సోమవారం, ఫిబ్రవరి 29, 2016

ఈమధ్య న్యూస్ పేపర్లలో వస్తున్న వార్తలు చూస్తుంటే ఒక పది సంవత్సరాలలో మన ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలోనే కాదు, ప్రపంచానికే ఆదర్శంగా, ఉన్నతంగా నిలబడేలా వుంది. రకరకాల ప్రాజెక్ట్స్ , వివిధ దేశాల మంత్రులు, నాయకులు మన ఆంధ్రాను చూస్తూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం శుభసూచకం. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్థానంలో చద్రబాబు కాకుండా జగన్ వచ్చి ఉంటే ఆంధ్ర పరిస్తితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. వివిధ దేశాల మంత్రులు, నాయకులతో జగన్కు  సంబంధాలెక్కడివి? సాక్షి పేపర్లో ఒక ప్రాజెక్ట్ విషయం కానీ, ఆంధ్ర అభివృద్ధి గూర్చి గాని ఒక్క ముక్క రావడం లేదు. జగన్ కాస్త కుల,మత గొడవలు రెచ్చగొట్టడం ప్రక్కన పెట్టి ఆంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబుకు సహకరిస్తే తెలుగు ప్రజలు చక్కగా జగన్ ను కూడా ఆదరిస్తారు. ఇసుకను నిత్యావసర వస్తువుగా పరిగణించి ఉచితంగా ప్రకటించడం, 100రూపాయలకే ఇంటర్ నెట్ కనెక్షన్ ప్రకటించడం చాలా బాగుంది. చంద్రబాబు నాయుడుగారు ఇలా చేసుకుంటూ పోతే ఇక ఆయనకు ఎదురే ఉండదు. ప్రస్తుతం ఆంధ్రాలో సరైన పార్టీ లేదు. జగన్ పార్టీ ఉన్నా అదంతా మాయలమరాఠీ పార్టీ లా కన్పిస్తోంది ప్రజలకు. గొడవలకు మాత్రమే నిలయంలా ఉంది. ఆపార్టీ నాయకులే ఆయన(జగన్)ను దుయ్యపట్టడం కడు శోచనీయం. ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు ప్రజల అభిమానాన్ని చక్కగా నిలబెట్టుకోగలిగితే ప్రజల హృదయాలలో మకుటం లేని మహారాజులా వెలిగిపోవడం ఖాయం.

ఆదివారం, ఫిబ్రవరి 28, 2016


More Videos : "Sakshyam TV"

సోమవారం, ఫిబ్రవరి 15, 2016

నేను 10 బ్లాగుల వరకూ క్రియేట్ చేశాను. 10 బ్లాగులకు డోమైన్స్ కూడా సెట్ చేశాను. అవ్వన్నీ కూడా "సాక్ష్యం గ్రూప్" పేరు మీద నడుపుదామనుకుంటున్నాను. ఇప్పటికే ఈ క్రింది 4బ్లాగులను రన్ చేస్తున్నాను కూడా! అయితే సమయా భావం వలన మిగతా బ్లాగులను అప్ డేట్ చెయ్యడం కష్టంగా మారింది. అయినా పర్లేదు ఒక్కో బ్లాగు ఇంత కంటెంట్ వరకూ అని టార్గెట్ పెట్టుకుని వర్కు ప్రారంభిస్తాను. "సాక్ష్యం గ్రూప్" ప్రజలలో పాపులర్ అవ్వాలన్నదే నా లక్ష్యం. ఇదొక కంపెనీ గా అవతరించాలి. ఒక ఆఫీస్ కనీసం 10 మంది స్టాప్ ఏర్పాటు చేసుకోగలగాలి. వెబ్ సైట్ల రూపంలోనూ, యూట్యూబ్ చానెళ్ల రూపంలోనూ కాక బిజినెస్ రూపంగానూ సాక్ష్యం గ్రూప్ అభివృద్ధి కావాలి. కొత్త,కొత్త ప్రొడక్ట్స్ ను మార్కెట్లోకి రిలీజ్ చేయాలి. కనీసం "సాక్ష్యం గ్రూప్" కంపెనీ సంవత్సరానికి ఒక కోటి రూపాయల టర్నోవర్ చేయగలగాలి. అంతవరకూ కృషి చేస్తాను.శుభమ్!!!

