత్వ ఖజానాను పెంచుకునే మత్తులో ఉంది ప్రభుత్వం. దానికోసం ప్రజల ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడుతోంది. అన్ని చెడులకు మూలమైన మద్యం ద్వారా ఖజానా నింపుకోవాలని చూస్తోంది. ఈ మద్యం మహమ్మారి ఏదో ఒక రూపేణ ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నా సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తోంది. 
మధ్య తరగతి, పేదల కష్టాలను తీర్చలేని అభివృద్ధి నిజమైన అబివృద్ధి కాలగదా... ఓట్లు వేసే ప్రజల ఆ ఓట్లతో అందలమెక్కే సిగ్గు లేని నేతలు ఈ విషయమై ఆలోచించాలి. పదే,పదే అదే నాయకులకు ఓట్లు వేసే సిగ్గు లేని ఓటర్లు కూడా దీని గురించి ఆలోచించుకోవాలి. 

మంగళవారం, సెప్టెంబర్ 20, 2016

విక్రమ్ నటన అన్నా,విక్రమ్ సినిమాలన్నా నేను చాలా ఇష్టపడతాను. ఈమధ్య రిలీజైన కొత్త సినిమా "ఇంకొకడు" ను చూడాలని ఎన్నో సార్లు అనుకున్నాను. కానీ చూసే భాగ్యం నాకు దక్కలేదు. వెళదామనుకున్న ప్రతిసారి ఏదో పని బడి కాల్సిల్ అవుతుంది. సహజంగా నేను సినిమాకి సాయంత్రం 6:30 కి మాత్రమే వెళతాను. మిగతా ఏ షో కి కూడా వెళ్ళే చాన్స్ లేదు. కుదిరినా వెల్ల బుద్ధి కాదు కూడా!
 ఎలాగైనా వీలు చూసుకుని ఆ సినిమా చూసి రివ్యూ రాయాలనుకుంటున్నాను. రాస్తాను కూడా!!

సోమవారం, సెప్టెంబర్ 19, 2016

మనలో చాలా మందిమి సమస్యల గూర్చి ఎక్కువుగా ఆలోచించుకుంటూ ఉంటాము. దాని వలన మనసు ఒక విధమైన బరువుతో నిండిపోయి విపరీతమైన ఆవేదనకు, ఆందోళనకు గురై పోయి మనస్సు కకావికలమై పోయి భరించలేని మానసిక క్షోభకు గురైపోతుంది. దీని వలన మనకు సరిగా నిద్ర పట్టదు. తినబుద్ధి కాదు. అదీ ఫ్యామిలీ సమస్యలైతే మరీ దారుణం.
       ఇటువంటి పరిస్థితులలో మనం జాగ్రత్త తీసుకోక పొతే మనమే తీవ్రంగా నష్టపోతాము. సమస్యకు కారణమైన వారు హ్యాపీగానే ఉండగలుగుతారు.
      ఇక్కడ మనం గమనించవలసింది ఒక్కటే విషయం.
      మనమెందుకు ఆ సమస్యల కోసం ఎక్కువ ఆలోచించాలి? జరిగేదేదో ఎలాగూ జరుగుతుంది. మనమెందుకు ఎక్కువ ఆలోచించి ఆందోళన చెందాలి? మనస్సు పాడు చేసుకోవాలి? నిద్ర పోగట్టుకోవడం ఎందుకు,తినడం మానివేయడమెందుకు? దాని వలన ఆరోగ్యాన్ని దూరం చేసుకోవడమెందుకు?
      అన్నిటికీ ఒక్కటే పరిష్కారం!
      సమస్యకు దూరంగా ఉండడం.పట్టించుకోవడం మానివేయడం. అప్పుడు అవే మీ దగ్గరకు పరిష్కారం కోసం వస్తాయి.

