గురువారం, నవంబర్ 08, 2018

మనకి ఎంతో మంది స్నేహితులుగా పరిచయమవ్వడం, వాళ్ళతో కొన్ని వ్యవహారాలు పెట్టుకోవడం సహజంగా జరిగే పరిస్తితి. ఇక్కడే మనం జాగ్రత్త వహించాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. అలా నమ్మితే మనం సమస్యల వలయంలో చిక్కుకోవడం ఖాయం. ఒక సంఘటన చెప్తాను. నాజీవితంలో ఈమధ్యే జరిగింది. కొత్తగా ఒక మిత్రుడు పరిచయమయ్యి బాగా దగ్గరయ్యాడు. అతనిని పరిచయం చేసింది అంతకు ముందు నుండే పరిచయమున్న మరొక మిత్రుడు. ఇలా ముగ్గురమూ వీలున్నప్పుడల్లా పార్కులో కూర్చుని అనేక విషయాలు మాట్లాడుకోవడం,. చర్చించుకోవడం చేసేవాళ్లం. ఒకరోజు కొత్త ఫ్రెండుకి అవసరమని పాత ఫ్రెండు 10,000రూ|| చూడమన్నాడు. సర్లే అని నాదగ్గర లేకపోతే నా ఆప్తమిత్రుడి దగ్గర 10,000రూ|| తీసుకుని పార్కులో ఉన్న నా కొత్త,పాత మిత్రులను కలిసి డబ్బులన్నీ అందించాను. వాళ్ళు ఇస్తామన్న నెలరోజులు గడువు దాటిపోయి మూడు నెలలు ముగిశాయి. నా ఆప్తమిత్రుడు 10,000రూ|| చూచిపెట్టు చాలా అవసరమొచ్చింది అంటే సరే అని వాళ్ళను అడిగాను. అదిగో,ఇదిగో అంటూ మరో నెల రోజులు గడిపి ఫోన్లు సరిగా లిఫ్ట్ చేయడం మానేశారు. సర్లే ఏదో ఇబ్బందిలో ఉన్నారేమోనని నేను పెద్దగా తీసుకోలేదు. ఒకరోజు పార్కులో ముగ్గురమూ కూర్చునప్పుడు నేను అడిగాను. " మీరు 10,000రూ|| త్వరగా ఇచ్చేస్తే బాగుంటుంది.అవతల నా మిత్రుడు ఇబ్బంది పడుతున్నాడు.నన్ను చాలా గట్టిగానే అడుగుతున్నాదంటే నా పాత మిత్రుడు ఆ సమయంలో మాట్లాడిన మాటలకు అతను ఎంత స్వార్ధపరుడో, దుర్మార్గపు భావాలో నాకు అర్ధమయ్యిపోయాయి. పాత మిత్రుడు "అతనితో మనకెందుకండీ..డబ్బులుకోసం అలా ఇబ్బంది పెట్టేవాడు మనకి కరెక్ట్ కాదు. అతనితో ఫ్రెండ్ షిప్ ను కట్ చేసేయండి.మీకు చాలా మంచిది అన్నాడు. ఆసమయంలో నాకు అతని పట్ల అసహ్యం,విపరీతమైన కోపం వచ్చాయి. డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్న ఇవ్వకుండా, ఫోన్లు లిఫ్ట్ చేయకుండా వ్యవహరించే వీళ్లతో స్నేహం చేయాలా? స్నేహ భావంతో ఆపదలకు స్పందించే నా ఆప్తమిత్రుడితో సంబంధాలు తెంచుకోవాలా? ఆ దిక్కుమాలిన స్వార్ధపూరితమైన సలహాకి చెప్పు తీసుకుని కొట్టినా తప్పు లేదనిపించింది. ఉపయాగం కోసం స్నేహం చేసే స్వార్ధపూరితమైన ఇటువంటి వారితో దూరంగా ఉండడమే చాలా మేలని ఆసమయంలో నా అంతరాత్మ ఘోషించింది. తరువాత సీరియస్ గా తీసుకుని డబ్బులు వసూలు చేసి నెమ్మదిగా వాళ్ళను కలవడం తగ్గించి చివరికి కట్ చేసేశాను. ఇటువంటి వ్యక్తులు అందరికీ తారసపడతారు. వాళ్ళను జాగ్రత్తగా హాండిల్ చేస్తూ ముందుకు పోవాలి తప్ప ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు. శుభం!!!

1 కామెంట్‌:

 


Popular Posts

Recent Posts