  1. SAKSHYAM TV
  2. SAKSHYAM PUBLICATIONS
  3. SAKSHYAM MAGAZINE
  4. ALL TECHBOOK


నిన్నరాత్రి నా మిత్రుడుతో కల్సి "నాన్నకు ప్రేమతో" సినిమాకి వెళ్ళాను. స్టోరీ వచ్చి చాలా చక్కగా చూపించారు. సినిమా అంతా లాస్ట్ 10నిమిషాల మీదే ఆధారపడియుంటుంది. విలన్ ను మట్టి కరిపించడానికి హీరో వేసే గేమ్ షోలు అదిరిపోయాయి. సినిమా అంతా మైండ్ గేమ్ ప్లానింగ్. జూనియర్ ఎన్.టి.ఆర్ కి ఓ మంచి బ్రేక్ అందించే మూవీ. సుకుమార్ డైరెక్షన్ అడుగడునా కనిపించింది. ఏది,ఏమైనా నాన్నకు ఏదైనా ప్రేమతో అందించిన ఫీలింగ్ నిజ జీవితంతో చాలా గొప్పగా ఉంటుంది.

మంగళవారం, ఫిబ్రవరి 09, 2016

తునిలో కాపు గర్జన పేరుతో జాతీయ ఎక్స్ ప్రెస్ ట్రైన్ "రత్నాచల్" ను తగులబెట్టేశారు. ఈ అసాంఘిక సంఘటనకు నేను ప్రారంభించిన ఉద్యమానికి ఏవిధమైన సంబంధం లేదని ముద్రగడ వారు ప్రకటించేశారు. పేపర్లలో,టి.వి.లలో మాత్రం దీని వెనుక జగన్ ఉన్నాడని, రాయలసీమ,హైద్రాబాద్ నుండి కొంతమంది ముసుగు రౌడీలు ప్రవేశించి ఈ ఘాతుకం చేశారని వచ్చింది. అదే నిజమైనప్పుడు జగన్ ను మళ్ళీ జైల్ గోడల మద్యకు ఎందుకు నెట్టలేదో ఆంధ్ర ప్రజలెవరికీ అర్ధం కావడం లేదు. రౌడీల ఆగమనం చూస్తుంటే రత్నాచల్ ట్రైన్ తగుల బెట్టేయాలని ముందే ప్లానింగ్ జరిగిపోయినట్టు అనిపిస్తోంది. అంటే కాపు గర్జన సభలో పాల్గొన్న రాజకీయ పెద్దలకు ముందే తెలుసేమో అన్పిస్తోంది. ఎవరేమి పన్నాగాలు పన్నినా మొత్తానికి ఆంధ్రాలో కుల చిచ్చులు రేపారు. నిజానికి ఈ కుల రాజకీయాలు ఎంతో కాలం నిలవవు. ఈ కుల రిజర్వేషన్స్ నిలవవు. వీటికి ముగింపు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. 