ఆదివారం, సెప్టెంబర్ 18, 2016

అవును ఇది వాస్తవం. చేసేవాడు ఎప్పుడూ చేసుకుంటూ పోతాడు. చూసేవాడు చూస్తూనే ఉంటాడు. వాడికి చేసే వాడిని విమర్శించడం తప్ప మరొక పని ఉండదు. కాని చేసేవాడు అవేవీ పట్టించుకోడు.వాడు పని వాడు చేసుకుంటూ పోతాడు. ఎందుకంటే వాడికి విమర్శించే వాళ్లకు సమాధానం చెపుతూ కూర్చుంటే వాడి పని ముందుకెల్లదని తెలుసు.
పని చేసేవాడు తక్కువ మాట్లాడతాడు. ఎవరికీ చులకన కాడు. పని చేయనివాడు మాత్రమే ఇంతలేదు,అంతలేదు అంటూ విర్రవీగుతాడు. వీడికి సమయాన్ని ఇచ్చిన వాడు తన జీవితాన్ని కోల్పోవడం ఖాయం.
కాబట్టి ప్రతి వ్యక్తీ తమ,తమ రంగాలలో ముందుకు పోవడానికి శ్రమించాలి. ఎందుకంటే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.
ప్రతి రోజూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.నిజానికి మనిషికి జ్ఞానమే పెద్ద ఆస్తి. అది ఉంటే మనిషి దేనినైనా సాధించగలడు.చేధించగలడు.కాబట్టి మనమందరమూ కూడా పని చేసే వర్గంలోనే కల్సిపోదాము.దీనికి మీరేమంటారు?

