శనివారం, అక్టోబర్ 27, 2018

రాత్రి పడుకునే ముందు నాకు ఏదైనా ఒక పుస్తకం కొంతవరకైనా చదవడం అలవాటు. నాకదేమిటో కానీ పుస్తకం ముట్టుకోనిదే అసలు నిద్ర పట్టదు. ఆ పరంపరలో భాగంగా ఒక పర్సనాలిటీ డెవలప్ మెంట్ బుక్ చదువుతుంటే అందులో ధీరూభాయ్ అంబానీ గారి మాటలు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించాయి.స్ఫూర్తిని ఇచ్చాయి. ఆయనగారి మాటల్లో...
      "సూర్యుడు నన్ను మంచం మీద చూసి 50సంవత్సరాలు అయింది"
    ఈ మాటల్లో చాలా లోతైన అర్ధం వుంది. గొప్పవారు పెద్దగా మాట్లాడరు. చాలా మౌనంగానే ఉంటారు. ఒకవేళ వాళ్ళు మాట్లాడ వస్తే "ఆ మాటల్లో లెక్కలేనన్ని ఆణిముత్యాలు" దొర్లుతాయి.
    తెల్లవారు జాము నిద్రలేవడం అంటే జీవితంలో సగం విజయాన్ని సాధించడమే! ఆరోగ్య సంస్థలు కూడా తమ,తమ పరిశోధనలలో "తెల్లవారు జాము నిద్రలేచి, రోజుకు 5లీటర్ల నీళ్ళు త్రాగడం ఎవరు ప్రారంభిస్తారో వాళ్ళకు ఏవిధమైన రోగమూ అంటదు" అని తేల్చి చెప్పేసాయి.
    మన ధార్మిక గ్రంధాలైన వేదాలు, ఖురాన్,బైబిల్లు కూడా తెల్లవారు జామున లేచి ప్రార్ధన చేసుకునే వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని శాసిస్తూనే ఉన్నాయి.
   అందుకే కాబోలు గొప్పవాళ్లేప్పుడూ ఈ అవకాశాలను వదులుకోలేదు. మీరే ఆలోచించండి. ధీరూభాయ్ అంభానీ గారీలాంటి గొప్పవారు 50సం// సూర్యుడి కంటే ముందే అంటే ఉద్దేశ్యం తెల్లవారుజామునే నిద్ర లేచేవారు.
  ఈరోజుల్లో మనం చాలా దిగజారిపోతూ ఉన్నామనే చెప్పాలి. రాత్రి 10లేక 11 గంటలకు భోజనం చేయడం, అప్పటి వరకూ TVలకు అతుక్కుపోవడం, మర్నాడు 8,9 గంటలకు నిద్రలేవడం ఆదర,బాదరా హడావుడి...జీవితం అంతా ఒక యంత్రం మాదిరి అయిపోయింది. నిస్తేజం,నీరసం,నిర్వేదం,నిష్తానమ్ ఏవైతే ఉన్నాయో అవ్వన్నీ కూడా మన జీవితాన్ని అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. మానసిక ప్రశాంతత లేక చికాకు,చింతనాలతో నిత్యం బాధపడుతూనే వున్నాం.వీటిని ఎలాగైనా మనం జయించాలి.జయించవచ్చు కూడా! ఇప్పటి రోజులు సహకరించవు. పరిస్తితి మన చేతులలో లేదనే మాటలు కుంటి సాకులు మాత్రమే! వళ్ళంతా నీరసం, నిస్తేజం నిండిపోయిన మాటలే!ఇప్పటికీ ఎంతో మంది మేధావులు అవుతూనే ఉన్నారు. గొప్ప,గొప్ప పనులు చేసి చూపిస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా మనాలాగే ఆలోచిస్తే వారా స్తాయికి చేరుకుందురా? ఒక్కసారి ఆలోచించండి! మనం మారిపోదాం! మన జీవిత గమ్యాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం! ఆ పనేదో తెల్లవారు జాము నిద్రలేచిపోయి సరైన ప్లానింగ్ తో ముందుకెళ్దాం!...మీరు రెడీ నా?

6 కామెంట్‌లు:

 


Popular Posts

Recent Posts