గురువారం, ఫిబ్రవరి 04, 2016

ఫేస్ బుక్ లోని ఈ పోస్టు చూసి మనసంతా చలించిపోయింది. నిజానికి ఈ దిక్కుమాలిన కులాలన్నీ కేవలం ఒకరికొకరు పరిచయం,గుర్తింపు కొరకే! పెద్ద కులం,చిన్న కులం అన్న మాటలు పనికిమాలిన వెధవలు మాటలాడే మాటలు. ఆమె మన తల్లి లాంటిది కాదా? ఎలా నగ్నంగా నిలబెట్టారో చూడండి. ఆ మాతృమూర్తి తన కడుపున పుట్టిన బిడ్డతో తన మానాన్ని కప్పుకోవడం చూస్తుంటే ఛ... ఆతల్లి గుండె కోత,హృదయ వేదన ఎలా భరించగలుగుతుందో, దేవుడా? ఈ దారుణాలు ఎలా భరిస్తున్నావు?
ఫేస్ బుక్ లో వచ్చిన వివరాలు క్రింది ఇస్తున్నాను.  
మన డిజిటల్ ఇండియాలో ఒక దళిత కుటుంబానికి జరిగిన పరాభవం .... దొంగతనం జరిగింది చర్య తీసుకోండంటూ వచ్చిన ఓ దళిత కుటుంభంతో పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. స్టేషన్ బైటికి గుంజుకొచ్చి నడి రోడ్డు మీద భార్య భర్తల బట్టలు ఊడదీసి కొట్టారు. ఉత్తరప్రదేశ్ లోని దన్ కౌర్ పోలీసు స్టేషన్ పరిదిలో సునీల్ గౌతమ్ అనే అతని ఇంట్లో బుధవారం నాడు రాత్రి దొంగతనం జరిగింది. ఆ విషయం పై కంప్లైంట్ ఇవ్వడానికి సునీల్ గౌతమ్, అతని భార్య మరికొందరు బందువులతో కలిసి గురువారం నాడు దన్ కౌర్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. స్టేషన్ లో ఉన్న స్టేషన్ ఆఫీసర్ ప్రవీణ్ యాదవ్ కేసు నమోదు చేయడానికి నిరాకరించాడు. దాంతో ఎందుకు కేసు నమోదు చేయరో చెప్పాలని సునీల్ కుటుంభం ప్రవీణ్ ను నిలదీసింది. అంతే.... పోలీసు అధికారి ప్రవీణ్ కు కోపమొచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయాడు. అతనికి స్టేషన్ లో ఉన్న మరికొందరు పోలీసులు తోడయ్యారు. డ్రస్సులో ఉన్న పోలీసులు, డ్రస్సుల్లో లేని పోలీసులు అందరూ కలిసి ఒక్క సారి సునీల్ కుటుంభ సభ్యులు, బందువుల మీద పడ్డారు. కొట్టుకుంటూ రోడ్డుమీదికి ఈడ్చుకొచ్చారు. సునీల్ భార్య చీరను లాగి పడేశారు. బట్టలు చించేశారు. అడ్డుపోయిన సునీల్ బట్టలు కూడా చించి పడేశారు. అడ్డుకున్న బందువులను చితక్కొట్టారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ ʹఎఫ్ ఐ ఆర్ రాయాల్నా వద్దా అనేది నా ఇష్టం నన్నే ప్రశ్నిస్తారా ʹ అని బూతులు తిట్టుకుంటూ నగ్నంగా ఉన్న సునీల్ ను అతని భార్యను రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టాడు. వందలాది లాది మంది చూస్తుండగా ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసులు అంతటితో ఊరుకోకుండా సునీల్ పై, అతని భార్యపై, బందువులపై క్రిమినల్ కేసులు బనాయించి జైలుకు పంపారు. ఈ దుర్మార్గం జరుగుతుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో ఈ సంఘటనను చిత్రీకరించి యూట్యూబ్ లో పెట్టాడు. ఈ దాడి సంఘటనపై జర్నలిస్టులు ప్రవీణ్ యాదవ్ ను ప్రశ్నిస్తే అసలు అలాంతి వేమీ జరగలేదని. సునీల్ కుటుంభమే పోలీసులపై దాడికి ప్రయత్నించిందనిఅందుకే వారందరి పై క్రిమినల్ కేసులు పెట్టామని చెప్పాడు. పోలీసులకు కథలు చెప్పడం మామూలే కానీ విజువల్స్ నిజాలు మాట్లాడుతాయి కదా !

బుధవారం, ఫిబ్రవరి 03, 2016

మిగతా కులాలలోనే పేదవాళ్లు ఉన్నారా? చౌదరుల (కమ్మ జాతుల)లో లేరా? చౌదరులలో ఎంతో మంది ఆకలికి అలమటిస్తూ ఉన్నారు. ఒకపూట ఉంటే మరొక పూట గడవని ఎన్నో దయనీయ కుటుంబాలు నిలువ నీడ లేకుండా బ్రతుకీడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లెక్క వేస్తే మిగతా కులాలలో మాదిరిగానే ఈ చౌదరులలో కూడా పేదవారు ఉన్నారు. వీరికి కూడా రిజర్వేషన్లు కల్పిస్తే పోలా? మళ్ళీ వీళ్ళ ఉద్యమాలు కూడా చూడాలా ఏమిటి? కేంద్ర,రాష్ఠ్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ప్రత్యేక రాయితీలతో రిజర్వేషన్లు కల్పించాలి. లేక పోతే రాష్ఠ్ర వ్యాప్తంగా స్పందిస్తాము. రైళ్లను గాని, బస్సులను గాని ఆఖరికి సైకిళ్ళను కూడా తిరగనీయం. రాష్ట్రమంతా బైఠాయించి కూర్చుంటాము. అవసరమైతే చట్టాలను మార్చైనా సరే చౌదరులకు రిజర్వేషన్లు కలిపించవల్సిందే!.అన్ని కులాలకు  రిజర్వేషన్లు కల్పిస్తూ చౌదరుల కులాలను అణగదొక్కడం అమానుషం. దీనిని ప్రత్యేకంగా ఖండిస్తున్నాము. మాకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే వరకూ మేము విశ్రమించేది లేదు.మాకు తక్షణమే రిజర్వేషన్లు కల్పించాలి.

 


Recent Posts