శనివారం, సెప్టెంబర్ 17, 2016

వీరు మనుష్యులు కారు. వీరు మంచుయుగంలో అత్యాదిక శక్తిమంతులు. పొడిగించిన పుర్రెలు కలిగి, విపరీతమైన మేధావితనం గలవారు. మనమంతా రహస్య సమూహాలతో మరియు రహస్యలతో నిండిన ప్రపంచములో జీవిస్తున్నాము. ప్రజలకు తెలియవలసిన సమాచారం, తెలియనివ్వటంలేదు. నాలుగు రకాల అన్య జాతుల వారు 1000 సంవత్సరాల నుండి భూమికి వచ్చి పెడుతున్నారు. అందులో నాకు ఒకరి గురించే తెలుసు. వారు nderomeda నక్షత్ర మండలాలలో ఉన్న గ్రహం నుండి వచ్చారు. వారు క్రమశిక్షణకు కట్టుబడ్డవారు. మన గ్రహాన్ని మనమే యుద్ధాల పేరుతో నాశనం చేసుకుంటున్నామాట. అనవసరమైన పరిశోధనలతో డబ్బు వృధా చేసుకోవడమే   కాకుండా, ఇతర గ్రహాలపై దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నా మాట. అది వారికి నచ్చలేదుట. వెంటనే ఆపకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వెళ్లేరు.
''భూమి మీద రెండవ జాతి డబ్బును, మతాలను నియంత్రిస్తోంది ''
భూమి మీద మానవజాతి కాకుండా మరో జాతి కూడా సంచరిస్తోందా? ఆ రెండవ జాతే ప్రపంచములోని అన్నీ మతాలను మరియు డబ్బును నియంత్రణచేస్తోందా? ఆ జాతివారే మానవులను శాసిస్తున్నారా,వారు చెప్పినట్లే మానవులు నడుచుంటున్నారా? వారు మానవులతో కలిపి జీవిస్తున్నారా? మనలో ఒకళ్లుగా సంచరిస్తున్నారా?... ఇలా తలచుకుంటేనే వొళ్ళు జాలదిరిస్తోంది... అవునా?
కానీ ఒక ప్రముఖ వ్యక్తి ఈ విషయాన్ని చెబితే అది నమ్మలా? వద్దా? మనకులాగానే ప్రపంచములోని చాలా మండి ప్రజలు ఆ ప్రముఖ వ్యక్తి చెప్పేది నమ్మలా,వద్దా అనే గందరగోళంలో ఉన్నాయి. చాలామంది ఆ ప్రముఖ వ్యక్తి చెప్పింది కొట్టిపారేశసారు. కొంతమంది మాత్రం ఆ వ్యక్తి చెప్పిందాంట్లో నిజాలను వెదుకుతున్నారు... ఎవరావ్యక్తి? ఆ వ్యక్తి  ప్రపంచ బ్యాంక్ మాజీ సీనియర్ [పై స్థాయిలో పనిచేసిన] మహిళా అధికారి karen Hudes.ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆమె చెప్పింది నమ్మలని అవసరం లేదు. కానీ ఆమె చెప్పింది. ప్రాచీన చారిత్రక నిజాలకు దగ్గరగానూ, ఆధునిక [ఈ మద్య] కాలంలో బహిర్గతం అవుతున్న విచిత్ర [రహస్య సమూహాలు ఉన్నాయనడం, యూ.ఎఫ్.ఓలు భూమికి వాచీ వెడుతున్నాయనడం] సంఘటనలు ఆమె చెప్పిన విషయాన్ని బలపరుస్తున్నాయి. ఈమె లాగానే కెనడా దేశ మాజీ జాతీయ రక్షణ మంత్రి paul Hellyer కూడా ''నాలుగురకాల అన్య జాతుల వారు 1000 సంవత్సరాల నుండి భూమికి వచ్చి వెడుతున్నారు'' అని తెలిపారు.
''పదవిలో ఉన్నప్పుడే ఈ విషయాన్ని తెలిపి ఉండొచ్చు కదా.. ఇప్పుడు చెప్పవలసిన అవసరమేముంది''అని చాలమందిలో అనుమానం తలెత్తవచ్చు. పదవిలో ఉన్నప్పుడు చెబితే అది అధికారపూర్వకమైన ప్రకటన అయిపోతుంది. పదవి చెపుచ్చుకుంటున్నప్పుడు 'అధికారంలో ఉన్న, లేకపోయినా ప్రభుత్వ రహస్యాలను కాపాడతాము అని ప్రమాణస్వీకారం తీసుకుంటారు. పదవిలోకి వచ్చే ముందు ప్రభుత్వ రహస్యాలు తెలియవు. పదవిలో కొనసాగుతున్నప్పుడు ప్రభుత్వ రహస్యాలు తెలుస్తాయి. భాధ్యతతో పనిచేసే అధికారులు ప్రజలకు అన్యాయం జరగుతున్న వాటిని గుర్తించి, వాటిని ఆపమని లేక ప్రజలకు తెలియపరచమని ప్రభుత్వాలను నిలదీయలేక, ఎదురించలేక తమ పదవిని కొనసాగిస్తూ, పదవి విరమణ చేసిన తరువాత మనస్సాక్షికి భయపడుతూ ఏదో ఒక రోజు విధంగా విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు. విజిల్ బ్లోయర్ గా మారతారు. karen Hudes చెప్పిన విషయాన్ని సమర్ధించే కొంతమంది ఇలా వాదిస్తూన్నారు.
ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ''ఘన గ్రహం మీద అన్యప్రాణులు ఉన్నాయనే ఆలోచనను తిరస్కరిస్తున్నాను. ఖచ్చితంగా ఆ ఆలోచనను ఒప్పుకొను. కానీ మనం [మానవజాతి] ఒంటరిగా మాత్రం లేము. భూమిని రెండవ జాతివారు పర్యటిస్తున్నారనే సూచనకు కావలసినంత ఆధారమున్నది''
''దేశాలన్నీ ఒకటిగాలేవు. అవినీతిని పోరాడుతున్న విభాగమూ ఉన్నది, ఎన్నుకొనబడిన సభ్యులూ ఉన్నారు. ఎన్నుకొనబడిన సభ్యులు ఆ ఆ దేశాలలో ప్రజలకు దేశ ద్రోహులుగా ఉంటున్నారు. వీరు వెనుక వీరిని నియంత్రణపరచటానికి మత సంఘానికి చెందిన నెట్వర్క్ ఉన్నది. వీరిని నియంత్రణ పరచడానికి సమూహాలున్నాయి. అందులో ఒక సమూహం Hominids. వీరు మనుష్యులు కారు. వీరు మంచుయుగంలో అత్యధిక శక్తిమంతులుగా ఉండేవారు. పొడిగించిన పుర్రెలు కలిగి, విపరీతమైన మేధావితనం గలవారు.ఇంత కంటే నేను వివరించలేను.మనమంతా రహస్య సమూహాలతో మరియు రహస్యలతో నిండిన ప్రపంచములో జీవిస్తున్నాము. ప్రజలకు తెలియవలసిన సమాచారం, తెలియానవ్వటంలేదు'' అని చెప్పింది.   
ప్రపంచ బ్యాంక్ లో జరిగిన ఎన్నో అవినీతి పనులను బయట పెట్టిన ఈమె, విశ్వసించదగిన World Bank whistleblower గా ప్రసిద్ది చెందింది. ప్రస్తుత ప్రపంచం 'ద్రవ్య [డబ్బు] యుద్దంలో ఉన్నది అని చెప్పింది. 1999లో ఫిలిపైన్స్ దేశంలో రెండవ అతి పెద్ద బ్యాంకును కొందరు అవినీతి కోసం కైవసం చేసుకున్నారని బయటపెట్టింది.
పలు దేశ ప్రభుత్వాలు ఆర్ధిక సంబంధమైన సంస్థలతో కలిసి కలిసికట్టుగా అవినీతి పనులు చేస్తున్నాయనే విషయాన్ని కూడా బయటపెట్టింది ఈమే.
కెనడా దేశ మాజీ జాతీయ రక్షణమంత్రి Paul Hellyel కూడా ''నాలుగు రకాల అన్యజాతుల వారు 1000 సంవత్సరాల నుండి భూమికి వచ్చి పెడుతున్నారు'' అని తెలిపారు. ''అందులో నాకు ఒకరి గురించే తెలుసు. వారు Anderomeda నక్షత్ర మండలాలలో ఉన్న గ్రహం నుండి వచ్చారు. వారు క్రమశిక్షణకు కట్టుబడ్డవారు. మన గ్రహాన్ని మనమే యుద్ధాల పేరుతో నాశనం చేసుకుంటున్నామట. అనవసరమైన పరిశోధనలతో డబ్బు వృధా చేసుకోవడమే కాకుండా, ఇతర గ్రహాలపై దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నామట. అది వారికి నచ్చలేదుట. వెంటనే ఆపకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వెళ్లేరు'' అని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
వీరే కాకుండా మరికెంతోమంది మాజీ సైనిక అధికారులు వీరు చెప్పిన దాంట్లో నిజం ఉన్నదని, తమ దగ్గర కూడా కావలసిన అధికార పాత్రలు ఉన్నాయని వీరు చెప్పిన విషయాన్ని ఆమెదిస్తున్నారు.
ఇవన్నీ ఎంతవరకు నిజం? మనతో కలిసి మనలో ఒకరిగా తిరుగుతున్న ఆ రెండవ జాతి వారు ఎవరు?
వీరు ఏ విధంగా మన మీద అధికారం చెలాయిస్తున్నారు? మానవులలో ఎవరు వీరికి సహాయపడుతున్నారు? వీటికి సమాధానం ప్రభుత్వాలే చెప్పాలి. చెబుతాయా?

శుక్రవారం, సెప్టెంబర్ 16, 2016

కాకినాడ వివేకానంద పార్క్ లో కూర్చుని ఉన్నాను. టైం 7PM అవుతూంది.
ఇంతలో బైక్ మీద వేగంగా వచ్చిన కానిస్టేబుల్ నాకు దగ్గరలో బెంచీ పై కూర్చుని ఆ చీకట్లో కబుర్లు చెప్పుకుంటున్న ఒక జంట దగ్గరికి వెళ్లాడు. వాళ్ళు లవర్స్ అనుకుంటా కానిస్టేబుల్ ను చూడగానే భయపడిపోయారు. లేచి నిలబడిపోయారు.
కానిస్టేబుల్ ఏదో అడుగుతున్నాడు. వాళ్ళు ఏదో బ్రతిమిలాడుతూ చెపుతున్నారు.
ఆ పోలీసాయన వినిపించుకోవడం లేదు. అక్కడి నుండి నడవండి అన్నట్టు కంగారు పెడుతున్నాడు.
ఆ అమ్మాయి బిక్క చచ్చి పోయి చూస్తోంది. అబ్బాయి కానిస్టేబుల్ ను బ్రతిమిలాడుతూనే ఉన్నాడు.
చివరికి ఆ అబ్బాయి పర్సులోంచి కొంత డబ్బు కానిస్టేబుల్ కి ఇచ్చేసాడు.
కానిస్టేబుల్ ఆ డబ్బులు తీసుకుని మరొక జంటను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు.
నేను లేచి అటు వెళుతూ ఆ అబ్బాయిని ఆపోలీసోడు ఎంత గుంజాడు నీ దగ్గర అని అడిగాను.
దానికి ఆ అబ్బాయి తెగ బాధపడిపోతూ "1000రూ// సర్! ఎంత బ్రతిమిలాడినా తగ్గించలేదు. స్టేషన్ కొస్తే 5000 అవుతుంది. ఇక్కడ అయితే 1000 రూ అవుతుంది. తరువాత నీ ఇష్టం అన్నాడు. ఎందుకొచ్చిన గొడవని ఇచ్చేసాను. అనవసరంగా ఈ రోజు వెయ్యి రూపాయలు బొక్క, ఎవరి ముఖం ప్రొద్దుటే చూసానో అంటూ తెగ వాపోయేడు.
ఆ అమ్మాయి సిగ్గుతో తల దించుకుని బెంచీకి అటు తిరిగి కూర్చుని ఉంది.
నేను ఆ అమ్మాయిని పిలిచి ' అమ్మా నీ లవర్ వెయ్యి రూపాయలు పోయాయని తెగబాధ పడిపోతున్నాడు. నీవు ఇంటికెళ్ళాక మీ నాన్నగారిని నీ లవర్ 1000రూ ఇచ్చేయమని చెప్పు ,అతని నష్టంలో ప్రధాన భాగాస్వామివి నీవే కదా?" అంటూ అక్కడ నుండి వచ్చేసాను.
ఆ మాట అన్నందుకు వాళ్ళు నా మీద కోపపడి తిట్టుకున్నారో,లేదో నాకు తెలియదు గాని ఆ అమ్మాయి సిగ్గుతో బిగిసుకుపోవడం మాత్రం గమనించాను.

మంగళవారం, సెప్టెంబర్ 13, 2016

ఉత్తమ పెంపకం అంటే, కన్నవారికి వారి బిడ్డలకూ మద్య ఒక గొప్ప అనుబంధం ఉండడం. ఈ కింద పేర్కొన్న కొన్ని చిట్కాలు మీకు మీ పిల్లలతో ఒక చక్కని అనుబందం ఏర్పడటానికి తోడ్పడతాయి.

* బేషరతు ప్రేమ పంచండి.
     మీ పిల్లలు పసి పిల్లల్లా, ప్రీ-స్కూలర్లలాగా ఎప్పటికీ ఇలాగే ఉండిపోరు. కాలం చాలా వేగం వెళుతూనే ఉంటుంది. ఈ రోజున ఉన్న ఈ పిల్లలు రేపటికి పెరిగి పెద్దవాళ్లవుతారు. అయితే, స్వతహాగా మీరు కూడా మీ పిల్లలు మరింతగా ఎదగడానికి మీ వంతు ప్రోత్సాహం, అందిoచాలి. తల్లిదండ్రులు ఉన్నంతలో పిల్లలతో అత్యధిక సమయం గడిపేది బాల్యంలోనే బాగా సన్నిహితంగా గడిపేది కూడా ఈ కాలంలోనే. అయితే వారు కాస్త పెద్ద వారై, టీనేజర్ వయసుకు వచ్చేస్తే, వారి జీవిత కార్యకలాపాల్లో వారు తలమునకలైపోతాయి. అందుకే ఆ పసి వయసులో వారితో కలిసి సాద్యమైనంత ఎక్కవ సమయం ఆనందంగా గడపడానికి ప్రయత్నించాలి. అప్పుటి ఆ తీయని జ్ణాపకాలను ఎప్పటికీ గుండెలో భద్రంగా ఉంచుకోవాలి. మీ పిల్లలన్నీ మీరు నిరంతరం ప్రేమిస్తూనే ఉంటారు. కానీ, మీరు మీ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో వారికి తెలిసోచ్చేలా వ్యవహరించండి.

* పిల్లల మనసుల్లోంచి 
    మీ పిల్లలు ఎప్పుడైనా మీమ్మల్ని అసహనానికి గురి చేసే సందర్బాలు ఉండవచ్చు. అయితే వాళ్ల స్థానంలో కూర్చుని ఆలోచిస్తే, ఆ అసహనమేమీ రాదు. అలా అనుకోవడానికి మీ బాల్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోండీ. ఆ బాల్యంలో మీరు కూడా దాదాపు ఇలాగే ప్రవర్తించి ఉంటారు. మీ బాబు కొద్ది రోజులు తన ఫ్రెండ్ ఇంట్లో ఉంటానంటే ఇప్పుడు మీరు అభ్యంతరం చెప్పవచ్చు. కానీ, మీ బాల్యంలో మీలో కూడా అలాంటి కొరికలే ఉండవచ్చు. అందుకే పిల్లల కోణంలోంచి ఆలోచించినప్పుడే పిల్లల్ని బాగా అర్ధం చేసుకోగలుగుతాం. వాళ్ల మనసును నొప్పించకుండా వ్యవహరించగలుగుతాం.

* ఎవరి మీదా ఆధారపడకుండా 
     పిల్లలకు తల్లిదండ్రులే అన్నీ చేసిపెట్టే విధానం ఎక్కువ హానికరమైనది. దీనివల్ల పిల్లలు ప్రతి దానికీ తల్లిదండ్రుల మీదే ఆధారపడే స్థితికి చేరుకుంటారు. ఆ పరిస్థితి రాకుండా, కొన్ని చిన్న చిన్న పనులు వారికి అప్పగించి ఎవరి సహకారమూ తీసుకోకుండా ఆ పని పూర్తి చేయమని చెప్పాలి. వాళ్ల పనులు వాళ్లే చేసుకోగలిగే ఈ వైఖరి వల్ల పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తన కాళ్ల మీద తాను నిలబడే తత్వం పెరుగుతుంది.     

సోమవారం, సెప్టెంబర్ 12, 2016

ఈమాట అన్నందుకు మహిళా మణులు నన్ను విమర్శించవచ్చు. అయినా ఏం పర్లేదు. ఎందుకంటే ఈరోజు అత్యధికంగా పురుషులు నరకయాతన అనుభవించేది, మానసికంగా క్రుంగిపోయేది కేవలం స్త్రీ వలన మాత్రమే.నిజానికి స్త్రీ తన జీవితంలో అనేక పాత్రలు ధరిస్తుంది. అందులో అతి పవిత్రమైనది, మాటలతో వర్ణించలేనిది ఒక్క తల్లి పాత్ర మాత్రమే. దీనికి మాత్రమే స్త్రీ నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చుతుంది. మిగతా అన్ని పాత్రలకు అన్యాయం చేసేదే! పురుషునికి నరకయాతన చూపించే ప్రధాన అస్త్రం భార్య పాత్ర. నాకు తెలిసి ఈ పాత్రకు చట్టాల అనుమతి కూడా ఉంది. ఆమే  తప్పు చేసి ఆమే కోర్టు కేక్కితే మన భారత చట్టాలన్నీ ఆమెకు మాత్రమే సహకరిస్తాయి. పురుషుడు మాత్రం నిలువునా అన్యాయంలో మునిగిపోవాల్సిందే.

         పురుషునితో సమాన హక్కులు కోరుకునే స్త్రీ మణులు సమాన చట్టాలకు ఎందుకు సహకరించరో? పురుషునితో సమానమని విర్రవీగుతున్న స్త్రీలు బయట మృగ పురుషులకు బలవ్వుతున్న దాఖలాలెన్నో. నిజానికి స్త్రీ తన పురుషున్ని అర్ధం చేసుకోవడం కంటే అపార్ధం చేసుకోవడానికే పని చేస్తుంది.

      అందుకే అనుకుంటాను కొంతమంది మహానుభావులు స్త్రీ గూర్చి ఇలా హెచ్చరించారు.
1.స్త్రీ నీడ లాంటిది. పట్టుకోవాలంటే దొరకదు. పట్టించుకోవడం మానివేస్తే నీ వెనుకే తిరుగుతుంది.
2.స్త్రీ నది లాంటిది దొర్లించుకుంటూ పోయి సముద్రంలోకి విసిరివేస్తుంది.
౩.స్త్రీ మనస్సు అద్దంతో సమానం,పగిలితే అతకదు అన్న మాట పచ్చి అబద్ధం.  ఇది కేవలం పురుషునికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే చరిత్రలో అన్యాయానికి గురైంది పురుషులే. ఉదా:కు పార్వతి,దేవదాసుల్లో దేవదాసే పోయాడు. లైలా,మజ్నూలలో మజ్నూయే పోయేడు.
         అందుకనే స్త్రీ పట్ల పురుషుడు జాగ్రత్త వహించాలి. ఆదమరచియుంటే మనం మటుమాయమవ్వడం ఖాయం.మనకందరికీ స్త్రీ నుండి రక్షణ లభించుగాక! శుభం!!!

ఆదివారం, సెప్టెంబర్ 11, 2016

9-9-2016 తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలంటూ ద్వజమెత్తారు. జాతీయ పార్టీ అయిన బిజెపిని ఘాటుగానే విమర్శించారు. ఈ పబ్లిక్ మీటింగ్ లో ఇద్దరు యువకులు కూడా అసువులు బాసారు. ఇంతకీ పవన్ ఏం మాట్లాడాడు? ఏ విషయాలు తెలియజేసాడు? ఆయనిచ్చిన దిశానిర్దేశం ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ భాగాలు మాదిరిగా మీ ముందు పెడతాను. మీకు వీలయితే వీక్షించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది రెండవ భాగం ( Part :2).
Part : 2

9-9-2016 తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలంటూ ద్వజమెత్తారు. జాతీయ పార్టీ అయిన బిజెపిని ఘాటుగానే విమర్శించారు. ఈ పబ్లిక్ మీటింగ్ లో ఇద్దరు యువకులు కూడా అసువులు బాసారు. ఇంతకీ పవన్ ఏం మాట్లాడాడు? ఏ విషయాలు తెలియజేసాడు? ఆయనిచ్చిన దిశానిర్దేశం ఏమిటి? ఇత్యాది విషయాలన్నీ భాగాలు మాదిరిగా మీ ముందు పెడతాను. మీకు వీలయితే వీక్షించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది మొదటి భాగం (First Part :1).
First Part : 1

శుక్రవారం, సెప్టెంబర్ 09, 2016

తిరుపతి పబ్లిక్ మీటింగ్ లో ఊదరగొట్టిన పవన్ ఈరోజు కాకినాడలో ఊదరగోట్టడానికి వస్తున్నాడు. రాజకీయ పార్టీలన్నీ లబో,దిబో మంటున్న లభించని ప్రత్యేక హోదా కేవలం అక్కడా,ఇక్కడా పబ్లిక్ మీటింగులు పెట్టి ప్రసంగాలు పెట్టడం వలన లభిస్తుందా? పవన్ తీరు చూస్తుంటే పబ్లిసిటీ కోసమే చేస్తున్నట్టు ఉంది. ఈమధ్య పవన్ జరుగున్న ప్రతి చిన్న సంఘటనకు మీడియా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడేస్తున్నాడు.
       నిజానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పట్ల, ఆంద్ర భవిష్యత్ పట్ల ఆందోళన,చిత్తశుద్ది ఉంటే "ఆమరణ నిరాహార దీక్ష" చేయాలి. అప్పుడు పవన్ చేపట్టిన ఉద్యమంలో చలనం వస్తుంది. దేశంలో కదలిక వస్తుంది. అంటే గాని అక్కడక్కడ మీటింగులు పెట్టి ఏవేవో మాట్లాడి వెళ్ళిపోవడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు.
      రేపొద్దున్న జగన్ అండ్ మిగతా పార్టీ వాళ్లు చేసే బంద్ వలన కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు.

 


Recent Posts